12, జులై 2023, బుధవారం

లివర్ మరియు స్ప్లీన్ ( ప్లీహ ) వ్యాధులు

 లివర్ మరియు స్ప్లీన్ ( ప్లీహ ) వ్యాధులు  - 


 లివర్ అంటే ఏమిటి  ?  - 


   లివర్ మానవ శరీరంలో హృదయానికి పక్కటేముకలకి క్రిందుగా కుడివైపున ఉండే అవయవం . ఇది రక్తం వలన పుట్టినది. దీనిని కార్జం మరియు లివర్ అంటారు. ఇది నలుపు , ఎరుపు మిశ్రమ వర్ణంతో మిక్కిలి మృదువుగా ఉండే మాంస ఖండం . 


  ప్లీహము అంటే ఏమిటి  ?  - 


    ప్లీహము మానవ శరీరంలో ఎడమ బాగంలో హృదయానికి క్రిందుగా ఉండే అవయవం . ఇది కూడా రక్తం వలెనే జనిస్తుంది. రక్తాన్ని తీసుకుని పొయే సిరలన్నిటికి ఈ ప్లీహమే మూలం అని బారతీయ మహర్షులు పేర్కొన్నారు.


  లివర్ , ప్లీహ రోగాలు ఎందుకు వస్తాయి ?  -


 *  శరీరానికి వేడిచేసే పదార్దాలు అయిన మినుములు , ఉలవలు, ఆవాలు మొదలయిన వాటితో వండిన పదార్దాలను అధికంగా సేవించడం .


 *  గేదె పెరుగు ఎక్కువుగా తినడం .


 *  పగటిపూట అధికంగా నిద్రపోవడం.


     ఇటువంటి కారణాల వలన శరీరంలో రక్తం , కఫం ఎక్కువుగా వృద్ది చెంది లివర్ ని మరియు ప్లీహం వృద్ది చెందుతాయి. లివర్ , ప్లీహం చెడిపోయి  ప్లీహం వృద్ది అవుతుంది. దీనినే ప్లీహభివ్రుద్ధి            ( enlargement of spleen ) అంటారు.ఇదే ప్లీహ వ్యాధి అంటారు. ఇదే దోషం వలన లివర్ వృద్ది చెందుతుంది దానిని లివర్ వ్యాధి అంటారు. అయితే లివర్ వ్యాధి కుడివైపున , ప్లీహ వ్యాధి ఎడమ వైపున కలుగుతుంది అని తెలుసుకోవాలి.


  లివర్ మరియు ప్లీహ వ్యాధుల లక్షణాలు  - 


 *  ఈ వ్యాధుల వల్ల రోగులు బాగా కృశించి బలహీనులు అయిపోతారు.


 *  ఎల్లప్పుడు కొద్ది జ్వరం వెంటాడుతూనే ఉంటుంది.


 *  ఉదరంలో జట రాగ్ని మందగించిపోయి అజీర్ణం అగ్నిమాన్ధ్యం కలుగుతాయి.


 *  దీనివలన శరీరంలో రక్తం , కఫం దుషిమ్పబడి వ్యాధికారకం అవుతాయి. కావున శరీరం నందలి రక్తం తగ్గినా , విపరీతంగా పెరిగినా అనర్ధమే .


 *  శరీరమంతా ఎంతో బరువుగా , బడలికగా ఉంటుంది. నీరసం అనిపిస్తుంది.


 *  దేహమంతా వివర్ణం అయి శరీరం తిరిగి పోతున్నట్టుగా ఉంటుంది.


 *  పోట్టపైన చర్మం ఎరుపుగా ఉండి , పొట్ట బరువు పెరుగుతుంది.


 *  మనసుకి మైమరపు, భ్రమ , మొహం కలుగుతాయి .


  లివర్ మరియు ప్లీహ రోగాలకు సులభ యోగాలు -


 *  50 గ్రా శనగలను  నీళ్లలో  వేసి ఉడకబెట్టి రుచికోసం కొద్దిగా ఉప్పు కలిపి రోజు ఉదయం పూటనే తినాలి . కొంత సమయం తరువాత నేతిలో వేయించిన 50 గ్రా శనగలని కొద్దిగా ఉప్పు చేర్చి తినాలి . ఈ ప్రకారంగా కనీసం 15 రోజుల పాటు చేయాలి . ఈ 15 రొజుల్లొ కారం అసలు ముట్టుకోకుడదు చప్పిడి ఆహారమే తినాలి . ఈ నియమం పాటిస్తే ఎంతోకాలం నుంచి పీడించే లివర్ సమస్యలు అయినా పరిష్కారం అయి లివర్ శుభ్రపడుతుంది.


 *  50 గ్రా వాము తీసుకుని బాగా చెరిగి శుభ్రం చేసి ఆ వాముని ఒక మట్టి మూకుడులో పోసి అది మునిగేంత వరకు కలబంద మట్టల లోని రసం పోయాలి. దీనిని ఒక రాత్రి నానబెట్టి ఒక పగలు ఎన్దించాలి . ఎండ ప్రభావానికి వాము కలబంద రసాన్ని పీల్చుకుంటుంది. తరువాత సాయంత్రం పూట మళ్లి కలబంద రసాన్ని పోసి రాత్రి నానబెట్టి తెల్లారి ఎండలో పెట్టాలి. ఇలా మూడు రోజులు చేసిన తరువాత కలబంద రసాన్ని గ్రహించిన వాముని తీసుకుని నిలువచేసుకోవాలి. రోజు ఉదయం , సాయంత్రం వేళల్లో పూటకు 3 గ్రా మోతాదుగా తింటూ అనుపానంగా కొంచం మంచి నీళ్లు తాగుతూ ఉంటే ప్లీహబివ్రుద్ధి ( కడుపులో పెరిగే బల్ల ) హరించి పొతుంది.


            దీనికి పుదినా పచ్చడి , గోధుమ రొట్టెలు , ముల్లంగి కూర తినాలి . సగం బోజనమే చేయాలి . అంటే కడుపు నిండా తినకుడదని అర్ధం . పప్పులు , దుంపలు , మినుములు , పచ్చిపాలు, వెన్న, నెయ్యి మొదలయిన ఆలస్యంగా జీర్ణం అయ్యే పదార్ధాలు తినకుడదు.


  *  రోజు ఉదయం , సాయంత్రం వేళల్లో తులసి ఆకుల రసం రెండు మూడు చెంచాలు తాగుతూ ఉంటే క్రమంగా కడుపులో బల్లలు కరిగిపోతాయి.


 *  వెంపలి చెట్లు ప్రతిచోటా పెరుగుతాయి. వెంపలి వేళ్ళు తెచ్చి కడిగి ఎండబెట్టి దంచి చూర్ణం చేసి నిలువ ఉంచుకుని రోజు 5 గ్రా మోతాదుగా ఆవు మజ్జిగ లో కలుపుకుని తాగుతూ ఉంటే కడుపులో బల్లలు కరిగిపోతాయి . ఆహారం ద్రవ పదార్ధంగా మాత్రమే తీసుకోవాలి . తెల్ల వెంపలి వేళ్ళు వాడటం శ్రేష్టం .


 *  రావిచెట్టు బెరడు తెచ్చి నీడలో ఎండబెట్టి కాల్చి బూడిద చేయాలి . దాన్ని జల్లెడ బట్టి నిలువ ఉంచుకొవాలి. దానిని రోజు ఉదయం పూట 2 గ్రా బూడిద ని అరటిపండు ముక్క మద్యలో పెట్టి తింటూ ఉంటే 40 రోజుల్లో లివర్, ప్లీహ సమస్యలు పరిష్కారం అవుతాయి.


 *  ఉత్తరేణి సమూలంగా పీకి తెచ్చి కడిగి చిన్నచిన్న ముక్కలు చేసి ఎండబెట్టి కాల్చి బూడిద చేయాలి . ఈ బుడిదని జల్లెడ పట్టి నిలువ ఉంచుకొవాలి. శోంటి ముక్కలని మంచి నీళ్లలో వేసి శొంటి కషాయం తయారు చేసి ఆ కషాయం 30 గ్రా మోతాదుగా తీసుకుని అందులో రెండు గ్రాముల ఉత్తరేణి భస్మాన్ని కలిపి రోజుకొక మోతాదుగా తాగుతూ ఉంటే మూడు వారాలలొ లివర్, ప్లీహ రోగాలు పొతాయి.


 *  కలబంద మట్టలు చీల్చి లొపల ఉండే గుజ్జు తీసి ఆ గుజ్జుని 10 గ్రా మోతాదుగా అందులో 3 గ్రా పసుపు కలిపి రోజు సేవిస్తూ ఉంటే ప్లీహభివృద్ధి తగ్గిపొతుంది.


 *  నాటు ఆవు యొక్క మూత్రం తెచ్చి గుడ్డలో వడపోసి 50 గ్రా మోతాదుగా తీసుకుని అందులొ చిటికెడు ఉప్పు కలిపి రోజు ప్రాతః కాలంలో తాగుతూ ఉంటే మూడు , నాలుగు వారాలలొ లివర్, ప్లీహ వ్యాదులు తగ్గిపోతాయి . జెర్సీ ఆవులు, పట్టణాలలో ప్లాస్టిక్ కవర్లు తినే ఆవులు మూత్రం పనిచేయదు . పొలాలొ తిరిగే నాటు ఆవులు మూత్రం పనిచేయదు . 


  లివర్ ఆరోగ్యంగా ఉండటానికి తీసుకోవల్సినవి -


  *  పచ్చి గుంటగలగర చిగురాకు తెచ్చి పచ్చడి నూరుకొని అన్నంలో కలుపుకుని వారానికి ఒకసారి తింటూ ఉంటే ఎప్పటికప్పుడు లివర్ శుభ్రపడుతూ ఎటువంటి అనారోగ్యానికి గురికాకుండా ఉంటుంది. అంతే కాకుండా వెంట్రుకలు తెల్లబడకుండా , కంటి చూపు తగ్గకుండా ఉంటుంది. అంతేకాక వెంట్రుకలు తెల్లబడకుండా కంటిచూపు తగ్గకుండా కూడా శరీరాన్ని సంరక్షిస్తుంది.


 *  పచ్చి గుంటగలగర ప్రతీసారి దొరకనివారు ఒకేసారి గుంటగలగర మొక్కలను సమూలంగా తెచ్చుకుని కడిగి నీడలో ఎండబెట్టి చూర్ణం చేసుకోని రోజు పూటకు 3 గ్రా మోతాదుగా ఆ చూర్ణాన్ని రెండు పూటలా మంచినీళ్ళతో సేవించవచ్చు.


 *  తమలపాకు లకు ఆముదం రాసి వేడి చేసి కట్టుకడుతూ ఉంటే లివర్ గట్టిపడటం తగ్గి యధాస్థితి వస్తుంది.


 *  నిమ్మపండ్ల రసం , టమాటో పండ్ల రసం , బొప్పాయి పండ్లు తరచుగా వాడుకుంటూ ఉంటే లివర్ , స్ప్లీన్ వ్యాదులు కలగకుండా ఉంటాయి.


 

 మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


    

హృదయ పరివర్తనం

 *హృదయ పరివర్తనం....*


కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత ధర్మరాజు హస్తినకు రాజయ్యాడు. ధర్మబద్ధంగా పాలన చేస్తూ ప్రజల మన్ననలు అందుకోసాగాడు. 

కొన్నాళ్లకు ధర్మరాజు తీర్థయాత్ర చేయాలని భావించాడు. 

సోదరులను, సామంత రాజులకు తన మనోభీష్టాన్ని తెలిపాడు. 

వారిలో కొందరు ధర్మరాజుతో కలిసి యాత్ర చేయాలని నిశ్చయించుకున్నారు. అదే సమయంలో ధర్మజుడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్లి.. 


‘కృష్ణా! నేను, మరికొంత మంది తీర్థయాత్రలకు వెళ్తున్నాము. నువ్వు కూడా మాతో వస్తే అంతకన్నా భాగ్యం మరొకటి ఉండదు’ అన్నాడు. 

యాత్రలు చేసే సమయం తనకు లేదన్నాడు కృష్ణుడు. 

ధర్మరాజు పట్టు వీడలేదు. 

అప్పుడు కృష్ణుడు.. ధర్మజుడికి ఒక సొరకాయను ఇచ్చి.. 


‘ధర్మరాజా! పనుల ఒత్తిడి వల్ల నీతో పాటు యాత్రలకు రాలేకపోతున్నాను. నా ప్రతినిధిగా ఈ సొరకాయను నీ వెంబడి తీసుకుని వెళ్లు’ అని చెప్పాడు.

 

కృష్ణుడి ఆదేశం ప్రకారం ధర్మరాజు.. సొరకాయను నెత్తిన పెట్టుకుని యాత్రలకు వెళ్లాడు. 

మూడు నెలల తర్వాత యాత్రలన్నీ పూర్తి చేసుకుని తిరిగి హస్తినకు చేరుకున్నాడు. 

మర్నాడు అన్న సమారాధన చేయాలని భావించాడు. 

శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్లి.. ‘కృష్ణా! మా యాత్ర విజయవంతంగా పూర్తయింది. నీవు ఇచ్చిన సొరకాయను నేను మునిగిన అన్ని తీర్థాల్లో ముంచాను.

 రేపు అన్న సమారాధన ఉంది. 

నీవు తప్పకుండా రావాల’ని కోరాడు. 


అప్పుడు కృష్ణుడు.. ‘ధర్మరాజా! అన్న సమారాధనలో ఈ సొరకాయను వండి అందరికీ ప్రసాదంగా పంచండి’ అన్నాడు. అలాగే చేశాడు ధర్మరాజు. 


సొరకాయతో వండిన పదార్థం తిన్నవారంతా చేదు భరించలేక వాంతులు చేసుకున్నారు. ‘రాజా! చేదుగా ఉన్న సొరకాయతో ఎందుకు వంట చేయించారు’ అని ప్రశ్నించారు. 


కలత చెందిన ధర్మరాజు సమారాధనకు వచ్చిన కృష్ణుడితో... 

‘స్వామీ! మీరిచ్చిన సొరకాయ చేదుగా ఉన్నది’ అన్నాడు. కృష్ణుడు నవ్వి.. ‘ధర్మరాజా! ఆ సొరకాయ చేదుగా ఉందని నాకు ముందే తెలుసు. 

నీతో పాటు ఎన్నో తీర్థాల్లో మునక వేసింది కదా..! దాని చేదుదనం పోయిందేమో అనుకున్నాను. 

ఇంకా అలాగే ఉన్నట్లుందే?’ అన్నాడు. 


ధర్మరాజుకు విషయం అర్థమై.. కృష్ణుడికి దండప్రణామాలు చేశాడు.


*వేలమంది నిత్యం తీర్థయాత్రలు చేస్తూ ఉన్నారు. జపతపాలు చేస్తున్నారు. కానీ, మనసులో గూడు కట్టుకుని ఉన్న అసుర గుణాలు, పాప సంస్కారాల గురించి చింతించడం లేదు. హృదయ పరివర్తనం లేని యాత్రలు ఎన్ని చేసినా, తీర్థాల్లో ఎన్నిసార్లు మునిగినా ఫలితం ఉండదు.*

                  స్వస్తి!🙏🙏🙏🙏🌷🌷🌷🌷😀🌷🌷🌷🌷🌷🌷🌷

వివేక హీనుని పతనములు

                    వివేక హీనుని  పతనములు !


             శా:  ఆకాశంబున  నుండి  శంభుని  శిరం , బందుండి  శీతాద్రి ,  సు


                    శ్లోకంబైన  హిమాద్రి  నుండి  భువి ,  భూలోకంబు నందుండి  య


                    స్తోకాంభోధి ,  పయోధినుడి  పవనాంధో లోకముం జేరె, గం


                     గా కూలంకష ,  పెక్కు  భంగులు ,  వివేక భ్రష్ట    సంపాతముల్;


                             భర్తృహరి సుభాషితములు:  ఏనుఁగు లక్ష్మణ కవి;

             


           కఠిన పదములకు అర్ధము:- శీతాద్రి-హిమాలయము; సుశ్లోకము:చక్కగా మెచ్చుకొనే; అస్తోక: అంతులేని; అంబోధి-సముద్రము;

           పవనాంధోలోకము: పాతాళము; కూలంకష:నది; వివేక భ్రష్టులు: తెలివి లేనివారు; సంపాతముల్: పతనములు;


             భావము:  గంగా  భవాని  మొదట స్వర్గలోకంలో  (ఆకాశంలో ) మందాకినీ యనుపేరుతో

పిలువ బడుతూ ఉండేది. అదికాస్తా భగీరధునిప్రార్ధనకు లొంగి  క్రిందకు జారటం మొదలు పెట్టింది. మొదట శివుని శిరస్సు మీదకు జారింది. అక్కడినుండి  హిమాలయాలమీదకు , అటనుండి భూలోకానికీ  అక్కడ నుండి సముద్రం లోకి,  సముద్రమునుండి పాతాళానికి  జారిపోయింది.


                      ఎక్కడో  ఊర్ధ్వ లోకమైన  స్వర్గంలో   ( ఆకాశంలో)   ఉండే గంగ  అక్కడ నుండి  దిగటం  మొదలు పెట్టి  చివరకు అధోలోకమైన  పాతాళానికి   జారిపోయింది. తెలివి లేని  మూర్ఖుల  పతనములు  గూడా యిలాగే  ఉంటాయి. అందుచేత వివేకంతో

పనులు చేసికుంటూ  తనస్థానాన్ని  తాను కాపాడుకోవాలి! అని  మనకు  సందేశం!


                       గంగా నది పతనం  మనకు నిదర్శనం కాబట్టి "  నిదర్శనాలంకారం!


                                                    స్వస్తి!

కృతజ్ఞత

 కృతజ్ఞత


ఉడయార్ పాళ్యం సంస్థానాధిపతులు ఒక సంవత్సరం పోషించిన తరువాత అప్పటి తంజావూరు మహారాజైన ప్రతాపరుద్రుడు కంచి మఠాన్ని తమ సీమలో వచ్చి ఉండమని ప్రార్థించాడు. అతడి రెవెన్యూ మంత్రి అయిన డబీర్ పంత్ ప్రోద్బలంతో కుంభకోణం కావేరీ తీరంలో అనువైన మఠం నిర్మించబడుతుంది. 


కాలప్రవాహంలో బ్రిటిష్ వారి నక్కజిత్తుల వలన తంజావూరు పాలకులు ఆస్తులన్నీ కోల్పోయారు. 1937 జనవరి నాటికి బ్రిటిష్ ప్రభుత్వం వారు కోట ఖాళీ చేయమని నోటీస్ ఇచ్చారు. మహాస్వామివారు ఈ సమయంలో ఒక మహా ప్రయత్నాన్ని చేసి వారికి రాజభరణం ఏర్పాటు చేశారు. తమకు మేలు చేసినవారిని ఎన్నటికి మరువరు వారు. తంజావూరు పాలకులకు ఏర్పాటు చేసిన భరణం గురించి విస్తారంగా చెప్పుకోబోయే ముందు ఒక చిన్న శాఖా సంక్రమణం -


1935 - 36లలో మహాస్వామివారు ప్రయాగలో త్రివేణీ సంగమస్నానం చేసి తల ఎత్తి చూసి ఏదో వెతుక్కుంటున్నారట. అనుష్టానం ముగించిన తరువాత పరిచారకులొకరు, “స్వామివారు చుట్టూ కలయజూసి దేనినో వెతుక్కుంటున్నారు. దేని కోసం” అని ప్రశ్నించారట. “చుట్టుపక్కల ఒక గోపురం కూడా కన్పించలేదు” అన్నారట. అప్పటి నుండి వారి మనసులో ఒక సంకల్పం - ప్రయాగ స్నానం అయిన వెంటనే గోపుర దర్శనం అయేట్లు ఒక దేవాలయ నిర్మాణం చేయాలని. 


కాలం గడచి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు ఉత్తరదేశ యాత్ర చేసే సమయం వచ్చింది. మాటల సందర్భంలో తన మనస్సులోని మాట వారికి చెప్పారు మహాస్వామివారు. గురుభక్తిలో తమకు తామే సాటి అయిన శ్రీ జయేంద్రులు ఆ ప్రయత్నం చేద్దామనుకున్నారు. అప్పుడు ఉత్తర ప్రదేశ ప్రభుత్వం రాష్ట్రపతి పాలనలో ఉన్నది. గవర్నర్ గా శ్రీ బెజవాడ గోపాలరెడ్డి గారున్నారు. స్థల సేకరణ విషయంలో వారి సహాయంకై మహాస్వామివారు అభ్యర్థనతో మనుష్యలను పంపారు. రెడ్డి గారు ఎంతో సాదరంగా వారిని ఆహ్వానించి నిబంధనల మేరకు చేయదగినదంతా చేయవలసినదని అధికారులను ఆదేశించారు. రాజు తలచుకొంటే కానిదేమున్నది. శ్రీఘ్రగతిన స్థలం నిర్ణీతమైన శుల్కమునకు కేటాయించబడడం నిర్మాణారంభం జరిగిపోయింది. తరువాత వచ్చిన ముఖ్యమంత్రి - వీరభద్రసింగ్ అని జ్ఞాపకం - కాలంలో ప్రభుత్వపు సంపూర్ణ సహాయ సహకారాలతో కమాక్షీదేవికి ఎత్తైన స్తూపం మీద గుడి కట్టబడింది. ఇప్పుడు ప్రయాగలో స్నానం చేసి తల ఎత్తి చూస్తే ఉన్నతమైన గోపురం కనిపించి భగవంతుని మాబోంట్లకు మహాస్వామి వారిని జ్ఞాపకం చేస్తోంది.


1981 ప్రాంతాలలో ఆ గుడికి ప్రతిష్ట కుంభాభిషేకాదులు శ్రీ జయేంద్రసరస్వతీ స్వామివారి అమృతహస్తాలతో జరపడానికి నిర్ణయమైంది. అప్పుడు మహాస్వామివారు సతారాలో ఉన్నారు. స్వామివారికి ఆహ్వాన పత్రం సమర్పించబడింది. పరికించి చూస్తే అందులో బెజవాడ గోపాలరెడ్డీ గారి పేరు ఎక్కడా లేదు. 


బహుశ అప్పటికి శ్రీ గోపాలరెడ్డి గారు క్రియాశీలక రాజకీయముల నుండి తప్పుకొని స్వక్షేత్రంలో స్థిరపడినారు. నిజానికి మఠానికి ఆయన మూలకంగా జరగబోయే ఉపకారమేదీ లేదు. కానీ చేసిన మేలును మరచేవారు కాదు కదా మన మహాస్వామి. వెంటనే చెన్నైలో మఠానికి సన్నిహితులైన వారికి వర్తమానం పంపబడింది. 


వారు హుటాహుటిన బయలుదేరి నెల్లూరు ప్రాంతాలలో ఉన్న గోపాలరెడ్డి గారిని కలిసి వారిని ముందే పిలవనందుకు క్షమాపణ చెప్పి కారులో చెన్నై, అక్కడి నుండి విమానంలో ఢిల్లీ, ఢిల్లీ నుండి ప్రత్యేకమైన కారులో ప్రయాగ తీసుకువెళ్ళేందుకు అదేవిధంగా వెనుకకు తీసుకొని వచ్చేందుకు సౌకర్యాలను ఏర్పాట్లు చేశారు. సతారా నుండి పెద్ద స్వామివారు పంపిన ప్రత్యేకమైన శాలువాతో వారు సత్కరించబడ్డారు. 


కంచి ఏకామ్రేశ్వరునికి ఏడు వారాలకు ఏడు ప్రత్యేకమైన కొలనులున్నాయి. అందులో శ్రీ మఠానికి ఎదురుగా ఉన్న మంగళా తీర్థము ఒకటి. శ్రీవారు 1984లో మఠానికి తిరిగివచ్చిన తరువాత దానిలో ఒక మంగళవారం స్నానం చెయ్యడానికి బయలుదేరారు. కొలనులో కూడా ఇళ్ళు కట్టి ఉన్నాయి. మెట్లు పూర్తిగా భిన్నమయిపోయి ఉన్నాయి. కేవలం అది ఒక మరుగుదొడ్డిగా వాడబడుతున్నది. రాజకీయ బలం లేకపోతే ఆ అక్రమణదారులను తొలగించడం సాధ్యం కాదు.


స్వామివారు అప్పటి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వద్దకు తమ శిష్యులను ఒక విజ్ఞాపనతో పంపారు. అప్పటి మంత్రి శ్రీ వీరప్పన్. యమ్.జి.ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కంచి మహాస్వామివారి నుండి వచ్చిన వర్తమానం అనగానే ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. కరడుగట్టిన ద్రవిడోద్యమ నేత రామస్వామి నాయకర్ అనుయాయులు శ్రీ వీరప్పన్, కావలసిన నిధులు, ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. అయితే ఆ తీర్థానికి దురాక్రమణలను తొలగించి, పెన్సింగ్ వేసి, మెట్లు కట్టే సమయానికి వీరప్పన్ ప్రభుత్వంలో లేరు సరికదా ప్రభుత్వ పక్షం వారికి పరమ శత్రువులుగా పరిగణించబడుతున్నారు. 


కొలను సిద్ధమయింది. మహాస్వామివారు మంగళవార స్నానానికి వెళ్ళబోతూ వీరప్పన్ కు ప్రత్యేక ఆహ్వానం పంపారు. తాము నీటిలో దిగి అతనిని అదే సమయంలో స్నానం చేయమని చెప్పి పునీతులను చేశారు. వారి ఔదార్యమునకు తబ్బిబ్బులయిపోయారు వీరప్పన్.


--- శ్రీకార్యం చల్లా విశ్వనాథ శాస్త్రి, ఋషిపీఠం ప్రచురణల నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

యక్ష-ప్రశ్న"లో

 మహాభారతంలోని "యక్ష-ప్రశ్న"లో బ్రాహ్మణుని సాధారణ జీవితం సూచించబడింది:



పఞ్చమేऽహని షష్ఠే వా శకం పచతి స్వే గృహే ।


అనృణి చాప్రవాసి చ స వారిచర్ మోదతే ॥



పఞ్చమేహని శాస్తే వా సాకం పచతి స్వగ్రహే ॥


అన్రాణి చప్రవాసీ చ సా వారిచార మోదతే



పగటి సమయాన్ని ఎనిమిది భాగాలుగా విభజించినట్లయితే, బ్రాహ్మణుడు తన కర్మలను పూర్తి చేసిన తర్వాత ఐదవ లేదా ఆరవ భాగంలో మాత్రమే ఆహారం తీసుకోవచ్చు. 

అంతకు ముందు అతనికి అల్పాహారం గానీ, స్నాక్స్ గానీ లేవు. 

మరియు అతను ఏమి తింటాడు? 

ఏ ధనిక ఆహారం కాదు, తియ్యటి పాలలో చూర్ణం చేసిన బాదం వంటి స్వీట్లు లేవు. 

"సకం పచటి" - బ్రాహ్మణుడు నదుల ఒడ్డున పండే ఆకు కూరలు తింటాడు, అలాంటి ప్రాంతాలు ఎవరి సొత్తు కాదు. 

నది ఒడ్డున నివసించమని ఎందుకు అడిగారు? 

ఇది అతని తరచుగా స్నానాలు మరియు అక్కడ ఉచితంగా పండించే ఆకు కూరల కోసం మరియు అతను అడుక్కోవలసిన అవసరం లేదు. 

అతను డబ్బు తీసుకోకూడదు: "అన్ర్ణి" అనే పదానికి అర్థం, ఎందుకంటే అతను అప్పు తీసుకునే అలవాటును పెంచుకుంటే, అతను విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ప్రలోభాలకు గురవుతాడు. 

పేదరికం మరియు సంపాదన లేనితనం (అపరిగ్రహం) అతని ఆదర్శాలు. 

బ్రాహ్మణుడు తన అవసరాలకు మించి గడ్డి గడ్డిని కూడా ఉంచుకోకూడదు.

11, జులై 2023, మంగళవారం

శ్రీ డౌల్ గోవింద ఆలయం

 🕉 మన గుడి : 





⚜ అస్సాం : ఉత్తర గౌహతి


⚜ శ్రీ డౌల్ గోవింద ఆలయం


💠 బ్రహ్మపుత్ర నది ఉత్తర ఒడ్డున , చంద్రభారతి కొండ పాదాల మీద ఉన్న డౌల్ గోవింద దేవాలయం అస్సాంలోని గౌహతిలో అత్యంత ముఖ్యమైన వైష్ణవ శాఖకు చెందిన  అత్యంత ముఖ్యమైన మతపరమైన ప్రదేశాలలో ఒకటి. 


💠 ఆలయంలో ప్రధాన దైవం శ్రీకృష్ణుడు. 

ఈ దేవాలయం గౌహతిలో ఉన్న శ్రీకృష్ణుని పుణ్యక్షేత్రాలలో ఒకటి. 

ఆలయ ఆవరణలో నామ్‌ఘర్ (అస్సామీ ప్రార్థనా స్థలం) ఉంది. 

దౌల్ గోవింద దేవాలయం  అపారమైన ప్రకృతి సౌందర్యాన్ని కలిగి ఉంది. 

చాలా మంది పర్యాటకులు ఈ ఆలయాన్ని సందర్శించి, శ్రీకృష్ణుని ప్రార్ధనలు చేయడానికి వస్తారు.



⚜ స్థల పురాణం ⚜


💠 నల్బరీకి చెందిన గంగారామ్ బారువా అనే వ్యక్తి  శ్రీకృష్ణుడి విగ్రహాన్ని నల్బరి సమీపంలోని ఏకాంత ప్రదేశం నుండి సంధ్యాసర్ నుండి తీసుకువచ్చి రాజదూర్‌లో ప్రతిష్టించాడని చెబుతారు. 

అతను ఆలయంలో సాధారణ "పూజ" మరియు "అర్చన" చేసేవాడు. 

ఆ సమయం నుండి దౌల్ గోవింద ఆలయంలో సాధారణ "పూజ" మరియు "అర్చన" నిర్వహిస్తారు మరియు ఇక్కడ హోలీ పండుగ విశేషంగా జరుపుకుంటారు. 


💠 ఆలయం యొక్క మొదటి అసలు నిర్మాణం 150 సంవత్సరాల క్రితం నిర్మించబడింది మరియు  1966లో పునరుద్ధరించబడింది. ప్రస్తుతం, దౌల్ గోవింద ఆలయాన్ని 25 మంది సభ్యుల కమిటీ నిర్వహిస్తోంది.


💠 పూజలు : 

దౌల్ గోవింద దేవాలయంలో ప్రతిరోజూ శ్రీకృష్ణుని పూజలు జరుగుతాయి. రోజూ ఉదయం 7 గంటలకు ఆలయం తెరవడంతో ఆలయంలో పూజలు ప్రారంభమవుతాయి.

శ్రీ కృష్ణ భగవానుడి విగ్రహం "అర్చన" తరువాత సాంప్రదాయ ఆచారాలు మరియు అభ్యాసాలతో స్నానం చేయబడుతుంది. ఆలయం తెరిచిన తర్వాత స్వామిని ప్రార్థించేందుకు భక్తులు ఆలయానికి రావడం ప్రారంభిస్తారు. ఈ ప్రక్రియ రోజు చివరి వరకు కొనసాగుతుంది. 


💠 స్వామివారికి "భోగ్" ( నైవేద్యం) సమర్పించడం కోసం మధ్యాహ్న సమయంలో ఆలయ తలుపులు కొంత సమయం పాటు మూసివేయబడతాయి, తరువాత ఒక హాలులో భక్తులకు "భోగ్" పంపిణీ చేస్తారు. 

సాయంత్రం స్వామికి భక్తిగీతాలు పాడుతూ

హరికృష్ణ ఆరతి భక్తి పాటలు లేదా 'కీర్తన్' పాడటం ద్వారా  "ఆరతి" చేస్తారు.


💠 డౌల్ గోవింద ఆలయంలో పండుగలు జరుపుకుంటారు.

దౌల్ గోవింద దేవాలయం శ్రీకృష్ణుని పండుగలను జరుపుకోవడానికి ప్రసిద్ధి చెందింది. 

డౌల్ గోవింద ఆలయంలో ఏడాది పొడవునా వివిధ పండుగలు జరుపుకుంటారు. దేవాలయంలో జరుపుకునే అన్ని పండుగలలో రంగుల పండుగ హోలీ ప్రధానమైనది. ఆలయంలో హోలీని ఇక్కడ చాలా కోలాహలంగా మరియు ఉల్లాసంగా జరుపుకుంటారు. 

ఆలయంలో 5 రోజుల పాటు హోలీ పండుగను జరుపుకుంటారు. 

వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా స్థానిక ప్రజలు ఆలయంలో హోలీని జరుపుకుంటారు. 


💠 సంవత్సరంలో ఈ సమయంలో రంగుల పండుగను జరుపుకోవడానికి వేలాది మంది యాత్రికులు ఆలయంలో గుమిగూడుతారు.


💠 శ్రీ కృష్ణ జన్మాష్టమి దౌల్ గోవింద మందిరంలో అదే ఉత్సాహంతో జరుపుకునే మరొక పండుగ. ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. 

జన్మాష్టమి  సందర్భంగా ఆలయంలో రాత్రంతా "పూజ" మరియు "హోం-జగ్య" ( హోమం- జాగరణ ) నిర్వహిస్తారు. 


💠 ఈ ఆలయంలో మాఘి ( మాఘ) పూర్ణిమ పండుగను కూడా జరుపుకుంటారు. 

ఈ సమయంలో "భోగ్" తయారు చేసి భక్తులకు పంపిణీ చేస్తారు.


💠 డౌల్ గోవింద ఆలయం, గౌహతి, అస్సాం, రోజువారీ దర్శన సమయాలు

ఆలయం ఉదయం 7.00 నుండి సాయంత్రం 8.00 గంటల వరకు తెరిచి ఉంటుంది.


💠 రవాణా :

సాధారణంగా ఫెర్రీలు అలాగే స్టీమర్లు ఫ్యాన్సీ బజార్ ఫెర్రీ ఘాట్ నుండి రాజదూర్ వరకు అందుబాటులో ఉంటాయి, ఇది ఆలయానికి చేరుకోవడానికి సులభమైన మరియు వేగవంతమైన మార్గం. రాజదూర్‌లో దిగిన తర్వాత, ఆలయానికి చేరుకోవడానికి ఐదు నిమిషాల నడక. ట్రెక్కర్లు ఖర్గులి నుండి అలాగే అడబరి మరియు జలుక్‌బరి నుండి అందుబాటులో ఉంటారు . 


💠 గౌహతి డిస్పూర్ నుండి 15 కి.మీ, షిల్లాంగ్ నుండి 98 కి.మీ, కోహిమా నుండి 350 కి.మీ, ఇంఫాల్ నుండి 485 కి.మీ.

ప్రతి ఫలం

 

 ప్రతి ఫలం 

కొన్ని సందర్భాలలో మనం చేసే చిన్న చిన్న పనులు కూడా ఎంతో గొప్ప ఫలితాన్ని ఇవ్వవచ్చు.  ఇటువంటి దానికి నిదర్శనంగా ఆది శంకరుల ఒక వృత్తాంతం తెలుపుతారు. 

బాల శంకరులు బిక్షాటన కొరకు ఒకసారి ఒక గుడిశముందు నిలబడి " భవతి బిక్షం దేహి" అని యాచించాడట కానీ ఆ గృహంలోనుంచి ఎంతసేపటికి ఎవ్వరు రాలేదట.  అయినా కానీ మన శంకరులవారు ఇంకా నిరీక్షిస్తూ ఉన్నారట. కొంతసేపటికి ఒక పేదరాలు వణుకుతున్న చేతులతో స్వామికి లేదు అని చెప్పటానికి మనస్కరించక ఒక ఉసిరిక పండును మాత్రం ఆయన జోలెలో వేసిందట. ఆమె దైన్యతను గమనించిన శంకరాచార్యులవారు ఒకసారి ఆమె గుడిసెను పరికించారట అంతా కాళిగా ఉండటం చూసి ఆమె కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నదని తెలుసుకున్నారట. 

శంకరులవారి మనస్సు ఆర్ద్రతమైనదట. వెంటనే శంకరాచార్యులవారు మహాలక్షిని స్తుతిస్తూ స్తోత్రము చేశారట.  ఆయన స్తోత్రానికి ప్రసన్నమైన అమ్మవారు ఆయనకు ప్రత్యక్షం అయి నాయనా ఎందుకు నన్ను పిలిచావు అని అడిగింది.  దానికి శంకరులవారు అమ్మా ఇది నీకేమైనా న్యాయంగా ఉన్నదా ఈ స్వాద్విమణి  దీనత్వం చూసి నీకు దయరాలేదా తల్లి అని వేడుకొన్నాడు. అప్పుడు అమ్మవారు నాయనా నేను ఏమి చేతును ఆమె గతజన్మలో పూర్తిగా పిసినారిగా వుంటూ ఎవరికి కూడా ఎటువంటి దానధర్మాలు చేయకుండా ఉండి పూర్తిగా పుణ్యరహితంగా ఉండటం వలన ఆమెకు ఈ జన్మలో ఈ దారిద్యం దాపురించింది.  అమ్మా ఆమె ఏ పుణ్యము చేయలేదు సరే మరి ఆమె భర్త పుణ్యము వలన అయినా ఈమెకు కొంత ఊరట కలగాలి కదా తల్లి అని అన్నాడు. దానికి తల్లి నాయనా ఆమె భర్త ఈమెకన్నా ఎక్కువ పాపాత్ముడు . అందుకే వారిద్దరిని కలిపాడు పరమేశ్వరుడు.  ఇద్దరు ఒకరిని మించిన వారు ఇంకొకరు.  కాబట్టి వారు ఈ దారిద్యాన్ని అనుభవిస్తున్నారు అని అన్నారు అమ్మవారు. 

నాయనా ప్రస్తుత పరిస్థితుల్లో వారి దారిద్యాన్ని బాపటం ఆ పరమేశ్వరుని వశం కూడా కాదు వారు అంత పాపాత్ములు అని తల్లి ఉన్నసంగతి తెలిపింది. అప్పుడు ఆలోచించటం శంకరులవారి వంతయినది శంకరులు అంటే సాక్షాత్తు శంకరులేకదా మరి శంకరాచారులవారు ఊరుకుంటారా.  తల్లి నీవు చెప్పింది నిజమే ఆ సాద్విమణి ఏ పుణ్యము గత జన్మలో చేసి ఉండకపోవచ్చు.  మరి ఈ జన్మలో విషయం ఏమిటి తల్లీ అని అమ్మవారిని మరల వినమ్రుడై అడిగాడు.  ఈ జన్మలోకూడా ఆమె ఏ రకమైన దానం చేయలేదు అని తల్లి బదులిచ్చింది. అప్పుడు శంకరులవారు ఒక్కసారి ఆమె గుడిశ మొత్తం పరికించి చూడు తల్లీ అని వేడుకున్నాడు.  మొత్తం చూసిన మహాలక్షి ఏమున్నది నాయనా అని అన్నది.  తల్లీ నేను చెప్పేది కూడా అదే ఆ సాద్వీమణికి ఇవ్వటానికి ఏమిలేకపోయినా నాకు ఒక ఉసిరిక పండును దానం చేసింది తల్లీ మరి ఆ దానఫలితాన్ని ఇవ్వవా అని మరల వేడుకొన్నాడు. అప్పుడు శంకరుని తెలివికి మెచ్చుకొనిన లక్ష్మీ దేవి ఆ ఇంట బంగారపు ఉసిరికాయలను వర్షించిందట దానితో ఆ పేదరాలి పేదరికం అంతా మటుమాయం అయిందట. 

ఆది శంకరులు లక్షి అమ్మవారిని ప్రసన్నురాలిగా చేసిన స్తోత్రం కనకధారా స్తోత్రముగా చాల ప్రసిద్ధి చెందింది.  ఈ స్తోత్రాన్ని భక్తితో రోజు పారాయణ చేసే భక్తులకు సిరి సంపదలు సమకూరుతాయని ప్రతీతి. త్రికరణ శుద్ధిగా అకుంఠిత దీక్షతో ఈ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేస్తే తప్పకుండా ఆ మహాలక్షి ప్రత్యక్షం అవుతుంది.  

చూసారా సత్పురుషునికి చేసిన ఒక చిన్న దాన ఫలితంగా యెంత ఫలితం లభించిందో కదా.  కాబట్టి మనం ఎప్పుడూ సపాత్ర దానాన్ని చేయాలి. అంటే పాత్రనెఱిగి దానం చేయాలి.  దానం చేసేటప్పుడు దాన గ్రహీత మీరు చేసే దానానికి యోగ్యుడా కాదా అని నిర్ధారణ చేసుకొని మరి దానం చేయాలి. మీరు చేసిన దాన ద్రవ్యముతో దాన గ్రహీత ఏదైనా పాపపు కృత్యాలు చేస్తే మీకు దానఫలితంగా పుణ్య ఫలం రాకపోగా ఆ పాపంలో భాగం వస్తుంది. అంటే డబ్బులు ఇచ్చి మరి పాపాలను కొనుక్కోవటం అన్నమాట. 

మన పూర్వికులు అందుకేనేమో అన్నిదానాలలోకి అన్నదానం గొప్పది అని అన్నారు. అన్నదానం చేయటం  వలన రెండు విషయాలు అవగతం  అవుతాయి. ఒకటి అన్నం తిన్న దాన గ్రహీత ఇక నాకు చాలు అంటాడు అంటే అతను మీ దానంతో తృప్తి చెందుతాడు. కాబట్టి అతని తృప్తివలన మీకు దాని ఫలితంగా పుణ్యఫలం వస్తుంది.   ఇంకొక విషయం. మీరు పెట్టిన అన్నాన్ని మీ సమక్షంలోనే ఆరగిస్తాడు కాబట్టి ఎట్టి పరిస్థితిలో అన్న దానం వలన పాపం రాదు.  ఏదానానికైనా పాత్రను యెరిగి దానం చేయాలి కానీ అన్నదానానికి మాత్రం ఆకలితోవున్న ఎవ్వరికైనా చేయవచ్చు. పుణ్య ఫలితం ఒకేవిధంగా ఉంటుంది.  అన్నదానం కేవలం మనుస్యులకు మాత్రమే చేయాలనీ నియమం లేదు. పశుపక్షాదులకు కూడా చేయవచ్చు. నిత్యం పక్షులకు అన్నం పెట్టె వారికి ఈ జన్మలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కటి జీవితం కలుగుతుంది. వారి పితృదేవతలు కూడా సంతోషిస్తారు.

కాబట్టి మిత్రమా ఇతర దానాలకన్నా అన్నదానమే శ్రేష్ఠము కావున అన్నదానాన్ని చేయండి. అన్నదానాన్ని ప్రోత్సహించండి. ఆలా అని రోజు ఒక్కరికే అన్నాన్ని పెట్టి మనుషులను ఏ పని పాట చేసుకొని సోమరులుగా తయారు చేయకూడదు.  

అన్నదానం తరువాత చెప్పుకోదగిన దానం విద్య దానం. ప్రతి విద్వంసుడు తాను సముపార్జించిన విద్యను పలువురికి దానం చేసి విద్యావంతులను చేయాలి.  విద్యావంతుడైన వాడు తన విద్యతో చక్కగా జీవితాంతం సంపాదించుకొని తానూ సుఖపడి పలువురిని సుఖపెట్టగలడు.  కాబట్టి విద్యాదానం చేయటం కూడా చాలా మంచి విషయం. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ

బ్రహ్మపుత్ర

 సృష్టి కర్త అయిన బ్రహ్మ దేవుడు 'బ్రహ్మపుత్ర' ను తన అంశ తో ఆవిర్భవింప జేసినట్లు కథనం.


పూర్వము  శంతనుడు అనే ఋషి   వుండేవాడు. అయన భార్య అమోఘ.వీరిద్దరూ ఆశ్రమాన్ని నిర్మించుకొని నిత్యం దైవ చింతనలో నియమ నిష్టలతో తపో జీవనాన్ని సాగిస్తూ వుండేవారు.


వారిని చూసి బ్రహ్మ దేవుడికి సంతోషం కలిగి 

వారికేదైనా మేలు చెయ్యాలని తలచి వారికి తన అంశ తో ఒక కుమారుని ప్రసాదించాడు.తపస్సంపన్ను డయిన 

శంతనుడు తన కుమారుని జన్మ రహస్యాన్ని తెలుసుకున్నాడు. లోకహితం కోసమే తనకు కుమారుడు కలిగాడని గుర్తించాడు.


శంతనుడు తన కుమారుడిని తెసుకొని కైలాసం, గంధమాదనం, జరుది,శంబకం అనే నాలుగు పర్వతాల మధ్యకు తీసుకొని వెళ్లి అక్కడ వదిలిపెట్టాడు.


బాలుడిని ఆ నాలుగు కొండల మధ్య వుంచగానే అతడు జల రూపంగా మారి 5 యోజనాల ప్రదేశం లో విస్తరించాడు. శంతనుడు ఆ కుండా నికి 'బ్రహ్మకుండం'అని పేరు పెట్టి తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.ఆ కుండం లో దేవతలూ, అప్సరసలూ 

స్నానము చేస్తూ వుండేవారు.ఈ బ్రహ్మ కుండమే బ్రహ్మపుత్రా నదిగా మారింది. 


రేణుకా జమదగ్నుల కుమారుడు పరశురాముడు. రేణుకాదేవి రోజూ నదికి వెళ్లి అక్కడి ఇసుకతో కుండను తయారు చేసి ఆ కుండలో నీళ్ళు తెచ్చి తన భర్త సంధ్యా వందనాని కోసం పెట్టేది. 


ఒకనాడు ఆమె కుండలో నీళ్ళు తెస్తూండగా ఆకాశం లో గంధర్వులు నాట్యం చేస్తుండడం కనిపించి వారి వైపు చూస్త్తూ వుండి పోయింది. పర పురుషులను  దీక్షగా చూడడం వల్ల ఆమె ప్రాతివ్రత్యం భంగమై ఆ కుండ పగిలి పోతుంది. మరీ యెంత ప్రయత్నించినా ఇసుకతో కుండ తయారు కాదు.


ఆమె నిరాశతో ఆశ్రమానికి తిరిగి వస్తుంది. అప్పుడు జమదగ్ని తన దివ్య దృష్టి తో తెలుసుకొని కోపంతో తన కుమారులను పిలిచి ఆమె తలను ఖండించమని ఆజ్ఞాపిస్తాడు.తల్లిని చంపడానికి  కుమారులేవ్వరూ ఒప్పుకోరు.జమదగ్ని వారి శపిస్తాడు..


అపుడు జమదగ్ని పరశురాముడి కి చెప్తాడు అతడు తండ్రి  ఆనతిని పాటించి తల్లి తల తెగ వేస్తాడు.అతడి పితృభక్తికి మెచ్చుకొని యేదైనా వరం కోరుకోమంటాడు. 


అప్పుడు పరశురాముడు తల్లిని బ్రతికించి తన తన సోదరులకు శాప విముక్తి కలిగించ మంటాడు.జమదగ్ని అలాగే చేస్తాడు. 


పరశురాముడి   కి మా తృ హత్యా పాపం అంటుకుంటుంది. అది పోగొట్టు కోవడానికి ఎన్నో తీర్థాలు,క్షేత్రాలు దర్శించినా పోదు.


జమదగ్ని కుమారుడి ని చూసి జాలిపడి మానస సరోవరం లోని బ్రహ్మ కుండం లో స్నానం చేయమని చెప్తాడు.అందులో స్నానం చెయ్యగానే అతన్ని అంటిన బ్రహ్మ హత్యా పాతకం పోతుంది పరశురాముడు ఈ పవిత్ర నీటి వల్ల  కలిగే పుణ్య ఫలాలను అందరికీ కలిగించాలనే ఉద్దేశ్యం తో తన గొడ్డలితో త్రవ్వి బ్రహ్మ కుండాన్నించి వేరు  చేసి పారేలాగా చేశాడు.


నీరు పారుతూ వెళ్లి కైలాసం లో వున్న లోహిత సరోవరం లోకి చేరింది.పరశురాముడు కైలాసం వెళ్లి అక్కడ త్రవ్వి దారి చేస్తాడు.అది భూమి పైకి ప్రవహించింది.ఈ విధంగా పరశురాముడు బ్రహ్మపుత్రను భూమి పైకి తీసుకొని వచ్చినట్టు పురాణ కథనం.


ఈ నది ఒడ్డున శ్రీకృష్ణుడు 

సత్యభామతో పాటు కొంతకాలం విశ్రమించి ఆ నదిలో స్నానమాచరించి దాని ఫలితంగానే నరకాసురుడిని సంహరించి నట్లు కథనం ఈ నదీ తీరం లోనే శివుడు మన్మథుడిని దహించి పార్వతీదేవికి జ్ఞాన బోధ చేసినాడని చెప్తారు.శ్రీ  మహావిష్ణువు ఈ నదీ తీరం  లోనే మధు కైటభులనే రాక్షసులను సంహరించాడని 

పురాణాలలో చెప్పబడింది.దీని నీరు ఎర్రగా వుండడం వల్ల.దీనికి లౌహిత్య అనే మరో పేరు కూడా వుంది.టిబెట్ లో ఈ నదికి  'తింగ్ పో' అని పేరు. అరుణాచల ప్రదేశ్ లో ;సియాంగ్' అని ఈ నదిని పిలుస్తారు.


అన్ని నదులనూ స్త్రీలుగానే వర్ణిస్తారు.కానీ ఈ బ్రహ్మపుత్ర మాత్రం పురుషుడు గా చెప్పబడ్డది.

గుండెపొటు

 గుండెపొటు గురించి సంపూర్ణ వివరణ  -  


    ఉపిరితిత్తులలో శుభ్రమైన రక్తమును అన్ని భాగాలకు సరఫరా చెసి చెడురక్తమును మరలా ఊపిరితిత్తులకు పంపించు సాధనం గుండె . ఇది ఒక పంపుసెట్ వలే పనిచేయును . శుభ్రపడిన రక్తమును తీసుకువెళ్ళునవి ధమనులు , చెడురక్తమును తీసుకెళ్ళునవి సిరలు అంటారు. నూనె , చక్కెర, తియ్యటివి , డాల్డా , నెయ్యి , మాంసం , చేపలు , గుడ్లు మొదలైన వాటిని అత్యధిక మోతాదులో విపరీతముగా వాడుట వలన ధమనులలో కొవ్వు ఏర్పడును . దీనిని కొలెస్టరాల్ అని పిలుస్తారు . 


                   ఈ కొలెస్టరాల్ పెద్ద రక్తనాళాల్లో పేరుకుని పొవడం వలన రక్తనాళం లోపలి వ్యాసార్థం తగ్గి గుండె పనిచేయుటకు కావలసినంత రక్తం సరఫరా కాదు . రక్తము నందలి ఉండు ఆక్సిజన్ గుండెకు అందకపోవడం వలన రక్తం గ్రహించుటకు గుండె అధికశ్రమ చేయవలసి ఉంటుంది. దీనివలన ఎడమవైపు రొమ్ములో నొప్పి కలుగును. దీనిని గుండెపొటు అంటారు. ఈ నొప్పి ఒక్కోసారి భరింప శక్యం కానంతగా ఉండును. ఇది ఎడమవైపు రొమ్ము నుండి ఎడమ భుజానికి అచట నుండి ఎడమ చేతి మణికట్టుకు కూడా పాకుతుంది. ఈ నొప్పితో ఊపిరి ఆడదు . చేతులు , కాళ్లు చల్లగా ఉండును. అధికంగా చెమటలు పట్టును . 


                  ఇది అత్యంత ప్రమాదకరం అయినది. ఇది ప్రాణాలు తీయుటలో మనదేశంలో మూడొవ స్థానము నందు కలదు. శారీరక శ్రమ ఎక్కువ చేయు వారిలో ఇది ఎక్కువ కనిపించును. 


  ఈ వ్యాధి నివారణోపాయాలు  - 


 *  నూనె , నెయ్యి , డాల్డాతో  తయారుచేసిన తీపి పదార్దాలు , చాకోలెట్స్ , అతి కారపు పదార్దాలు , మాంసం , చక్కెరలు వాడకూడదు . 


 *  తాజా ఆకుకూరలు , కూరగాయలు , ముఖ్యముగా ఎర్ర ఉల్లిగడ్డ , వెల్లుల్లి , సోయాబీన్స్ మొదలైన వాటిని విరివిగా వాడవలెను . 


 *  వెల్లుల్లి శ్వాసకోశ వ్యాధుల నివారణలో ఎంతో ప్రాముఖ్యత వహించును. TB వ్యాధి నివరణలో కూడా వాడతారు. రక్తమును శుభ్రపరచడంలో అత్యంత గుణకారిగా పనిచేయును . రక్తనాళాలను శుభ్రపరచును. రక్తమును పలుచబరిచి రక్తనాళాలలో సులభముగా ప్రసరించుటకు తోడ్పాటు అందించును. 


 *  ప్రతినిత్యం 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలు తేనె లేదా బెల్లములో వేసి నలిపి తింటుంటే శ్వాసకోశ , హృదయ వ్యాధులు నివారణ అగును. 


 *  పీచుపదార్థం పుష్కలంగా కలిగిన ఆహారపదార్దాలు , అతిగా పాలిష్ పట్టని బియ్యం , పైన పొట్టు తియ్యని ఆపిల్ , కమలాలు , బత్తాయి కొనల పైన ఉండు తెల్లని పొరతో సహా తినవలెను . 


 *  ఎర్ర ఉల్లిగడ్డ కూడా చాలా మంచి ఫలితాన్ని ఇచ్చును. సోయాచిక్కుడు , విటమిన్ E , క్యాల్షియం , మెగ్నీషియంలు గుండెపొటు రాకుండా కాపాడును . 


                    మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


  


 

పవిత్ర పుడమిపై

 " పవిత్ర పుడమిపై, ప్రకృతి ఒసగిన ప్రశాంత జీవన మార్గం "

విశ్వ జీవన చక్రభ్రమణంలో ప్రతి సెకనూ విలువైనదే, " బ్రతుకు బ్రతకనివ్వు ", అనెడి సన్మార్గ జీవన పథంలో !

సృష్టిలో ప్రకృతి ప్రసాదించే ప్రశాంత తత్వ చింతన వెలకట్టలేనిది,             " బంగరు భవితకు సువికాస దృక్కోణమందు " !                   ప్రకృతి విశ్వ జీవరాశికి ఒసగెడి సన్మార్గ నిత్య ప్రశాంత సమైక్య జీవన గమనంలో ప్రస్ఫుటమయ్యెడి ప్రశాంత సుప్రకాశ దీప్తి ! 

ప్రకృతి, నిత్య తేజోమయ జీవన దివ్య ప్రకాశిక, సకల జీవ సురక్షా మార్గదర్శి !

సృష్టి కర్త, విశ్వ మానవాళికి ఒసగిన, సన్మార్గ జీవన పథం, నిత్య సువ్యక్తిత్వ చైతన్య తేజోమయ దృక్పథం !

భారతావనిపై, " అపౌరుషేయమై ఆవిర్భవించిన పవిత్ర వేద నాదం ", సర్వ శుభంకరి, సర్వ శ్రేయోభిలాషి !

పవిత్ర పుడమిపై  కలుపుకుపోయే తత్వం, సకల విశ్వ జీవ సుహృద్భావ, సువికాస జీవన మార్గగామి !

ప్రతి వ్యక్తీ నేడు యోచించాల్సిన ముఖ్య విషయం, సకల విశ్వ శ్రేయోభివృద్ధి, సకల జీవ సంరక్షణాత్మక జీవనవిధానం !

అణువణువూ నిండి ఉన్న పరమాత్మ సత్కటాక్ష సముపార్జనకు, ప్రకృతి ప్రసాదించే సన్మైత్రీ భావనాత్మక రక్షణ కవచం !

సాటి వాని నిత్య సత్య శ్రేయోమార్గ జీవన గమనంలో, ప్రకృతి తోడ్పాటు, విశ్వ జీవ సుసంక్షేమ దృక్పథ దార్శనికత !                                  రచన :                                            గుళ్లపల్లి ఆంజనేయులు 

దాశరధీ!కరుణాపయోనిధీ!



దాశరధీ!కరుణాపయోనిధీ!


కనకవిశాలచేల భవకానన శాతకుఠారధార స

జ్జనపరిపాలశీల! దివిజస్తుత సద్గుణ కాండ! కాండ సం

జనిత పరాక్రమ! క్రమ విశారద! శారద కందకుంద చం

దన ఘనసార! సారయశ దాశరథీ కరుణాపయోనిధీ...


*భావం:..*

గొప్పదైన బంగారంతో నేసిన వస్త్రములు ధరించినవాడవు. జనన-మరణ చక్రమనే అడవిని నరికి వేయగల పదునైన గొడ్డలి యొక్క అంచువంటి వాడవు. సజ్జనులను కాపాడే స్వభావం కలవాడివి. దేవతలచే స్తుతించబడే సద్గుణరాసి గలవాడివి. ధనుర్విద్యలో పండితుడివి. శరత్కాల మేఘము, మల్లెపువ్వులు, శ్రీ గంధము వంటి వాటివలె ఎంతో స్వచ్ఛమైన కీర్తి కలవాడివి. దశరధ తనయుడవు, కరుణా సముద్రుడవు, శ్రీ రామచంద్రుడవు. నన్ను దయ చూడు స్వామీ!


"ముక్త పదగ్రస్త మనే యలంకారప్రయోగంతో పద్యంగోపన్నహృద్గతభావాలకు నిలువుటద్దమైనది!!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

దాశరధీ!కరుణాపయోనిధీ

 శు భో ద యం🙏


దాశరధీ!కరుణాపయోనిధీ!


కనకవిశాలచేల భవకానన శాతకుఠారధార స

జ్జనపరిపాలశీల! దివిజస్తుత సద్గుణ కాండ! కాండ సం

జనిత పరాక్రమ! క్రమ విశారద! శారద కందకుంద చం

దన ఘనసార! సారయశ దాశరథీ కరుణాపయోనిధీ...


*భావం:..*

గొప్పదైన బంగారంతో నేసిన వస్త్రములు ధరించినవాడవు. జనన-మరణ చక్రమనే అడవిని నరికి వేయగల పదునైన గొడ్డలి యొక్క అంచువంటి వాడవు. సజ్జనులను కాపాడే స్వభావం కలవాడివి. దేవతలచే స్తుతించబడే సద్గుణరాసి గలవాడివి. ధనుర్విద్యలో పండితుడివి. శరత్కాల మేఘము, మల్లెపువ్వులు, శ్రీ గంధము వంటి వాటివలె ఎంతో స్వచ్ఛమైన కీర్తి కలవాడివి. దశరధ తనయుడవు, కరుణా సముద్రుడవు, శ్రీ రామచంద్రుడవు. నన్ను దయ చూడు స్వామీ!


"ముక్త పదగ్రస్త మనే యలంకారప్రయోగంతో పద్యంగోపన్నహృద్గతభావాలకు నిలువుటద్దమైనది!!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

 🕉 మన గుడి : 


⚜ అస్సాం : హజో


⚜ శ్రీ కేదారేశ్వర్ ఆలయం



💠 కేదారేశ్వర ఆలయం భారతదేశంలోని ముఖ్యమైన దేవాలయాలలో ఒకటి కాబట్టి, మతపరమైన తీర్థయాత్ర పర్యాటకులతో పాటు, అస్సాంలోని హజోలో ఉన్న ఈ అందమైన శివాలయాన్ని చరిత్ర మరియు పురావస్తు ఔత్సాహికులు తరచుగా సందర్శిస్తారు

కానీ ఆలయంలో శిల్ప కళ అంతగా కనిపించదు.


💠 ఈ ఆలయాన్ని మొదట విశ్వకర్మ నిర్మించాడంటారు. 

భారత దేశంలో అనాదినుంచీ వున్న ఆలయాలలో ఇది ఒకటి.   


💠 ఈ ఆలయంలో వున్న ఫలకాలమీద వ్రాసిన సమాచారం ప్రకారం ఇది  1753 సంవత్సరంలో అహోం రాజవంశం రాజేశ్వర్ సింఘ రాజు స్థాపించాడని నమ్ముతారు. 

అంటే మొదట నిర్మింపబడిన ఆలయం శిధిలమైన తర్వాత రాజేశ్వర సింఘ ఆలయ పునర్నిర్మాణంగావించాడు.


 💠 కేదారేశ్వర్ దేవాలయం పాదాల వద్ద ప్రసిద్ధ గణేష్ దేవాలయం ఉంది. 

కేదారేశ్వర ఆలయంలో రాతితో చేసిన భారీ శివలింగం ఉంది. శివలింగం స్వయంభూ లింగంగా ప్రసిద్ధి చెందింది. ఈ శివుని రూపాన్ని అర్ధనారీశ్వరుడు అని కూడా అంటారు. 

శివ పార్వతులు ఒక చోట కలిసి వుండటంవల్ల లింగం మీద ఎప్పుడూ ఒక  వెండి మూత పెట్టబడివుంటుంది.  

పూజారిగారు ఆ కవర్ తీసి అతి కొంచెంసేపు దర్శనం చేయించి మళ్ళీ కవర్ పెట్టేస్తారు.


💠 ఇక్కడ శివుడికి వివిధ రకాల పుష్పాలతో పూజ జరుగుతుంది. ఒక్కొక్క విధమైన కోరిక నెరవేరటానికి ఒక్కొక్క రకం పూలతో పూజ చేయాలని చెబుతారు.  అలా చేయటంవల్ల ఆ కోరిక  నెరవేరుతుందని భక్తుల నమ్మకం. 


💠 ఇక్కడ ఐదు అఖండ దీపాలున్నాయి. 

 ఇవి 6000 ఏళ్ళ నుంచి వెలుగుతున్నాయంటారు. 

గర్భాలయంలో ఈ దీపాల వెలుతురు తప్ప వేరే వెలుతురు వుండదు.


🔅 ఉత్సవాలు :-


💠 ఇక్కడ శివరాత్రికీ, చైత్ర మాసంలో మదన త్రయోదశికీ పెద్ద ఉత్సవాలు జరుగుతాయి.  

ఈ రెండు రోజులూ స్వామికి మహా నైవేద్యం రాత్రి పూజలయిన తర్వాతే పెడతారు.  

ఇంకొక విశేషమేమిటంటే, స్వామికి పెట్టే  నైవేద్యంలో  చేపలు, ప్రత్యేకంగా తయారు చేసిన గొఱ్ఱె మాంసం తప్పకుండా  వుంటాయి. ఇవి ఇక్కడ విశేషాలు.


💠 కేదార మందిరానికి కింద కమలేశ్వర్ మందిర్, జయదుర్గ మందిరాలున్నాయి. 

చైత్ర శుక్ల అష్టమిని అశోకాష్టమి అంటారు.  అశోకాష్టమి రోజు బ్రహ్మపుత్ర నదిలో స్నానం చేసి దానాలు చేయాలి.  ఆ రోజు ఎనిమిది అశోక పూల మొగ్గలను తిని నీరు తాగి ఉపవాసం వుండాలి.  ఇలా చేసినవారి జీవితంలో ఎప్పుడూ శోకం వుండదని ఇక్కడివారి నమ్మకం.  


💠 ఆ రోజు శ్రీ హయగ్రీవ మాధవుడు, కేదారేశ్వరుడు, కామేశ్వరులను పల్లకీలలో దండం, ఛత్రం, చామరం, వగైరా సకల మర్యాదలతో బ్రహ్మపుత్రలో స్నానానికి ఊరేగింపుగా తీసుకు వెళ్తారు.  

ఈ ఉత్సవంలో దాదాపు 500 మంది స్వామివారి సేవకులు పాల్గొంటారు స్వామికి రకరకాల సేవలు చేయటానికి. 


💠 ఊరేగింపు వెళ్తుంటే స్వామికి ముందు ఎవరూ గొడుగు వేసుకునిగానీ, టోపీ పెట్టుకునిగానీ వుండకూడదు. 

విశేషమేమిటంటే  ఇలాంటి నియమాలను అమలు చేయటానికి ముస్లిం మతస్తులు కొందరు వెండి బంగారం తాపడం చేసిన కర్రలను తీసుకుని ముందు నడుస్తారు.  హాజోలో సనాతన కాలం నుంచి వస్తున్న హిందూ, బౌధ్ధ, ముస్లిం మతస్తుల ఐకమత్యతకి చిహ్నం ఇది.  ఇప్పటికీ వీరంతా సహృద్భావంతో కలిసి మెలిసి వుంటారు.


💠 హాజో అనేక ఆలయాలకు నిలయమైనా, అందులో పంచ తీర్ధాలనబడే గణేష్, కేదార్, కమలేశ్వర్, కామేశ్వర్, హయగ్రీవ మాధవ మందిర దర్శనానికి ప్రాముఖ్యత.


💠  సమీప విమానాశ్రయం, రైల్వే స్టేషన్ కూడా గౌహతి.

గౌహతి నుండి హజో చేరుకోవడానికి ప్రైవేట్ క్యాబ్  తీసుకోవచ్చు. 

హజో పట్టణం నుండి, గమ్యస్థానానికి చేరుకోవడానికి ఆటో-రిక్షా లేదా టాక్సీని అద్దెకు తీసుకోవచ్చు.

మనస్సును ప్రసన్నంగా

 శ్లోకం:☝️

*చిత్తే ప్రసన్నే భువనం ప్రసన్నం*

 *చిత్తే విషణ్ణే భువనం విషణ్ణమ్ |*

*అతోఽభిలాషో యది తే సుఖే స్యాత్*

 *చిత్తప్రసాదే ప్రథమం యతస్వ ||*


అన్వయం: _యదా మనః ప్రసన్నం భవతి తదా సర్వత్ర ప్రసన్నతా ఏవ దృశ్యతే యదా మనః దుఃఖితం స్యాత్ తదా సర్వత్ర దుఃఖం అతః యది సుఖం వాఞ్ఛతి చేత్ మనసః ప్రసాదనాయ యతస్వ |_


భావం: ప్రపంచం ఒక అద్దం వంటిది. మన మనస్సు సంతోషంగా ఉన్నప్పుడు లోకమంతా సంతోషంగా ఉంటుంది (ఆనందమయంగా కనిపిస్తుంది) మరియు మన మనస్సు దుఃఖంగా, విచారంగా ఉన్నప్పుడు లోకమంతా దుఃఖమయంగా కనిపిస్తుంది. కాబట్టి సంతోషంగా ఉండాలనుకుంటే ముందుగా మన మనస్సును ప్రసన్నంగా ఉంచుకోవటానికి ప్రయత్నించాలి.

తానే రాజు,తానే మంత్రి,

 


నెట్వర్క్ రాలేదనే టెన్షన్ లేదు.

నెట్ బ్యాలన్స్ అయిపోయిందనే గోల లేదు

బీపీ,షుగర్ రోగాలు లేవు.

EMI లు కట్టాలనే టెన్షన్ లేదు

అప్పులోళ్ళ గోల లేదు

నెల జీతం కోసం వెయిటింగ్ లేదు

రేపు ఏమవుతుందో అనే గాబరా లేదు

కోట్లు కూడబెట్టాలన్న ఆశ లేదు

కోటల్లో ఉండాలన్నా కోరిక లేదు

కార్లలో తిరగలన్నా ఆకాంక్ష లేదు

ప్లాట్లు,భూములు కొనాలన్న ధ్యాస లేదు

పిజ్జా,బర్గర్లు తినాలనే ఊసు లేదు

ఆరోగ్యం కోసం డైటింగ్ చేసే పని లేదు

ప్రకృతే నేస్తం

పచ్చగడ్డే పట్టు పరుపు

నేలతల్లే డబుల్ కాట్ మంచం

పచ్చడి మెతుకులే పరమాన్నం

తుండు గుడ్డే పట్టు వస్త్రం

చినుకు పడితే ఆనందం

పంట చేతికొస్తే పరమానందం

తాను సృష్టించుకున్న సామ్రాజ్యానికి

తానే రాజు,తానే మంత్రి,తానే సైన్యం👍