శు భో ద యం 🙏
నిందాస్తుతి!
సీ:హరి! నీకుఁ బర్యంకమైన శేషుఁడు చాలఁ, బవనము భక్షించి బ్రతుకుచుండు
ననువుగా నీకు వాహనమైన ఖగరాజు, గొప్ప పామును నోటఁ గొఱుకుచుండు
అదిగాక నీ భార్యయైన లక్ష్మీదేవి, దినము పేరంటంబు దిరుగుచుండు
నిన్ను భక్తులు పిల్చి నిత్యపూజలు చేసి, ప్రేమఁ బక్వాన్నముల్ పెట్టుచుండ్రు
స్వస్థముగ నీకు గ్రాసము జరుగుచుండుఁ
గాసు నీ చేతి దొకటైనఁ గాదు వ్యయము
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర
-కాసుల పురుషోత్తమకవి!
మనసాహిత్యమున నిందాస్తుతులకు కొదవలేదు.ధూర్జటి ఇత్యాదులు తమశతకములలో ముద్దు ముద్దుగా శివకేశవులనుతెగడినట్లుగా పొగడినారు.
నిందాస్తుతి భాజనమైన శతకములలో 1శ్రీకాకుళాంధ్రదేవ శతకము. 2ధర్మపురి నరసింహ శతకము లు సుప్రసిధ్ధములు.
ధర్మపురి నరసింహశతకములోని
పద్యమును చిత్తగింపుడు భక్తులొనర్చు కైంకర్యములతో
సుఖపడుచు శ్రీ హరి సోమరిగా నెట్లుమారెనో కవిగారి కథనంలో-ఇదంతా నిందనుకునేరు.కాదుకాదు. స్తుతియే!!!
స్వస్తి!!🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి