నామ విశిష్టత
మానవ లోకంలోనే కాదు... ముల్లోకాల్లోనూ చరాచరాలకు పేర్లుంటాయి. పేరు లేనిదే మనిషి ఉండడు. పేరు లేని దేవుడు లేడు. పేరు లేని రాక్షసుడూ లేడు. బ్రహ్మ సృష్టిలో పేర్లకు గల విశిష్టత ఇంతా అంతా కాదు. మనిషి తాను జీవించి నంతకాలం తనకు మంచి జరగడానికి దేవతల ఆశీస్సులు కోరుకుంటాడు. తీర్ధ యాత్రలు చేస్తాడు. క్షేత్రాలను సందర్శిస్తాడు. దేవతల నామాలను జపిస్తాడు. తన సంతతికి దేవతల పేర్లు పెట్టుకొంటాడు. నిరంతరం నామస్మరణ చేస్తాడు. మనిషి నిత్యం చేసే ప్రతిపూజలోనూ దేవతానామాలను ఉచ్చరించడం పరిపాటి. ఆ దేవతానామాల్లోని గుణగణాలు తనలో నిలవాలని కోరుకోవడం ఇందులో కని పిస్తుంది. ప్రతి పూజలో, సంకల్పంలో విష్ణువుకు సంబంధించిన ఇరవైనాలుగు పేర్లను ఉచ్చరిస్తారు. విష్ణువు స్థితికారకుడు. అంటే మనిషి జీవించినంతకాలం అతడికి ఆయురారోగ్యభాగ్యాలను పుష్కలంగా సమకూర్చే విశిష్ట దైవం.
విష్ణువును స్తుతించే ఇరవై నాలుగు నామాలు ఎంతో విశి ష్టమైనవి. కేశవుడంటే అంద మైన శిరోజాలు కలవాడు. కేశి అనే రాక్షసుణ్ని చంపినవాడు. నారాయణుడంటే సృష్టికి మూలమైన నీటికి ఆధారమైన వాడు, నరుడి రూపంలో అవత రించిన అవతారపురుషుడు. శబ్దశక్తికి గమ్యం అయినవాడు. మాధవుడంటే లక్ష్మీదేవికి భర్త. సంపదలకు నెలవైనవాడు. గోవిందుడంటే భూమిని, గోవు లను, స్వర్గాన్ని, వేదాలను రక్షిం చేవాడు. విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్న వాడు. మధుసూదనుడు సుణ్ని చంపినవాడు. త్రివిక్ర ముడంటే మూడు అడుగు లతో ముల్లోకాలనే ఆక్రమించినవాడు. వామనుడంటే పొట్టిగా ఉండీ గట్టివాడై బలిచక్రవర్తి గర్వాన్ని అణచివేసినవాడు. శ్రీధరుడంటే సకల సంపదలనూ ధరిం చినవాడు. హృషీకేశుడంటే ఇంద్రియాలను అదుపులో ఉంచేవాడు. పద్మనాభు డంటే నాభిలో పద్మాన్ని కలిగినవాడు. దామోదరుడంటే తులసీ మాలను ఉదరంపై ధరించినవాడు. సంకర్షణుడంటే శత్రువులను సంహరించేవాడు. వాసుదే వుడంటే వసుదేవుని కొడుకు, సంపదలు పుష్కలంగా కలిగినవాడు. ప్రద్యుమ్నుడంటే గొప్ప బలం కలవాడు. అనిరుద్ధుడంటే ఎవరూ అడ్డుకోలేనంతటి పరాక్రమం కలిగి నవాడు. పురుషోత్తముడంటే మానవుల్లో ఉత్తముడు. అధోక్షజుడంటే ఇంద్రియాల వల్ల కలిగే జ్ఞానాన్ని మించిన జ్ఞానాన్ని కలిగినవాడు. నారసింహుడంటే నర, సింహ రూపంలో దుష్టులను అణచివేసినవాడు. అచ్యుతుడంటే ఎటువంటి నాశమూ లేనివాడు. అధోగతి లేనివాడు. జనార్ధనుడంటే సాగరంలో దాగి ఉండి లోకాలను హింసించిన రాక్షసులను చంపినవాడు. ఉపేంద్రుడంటే ఇంద్రలోకానికంటే పై లోకంలో ఉండేవాడు. హరి అంటే సమస్త పాపాలనూ హరించేవాడు. దివ్యమంగళ స్వరూపంతో మనసులను దోచేవాడు. శ్రీకృష్ణుడంటే సకల కర్మలనూ చేసేవాడు. ఇలా ఇరవైనాలుగు నామాలతో విష్ణువును స్మరించడం వల్ల మనిషి శాంతిని, ఆనం దాన్ని, అభ్యుదయాన్నీ పొందుతాడని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.
ప్రతి నామంలోనూ ఏదో ఒక గుణం, స్వభావం అంతర్భవించి ఉంటుంది. విష్ణువు నామాల్లోనూ గుణాలు విశేషంగా ఉన్నాయి. వాటిని తలచుకొన్నప్పుడు తానూ అలాంటి ఉత్తమ గుణవంతుడు కావాలని మనిషి అనుకొంటాడు. అలా అనుకున్నప్పుడు గుణసాధన కోసం ప్రయత్నిస్తాడు. సాధనలో లభించే ఫలితం మానవుణ్ని మాధవుడిగా చేస్తుంది. ఇదే నామస్మరణలోని విశిష్టత.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి