..*17 మార్చ్ సోమవారం సంకటహర చతుర్థి*
హిందువులకు పవిత్రమైన పండుగల్లో ఒకటి సంకటహర చతుర్థి. ఈ పండగ గణపతికి అంకితం చేయబడింది. ఈ రోజున విఘ్నాలకధిపతి వినాయకుడికి పూజిస్తారు. ఉపవాసం ఉంటారు. ఈ రోజున చేసే పూజ మాత్రమే కాదు దానాలు కూడా ఫలవంతంగా ఉంటాయి. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు నెలకొంటాయి. కనుక ఈ రోజు సంకటహర చతుర్థి ఎప్పుడు? ఈ రోజున సుఖ సంతోషాల కోసం చేయాల్సిన దానాలు ఏమిటో తెలుసుకుందాం..
సంకటహర చతుర్థి అనేది హిందూ మతంలో గణేశుడికి అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన పండుగ. ఇది ప్రతి నెల కృష్ణ పక్ష చతుర్థి తిథి రోజున జరుపుకుంటారు. ఈ రోజున గణేశుడిని పూజిస్తారు. ఉపవాసం చేస్తారు. గణపతి ఆశీర్వాదం పొందడానికి నియమనిష్టలతో పూజించాలి. గణేశుడిని విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు. అంటే అడ్డంకులను తొలగించేవాడని అర్ధం.సంకటహర చతుర్థి రోజున గణపతిని పూజించడం వల్ల జీవితంలో వచ్చే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఈ రోజున గణేశుడిని పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు లభిస్తాయని, కుటుంబంలో ఆనందం నెలకొంటుందని నమ్ముతారు. భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి సంకటహర చతుర్థి రోజున ఉపవాసం కూడా పాటిస్తారు.
పంచాంగం ప్రకారం పాల్గుణ మాసం కృష్ణ పక్ష చతుర్థి తిధి మార్చి 17, సోమవారం సాయంత్రం 07:33 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది మార్చి 18 మంగళవారం రాత్రి 10:09 గంటలకు ముగుస్తుంది. ఈ రోజున, చంద్రోదయ సమయంలో పూజ నిర్వహిస్తారు. అటువంటి పరిస్థితిలో బాల చంద్ర సంకటహర చతుర్థి మార్చి 17న మాత్రమే జరుపుకోవాల్సి ఉంటుంది.
సంకటహర చతుర్థి రోజున ఏ వస్తువులను దానం చేయాలంటే
బట్టలు: మీరు పేదలకు, అవసరంలో ఉన్నవారికి కొత్తవి లేదా శుభ్రమైన దుస్తులను దానం చేయవచ్చు.
ధాన్యాలు: బియ్యం, గోధుమలు, పప్పులు సహా ఇతర ధాన్యాలను దానం చేయవచ్చు.
పండ్లు, స్వీట్లు: గణపతి పూజలో పండ్లు, స్వీట్లు సమర్పించి.. పేదలకు పంచడం మేలు చేస్తుంది.
డబ్బు: పేదలకు, అవసరంలో ఉన్నవారికి డబ్బును దానం చేయవచ్చు.
పుస్తకాలు, స్టేషనరీ: పిల్లలకు పుస్తకాలు,స్టేషనరీ వస్తువులు అంటే పెన్సిల్స్, పెన్నులు వంటివాటిని విరాళంగా ఇవ్వవచ్చు.
జంతువులకు ఆహారం: ఆవులు, కుక్కలు, ఇతర జంతువులకు ఆహారాన్ని దానం చేయవచ్చు.
నీరు: దాహం వేసిన వారికి నీరు ఇవ్వడం అంటే వేసవిలో దాహార్తి తీర్చడానికి మంచి నీటి స్టాల్స్ ఏర్పాటు చేయవచ్చు.
గొడుగు లేదా బూట్లు: అవసరమైన వారికి గొడుగు లేదా చెప్పులను దానం చేయవచ్చు.
నెయ్యి: నెయ్యిని దానం చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని నమ్మకం.
బెల్లం : బెల్లం దానం చేయడం వల్ల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అదృష్టం కలుగుతుంది.
దానం చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోండి
దానం చేసేటప్పుడు మనసులో స్వార్థం ఉండకూడదు.
ఎల్లప్పుడూ పేదలకు దానం చేయాలి.
దానం చేసేటప్పుడు ఎవరినీ అవమానించకూడదు.
ఎవరి శక్తి సామర్థ్యం మేరకు దానం చేయాలి.
దానధర్మాలు రహస్యంగా చేయాలి.
సంకటహర చతుర్థి రోజున దానం చేయడం ద్వారా గణేశుడు సంతోషించి భక్తులను ఆశీర్వదిస్తాడని నమ్మకం. దానం చేయడం వల్ల ఇతరులకు సహాయం చేయడమే కాదు దాతకు మానసిక ప్రశాంతత, సంతృప్తి లభిస్తుంది. దీనితో పాటు జీవితంలో వచ్చే అడ్డంకుల నుంచి విముక్తి లభిస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి