చ.వినదగు నెప్పుడైనను వివేకముఁ గూర్చెడు నీతి వాక్యముల్
వినదగు సత్ప్రయోజన సువీక్షితమైన హితైషి సూచనల్
వినదగ దెప్పుడైనను వివేకములేని పరార్థ భాషణల్
విని కనినంత ధీమతి వివేచనఁ జేయ హితమ్ము భారతీ ౹౹ 31
చ. స్తుత మతితో విచక్షణ యశోగతిఁ గూర్చు శుభ ప్రదమ్మునౌ
అతులిత వైభవమ్మొసఁగు నాదరమున్ గలిగింపఁ జేయు స
న్మతి మహి మాయికాధముల నైజములన్ గమనింప నేర్పుమై
హిత మగు నెల్ల భంగుల సహేతుకమై వెలుగొందు భారతీ౹౹ 32
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి