17, మార్చి 2025, సోమవారం

నీపంచంబడియుండగాఁగలిగినన్

 శు  భో  ద  యం 🙏


"నీపంచంబడియుండగాఁగలిగినన్ భిక్షాన్నమేచాలు, ని/క్షేపంబబ్బిన రాజకీటముల నే సేవింపఁగా నోప,నా/

శాపాశంబులఁ జుట్టిత్రిప్పకుము సంసారార్ధమై, బంటుగా/

జేపట్టందగుఁబట్టి మానదగదో శ్రీకాళహస్తీశ్వరా!


కాళహస్తీశ్వర శతకం.

ధూర్జటి మహాకవి.


భావము:స్వామీ! నన్ను నీపంచన పడియుండనిమ్ము,భిక్షాన్నమబ్బినను అగియేనాకు చాలును.

నిధి నిక్షేపములొసంగినను రాచపురుగులను సేవింపను.ఆశాపాశముతో నన్నుబంధించి నన్ీసంసారముకొఱకై త్రిప్పవలదు.నీసేవకునిగా గైకొనుము నన్నెచ్టిపరిస్థితులలోను దూరముగావింపకు.


విశేషములు:

పంచ అనునది పల్లెలలో వసారాగా చెప్పబడు చిన్నఅరుగు.

శినసన్నిలోనున్నపంచయైనచాలునట.భిక్షాన్నమైనను అభ్యంతరములేదట.(శివుడునిత్యభైక్షికుడు అతనికడదొరుకునది భిక్షాన్నమేకదా! "లోకంలోవాడుక మీయిట్లో పచ్చడి మెతుకులైనా నాకుపరమాన్నమే"-ననివాడుక,అట్లే యిదియు.

          నిధినిక్షేపములనిచ్చిననురాజకీటములసేవింపనొల్లడట! ఇటప్రభువులు కవికి కీటక సమానులుగా దోచుచున్నారు.బహుశఃఇది రాయలయనంతరపు మాటయైయుండవచ్చును


సంసారభారమునుజూపి ఆశాపాశములతో ననుబంధించి పరిభ్రమింపజేయకుము.నీబంటుగా సేకొన్నచాలును చేపట్టి యెన్నటికి విడువబోకుము.నాకంతకుమించి వలదనుచున్నాడు.

లోకమున నాశనుజయించినవాడు.లేడు.నిజముగా నదిపాశమువంటిదే"ఆశాపాశముదాగడున్నిడుపు లేదంతంబు రాజేంద్ర!" యన్నవామనోక్తులు సర్వధాస్మరణీయములు.ఆశను జయించినవాడే ఆధ్యాత్మిక సింహాసనమున నధివశిచుటకు యోగ్యుడు.ఆయోగ్యనుప్రసాధింప గోరుట ధూర్జటి యాధ్యాత్మిక జ్ఙానపరిపక్వతకు నిదర్శనము.

                         స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: