18, జనవరి 2022, మంగళవారం

వాస్తు శాస్త్ర రహస్యాలు

 ప్రాచీన భారతీయ వాస్తు శాస్త్ర రహస్యాలు  - 


  నేను భారతీయుడిగా పుట్టినందుకు చాలా గర్విస్తున్నాను . ఎందుకంటే ప్రపంచంలో మరే దేశానికి , మరే సంస్కృతికి లేనంత గొప్ప ప్రాచీన విజ్ఞానం మన భారతీయులకు మన దేశానికే సోoతం . అటువంటి ప్రాచీన అద్బుతమైన విజ్ఞానాన్ని మనం మర్చిపోతున్నాం . ప్రస్తుత పరిస్థితుల్లో కొంతవరకు అయినా మరలా మీకు తెలియచేయాలి అనే ఈ చిన్న ప్రయత్నం .


            మన ప్రాచీన శాస్త్రాలలో వాస్తుశాస్త్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. దానిలోని కొన్ని రహస్యాలు మీకు తెలియచేస్తాను.


 *  ప్రప్రధముగా గృహనిర్మాణం కావించునప్పుడు భూమిని పరీక్షించవలెను . అలాచేయనిచో ఆ గృహనిర్మాణం వ్యర్థం అగును. 


 *  గృహనిర్మాణం కావించు భూమి యందు చిల్లపెంకులు ఉన్నచో అది అశుభప్రదము . ఎముక యొక్క బూడిద ఉన్నచో అది నష్టప్రదము , బొగ్గులు మరియు చౌడు ఉన్నచో జీవహాని .


 *  గృహనిర్మాణం చేయు భూమి తెల్లని రంగు కలిగి ఉన్నచో శ్రేష్టము . ఎర్రని రంగు గల భూమి మధ్యమము , పచ్చని రంగు కలిగిన భూమి అధమము , నల్లనిరంగు కలిగిన భూమి విడువవలెను .


 *  భూమిని త్రవ్వినప్పుడు దానిలోని మృత్తిక నాలుకపై వేసుకొనినచో తియ్యగా ఉన్న శ్రేష్టం , మిశ్రమం అయినది మధ్యమం , పుల్లనిరుచి అధమం , చేదు రుచి కలిగినది మరింత అధమం.


 *  తవ్విన మన్ను వాసన చూడగా తామరపద్మం వాసన వచ్చినచో శ్రేష్టం , గుర్రం మరియు ఏనుగు మదం వాసన వచ్చినచో మధ్యమం , పశువు మరియు ధాన్యం వాసన వచ్చినచో అది అధమం , ఇతర వాసనలు వచ్చినచో విడువవలెను . 


 *  నాలుగు దిక్కులు సమ చతురస్రం కలిగి గంధపు వర్ణం కలిగిన భూమి గృహనిర్మాణానికి అత్యంత అనుకూలం .


 *  గృహనిర్మాణ స్థలం నందు ఒక మూర చతురస్రాకారంగా గొయ్యి తవ్వి దాని యందు రాత్రి సమయం లో నిండా నీరుపోసి పొద్దున్న లేచి చూడగా నీరు పూర్తిగా ఇంకిపోకుండా నిలిచి యున్నచో శుభప్రదం . ఇదే పద్ధతిని కొన్ని ప్రాచీన వాస్తుగ్రంధాలలో నీటిజాడని కనుక్కోవడానికి వాడేవారు. అదే గుంటలో నీరు ఇంకి బురదగా ఉన్నచో మధ్యస్తంగా నీరు పడును. నీరు పూర్తిగా ఇంకి భూమి నెర్రెలు కొట్టి ఉంటే ఎంత ప్రయత్నించినను నీరు పడదు.


 *  దేవాలయములకు శంఖువు శిలతో చేయవలెను .  గృహములకు శంఖువు కర్రతో చేయవలెను . 


 *  బ్రాహ్మణులకు పదహారు అంగుళములు , రాజులకు పదిహేను అంగుళములు , వైశ్యులకు పదునాలుగు అంగుళములు , శూద్రులకు పదమూడు అంగుళములు ఉన్న శంఖములను గృహగర్భము నందు వాడవలెను . ఆయా ప్రమాణాలలో సగం వర్తులాకారంలో ఉండవలెను . ఇది మగధదేశ నియమం .


 *  శంఖువు ఎనిమిది అంగుళాల లావు వుండవలెను . 


 *  వృత్తాకారం గల స్థలం నందు గృహనిర్మాణం చేసి అందు నివసించేవారు దరిద్రులు అగును. విషమ కోణములు గల భూమి యందు నివసించేవారు దుఃఖితులు అగుదురు. ముక్కోణం గల స్థలం నందు ఇండ్లు కట్టి నివసించేవారు సివిల్ మరియు కేసులు సంప్రాప్తినుంచి ఇబ్బందులు పడును. చేట వంటి ఆకారం గల భూమి యందు గృహం నిర్మించి ఉండువారు ఎంతటి ధనవంతులు అయినను క్రమంగా రుణగ్రస్తులు అయ్యి దరిద్రులు అగును. కావున యోగ్యమైన భూమి యందే గృహనిర్మాణం చేయవలెను . 


 *  వాయువ్యమునకు గాని , ఆగ్నేయమునకు ముఖం కలిగి ఆ దిక్కుగా కట్టిన గృహము అగ్నిచే దహించబడును అని భృగుమహర్షి తెలియచేసెను . ఈశాన్య నైరుతి దిశలకు అభిముఖము కలిగి దిశతిరిగినట్టు కట్టిన గృహము నాశనం పొందును. కలహములచే ఎల్లప్పుడూ పీడించబడును.


 *  గృహారంభం పగటిపూట మధ్యాహ్నానికి పూర్వమే చేయవలెను . మధ్యాహ్నం నందు మరణప్రదం . సంధ్యాసమయం , రాత్రికాలం నందు ఐశ్వర్యం కోరువారు చేయకూడదు . 


 *  రాత్రియందు శంఖుస్థాపన చేసినచో గృహహాని .


 *  రాత్రిని నాలుగు భాగములు చేసి అందు నాలుగోవ బాగం యందు ఘడియలలో గృహారంభ ప్రతిష్ట చేయవచ్చు అని విశ్వకర్మ తన వాస్తుశాస్త్రం నందు తెలియచేశారు.


 *  భార్య గర్భవతిగా ఉన్నప్పుడు గృహారంభాలు చేయకూడదు . అలా చేసినచో గర్భహాని మరియు గృహహాని జరుగును. అలా చేయవలసివచ్చించో 5 మాసాల తరువాత చేసుకోవచ్చు.


 *  గర్బము ధరించిన స్త్రీ యొక్క భర్త సింధు  స్నానం , చెట్లు నరకుట , క్షౌరము , శవమును మోయుట , విదేశీయానం నిషిద్దం .


 *  నూతన గృహములు నిర్మించుకొనువారు నిర్మాణానికి కొత్త కలపనే వాడవలెను . పాత గృహం కలప , కాలిన కలప వాడరాదు.


 *  విష్ణు ఆలయములకు వెనక భాగం , ఈశ్వరాలయంకు ఎదుటను , శక్తి ఆలయములకు పక్క భాగములలో , వీధి శూలల యందు గృహం నిర్మించరాదు.


 *  గృహము నందు మూడు ద్వారములు , మూడు మంచములు , మూడు దీపములు , 3 కిటికీలు ఉన్నచో ఆ గృహము దుఃఖప్రధమం అగును.


 *  గృహము యొక్క గోడ దళసరి 12 భాగములు చేయగా లోపలి వైపు 7 భాగములు వెలుపలి వైపు 5 భాగములు ఉంచి మధ్య యందు ద్వారం ఉంచవలెను .


 *  ద్వారము లేనిది కూపం అనియు , ఒక ద్వారం కలిగినదానిని దిగుడు బావి అనియు నాలుగువైపులా మెట్లు ఉన్నదానిని పుష్కరణి అని అంటారు. అదేవిదంగా పొడవుగా ఉన్నదానిని దీర్గికా అనియు , ఎల్లప్పుడూ నీరు ఉండేదాన్ని కుల్యం అని కూడా అంటారు.


 *  లోగిలి యందు నీరు తూర్పుదిశకు వెళ్ళుట వృద్ధికరం . ఉత్తరదిశగా వెళ్లుట ధనప్రదం , పడమట దిశ యందుట ప్రవహించుట ధనక్షయం , దక్షిణదిశకు నీరుపోవుట మృత్యుపదం .


 *  గృహనిర్మాణం చేయు భూమి దక్షిణ , పశ్చిమాలు ఎత్తుగా ఉండటం శుభపరిణాము . తూర్పు , ఉత్తరములు  పల్లముగా వుండవలెను . 


 *  తిధి వృద్ది క్షయముల యందు , రోగగ్రస్తులగా ఉన్నప్పుడు , భయంతో కూడిన పరిస్థితులు ఉన్నప్పుడు , రాజాటంకం కలిగినప్పుడు , భార్య గర్భిణిగా ఉన్నప్పుడు, తనకు గ్రహస్థితి బాగాలేనప్పుడు , దుస్వప్నములు , దుశ్శకునాలు కనిపించినప్పుడు , ఇంట్లో మైల ఉన్నప్పుడు , అమావాస్య దగ్గర్లో , వర్జ్య ఘడియల్లో శంఖుస్థాపన నిషిద్దం .


 *  గృహం అతిఎత్తైనది అయితే చోరభయం , అతికూరచ అవుటవల్ల దరిద్రం , అతి వెడల్పు వలన మరణం సంభంవించును.


 *  ఆయష్షు కోరుకునే వారు  తూర్పుముఖంగా , కీర్తికాముకులు దక్షిణముఖముగా , ఐశ్వర్యకాముకులు పడమటి ముఖంగా కూర్చుని భోజనం చేయవలెను  . శార్ధకర్మలు యందు కాక మరే సమయంలోను ఉత్తరాభిముఖంగా భోజనం చేయరాదు . తల్లితండ్రులు జీవించి ఉన్నవాడు , తల్లి కాని తండ్రి కాని జీవించి ఉన్నవాడు కూడా దక్షిణ ముఖంగా తిరిగి భోజనం చేయరాదు .  ఇదియే గృహము నందు భోజన నియమము . 


  *  స్వగృహము నందు తూర్పు తలగడ , అత్తవారింట దక్షిణ తలగడ , ఇతరచోట్ల పడమర తలగడ పెట్టుకుని పడుకోవలెను . ఉత్తర తలగడగా ఎప్పుడూ పడుకోగూడదు .


 *  గడ్డియందు , దేవాలయం , పాషాణం , పల్లపు ప్రదేశం , మార్గము, ద్వారం, గృహమధ్య ప్రదేశం , ఒంటరిగా , స్మశానం , నాలుగు దార్లు కలిసేచోట , ఇంటి దూలం క్రింద , తన మరియు పర స్త్రీల సమీపం నందు పడుకోరాదు.


 *  గృహమధ్యమం నందు వృక్షాలు ఉండరాదు.తులసి ఉండవచ్చు.


      

                కాళహస్తి వెంకటేశ్వరరావు 


                  అనువంశిక ఆయుర్వేదం 


                     9885030034

 🍓🍒🍎🍉🍑🍊🥭🍍🍌🍋🍈🍏🍐🥝🍇

నివేదనల పేర్లు

🍈🍋🍌🍏🍐

1)చూతఫలం=మామిడిపండు

 2)ఖర్జూర= ఖర్జూరం.              

3)నింబ=వేప

4)నారింగ=నారింజ

5)భల్లాతకీ=జీడిపప్పు

6)బదరీ=రేగు

7)అమలక=ఉసిరికాయ

8)శుష్కద్రాక్ష=కిస్మిస్ 

9)అమృత లేక బీజాపూరం= జామపండు

10)ఇక్షుఖండం=చెఱకుముక్క

11)కదళీఫలం,రంభా ఫలం=అరటిపండు

12)నారికేళం=కొబ్బరికాయ

13)జంభీర= నిమ్మ పండు

14)దాడిమీ=దానిమ్మపండు

15)సీతాఫలం= సీతాఫలం

16)రామఫలం= రామఫలము

17)కపిత్త=వెలగ పండు

18)శ్రీ ఫలం, బిల్వఫలం= మారేడు

19)మాదీ ఫలం=మారేడు పండ్లు

20)జంభూఫలం=నేరేడు

 ప్రసాదములు.  

21)వాతాదం= బాదము పప్పు


1)కుశలాన్నం =పులగం


2)చిత్రాన్నం=పులిహోర


3)క్షీరాన్నం=పరమాన్నం


4)పాయసం=పాయసం 


5)శర్కరాన్నం= చక్కెరపొంగలి


6)మరీచ్యన్నమ్= కట్టు లేదా మిరియాలపొంగలి


7)దధ్యోదనం= పెరుగు అన్నము


8)తిలాన్నం=నువ్వులపొడితో చేసిన అన్నం


9)శాకమిశ్రితాన్నం=కిచిడీ


10)గుడాన్నం = బెల్లపు పరమాన్నం


11)సపాదభక్ష్యం= గోధుమనూకతో చేసిన ప్రసాదం


 (గోధుమ నూక చీనీ నెయ్యి సమపాళ్ళలో వేసి చేసింది గాన ఆపేరు)


12)గుడమిశ్రిత ముద్గ సూపమ్= వడపప్పు


13)గుడమిశ్రిత తండులపిష్టం= చలిమిడి


14)మధురపానీయ=పానకం


15)పృథక్=అటుకులు


16)పృథకాపాయస=అటుకుల పాయసం


17)లాజ=పేలాలు


18)భక్ష్యం= పిండివంటలు


19)భోజ్యం= అన్నము మొదలగునవి


20)వ్యంజనం=పచ్చడి


21)అపూపం=అరిసెలు లేదా అప్పములు


22)మాషచక్రం= గారెలు


23)లడ్డుక,= లాడూలు


24)మోదకం= ఉండ్రాళ్లు

🍓🍒🍎🍉🍑🍊🥭🍍🍌🍋🍈🍏🍐🥝🍇

కరోనా/ ఓమిక్రాన్ రూపంలో

 *కరోనా/ ఓమిక్రాన్ రూపంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా విసరిస్తోంది. భయపడాల్సిన  అవసరం లేదు. బాగా చదివి అర్థం చేసుకొని పాటించండి.* 


ఓమిక్రాన్/కరోనా సోకిన వారికి కనిపించే లక్షణాలు. 

1 . జలుబు, గొంతు గరగర;  ఒక్కో  సారి దగ్గు. ఈ లక్షణాలు చాల మందిలో  కనిపిస్తున్నాయి.  


2. జ్వరం... కొద్ది మందిలో మాత్రమే  కనిపిస్తోంది. ఎక్కువ మందికి జ్వరం రావడం లేదు. కొంతమందికి మాత్రం ఒక రోజు లేదా రెండు రోజులు జ్వరం వస్తోంది. కొంతమందిలో జ్వరం ఎక్కువగా అంటే 103 డిగ్రీ ల దాక వచ్చి తగ్గిపోతోంది. జ్వరం 102  దాటితే ఒంటిని ని తడిబట్ట తో తుడవండి. దీన్ని  స్పాంజింగ్ అంటారు. 


3. తక్కువ మందిలో కడుపు నొప్పి , వాంతులు... ముఖ్యంగా ఇరవై ఏళ్ళు లోపు వారిలో ఇది కనిపిస్తోంది. వాంతులు అవుతున్నప్పుడు మజ్జిగ కొబ్బరి నీరు లాంటివి బాగా తాగాలి. వాంతులు ఒకటి రెండు రోజుల్లో  తగ్గిపోతాయి. 


4. వొళ్ళు నొప్పులు , కాళ్ళు లాగినట్టు ఉండడం నీరసం. 


చేయాల్సినవి : 


1.  పై లక్షణాలు కనిపిస్తే బి,  సి , డి విటమిన్ మాత్రలు, జింక్ మాత్ర  వారం పాటు తీసుకోండి . జ్వరం వున్నప్పుడు మాత్రం పారాసెటమాల్ 500 మాత్ర తీసుకోండి . పారాసెటమాల్ అదే పనిగా తినొద్దు. పదేళ్ల లోపు పిల్లలకు విటమిన్ మాత్రలకు బదులుగా మల్టీ విటమిన్ సిరప్ ఇవ్వండి. ఇవి కాకుండా మరే ఇతర మాత్రలు వద్దు. అంటి బయటిక్ మాత్రలు అవసరం లేదు. మాల్పురంవీర్ అనే మాత్రలు కొంతమంది తీసుకొంటున్నారు. ఇవి తీసుకొంటే కాన్సర్ వచ్చే ప్రమాదం వుంది అని icmr హెచ్చరించింది . జాగ్రత్త . అది తింటే పిల్లలు పుట్టరు. 


Tab. DoxT (10) రోజుకు 1 మాత్రమే


Tab. Mefthal plus or Dolo 650 జ్వరం వుంటేనే రోజుకు 1లేదా2 మాత్రమే


Tab. Montek LC (15) అవసరమైతేనే వాడాలి.


Azithromycin 3 or Azee 500mg రోజుకు 1మాత్రమే


Tab. Vit C (30)

రోజుకు 2మాత్రమే


Tab.Vitamin D 60K (8) వారానికి 1 మాత్రమే


Tab. Zincovit (30) రోజుకు 2 మాత్రమే


Tab. Omez D (10) పరగడుపున 1మాత్రమే


2. ప్రతిరోజూ వేడి నీరు తాగాలి. పెద్దలు రోజుకు నాలుగు లీటర్లు. పిలల్లు రెండు లీటర్లు. గొంతు లో గరగర /దగ్గు  పోవడానికి *వేడి నీటిలో ఉప్పు వేసి గొంతు లో పోసుకొని గొంతు చివర అపి తల పైకెత్తి బాగా గొంతులో ఆపి షేక్ చేయండి.తరవాత దాన్ని ఊసేయండి.* జలుబు, దగ్గు చాల మందిలో రెండు రోజుల్లో తగ్గిపోతోంది. నాలుగైదు రోజులు దగ్గు తుమ్ములు వున్నా భయపడాల్సింది ఏమీ లేదు. 


4 . నాన పెట్టిన బాదం రెండు, షుగర్ లేని వారు రోజుకు ఒక అరటి పండుతినాలి.  అందరూ పాలకూర, తోట కూర, అల్లం వెల్లులి కనీసం వారం  తినాలి. వీటిని మీకు తోచిన రీతిలో వండుకోండి. ఇది మన ఇమ్మ్యూనిటి ని బలోపేతం చేస్తుంది. 


5.అల్లం పసుపు కషాయం రోజుకు ఒక సారి కేవలం మూడు రోజులు టీ లాగా తాగండి. ఎక్కువ తాగొద్దు. వాంతులు అయ్యేవారికి కషాయం వద్దు. 


ఇప్పుడు విసరిస్తున్నది ఓమిక్రాన్. కానీ అక్కడక్కడా డెల్టా కూడా వ్యాపిస్తోంది . మనకు సోకింది డెల్టా నా ఓమిక్రాన్ నా అని తెలిసే అవకాశం లేదు.చిన్న పాము నైనా పెద్ద కర్ర తో కొట్టాలి అంటారు. కాబట్టి అందరూ పల్స్ ఆక్సీమేటర్ తో చెక్ చేసుకోండి. అందులో sp ౦ 2 .. 94 అంతకంటే ఎక్కువ ఉంటే సమస్యే లేదు. లేచి కూర్చుని చెక్ చేసుకోండి. పడుకొని, కిటికీలు మూసి  చెక్ చేస్తే ఒక్కో సారి 93 లేదా 92 రావొచ్చు. గాబరా పడొద్దు. వేలు పెట్టిన ముప్పై సెకండ్స్ కు వచ్చే రీడింగ్ చూడాలి. ముందుగా ఎంత వుంది అనేది లెక్కలోకి తీసుకోవద్దు. 91 కంటే రీడింగ్ తక్కువ ఉంటే సోకింది డెల్టా అది ఊపిరి తిత్తుల్ని దెబ్బ తీస్తోంది అని అర్థం చేసుకోవాలి. ఇప్పటికే కరోనా ఈ మూడో వేవ్ లో  లక్షలాది మందికి సోకింది. ఎవరికీ ఇలాంటి అవసరం  రాలేదు, ముందు జాగ్రత్త మాత్రమే. కంగారు పడొద్దు. 


డెల్టా సోకితే అయిదవ రోజుకు రుచి లేదా వాసన లేదా రెండు పోతుంది. అలా వాసన రుచి పోలేదంటే అది ఓమిక్రాన్ అని అర్థం. రుచి వాసన పొతే నువ్వుల లడ్డు రోజుకు ఒకటి పది రోజులు తినండి. పోయిన రుచి వాసన తిరిగి వచ్చేస్తాయి. కాస్త ఆలస్యం అయితే కంగారొద్దు. 


ఓమిక్రాన్  సోకిన నూటికి తొంబై మందిలో ఎలాంటి లక్షణాలు కనపడడం లేదు. లక్షణాలు ఉన్నా అవి రెండు  మూడు  రోజుల్లో పోతున్నాయి. కాబట్టి భయం అసలు వద్దు.  ఇప్పుడు సోకుతున్న వారిలో నూటికి తొంబై తొమ్మిది ఓమిక్రాన్. డెల్టా ఎక్కడో ఒక చోట కనిపిస్తోంది.


    మనకు సోకింది కరోనా కదా అని తెలుసుకోవాలనే ఆసక్తి భయం వద్దు. ఆర్టీపిసిఆర్ యాంటిజెన్ లాంటి టెస్ట్ ల వద్దు. వైరస్ రెండు రోజుల్లో చనిపోతుంది. టెస్ట్ కు వెళ్లే లోపే పోతుంది. కాబట్టే దక్షిణాఫ్రికా స్పెయిన్ లాంటియూ అనేక దేశాలు అసలు టెస్ట్ లు అవసరం లేదని చెప్పాయి. కొంత మంది వెళ్లి టెస్ట్ చేయించుకొంటున్నారు. అక్కడ పాజిటివ్ అని తేలితే కొన్ని ఆసుపత్రులు డి దిమ్మెర్ CRP, బ్లడ్ టెస్ట్ అంటూ ఒక డజను టెస్ట్ లు చేయమని అడుగుతున్నారు. ఓమిక్రాన్ కోసం ఇలాంటి టెస్ట్ లు ఏవీ అవసరం లేదు. ఇది నా మాట కాదు. దేశం లోని ప్రముఖ డాక్టర్ లు నిన్న ఈ మేరకు పత్రికా ప్రకటన జారీ చేసారు. రెండో వేవ్ సందర్భంగా రోగులకు స్టెరాయిడ్ లాంటివి ఇచ్చి ఆరోగ్యాన్ని  చెడగొట్టారు . ఇలాంటి ప్రయత్నాలు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి . వీటిని అరికట్టాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. కాబట్టి జాగ్రత్త. చికిత్స పేరుతొ అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవద్దు. 


ఓమిక్రాన్ సోకి ఇంట్లో ఉంటే రెండు రోజుల్లో తగ్గిపోతుంది. అనవసర టెస్ట్ లు.. సైడ్ ఎఫెక్ట్స్ కలిగించే మందులు తిని ఆరోగ్యాన్ని చెడకొట్టుకోవద్దు . డబ్బు ఎక్కువైతే ఉద్యోగం పోగొట్టుకొని బాధ పడుతున్నవారికి విరాళం ఇవ్వండి. పిచ్చి టెస్ట్ లతో పిచ్చి మాత్రలతో ఇంటిని ఒంటిని గుల్ల చేసుకోవద్దు. 


ఆసుపత్రికి ఎప్పుడు వెళ్ళాలి ?


1 . జ్వరం ఆరో రోజుకు కూడా తగ్గక పొతే . 2 . పల్స్ ఆక్సీమీటర్ లో ఆక్సిజన్ శాతం 94 నుంచి తగ్గడం మొదలై 91  చేరుకున్నప్పుడు అంబులెన్సు పిలవాలి . అప్పుడు ఆలస్యం వద్దు . ఇలాంటి అవసరం ఈ మూడ్ వేవ్ లో ఎవరికీ రాలేదు. 


పల్స్ ఆక్సీమేటర్ లో SPO2 కాకుండా మరొక రీడింగ్ వస్తుంది . చూసారా ? అది వంద లోపు ఉంటే మీ ఉంట్లో నిలకడ లేనట్టు . జ్వరం వల్ల ఒంట్లో నిలకడ ఉంటే అది 120 -130  దాకా ఉంటుంది . కంగారొద్దు . అదేమీ డేంజర్ కాదు . అయ్యో పల్స్ రీడింగ్ ఎక్కువ వుంది . వందకు తగ్గాలి అని మీరు కంగారు పడితే అది టెన్సన్ వల్ల పెరుగుతుంది . లైట్ గా తీసుకోండి . సాధారణంగా  వైరస్ సోకి లక్షణాలు వున్నప్పుడు అంటే తొలి రెండు  మూడు రోజులు అది వందకు పైన ఉంటుంది . వైరస్ చచ్చి మీరు ఆరోగ్యం కుదుటపడుతుంటే అది వంద అంతకంటే తక్కువ యిపోతుంది . మీకు ఇదివరకే బిపి ఉంటే ఇది ఎక్కువగా ఉంటుంది . దాన్ని గురించి భయం వద్దు. 


ఈ మెసేజ్ ని అందరితో షేర్ చేసుకోండి. 


*బ్రాహ్మణ చైతన్య వేదిక*

వివాహం/పెండ్లి సంబంద 15 పుస్తకాలు

 

వివాహం/పెండ్లి సంబంద 15 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో

పాణిగ్రహణము-వివాహ మంత్రార్ధము www.freegurukul.org/g/Vivaham-1

గృహస్థాశ్రమం లో ఎలా వుండాలి www.freegurukul.org/g/Vivaham-2

పెండ్లి సందడి- వివాహ పద్ధతి www.freegurukul.org/g/Vivaham-3

బ్రహ్మ చర్యం www.freegurukul.org/g/Vivaham-4

పెళ్లి దాని పుట్టు పూర్వోత్తరాలు www.freegurukul.org/g/Vivaham-5

వివాహ మంత్రార్ధం www.freegurukul.org/g/Vivaham-6

పాణిగ్రహణం www.freegurukul.org/g/Vivaham-7

వైదిక వివాహ వైశిష్ట్యము www.freegurukul.org/g/Vivaham-8

సప్తపది www.freegurukul.org/g/Vivaham-9

హైందవ వివాహము www.freegurukul.org/g/Vivaham-10

గృహస్థ ధర్మావళి www.freegurukul.org/g/Vivaham-11

వివాహ తత్త్వము www.freegurukul.org/g/Vivaham-12

వివాహం సంతానం కోసమేనా www.freegurukul.org/g/Vivaham-13

మన వివాహ వ్యవస్థ www.freegurukul.org/g/Vivaham-14

గృహస్థ ధర్మావళి www.freegurukul.org/g/Vivaham-15

వివాహం/పెండ్లి గురించి తెలుసుకోవడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.

మరింత సమాచారం కోసం:
ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్
Website: www.freegurukul.org
Android App: FreeGurukul
iOS App: Gurukul Education
Helpline: 9042020123
To Join In WhatsApp Group: To get this type of Spiritual/Inspirational/PersonalityDevelopment messages daily, join in group by this “www.freegurukul.org/join link.

ఉపనిషత్ సంబంద 56 పుస్తకాలు

ఉపనిషత్ సంబంద 56 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో

ఉపనిషత్సర్వస్వము www.freegurukul.org/g/Upanishath-1

ఐదు ఉపనిషత్తులు www.freegurukul.org/g/Upanishath-2

మలయాళ సద్గురు గ్రంధావళి-10 www.freegurukul.org/g/Upanishath-3

ముండకోపనిషత్ www.freegurukul.org/g/Upanishath-4

కేనోపనిషత్ www.freegurukul.org/g/Upanishath-5

ఈశావాస్య ఉపనిషత్ www.freegurukul.org/g/Upanishath-6

కఠోపనిషత్ www.freegurukul.org/g/Upanishath-7

కైవల్యోపనిషత్తు www.freegurukul.org/g/Upanishath-8

తేజో బిందూపనిషత్ www.freegurukul.org/g/Upanishath-9

ముండకోపనిషత్ www.freegurukul.org/g/Upanishath-10

శివ తత్వ ప్రభాంద్రీకరణం-2 www.freegurukul.org/g/Upanishath-11

శివ తత్వ ప్రభాంద్రీకరణం-1 www.freegurukul.org/g/Upanishath-12

ఈశావాస్య ఉపనిషత్ www.freegurukul.org/g/Upanishath-13

మహానారాయణోపనిషత్-1 www.freegurukul.org/g/Upanishath-14

మహానారాయణోపనిషత్ www.freegurukul.org/g/Upanishath-15

ఈశావాస్య ఉపనిషత్ www.freegurukul.org/g/Upanishath-16

కేనోపనిషత్ www.freegurukul.org/g/Upanishath-17

నిరాలంబోపనిషత్ www.freegurukul.org/g/Upanishath-18

అనంతోపనిషత్ www.freegurukul.org/g/Upanishath-19

సర్వసారోపనిషత్ www.freegurukul.org/g/Upanishath-20

గురువాక్యోపనిషత్ www.freegurukul.org/g/Upanishath-21

ఉపనిషత్సారము www.freegurukul.org/g/Upanishath-22

కైవల్యోపనిషత్తు www.freegurukul.org/g/Upanishath-23

ఉపనిషచ్చన్ద్రిక-2 www.freegurukul.org/g/Upanishath-24

ఉపనిషచ్చన్ద్రిక-1 www.freegurukul.org/g/Upanishath-25

శ్వేతాశ్వతర ఉపనిషత్ www.freegurukul.org/g/Upanishath-26

ఈశావాస్య ఉపనిషత్ www.freegurukul.org/g/Upanishath-27

ఈశ – కేన ఉపనిషత్తులు www.freegurukul.org/g/Upanishath-28

ద్వాదశోపనిషత్తులు www.freegurukul.org/g/Upanishath-29

ఉపనిషత్ పాటములు www.freegurukul.org/g/Upanishath-30

కేనోపనిషత్ www.freegurukul.org/g/Upanishath-31

సౌమ్య కాశీశ స్తోత్రం-ఉపనిషత్తుల సారామృతము www.freegurukul.org/g/Upanishath-32

తైత్తిరీయోపనిషత్ www.freegurukul.org/g/Upanishath-33

కఠోపనిషత్ www.freegurukul.org/g/Upanishath-34

మాండూక్య రసాయనము www.freegurukul.org/g/Upanishath-35

కఠోపనిషదార్య భాష్యము www.freegurukul.org/g/Upanishath-36

కేనోపనిషత్ www.freegurukul.org/g/Upanishath-37

ఆది అనాది www.freegurukul.org/g/Upanishath-38

కఠోపనిషత్ www.freegurukul.org/g/Upanishath-39

శ్వేతాశ్వతర ఉపనిషత్ www.freegurukul.org/g/Upanishath-40

ప్రశ్నోపనిషత్తు www.freegurukul.org/g/Upanishath-41

తైత్తిరీయోపనిషత్ www.freegurukul.org/g/Upanishath-42

గర్భోపనిషత్ www.freegurukul.org/g/Upanishath-43

భావనోపనిషత్ www.freegurukul.org/g/Upanishath-44

ఉపనిషత్సుధ -1 www.freegurukul.org/g/Upanishath-45

ఉపనిషత్సుధ -2 www.freegurukul.org/g/Upanishath-46

ఉపనిషత్సుధ -3 www.freegurukul.org/g/Upanishath-47

ఉపనిషత్తుల భోధలు-కథలు www.freegurukul.org/g/Upanishath-48

మాండూక్యోపనిషత్ www.freegurukul.org/g/Upanishath-49

ఈశావాస్య ఉపనిషత్ www.freegurukul.org/g/Upanishath-50

బ్రహ్మవల్లీ www.freegurukul.org/g/Upanishath-51

ఉపనిషత్సప్తకె www.freegurukul.org/g/Upanishath-52

ఉపనిషత్తుల కథలు www.freegurukul.org/g/Upanishath-53

భావనోపనిషత్ www.freegurukul.org/g/Upanishath-54

మాండూక్యోపనిషత్ www.freegurukul.org/g/Upanishath-55

ఐతరేయోపనిషత్ www.freegurukul.org/g/Upanishath-56

ఉపనిషత్తులు పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.

మరింత సమాచారం కోసం:
ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్
Website: www.freegurukul.org
Android App: FreeGurukul
iOS App: Gurukul Education
Helpline: 9042020123
To Join In WhatsApp Group: To get this type of Spiritual/Inspirational/PersonalityDevelopment messages daily, join in group by this “www.freegurukul.org/join link

 

Webex Meeting ID High court of Telangana

 Webex Meeting ID


Court Hall No.1 : HONOURABLE THE CHIEF JUSTICE SATISH CHANDRA SHARMA https://hcts.webex.com/meet/hcjtshc1 126 104 8389


Court Hall No.2: HONOURABLE SRI JUSTICE UJJAL BHUYAN https://hcts.webex.com/meet/ubjtshc1 126 383 6493


Court Hall No.3: HONOURABLE SRI JUSTICE A.RAJASHEKER REDDY https://hcts.webex.com/meet/arrjtshc1 126 206 9222


Court Hall No.15: HONOURABLE SRI JUSTICE P.NAVEEN RAO https://tshc.webex.com/meet/pnrjtshc1 166 676 4167


Court Hall No.13: HONOURABLE DR. JUSTICE SHAMEEM AKTHER https://tshc.webex.com/meet/sajtshc1 166 685 3469


Court Hall No.9: HONOURABLE SRI JUSTICE ABHINAND KUMAR SHAVILI https://tshc.webex.com/meet/aksjtshc1 166 707 7499


Court Hall No. 4 HONOURABLE JUSTICE G. SRI DEVI https://tshc.webex.com/meet/gsdjtshc1 166 144 4278


Court Hall No. 5 HONOURABLE JUSTICE LALITHA KANNEGANTI https://tshc.webex.com/meet/lkjtshc1 166 924 4436


Court Hall No. 14 HONOURABLE SRI JUSTICE T. VINOD KUMAR https://tshc.webex.com/meet/tvkjtshc1 166 745 2140


Court Hall No.32 HONOURABLE SRI JUSTICE A ABHISHEK REDDY https://tshc.webex.com/meet/aarjtshc1 166 363 2560


Court Hall No.11 HONOURABLE SRI JUSTICE K.LAKSHMAN https://tshc.webex.com/meet/kljtshc1 166 084 9913


Court Hall No.30 HONOURABLE SRI JUSTICE B. VIJAYSEN REDDY https://tshc.webex.com/meet/bvrjtshc1 166 191 4494


Court Hall No. 6 HONOURABLE SMT JUSTICE PERUGU SREE SUDHA https://tshc.webex.com/meet/pssjtshc1 2518 134 6635


Court Hall No. 10 THE HON'BLE DR. JUSTICE CHILLAKUR SUMALATHA https://tshc.webex.com/meet/csljtshc1 2510 805 2663


Court Hall No. 26 THE HON'BLE DR. JUSTICE GURIJALA RADHA RANI 

https://tshc.webex.com/meet/grrjtshc1 2518 004 5584

 

Court Hall.27 HONOURABLE SRI JUSTICE MUNNURI LAXMAN https://tshc.webex.com/meet/mljtshc1 2517 068 2525


Court Hall No. 28 HONOURABLE SRI JUSTICE NOONSAVATH TUKARAMJI https://tshc.webex.com/meet/ntrjtshc1 2518 237 9641


Court Hall No. 29 HONOURABLE SRI JUSTICE ADDULA VENKATESHWARA REDDY https://tshc.webex.com/meet/avrjtshc1 2519 613 7586


Court Hall No. 31 HONOURABLE SMT JUSTICE PATLOLLA MADHAVI DEVI https://tshc.webex.com/meet/pmdjtshc1 2517 176 9592

17, జనవరి 2022, సోమవారం

గుండెనొప్పి వచ్చినప్పుడు

 *గుండెనొప్పి వచ్చినప్పుడు* ఒకవేళ మనం ఒంటరిగా వున్నప్పుడు మనకు మనం చేసుకునే ప్రథమ చికిత్స గురించి Dr. గీతా క్రిష్ణస్వామి గారు రాసిన ఈ క్రింది విషయం, ఓ రెండు నిమిషాలు కేటాయించి చదవటం మనకు చాలా మంచిది !


       అప్పుడు రాత్రి 7/45 అయింది , ఆరోజు ఎక్కువ పని భారంతో ఆఫీస్ నుంచి బాగా అలసిపోయి తిరిగి వస్తున్నాం,ఎంతో నిస్సత్తువగా,చిరాకుగా కూడా వుంది ! ఇంతలో అకస్మాత్తుగా గుండెలో ఎదో గట్టిగా పట్టేసినట్లు తీవ్రంగా నొప్పి మొదలయింది ,ఆ నొప్పి అలా భుజాలవరకు,ఇంకా పైకి దవడల వైపు కూడా ప్రాకుతోంది ! అప్పటికి ఇంకా ఇల్లు చేరలేదు,హాస్పిటల్ కు చేరుకోవటానికి దూరం కనీసం 5 కిలోమీటర్లు వుంది కానీ అతి త్వరలో అక్కడకు చేరుకోగలమా అన్న సందేహంతో మరింత కంగారు కూడా మొదలయ్యింది !

       

       ఇలాంటి క్లిష్ట సమయంలో హాస్పిటల్ చికిత్స అందే లోపల ఒకరికి ఒకరు, వెంటనే ఇచ్చే CPR చికిత్స గురించి తెలిసినా, ఎవరికి వారే చికిత్స చేసుకునే విధానం తెలియక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు, మరేం చేయాలి ?......

        

       ఇటువంటి సంకట పరిస్థితిలో హాస్పిటల్ చికిత్స అందే లోపల మన ప్రాణాలను మనమే ఎలా కాపాడుకోవచ్చో Dr గీతా క్రిష్ణ స్వామి గారు చెప్పిన సలహా చాలా అద్భుతం ! అది చాలా సులభం అని కూడా మీకు తెలుస్తుంది ఈ క్రిందిది చదివిన తరువాత !

     

        ఆ క్లిష్టమైన ఘడియలలో గుండె కొట్టుకోవటంలో లయ తప్పుతోందని మనకు అర్థం అవుతున్న సమయంలో, దగ్గరలో ఎటువంటి సహాయం అందే మార్గం లేనప్పుడు, ఇక స్పృహ కోల్పోతామేమో సమయానికి........ మనకు ఇంకా *ఓ పది సెకండ్ల సమయం మాత్రం మన చేతిలో వుంది*, మనం పూర్తిగా స్పృహ కోల్పోవటానికి ! ఈలోగా ?????😱

   

       అలాంటి ఆ పది సెకండ్ల అమూల్యమైన సమయంలో మనం చేయవలసినది ఒక్క *దగ్గటం* మాత్రమే ! 😊 ! *ఆశ్చర్యంగా వుంది కదూ !* ఆ దగ్గు రిపీట్ చేస్తుండటమే ! అది ఎలా అంటే, దగ్గే ముందు ఊపిరి బాగా పీల్చుకుంటూ దగ్గుతుం డాలి, ఒకసారి ఊపిరి పీల్చుకుని 

దగ్గటానికి రెండు సెకండ్ల చొప్పున కేటాయిస్తూ,బాగా లోతునుంచి, ఒకవేళ కఫం వున్నట్లయితే,అది బయటకు వచ్చేటట్లు ఎలా దగ్గుతామో అంత ఉదృతంగా, ఆగకుండా మనకు ఏదైనా సహాయం అందే వరకూ దగ్గుతూనే వుండాలి అలా ! ఈలోగా గుండెలో సరి అయిన మార్పు వచ్చి మాములుగా కొట్టుకోవటం కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది !  

   

       ఈ దగ్గటం మనకు ఎంతలా సహాయ పడుతుందంటే , మనం గట్టిగా ఊపిరి పీల్చి నప్పుడు, మన ఊపిరి తిత్తులు, ప్రాణ వాయువుతో ( ఆక్సిజన్) పూర్తిగా నిండి, గుండె మీద వొత్తిడి తెచ్చిపెడుతుంది,ఆ వొత్తిడి వల్ల గుండెలో వున్న రక్త నాళాలు స్పందించి, మరల సరిఅయిన రీతిలో రక్త ప్రసరణ జరిగి, గుండె కొట్టుకోవటంలో లయ మరల యధాస్థితికి చేరు కోవటానికి తోడ్పడుతుంది ! అంటే చికిత్స అందే లోపల మనకు మనమే ప్రథమ చికిత్స చేసుకుంటు ఇలా ప్రాణాలను నిలుపు కుంటున్నామన్న మాట !

        

        ఇటువంటి ఉపయోగకరమైన సమాచారం మనం ఎంత మందికి పంపిస్తే అందులో కొంత మందికైనా ఇది ఉపయోగ పడి వారి ప్రాణాలు నిలిపిన వారి మౌతాం !

   

   *హృద్రోగ నిపుణులు కూడా అదే చెబుతున్నారు*

   

      అందువల్ల, మనం రోజూ పంపించే మెసేజెస్ తో పాటు ఇదీ కూడా కలపి పంపించి నట్లైతే పరోక్షంగానైనా ఎందరికో సహాయ పడిన వాళ్ళ మవుతాం !

 *ఏ టీవీ. ఛానెల్స్ అయినా ఎన్నికల ముందస్తు సర్వే

 రిపోర్ట్ ప్రసారం చేస్తున్నప్పుడు, ప్రాంతం వారీగా కులాల జనాభా శాతం ఈ విధంగా చెబుతున్నారు*


ఈ ప్రాంతాల్లో 

15% ముస్లింలు

1% బ్రాహ్మణులు

17 % రెడ్లు

04 % క్షత్రియులు

12 % కమ్మలు

37% బి.సి.లు

12% షెడ్యూల్ కులాలు

02 % గిరిజనులు...


👇 *వాళ్లు ఈ విధంగా ఎందుకు చెప్పరు* ? 


ఈ ప్రాంతంలో 

62% హిందువులు, 

10% క్రిస్టియన్ లు, 

మరియుముస్లిం లలో 

5% సున్నీ ముస్లింలు 

మరియు 

10% షియా ముస్లింలు ఉన్నారు. అని.??


ముస్లిం లలో 

కసాయి------------0.5 %

గహీ ------------ 0.5 %

అన్సారీ -----------01 %

హజ్జమ్ -----------0.5 %

కయంఖాని -------- 0.5%

సయ్యద్---------------01 %

పఠాన్ ------------- 01 %

షేక్ --------------- 02 %

షఫీ ----------------01 %

మణిహార్ ---------- 01 %

సల్మానీ (ధోబి) ----- 0.5 %

ఇద్రిసి (టైలర్) ------ 0.5 %

మన్సూరి ------- 0.5%

బాబర్చి ---------- 0.5 %

మిరాసి ----------0.5%

భండ ------------01 %

పింజారీ --------- 0.5%

నూర్ భాషా ---- 01%

దూదేకుల ------ 01%

ఉన్నారు. అని?


ఇలాంటి ప్రసారాలు టీవీలో ఎవరైనా చూశారా? లేక ఏ వార్తాపత్రికలోనైనా?


అలాంటప్పుడు కేవలం హిందువుల విభజన ఎందుకు?


ఎందుకంటే *హిందూజాతిని ఏకమవకుండా విభజించే కుట్రలో భాగమే* 


హిందూ ధర్మం ప్రకారం 4 కులాలు ఉంటే రాజ్యాంగంలో 7000 కులాలు ఎక్కడ నుంచి వచ్చాయి?


ఈ విధంగా *హిందువులను* 7000 *కులాలుగా విభజించి* మొఘలులు మరియు బ్రిటీష్ వారు పాలించారు.


ఇక ముస్లిం లలో మిగతా సమయంలో వారిలోని కొన్ని కులాల మీద వివక్ష ఉన్నా ఎన్నికలు వచ్చేసరికి అంతా ఒక్కటే కులం. వారి దృష్టిలో ప్రపంచంలో రెండే రకాల ప్రజలు. 

1) *ముస్లిం లు* 

2) *కాఫిర్ లు* 


ఏ ఛానల్స్ ఐనా *ముస్లింలలోని కులాల గురించి ఎందుకు మాట్లాడవు* ..❓


*ఇక నుండి మార్పు రావాలి. హిందూ సమాజం ఐక్యం అవ్వకపోతే అంతరించిపోతుంది. తురకల చేతిలో మీ ప్రాణాలే మిగలవు, ఇక కులాలు మిగిలుంటాయా?*


🚩 *జాగో హిందూ*

 బెంగళూరును అతిచౌకగా అనగా కేవలం మూడు లక్షల రూపాయలకే అమ్మేసిన నాటి పాలకుడెవరు ?

.............................................................


(1) ప్రళయకావేరి అనగా ?


(అ) కావేరినదికి ఉపనది

(ఆ) కావేరి నదికే మరోపేరు

(ఇ) పులికాటు సరస్సు

(ఈ) చిలుకసముద్రం


(2) శ్రీకృష్ణదేవరాయలకు ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కొడుకులు.ఒక కూతురైన తిరుమళాంబను ఆళియ రామరాయలు మనువాడాడు.మరో కూతురును ఆళియరామరాయల తమ్ముడైన తిరుమలదేవరాయలు పెండ్లాడాడు. పెద్దకొడుకు పేరు తిరుమలయ్యదేవరాయలు. చిన్న కుమారుడి పేరు గురించి ఎక్కడా ప్రస్తావనలు లేవు, తెలియదు. మరి శ్రీకృష్ణదేవరాయల రెండో కూతురి పేరేమో చెప్పగలరా ?


(అ) తిమ్మాంబ

(ఆ) వెంగళాంబ

(ఇ) మంగాంబ

(ఈ) కృష్ణాంబ


(3) 1542 నుండి 1572 వరకు సదాశివరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించాడు. ఇతను పేరుకే రాజు, రాజ్యాధికారం ఆళియ రామరాజు, తిరుమలదేవరాయలుదే. సదాశివుడే తుళువవంశంలో చివరి చక్రవర్తి. ఇంతకు ఇతనేవరి కొడుకు ?


(అ) శ్రీకృష్ణదేవరాయల స్వంత తమ్ముడైన శ్రీరంగరాయల కొడుకు.

(ఆ) శ్రీకృష్ణదేవరాయల స్వంత అన్నయైన వీరనరసింహరాయల కొడుకు.

(ఇ) శ్రీకృష్ణదేవరాయల స్వంత తమ్ముడైన అచ్యుతరాయల కొడుకు.

(ఈ) తుళువ నరసరాజు కొడుకు.


(4) సాళువతిమ్మరాజు లేదా సాళువ తిమ్మరుసు (అప్పాజీ) తమ్ముడి పేరేమిటి ?


(అ) సాళువ గోవిందరాజులు

(ఆ) సాళువ మంగు

(ఇ) సాళువ గోపమంత్రి

(ఈ) సాళువ రామరుసు


(5) శ్రీకృష్ణదేవరాయల తండ్రైన నరసరాజు సాళువ నరసింగుని సేనాని, ఇతడు బెడందకోటపై దాడిచేసి దానినిసాధించాడు. బెడందకోట అనగా ఇప్పటి ?


(అ) ఆదోని

(ఆ) బీజాపురం

(ఇ) బీరారు

(ఈ) బీదరు


(6) శివాజీ సోదరుడైన ఏకోజి (మరోపేరు వెంకోజీ ) నుండి 3 లక్షల రుపాయలకు బెంగళూరును కొన్న మైసూరు పాలకుడెవరు ?


(అ) మొదటి కృష్ణరాజవడయార్

(ఆ) రెండోదేవరాజ వడయార్

(ఇ) మూడవ చామరాజ వడయార్

(ఈ) నాలుగవ చామరాజ వడయార్.


(7) ఒకసారి శ్రీకాళహస్తీలో మరోసారి తిరుమల శ్రీహరి సన్నిధిలో శంఖం నుండి జాలువారిన పవిత్ర జలంతో మరోసారి విజయనగరంలో ఇలా మొత్తం మూడుసార్లు పట్టాభిషక్తుడైన విజయనగర చక్రవర్తి ఎవరు ?


(అ) కంపన (కంపరాయలు)

(ఆ) మల్లికార్జున దేవరాయలు

(ఇ) విరూపాక్ష దేవరాయలు

(ఈ) అచ్యుతదేవరాయలు


(8) శివాజీ తనయుడు రాజారాం (సాహుజీ) ఔరంగజేబు చేతిలో ఓడిపారిపోయాడు. హిందూరాష్ట్ర స్థాపనకు కారకుడైన శివాజీ తనయుడు కష్టాలలో వున్నాడని ఈ రాణి విని, అతనికి తన రాజ్యంలో ఆశ్రయం కల్పించింది. దీంతో కోపించిన ఔరంగజేబు రాణిపై యుద్ధం ప్రకటించాడు. అజ్మత్ అరా నేతృత్వంలో మొగలుల భారీసేనలు దాడికి దిగాయి. ఈ రాణి ఆ సేనలను చిత్తుగా ఓడించింది.గతిలేక అజ్మత్ ఆరా ఆమెతో సంధిచేసుకొని వెనుదిరిగాడు. ఔరంగజేబునే ఎదిరించిన ఈ ధీరోద్ధాత రాణి గురించి మన పాఠ్యప్రణాళికలో లేకపోవడం దురదృష్టకరం.ఇంతకు ఆ రాణి పేరేమిటో మీకు తెలిసినట్టైతే చెప్పండి.


(అ) మహరాణి ఒనకే ఓబక్క

(ఆ) కెళదిరాణి చెన్నమాంబ

(ఇ) రాణిమంగమ్మ

(ఈ) రాణితిమ్మమాంబ


(9) వేలాపురానికి ప్రస్తుతమున్న నామధేయం ఏమిటి ?


(అ) వేల్పురము

(ఆ) వేలానగర్

(ఇ) గుడియాత్తం

(ఈ) వేలూరు (రాయవేలూరు)


(10) చావనైనా చస్తాను కాని మతం మారనని ధైర్యంగా ప్రశ్నించి ఔరంగజేబు చేతిలో చిత్రహింసలకు గురై మరణశిక్ష పొందిన ఛత్రపతి శివాజీ తనయుడెవరు ?


(అ) ఛత్రపతి సాహు

(ఆ) ఛత్రపతి రాజారాం

(ఇ) ఛత్రపతి శంభాజీ

(ఈ) ఛత్రపతి ఏకోజి

......................................................................... జి.బి.విశ్వనాథ.డిప్యూటి కలెక్టర్‌ (రిటైర్డ్) 9441245857, అనంతపురం.

కలియుగం

 * కలియుగం ఎలా ఉంటుంది.


కలియుగం ఎలా ఉంటుంది అన్న పాండవుల ప్రశ్నకు.... కృష్ణ భగవానుని సమాధానం. 


ఒకసారి ధర్మరాజు లేని సమయంలో మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుని కలియుగం ఎలా ఉంటుంది అని అడిగారు.


శ్రీకృష్ణుడు నవ్వి చూపిస్తాను చూడండి అన్నాడు. నాలుగు బాణాలు నాలుగు దిక్కులకు వేసి తలో దిక్కు వెళ్లి ఆ బాణాలను తెమ్మన్నాడు. నలుగురు పాండవులు తలో దిక్కుగా ఆ బాణాలను వెదుక్కుంటూ వెళ్లారు.


అర్జునుడికి బాణం దొరికింది. ఇంతలోనే ఒక మధుర గానం వినిపించి అటు తిరిగాడు. ఒక కోయిల మధురంగా పాడుతూ బ్రతికున్న ఒక కుందేలును పొడచుకు తింటోంది. అర్జునుడు నివ్వెర పోయాడు. తిరిగి కృష్ణుడి దగ్గరకు బయలు దేరాడు.


భీముడికి బాణం దొరికిన చోట నిండుగా నీళ్లున్న నాలుగు బావుల మధ్య ఒక ఎండి పోయిన బావి కనిపించింది. ఆశ్చర్య పోయాడు. కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు.


నకులుడికి బాణం దొరికిన చోట ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగ దూడను గాయాలయ్యేంత విపరీతంగా నాకుతోంది. చుట్టూ వున్న జనం అతి కష్టమ్మీద ఆవు దూడలను విడదీశారు. నకులుడికి ఆశ్చర్యమేసింది. వెనుదిరిగాడు.


ఇక సహదేవుడికి బాణం దొరికిన చోట ఒక పర్వతం పైనుండి ఒక పెద్ద గుండు దొర్లుతూ దారిలో ఉన్న చెట్లను పడవేస్తూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది. సహదేవుడికి అర్థం కాలేదు.


నలుగురూ కలిసి శ్రీకృష్ణుని తమ సందేహాలు అడిగారు.  


ఆయన చెప్పనారంభించాడు.


కలియుగంలో గొప్ప జ్ఞానులైన వారు కూడా కుందేలును కోయిల పొడుచుకు తిన్న రీతిగా భక్తులను దోచుకుంటారు.


కలియుగంలో అత్యంత ధనికులు కూడా పేదలకు పైసా సాయం చేయరు.


కలియుగంలో ఎలాగైతే ఆవు దూడకు గాయాలయ్యేంతగా నాకిందో తలిదండ్రులు తమ పిల్లలను గారం చేసి వాళ్ల జీవితాల్ని నాశనం

చేస్తారు.


కలియుగంలో జనులు మంచి నడవడి కోల్పోయి కొండ మీద నుంచి గుండు దొర్లినట్లుగా పతనం అవుతారు. భగవన్నామమనే చిన్న మొక్క తప్ప ఎవరూ కాపాడ లేరు.


ఉద్ధవ గీత శ్రీమద్భాగవతం

16, జనవరి 2022, ఆదివారం

కనుమలు అయిదు

 ❤️ *కనుమలు అయిదు*


💕 *కనుమ పండుగ నాడు ప్రయాణాలు నిషిద్ధం...అంటుంది శాస్త్రం.. !!*

💕 *కనుమ నాడు కాకి కూడా ప్రయాణం చెయ్యదు...*


🌺 *మనకు ఉన్నవి ఐదు కనుమలు*


🌺 *సంప్రదాయంగా ఐదు కనుమల్లో ప్రయాణం చేయరాదని చెబుతారు.*


❤️ *"శవదాహే గ్రామదాహే సపిండీకరణే తథా*

*శక్య్తుత్పవే చ సంక్రాంతౌ నగంతవ్యం పరేహని"*


❤️ *శవదహనం జరిగిన మరుసటి రోజు*

❤️ *గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగిన మరుసటి రోజు*

❤️ *సపిండీకరణమైన మరుసటి రోజు*

❤️ *గర్భస్రావం జరిగిన మరుసటి రోజు*

❤️ *సంక్రాంతి మరుసటి రోజు*

🌺 *వీటిని కనుమలు అంటారు.*


💕 *ఈ రోజుల్లో ప్రయాణించకూడదు*

సొంతింటి కల

 🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹

   కోట జగదీశ్ గారి "సొంతింటి కల" కథనం.

                🌷🌷🌷

‘అక్కడేదో కనిపిస్తోంది. అదొక్కటీ చూసేసి ఇంటికెళిపోదాం!’ అంది సావిత్రి. అప్పటికే చాలాసేపట్నుంచీ ఊరంతా తిరుగుతున్నారు. ఎలాగైనా నెలాఖరుకల్లా ఏదో ఒక అపార్ట్‌మెంట్ బుక్ చేసెయ్యాలని నిర్ణయించుకున్నారు. 


‘ఇది డెడ్ ఎండ్‌లా ఉంది. దీని తరవాత ఇంకలేవు. పేరు కూడా ఎన్‌క్లేవ్ అనే పెట్టాడందుకే!’ చిరాకుని చిగురాకంత చిరునవ్వుతో దాచాలని ప్రయత్నిస్తున్నాడు ప్రసాద్.


బిల్డింగైతే చూడటానికి ఏదో బానే వుందనిపిస్తోంది. కింద మేనేజర్ని అడిగితే మూడో అంతస్తులో ఖాళీ ఉన్నాయని చెప్పాడు. లిఫ్టదీ ఇంకా తయారవలేదు. మెట్లెక్కి పైకి వెళ్లారు. ఇల్లంతా కలియజూసేసి కిచెన్ వైపు వచ్చారు. దక్షిణం వైపు బాల్కనీలోకి వచ్చి గోడవతల దృశ్యం చూసి ఒక్కసారిగా కొయ్యబారిపోయారు.


అప్పుడే ఫ్రెష్‌గా శవాన్ని కాలుస్తున్నారక్కడ. పక్కనే, గోడనానుకునే స్మశానం. 


‘ఇదేందివయా ఇదీ? బెడ్‌రూమ్ కిటికీలోంచి చూస్తే డైరెక్టుగా కనబడేలా ఉంది? సీ వ్యూ, లేక్ వ్యూ పేర్లు పెడతారు చూడూ, దీనికి ‘గ్రేవ్ వ్యూ’ అపార్ట్‌మెంట్స్ అని పెట్టండి పేరు. సరిపోతుంది. పద సావిత్రీ!’


‘సర్, అదేంలేద్సార్! మనకసలు ఎటువంటి డిష్టబెన్సూ ఉండదు. ఇన్నిరోజుల్నించీ కడతన్నామా, ఇప్పటివరకూ ఒక్క బాడీని కూడా కాల్చలేద్సార్! బాడ్‌లక్ మీరొచ్చినపుడే రావాలా? అయినా మన కాంపౌండ్ వాల్ చాలా హైటొస్తాద్సార్! కిటికీలకి టింటెడ్ గ్లాసేసుకుంటే కనబడే అవకాశం కూడా ఉండదు!’ 


ఎలాగోలా ఒప్పించేద్దామని చూస్తున్నాడు.


‘వద్దులే తమ్ముడూ! మాకు సెంటిమెంట్లవీ ఎక్కువ. ఇలా స్మశానాలవీ ఆక్రమించేసి రియల్ ఎస్టేట్‌ కాస్తా బరియల్ ఎస్టేట్‌లా మార్చేస్తున్నారు!’


చూసింది చాల్లే అనుకుని కిందకొచ్చి బండెక్కేశారు. ఎండ తీవ్రంగా ఉంది. ఇక ఆపేసి ఇంటికెళిపోదామని నిర్ణయించుకున్నారు దంపతులిద్దరూ.


మెయిన్‌రోడ్డు మీదకు రాగానే వెంకట్రెడ్డి కనబడ్డాడు. 


‘నమస్తే ప్రసాద్‌గారూ! ఇళ్ల వేటా? ఇంకా కొనలేదేటి?’ అన్నాడు పెద్దగొంతేసుకుని.


‘ఏవీ నప్పట్లేదు వెంకట్రెడ్డీ! మీ బావమరిదేదో కడుతున్నాడని చెప్పావు, పూర్తైందా?’


‘అయిపోవచ్చింది ప్రసాద్‌జీ! కానీ కాస్త తక్కువ రేంజ్. మీకు నచ్చుద్దోలేదో?’


‘ఒకసారి చూసేస్తే పోలా? పద వెళ్దాం!’


అక్కణ్ణుంచి మూడువీధులవతల కాస్త గోప్యంగా కట్టాడు బిల్డింగ్. చుట్టూ బోల్డన్ని చెట్లు, పొదలమధ్య దాక్కున్నట్టుంది బిల్డింగ్.


రెడ్డి చెప్పినట్టు కాస్త మీడియం రేంజే! గదులవీ బావున్నాయి కానీ బాల్కనీలు మాత్రం చిన్నవి. బెడ్‌రూమ్ కిటికీని బాగా దగ్గరగా ఆనుకుని పక్కనే మరొక అపార్ట్‌మెంట్ వాళ్ల బాల్కనీ ఉంది. ఏ పచ్చిమిరపకాయలో అయిపోతే అక్కణ్ణుంచి విసిరితే ఇటొచ్చి పడేంత దగ్గర. 


కిటికీగనక తీస్తే ఆయింట్లో ఉండేవాళ్ల డ్రాయర్లు, లంగాల కలర్సన్నీ మనకి కంఠతా వచ్చేస్తాయి. అన్నీ సెవెంటీ ఎంఎం స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా ఆరేశారు. చెరుకుపల్లి టవర్స్ కాదు. ఇరుకుపల్లి టవర్సని పెట్టాల్సింది పేరు. నవ్వుకుని బయటికొచ్చాడు ప్రసాద్.


బాత్రూములోకి వెళ్లి చూశాడు. ప్లంబర్ కుర్రాడెవరో బాగా అప్రెంటిస్ అనుకుంటా! ఫ్లష్ ట్యాంకుకీ, కమోడ్‌కీ కనీసం తొంభై డిగ్రీలైనా ఉండాలికదా? పాపం, ఎనభై డిగ్రీలే పెట్టిచచ్చాడు. దాంతో బాత్‌రూముకి వెళ్లిన ప్రతిసారీ ఆ లిడ్‌ని పైకెత్తితే, అదొచ్చి సరిగ్గా ‘అక్కడే’ పడి కొట్టుకుంటుంది. రోజూ ఆ హింస భరించడం ఎంతకష్టం? పైగా పైకి చెప్పుకోవడానికి కూడా వీల్లేని కష్టమది!


అయినా అతను మాత్రం ఏంజేస్తాడు, బాత్రూములు అంత చిన్నవిగా ఉంటే? 


మళ్ళీ నవ్వొచ్చింది ప్రసాద్‌కి. ఇవన్నీ వెంకట్రెడ్డితో మాటాడ్డానికి మొహమాటపడి థాంక్స్ చెప్పేసి బయల్దేరాడు. పాపం, ముందునుంచీ అంటూనేవున్నాడుగా మీకు నప్పదని!


భోజనం కానిచ్చి మళ్ళీ సాయంత్రం బయల్దేరి మరో పాష్ ఏరియాలో అడుగుపెట్టారిద్దరూ. ఒకటేదో ‘ఫ్లాట్స్ ఫర్ సేల్’ అని బోర్డు చూసి వెళ్లారు. సెల్లార్‌లో వైటండ్ వైట్ వేసుకుని ఏవో రాసుకుంటున్న ఒకతన్ని పేరూ, ఉద్యోగ వివరాలు చెప్పి పలకరించారు ఇద్దరూ. 


‘ముందు పైకెళ్లి చూసొచ్చి అప్పుడు రేటదీ మాటాడదాం!’ అంది సావిత్రి. సరేనన్నాడు సత్యవంతుడు. ఇద్దరికీ ఆ అపార్ట్‌మెంట్ చాలా నచ్చేసింది. పైగా దేనికదే సెపరేటుగా విశాలంగా కూడా ఉన్నాయి. 


కిందకొచ్చి ఆఫీసు రూములో కూర్చున్న తరవాత అడిగాడు ప్రసాద్


‘ఉన్నాయాండీ? లేక అయిపోయాయా?’


‘చెప్పండ్సార్! మీకే ఫ్లోర్లో కావాలి?’


‘ఫస్టయితే దోమలెక్కువగా వుంటాయిట. థర్డ్, ఫోర్త్ కరెంటు లేకపోతే ఎక్కడం కష్టం. అంచేత సెకండే బెటరనిపిస్తోంది!’ 


ఇది అనేకానేక చర్చల తరవాత దంపతులిద్దరూ తీసుకున్న నిర్ణయం. 


‘సెకండా? ఉండండి చూస్తాను. మూర్తీ, ఆ డైరీ పట్రా ఓసారి!’ అంటూ ఎల్ఐసీ వాళ్ల డైరీ ఒకటి తెరిచి అన్నీ పరికించి బుర్ర అడ్డంగా ఊపాడు.


‘ఏంటి? లేవా?’ అన్నాడు నిస్పృహతో!


‘అసలెప్పుడో అయిపోయాయి సార్! మీరు చాలా లేటుగా వచ్చారు. మేవిఁక్కడ అపార్ట్‌మెంట్ కట్టాలని మనసులో అనుకున్నప్పుడే సగం ఫ్లాట్స్ బుక్కైపోయాయి. అలాంటిది మీరింత ఆలస్యంగా వచ్చి అడిగితే ఎలా?’ అంటూ మందలించాడు. 


ఎంసెట్‌కి ఆలస్యంగా వచ్చినా క్షమిస్తారేమోగాని ఇతనసలు క్షమించేలా లేడు.


కాసేపు నిశ్శబ్దం. ప్రసాద్ మొహంలో కొంతైనా పశ్చాత్తాపం కనబడుతుందేమో, ఇంకొంచెం బెట్టు చేద్దామనుకున్నాడు. 


కానీ వాళ్లిద్దరూ ‘ఆఁ! ఇది కాకపోతే వందున్నాయి. లోకం గొడ్డుపోయిందా?’ అన్నట్టు నిలబడ్డారు.


అప్పుడు అతనిలో చలనం వచ్చింది. 


‘పోనీ ఓపని చేద్దాం ప్రసాద్‌గారూ! మా బావమరిది అడిగాడని సెకండ్లో ఒకటుంచాను. అతనికి నేనేదో చెప్పుకుంటాన్లెండి. మీరు మా శ్యాంబాబుకి కావలసినవాళ్లు కాబట్టి అది మీకిచ్చేస్తాను. కాకపోతే ఎస్సెఫ్టీకి మరో యాభై ఎక్కువవుతుంది!’


ఇట్టాంటి స్ట్రాటజీలు చాలా విన్నాడు ప్రసాద్. అయినాసరే, ఆ ప్రాంతంలో ఉండాలన్న బలమైన కోరికతో ఒప్పేసుకున్నాడు. 


అది మొదలు సావిత్రికి రోజూ అందమైన కలలు రావడం మొదలయ్యాయి. ఆ విశాలమైన రోడ్లమీద చుట్టూ తురాయి చెట్ల నీడలో బొచ్చుకుక్కనొకదాన్ని తీసుకుని వాకింగులవీ చేస్తున్నట్టు, వర్షం పడుతోందని ఏ చెట్టునీడనో ఆగితే ఒక్కసారిగా గాలేసి ఆ చెట్టుపూలన్నీ తనమీద పూలవాన కురిసినట్టూ... 


‘పాలూ...!’ అని అరిస్తే అప్పుడు మెలకువొచ్చేది. 


పూలవాన నుంచి బయటపడి పాలక్యాన్ పట్టుకుని తలుపు తీసేది.


ప్రసాదుకి ఇటువంటి కలలవీ అలవాటులేదు. అతను చాలా మెటీరియలిస్టిక్. ఇల్లంటే ఇటుకలూ సిమ్మెంటనే అతని దృష్టి. అంచేత అతనెప్పుడూ ఇంటిచుట్టూ లాన్ల గురించి కాకుండా ఇంటికి కట్టాల్సిన లోన్ల గురించే ఆలోచించేవాడు.


పని చురుగ్గా సాగుతోంది. సావిత్రి ఎప్పటికప్పుడు వెళ్లి తనకెలా కావాలో మార్పులవీ చెబుతూ చేయించుకుంటోంది. పనివాళ్ళు చాలా చురుకైనవాళ్లు. చెప్పింది చెప్పినట్టు భలే మార్చేసేవారు. 


ఒకరోజు ప్రసాద్, సావిత్రి కలిసి వెళ్లారు. కింద సెల్లార్‌లో బిల్డర్ లేడు. పనివాళ్లని అడిగితే హరిద్వార్ వెళ్లాడని చెప్పారు. అతగాడి మేనమామగారు కూర్చున్నారు ఆఫీసులో. చూడ్డానికి వయసైపోయిన అరవింద్‌స్వామిలా ఉన్నాడాయన. అద్భుతమైన వర్ఛస్సు. నమస్కారాలు తెలిపి పైకి వెళ్లారు.


అక్కడ దృశ్యం చూసి మరోసారి కొయ్యబారిపోయారు.


కిచెన్‌నుంచి బయటికి వెళ్లే దారిలో పెద్ద ఫ్లోర్ విండో ఒకటి కనబడుతోంది. అది వీళ్లు చెప్పనేలేదసలు. ఒక్కసారిగా కంగారైపోయారు. బయటికొచ్చి అది సెకండ్ ఫ్లోరా కాదా అని రూఢీ చేసుకున్నారు. మళ్లీ లోపలికొచ్చి మేస్త్రీనడిగితే అతను మళ్ళీ కొయ్యబారిపోయే మాటొకటి అన్నాడు.


‘ఆచారిగారు ఆల్మోస్ట్ రోజూ వస్తన్నార్సార్! ఆయనే పెట్డమన్నారిది. మీకు చెప్పలేదా?’


‘ఆచారిగారెవరు?’ ఇద్దరూ ఒకేసారి అన్నారు. వాళ్లకి కొంకణ్ సినిమా సబ్‌టైటిల్స్ లేకుండా చూస్తున్నట్టుంది.


అప్పుడు మేస్త్రీ కొయ్యబారిపోయాడు. మేనేజర్ని పిలిచాడు. అతను టెర్రస్ మీద వరసగా ఆరేడు సిగరెట్లు కాల్చి ఎనిమిదోది అంటించబోతోంటే కుర్రాడొచ్చి కేకేశాడు.


చిరాగ్గా కిందకొచ్చి మేస్త్రీ మీద కోప్పడ్డాడు.


‘ఇప్పుడేకదా పైకెళ్లాను? ఇంతలో ఏమైంది?’ అన్నాడు అక్కడే సిగరెట్ బయటికి తీసి. సావిత్రికి సిగరెట్ వాసన పడదని అతణ్ణి వారించాడు ప్రసాద్.


‘ఈ సార్ ఏంటడుగుతున్నారో ఆలకించండొకసారి!’ అన్నాడు మేస్త్రీ.


‘ఏంట్సార్?’ అంటూ రాష్‌గా అడిగాడు.


‘ఆచారిగారెవరు?’ అన్నాడు ప్రసాద్.


‘ఆయన షిప్‌యార్డ్‌లో పనిచేస్తారు. ఆయన్దేగా ఈ ఫ్లాటు?’ 


‘ఏం తమాషాగా ఉందా? మేస్త్రీగారూ, మేం మొదట్నుంచీ ఎన్నిసార్లు మార్పులవీ చెప్పాం? గుర్తులేదూ?’


‘అదే ఆశ్చర్యంగా ఉంద్సార్ నాక్కూడా! మీరు వెంటిలేటర్లవీ తీసీమని చెప్పారని అన్నీ మూసీసాం. ఆచారిగారొచ్చి దెబ్బలాడి మళ్లీ అన్నీ తెరిపించారు. నాకదే బోదపళ్లేదు!’ అంటూ తాపీ పడేసి తాపీగా కింద కూర్చుండిపోయాడు.


అప్పుడు మేనేజర్‌కి కంగారొచ్చింది. నాతో రండంటూ ఆఫీసురూముకి తీసుకెళ్లాడు. రాత్రింబవళ్ళు కుక్కచాకిరీ చేసి సంపాయించిన డబ్బంతా వీళ్ల మొహాన పోశాం. ఇప్పుడేమంటాడో? అన్న కంగారు ఇద్దరి మనసులోనూ.


ఆ పెద్దాయన డైరీ ఒకటి తీసి అందులో చూపుడువేలుతో సూచిస్తూ వివరాలన్నీ మూడునాలుగు సార్లు చూశాడు. అతనికి చెమటలు పట్టేశాయి.


ఆ ఫ్లాట్ ప్రసాద్ పేరునా, ఆచారి పేరునా కూడా రిజిస్ట్రేషన్ అయివున్నట్టుగా ఉందందులో! వేరే వేరే పేజీల్లో రాసుకున్నాడు బిల్డర్.


ఇక ఏడుపు మొదలెట్టింది సావిత్రి. ఆయనతో వాదనకి దిగారు. ఆయనేమో కంగారుపడొద్దని, మేనల్లుడు రాగానే సత్వరన్యాయం చేస్తామని హామీ ఇచ్చి పంపేశాడు.


ఆ బిల్డర్ చాలారోజులవరకూ రాలేదు. ఏ గంగలోనో దూకేశాడేమో అనుకున్నాడు ప్రసాద్. ఆఖరికి ఒకరోజు సిరిపురం జంక్షన్‌లో కరాచీవాలాలో ఏదో కొంటూ కనబడ్డాడు. అప్పుడు పరుగుపరుగున వెళ్లి వాణ్ణి నిలదీశాడు.


‘ఏదో పొరపాటు జరిగింది. ఆ ఆచారిగారు ఊరుకోవట్లేదు. కోర్టుకి వెళతానంటున్నాడు. మీరే ఏదో ఒక సొల్యూషన్ చెప్పండి!’ అని తిరిగి ప్రసాదునే సలహా అడిగాడు.


ఉద్యోగం చేసుకుంటూ ఏరాత్రికో ఇల్లుచేరే ప్రసాదుకి కోర్టుకి తిరిగే ఓపికా తీరికా లేవు. అంచేత ఇచ్చిన డబ్బంతా తిరిగిచ్చేస్తే చాలంటూ వేడుకున్నాడు.


తనదగ్గర అంత సొమ్ము ఎప్పుడూ ఉండదుట. అందువల్ల దఫదఫాలుగా ఇస్తానని చెప్పాడు.


ఆ తరవాత అతని వెనకాల తిరిగితిరిగి జీవితంలో అతిముఖ్యమైన ఆనందాలన్నిటినీ కోల్పోయారు ప్రసాద్ దంపతులు. లాండ్ లైన్ ఫోన్ ఎత్తడు. మొబైల్‌కి చేస్తే కట్ చేస్తాడు. బిల్డింగ్ దగ్గరకెడితే ఎప్పుడూ మేస్త్రీయే కనబడతాడు.


దాదాపు రెండేళ్లపాటు బాగా ఏడిపించి అప్పుడు మూడోవంతు సొమ్ము వాళ్లమొహాన పడేశాడు. అదే చాలనుకుని ఆరోజు స్వీట్స్ తెచ్చుకు తిన్నారు ప్రసాదు, సావిత్రి.


‘ఇక ఈ అపార్ట్‌మెంట్‌ల విషయంలో మనం ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో మంచి అనుభవం వచ్చేసింది. ఇకనైనా జాగ్రత్తగా ఉందాం!’ అనుకుని ఒట్టేసుకున్నారు ఇద్దరూ!


యదార్ధగాథే! మాదే! పేర్లూ, ఉద్యోగసద్యోగాలూ మార్చానంతే!


......... *కొచ్చెర్లకోట జగదీశ్*

ఇల్లు కొనేవారు జాగ్రత్తలు తీసుకోవడానికి పనికి వస్తుంది.

*కనుమ పండగ

 🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹

*కనుమ పండగ “పశువుల పండుగ”*

 

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


కనుమను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశుపక్షాదులను పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పని చేసిన ఆవులను, ఎద్దులను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే. పక్షులు కూడా రైతన్ననేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వ్రేలాడ దీస్తారు.


     *🌷పశువుల పండుగ🌷*


ముఖ్యంగా చిత్తూరుజిల్లా, అందులో పాకాల మండలంలోని వల్లివేడు గ్రామ పరిసర అన్ని పల్లెల్లో ఈ పండగ జరుపుకోవటంలో ఒక ప్రత్యేకత వున్నది. ఆ ప్రత్యేకత ఏమిటంటే? ఆ రోజు ఇంటికి ఒకరు చొప్పున తెల్లవారక ముందే ఒక కత్తి, ఒక సంచి తీసుకొని సమీపంలో ఉన్న అడవికి బయలు దేరుతారు. అక్కడ దొరికే నానా రకాల వన మూలికలు, ఔషధ మొక్కలు సేకరిస్తారు. కొన్ని చెట్లఆకులు, కొన్ని చెట్ల బెరుడులు, కొన్ని చెట్ల పూలు, వేర్లు, కాండాలు, గడ్డలు, ఇలా చాల సేకరిస్తారు. కొన్ని నిర్దిష్టమైన చెట్ల భాగాలను మాత్రమే సెకరించాలి. అంటే, మద్ది మాను, నేరేడు మానుచెక్క, మోదుగ పూలు, నల్లేరు, మారేడు కాయ ఇలా అనేక మూలికలను సేకరించి ఇంటికి తీసుకొచ్చి వాటిని కత్తితో చిన్న ముక్కలుగా చేసి, ఆ తర్వాత దానికి పెద్ద మొత్తంలో ఉప్పు చేర్చి రోట్లో వేసి బాగా దంచుతారు. అదంతా మెత్తటి పొడిలాగ అవుతుంది. దీన్ని *"ఉప్పు చెక్క''* అంటారు. ఇది అత్యంత ఘాటైన మధురమైన వాసనతో వుంటుంది. దీన్ని పశువులకు తిని పించాలి. ఇదొక పెద్ద ప్రహసనం. అవి దీన్ని తినవు. అంచేత ఒక్కొక్క దాన్ని పట్టుకొని దాని నోరు తెరిచి అందులో ఈ ఉప్పు చెక్కను చారెడు పోసి దాని నోరు మూస్తారు. అప్పుడు ఆ పశువు దాన్ని మీంగుతుంది.. ఇలా ఒక్కదానికి సుమారు రెండు మూడు దోసిళ్ళ ఉప్పు చెక్కను తినిపిస్తారు. గొర్రెలు మేకలు ఐతే కొన్ని వాటంతట అవే తింటాయి. లేకుంటే వాటిక్కూడ తినిపిస్తారు. ఏడాదికి ఒకసారి ఈ ఉప్పుచెక్కను తినిపిస్తే అది పశువులకు సర్వరోగ నివారణి అని వీరి నమ్మకం. ఎందుకంటే అందులో వున్నవన్నీ ఔషధాలు, వన మూలికలే గదా.


ఆ తర్వాత పశువులన్నింటిని పొలాల్లోని బావుల వద్దకు గాని, చెరువుల వద్దకు గాని తోలుకెళ్ళి స్నానం చేయించి, లేదా ఈత కొట్టించి, ఇంటికి తోలుకొస్తారు. ఆ తర్వాత వాటి కొమ్ములను, పదునయిన కత్తితో బాగా చెలిగి వాటికి రంగులు పూస్తారు. మంచి కోడెలున్న వారు వాటి కొమ్ములకు ఇత్తడి కుప్పెలు తొడిగి, మెడలో మువ్వల పట్టీలు, మూతికి మూజంబరాలు అలంకరిస్తారు. అన్నింటికీ కొత్త పగ్గాలు వేస్తారు. ఈ సమయంలో చేలన్నీ పరిగిలి పోయి వున్నందున పశువులన్నింటిని వదిలేస్తారు. సాయంకాలం ఊరు ముందున్న కాటమరాజును పునఃప్రతిష్టించి ఊరిలో ప్రతి ఇంటి నుండి ఆడవారు కాటమరాజు ముందు పొంగలి పెడ్తారు. పొంగలి అంటే కొత్త కుండలో, కొత్త బియ్యం, కొత్త బెల్లం వేసి అన్నం వండడం. ఒక నెల ముందు నుండే కాటమరాజు ముందు ఆ దారిన వచ్చిపోయే ఊరివారు రోజుకొక కంపో, కర్రో తెచ్చి అక్కడ కుప్పగా వేస్తారు. కనుమ రోజుకు అది ఒకపెద్ద కుప్పగా తయారయ ఉంటుంది. దాన్ని *"చిట్లా కుప్ప"* అంటారు. చీకటి పడే సమయానికి పొంగళ్లు తయారయి ఉంటాయి. ఊరి చాకలి కాటమరాజు పూజ కార్యక్రమం ప్రారంబించి దేవుని ముందు పెద్ద తళిగ వేస్తారు. అంటే ప్రతి పొంగలి నుండి కొంత తీసి అక్కడ ఆకులో కుప్పగా పెడతారు. పూజానంతరం మొక్కున్న వారు, చాకిలి చేత కోళ్ళను కోయించు కుంటారు. అప్పటికి బాగా చీకటి పడి వుంటుంది. అప్పటికి పశుకాపరులు అందరూ ఊరి పశువులన్నింటిని అక్కడికి తోలుకొని వస్తారు. పూజారి అయిన చాకలి తళిగలోని పొంగలిని తీసి ఒక పెద్దముద్దగా చేసి అందులో సగం పోలిగాని కిచ్చి (పశువుల కాపరి) తినమని చెప్పి, తర్వాత అక్కడున్న చిట్లాకుప్పకు నిప్పు పెడతారు. పెద్ద మంట పైకి లేవగా పోలిగాడు పశువులన్నింటిని బెదరగొట్టి , చెదరకొడతాడు. అవి బెదిరి పొలాల వెంబడి పరుగులు తీస్తాయి. ఆ సమయంలో పశువులను బెదర గొడుతున్న పోలిగాని వీపున చాకలి తనచేతిలో వున్న మిగిలిన సగం పొంగలి ముద్దను అతని వీపు మీద కొడతాడు. దానిని పిడుగు ముద్ద అంటారు. వాడు పరిగెడుతాడు. ఆ తర్వాత అందరూ అక్కడ మిగిలిన తళిగలోని ప్రసాదాన్ని తిని మొక్కులు తీర్చుకొని చిట్లకుప్ప మంట వెలుగులో తమ కోళ్ళను కోసుకొని పొంగళ్లను తీసుకొని తాపీగా ఇళ్ళకి వెళతారు. ఈ సందర్భంగా పెద్ద మొక్కున్న వారు పొటేళ్ళను కూడ బలి ఇస్తారు. దాని రక్తాన్ని ఆన్నంలో కలిపి ఒక కుప్ప పెడతారు. దాన్ని *''పొలి''* అంటారు. ఆ *"పొలి"* ని తోటకాపరి గాని, నీరు కట్టేవాడు గాని తీసుకొని వెళ్ళి అందరి పొలాల్లో, చెరువుల్లో, బావుల్లో *"పొలో.... పొలి"* అని అరుస్తూ చల్లుతాడు. అప్పడే కొత్త మొక్కులు కూడ మొక్కు కుంటారు. అంటే, తమ పశుమందలు అభివృద్ది చెందితే రాబోయే పండక్కి పొట్టేలును, కోడిని ఇస్తామని కాటమ రాజుకు మొక్కు కుంటారు. అప్పటికప్పుడే ఒక పొటేలుపిల్లను ఎంపిక చేస్తారు. ఆ విధంగా పశువుల పండగ పరిసమాప్తి అవుతుంది.

ఈ నెలరోజులు వాకిట్లో అందమైన ముగ్గులతో అలంకరిస్తాము. కానీ ఈ కనుమ రోజున మాత్రం రధం ముగ్గువేసి ఆ రథాన్ని వీధిచివర వరకూ లాగినట్టుగా ముగ్గువేస్తారు. దీని అర్థం సూర్యుడు తన దిశను మార్చుకున్న మొదటిరోజు అని తెలుస్తుంది.

                  🌷🌷🌷

అయిదు కథలు*_

 _*నేడు సంక్రాంతి , సంక్రాంతి వెనుక ఎవరికీ తెలియని అయిదు కథలు*_


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


సంక్రాంతి అనగానే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే రోజు అని చాలామందికి తెలుసు. కానీ ఈ పండుగలో అంతకుమించిన ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. అవేంటో మీరే చూడండి.


1. పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు అరవైవేల మంది కొడుకులు. వీళ్లంతా ఓసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి , ఆయన తపస్సుని భంగం చేశారు. దాంతో కపిలముని వాళ్లందరినీ బూడిదగామార్చేశాడు. ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కానీ , వారి ఆత్మశాంతించదని తెలుస్తుంది. ఆకాశంలో ఉండే గంగని ఎవరూ నేల మీదకి తేలేకపోయారు. సగరుడి వంశంలో పుట్టిన భగీరధుడు ఈ పని చేయగలిగాడు. ఆయన తపస్సుకి మెచ్చి సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీద అవతరించిందట ! 


2. సంక్రాంతి గంగిరెద్దుల వెనుక కూడా ఓ కథ ఉంది. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. శివుడు తన కడుపులో ఉండేలా ఆ గజాసురుడు వరాన్ని కోరుకున్నాడు.

శివుని బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి ఓ ఉపాయం ఆలోచించాడు. దేవతలంతా తలా ఓ వాయిద్యాన్నీ పట్టుకుని , నందితో కలిసి గజాసురుడి దగ్గరకు బయల్దేరారు. వీళ్ల ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదన్నా వరాన్ని కోరుకొమ్మని అడిగాడు. ఇంకేముంది ! తన పొట్టలో ఉన్న శివుడిని బయటకు పంపమని వరాన్ని అడిగేశారు. అలా ఆనాడు శివుని పొందేందుకు చేసిన హడావుడే , ఇప్పటి గంగిరెద్దుల సంప్రదాయానికి నాంది అని చెబుతారు.


3. కనుమ రోజు పశువులని పూజించడం వెనుక కూడా ఓ కథ వినిపిస్తుంది. ఒకసారి శివుడు నందిని పిలిచి *‘భూలోకంలో అందరూ రోజూ ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి , నెలకి ఓసారే ఆహారం తీసుకోవాలి’* అని చెప్పి రమ్మన్నాడు. కానీ నంది అయోమయంలో *‘రోజూ ఆహారం తీసుకోవాలి , నెలకి ఓసారి నూనె పట్టించి స్నానం చేయాలి’* అని చెప్పిందట. దాంతో కోపం వచ్చిన శివుడు. *‘ప్రజలు రోజూ తినాలంటే చాలా ఆహారం కావాలి. ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి’* అని శపించాడు.

అప్పటి నుంచి ఎద్దులు , వ్వవసాయంలో సాయపడుతున్నాయట. కనుమ రోజు పశువులని సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తుంటారు.


4. సంక్రాంతికి గాలిపటాలు ఎగరేస్తాం కదా ! దీనికి కూడా ఓ కథ చెబుతారు. సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుందట. ఇది దేవతలకు పగలు అని నమ్మకం. దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తారట. దేవతలకి స్వాగతం పలికేందుకు , వారి దృష్టిని ఆకర్షించేందుకు గాలిపటాలు ఎగరేయాలని చెబుతారు.


5. సంక్రాంతితో పాటు ఇంటింటా అడుగుపెట్టే హరిదాసుకి కూడా ఓ ప్రత్యేకత ఉంది. సంక్రాంతికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే , హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడట. ఆయన తల మీద ఉండే పాత్ర , ఈ భూమికి చిహ్నమని చెబుతారు. అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టరు. భిక్ష పూర్తయ్యి ఇంటికి చేరుకున్నాకే దాన్ని కిందకి దించుతారు. ఇవండీ సంక్రాంతి గురించి ఓ అయిదు కథలు. ఇంకా గొబ్బెమ్మలు దగ్గర నుంచి భోగిపళ్ల వరకు... సంక్రాంతిలో కనిపించే ప్రతి ఆచారానికీ ఓ కథ ఉంది.

మూడు రకాల పాపాలు

మూడు రకాల పాపాలు 

మనం సామాన్య దృష్టితో పుణ్యం, పాపం అని పేర్కొంటాం.  పాపం చేస్తే పాప ఫలం పుణ్యం చేస్తే పుణ్యఫలం లభిస్తుందని మనం భవిస్తూవుంటాం. పాప పుణ్య విభజన మనం సామాజికంగా ప్రతివారు ధర్మపరులు కావాలని ఏర్పాటు చేసినట్లు కనపడుతుంది.  ప్రతివారు ఉత్తమమైనది మాత్రమే కోరుకుంటారు కాబట్టి పుణ్యకార్యాలు చేస్తే పుణ్యఫలంగా స్వర్గ ప్రాప్తి కలుగుతుందనే ఉద్దేశంతో పుణ్యాకార్యాలు చేస్తారు.  దీనివల్ల సమాజంలో అందరు సుఖ సంతోషాలతో ఉండగలరు. హిందూధర్మంలో ఏది చెప్పినా అది సమాజ శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకొనే ఉంటుంది. మన ఋషులు చాలా దూరం అలోచించి మనకు చక్కటి సాంప్రదాయాలను ఏర్పాటు చేసారు. 

ప్రతివారు తాము సద్గతులను పొందాలని పుణ్యకార్యాలను చేయటానికి పూనుకొంటారు.  వారు మరణానంతరం స్వర్గలోక నివాసం చేస్తారని మనకు శాస్త్ర ప్రమాణం. 

కానీ ముముక్షువులు మూడు రకాల పాపాలనుండి విముక్తుడు కావలి అప్పుడే మోక్షప్రాప్తి కలగదని మనకు ఉపనిషతులు తెలియచేస్తున్నాయి. 

మూడు రకాల పాపలు ఏవి. 

గృహస్థ జీవనానికి ఆధ్యాత్మిక జీవనానికి చాలా తేడా ఉంటుంది.  గృహస్తు  ఆచార సాంప్రదాయాలకు అనుగుణంగా తన జీవనానిని కొనసాగించాల్సి ఉంటుంది.  అదే ఆధ్యాత్మిక జీవనంలో సాధకుడు సదా ఆ పరబ్రహ్మ్ తత్త్వం వైపే పయనిస్తారు. నిత్యం, అనుక్షణం బ్రహ్మత్వంలోనే జీవిస్తాడు.  ఒకరకంగా చెప్పాలంటే సాధకుడు ఈ ప్రకృతితో సంబంధాన్ని సన్నగించుకొని దైవత్వం వైపు సంబంధాన్ని బలపరచుకుంటాడు.  కానీ విచిత్రం ఏమిటంటే ప్రక్రుతి యోగిని సదా వెన్నంటి ఉండి యోగికి అన్నివిధాల అనుకూలంగా మారుతుంది.  యోగి అతి చల్లని జలంతో కూడా స్నానం చేయగలడు, మండే మంటలమీద తన శరీరాన్ని ఉంచిన శరీరం కాలదు. అటువంటి అనేక అతీంద్రియ శక్తులు యోగికి కారతలామలకలం అవుతాయి.  యోగి వస్త్రధారణ చేయాల్సిన పనిలేదు రమణ మహార్షిలాంటి మహానుభావులు ఈ సమాజం కోసం కౌపీనం ధరిస్తారు కానీ నిజానికి అదికూడా వారికి అవసరం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే యోగికి మన సమాజపు నియమాలు బందించవు కేవలం సదా వారి ద్రుష్టి పరబ్రహ్మ మీదనే ఉంటుంది. 

ఇక్కడ చెప్పే మూడురకాల పాపలు సమాజ జీవనము చేస్తున్న గృహస్తులకు కాదు కేవలం సంపూర్ణ సాధన చేస్తున్న యోగులకు మాత్రమే అందుకే నేను పైన అంతవివరణ ఇచ్చాను. 

ఇప్పుడు పూర్తిగా ఆధ్యాత్మిక జీవనం చేసే యోగులైన సాధకులకు మాత్రం ఉన్నటువంటి మూడు రకాల పాపలు ఏమిటో చూద్దాం. 

1) పాప పాపం: సాధారణంగా మనం పాపం అనుకునే పాపం దీనిని పాప పాపం అంటారు.  గృహస్తులు కానీ అలాగే సాధకులు కానీ పాప కర్మలు అంటే నిషిద్ధ కర్మలు చేయకూడదు. 

2) పుణ్య పాపం: ఇది వినటానికి కొంత విచిత్రంగా కనిపిస్తుంది ఎందుకంటె పుణ్యం పాపం కాదు కాదా మరి పుణ్య పాపం ఏమిటి అని మనం అనుకుంటాము. నిజానికి సాధకుడు పుణ్య కార్యాలు కూడా చేయకూడదు అంటే పుణ్యం కూడా మూటకట్టుకోకూడదు. ఎందుకంటె ఎప్పుడైతే సాధకుడు పుణ్య కార్యాలు చేసి పుణ్య ఫలాన్ని పొందుతాడో అప్పుడు ఆ పుణ్య ఫలం అనుభవించటానికి మరలా జన్మ ఎత్తవలసి వస్తుంది.  కాక పుణ్య ఫలం చాలా ఎక్కువగా ఉంటే దానిని అనుభవించటానికి పుణ్యలోకాలకు (స్వర్గం) వెళ్ళవలసి ఉంటుంది.  ఆ ఫలం పరిసమాప్తం కాగానే మళ్ళి మానవ జన్మ ఎత్తి మరల ఈ జరామృత్యు వలయంలో చిక్కుకోవలసి ఉంటుంది.  కాబట్టి సాధకుడు పుణ్యం కోసం ఏ కర్మను చేయకూడదు. 

3) అజ్ఞాన పాపం:  ఇది మనకు సాధారణ జీవన విధానంలో ఎక్కడ వినపడదు.  ఆధ్యాత్మిక జగత్తులో సంపూర్ణ జ్ఞానం పొందిన వారు అంటే బ్రహ్మ జ్ఞానం పొందిన వారు మాత్రమే మోక్షార్హులు ఎందుకంటె మోక్షం సిద్ద వస్తువు సాద్య వస్తువు కాదు.  జిజ్ఞాసి బ్రహ్మ జ్ఞ్యానాన్ని పొందితే అప్పుడు ఈ అజ్ఞాన పాపం నుండి ముక్తుడు అవుతాడు. 

కర్మలు చేయకుండా ఉండటం యెట్లా: 

ఫై మూడు చదివిన తరువాత ప్రతి వారికి ఒక సందేహం కలుగుతుంది అదేమిటంటే మనిషి చేసే కర్మలు రెండు రకాలు ఒకటి పాప కర్మ రెండు పుణ్య కర్మ కాబట్టి చేసే ప్రతి పని (కర్మ) ఏదో ఒక విభాగంలోకి వస్తుంది కాబట్టి విధిగా తానూ చేసే కర్మలు రెంటిలో ఏదో ఒక ఫలాన్నిఇస్తాయి కదా మరి అటువంటప్పుడు పలితం లేకుండా కర్మలు చేయటం ఎట్లా. దీనికి సమాధానం సాధకుడు చేసే ప్రతి కర్మని ఈశ్వరార్పణగా చేయాలి అప్పుడు తానూ చేసే కర్మల ఫలాపేక్ష ఉండదు.  అది కేవలం ఈశ్వరునికే అర్పించబడుతుంది. ఇది బాగావుంది అయితే పాపాలు చేసి ఈశ్వరార్పణం అంటే అన్ని పాపాలు తొలగిపోతాయా అని అడగవచ్చు.  ఎట్టిపరిస్థితిలో ఆ పాప ఫలం పరమేశ్వరునికి చెందదు. ఎందుకంటె నీవు చేసే ప్రతి పాపము నీ మనస్సు, బుద్ది మిళితంగా చేస్తావు అంటే ఉద్దేశ్యపూర్వకంగా చేస్తావు ఎప్పుడైతే నీ మనస్సు నీవు చేసే కర్మ మీద లగ్నం అయ్యిందో దీని ఫలితం పూర్తిగా నీ కాతా లోనే చేరుతుంది. 

మహాపురుషులు తాము ఉద్దేశ్యపూర్వకంగా ఏ పనులు చేయరు.  కేవలం మనస్సుని పెట్టకుండా మాత్రమే కర్మలు చేస్తారు అందుకే వారు ఈ ప్రపంచంలో వున్నా కూడా లేనట్లే ఎందుకంటె వారు సదా తామరాకుమీద నీటి బిందువుగా వారి జీవితాన్ని గడుపుతారు.  నాది అని వారు ఏది అనుకోరు, రాగద్వేషాలకు బానిసలు కారు నిర్లిప్తగా జీవనాన్ని గడుపుతారు. 

ఓం శాంతి శాంతి శాంతిః 

తత్వమసి 

గమనిక: విజ్ఞులైన పాఠకులారా తెలుగు టైపు చేయటంలో కొన్ని తప్పులు సహజంగా దొర్లవచ్చు దయచేసి తప్పులను ఎత్తకుండా కేవలం భావాన్ని మాత్రమే తీసుకోగలరు. అమృత తుల్యమైన పానకాన్ని గ్రోలెరప్పుడు కొన్ని పుడకలు  రావటం సహజమే కదా.