*2044*
*కం*
ఈటెల వడిగల మాటల
మోటుగ వినియోగమొనరి ముదమొందక నా
మాటలు బీటలు జేసెడి
మేటగు బంధముల విలువ మీరకు సుజనా.
*భావం*:-- ఓ సుజనా! ఈటెల వంటి పదునుగల మాటలను విచక్షణ మరచి ప్రయోగించి సంతోషించకుండా ఆ మాటలు చీల్చే బంధాల విలువలు మరువవద్దు.
*సందేశం*:-- ధీటుగా మాటకు మాట సమాధానం చెప్పి సంతోషించే ముందు ఆ మాటల ప్రభావం ఎంత విలువైన బంధాలను నాశనం చేస్తోందో ఎంత గొప్ప వారికి తగిలి గాయాలు చేస్తోందో గ్రహించడానికి ప్రయత్నాలు చేస్తే మంచిది.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి