*ముర- కరి - గిరి- హర*( దత్తపది)
*కందంలో విష్ణు స్తుతి*
మురహర! కరుణను జూపర!
కరివరదా! భవము విడువ కావుము వేగన్
గిరిధర! లక్ష్మి మనోహర!
హరకత్తులు లేని భక్తి నందించు హరీ!
(హరకత్తులు =ఆటంకములు)
*స్వప్నంబందున గాంచినట్టి దవురా సత్యంబుగా నిల్చెడిన్.
ఈ సమస్యకు నాపూరణ.
*రుమణ్వంతుడు*
స్వప్నంబన్నది మీరు నమ్మ దగునా సాధ్యంబె? సాధించుటే!
స్వప్నంబంత నయోచనా రచనలే సాగించు మిథ్యార్థముల్
*ఉదయనుడు*
స్వప్నావస్థను జూచి వాసవిని నే సందేహమున్ నొందగా
స్వప్నంబందునc గాంచినట్టి దవురా సత్యంబుగా నిల్చెడిన్.
అల్వాల లక్ష్మణ మూర్తి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి