22, మే 2024, బుధవారం

భాగస్వాములు కండి

 మీరు భాగస్వాములు కండి 

ఈ బ్లాగును ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలోని తెలుగువారు చూస్తున్నారు.  మనలో ఎంతోమంది, కవులు, పండితులు, ఫొటోగ్రాఫరులు ఇంకా ఇతర కళాకారులు ఉండి వుంటారు. వారందరికీ ఇదే మా సాదర ఆహ్వానం. మీరు మీ రచనని లేదా మీరు ఈ బ్లాగులో ప్రచురించదలచిన అంశం ఏదైనా కానీ అందరకు ఉపయోగపడుతుందని తలుస్తే దాని మీద "తెలుగు పండిత కవులలో ప్రచురణార్ధం" అని వ్రాసి మీ పేరు, చిరునామా, ఫోను నెంబరు పేర్కొంటూ 9848647145 కు వాట్సాప్ చేయండి.  దానిని మేము మన బ్లాగులో ప్రచురిస్తాము. మీరు పంపిన అంశాలు (content ) ప్రపంచమంతా చూస్తారు. 

ఈ బ్లాగును మరింత సుందరంగా తీర్చి దిద్దే దిశలో మీ వంతు భాగస్వామ్యంగా విరాళాలు 9848647145 ఫోను నెంబరుకు ఇవ్వగలరు   

ఇట్లు 

మీ బ్లాగరు

ఇంద్రియ నిగ్రహము

 वश्येन्द्रियं जितात्मानं धृतदण्डं विकारिषु ।

परीक्ष्यकारिणं  धीरं अत्यन्तं श्रीर्निषेवते  ॥


Vashyendriyam Jitaatmaanam dhrutadandam vikaarishu

Pareekshyakaarinam dheeram atyantam shreernishevate


వశ్యేంద్రియం జితాత్మానం ధృతదండం వికారిషు|

పరీక్ష్యకారిణం ధీరం అత్యంతం శ్రీర్నిషేవతే||


An essential management lesson for those in spiritual path and also in Gruhastaashramam: Goddess Lakshmi is always with people who keep their senses  and mind under control, who firmly fight (oppose) wrongdoing, whose actions are preceded by a thorough examination of its pros and cons and who is of great determination.


లౌకిక కార్యాచరణలో ఉంటూ, ఆధ్యాత్మిక సాధన చేస్తున్న వారికి ఉపయోగించే విదురనీతి: ఇంద్రియ నిగ్రహము (దమము), మనోనిగ్రహము కలిగి, లౌకికమైన విషయాలలో గట్టి పరిశీలన (Introspection) కలిగి, ధైర్యవంతులై ప్రవర్తించు వారివద్ద లక్ష్మి స్థిరనివాసం చేయును.

మెచ్చుకోలులో

 మెచ్చుకోలులో మతలబు!


"మెచ్చుడు మెచ్చవచ్చునెడ,మెచ్చకుడిచ్చకు మెచ్చురానిచో,/

మెచ్చియు మెచ్చుమ్రింగకుడు,మెచ్చక మెచ్చితిమంచుగ్రుచ్చలై/

మెచ్చకు,డిచ్చమెచ్చుగనిమెచ్చుడు,మెచ్చనుమానమైనచో /

మెచ్చియు,మెచ్చకుండకయు,మెచ్చుడు,

సత్కవులారమ్రొక్కెదన్!


"ఆంధ్రభాషాభూషణము-మూలఘటిక కేతన.

              తెనుగు భాషకు పద్యాలలో తొలివ్యాకరణం రచించబూనినదిట్ట మూలఘటిక కేతన.ఆకాలంలో విద్యాలయాలను ఘటిక లనేవారు.అలాంటి విద్యాలయానికాతడు అధికారి.తిక్కనకు ప్రియశిష్యుడు.దండి దశకుమార చరిత్రము ననువదించి తిక్కనకు కృతినొసంగినమహనీయుడు.

"తల్లి సంస్కృతంబె యెల్లభాషలకును,

దానివలన కొంతగానబడియె,

కొంత తానగలిగె నంతయునేకమై

తెనుగుబాసనాగ వినుతికెక్కె;-అంటూ తెలుగు సంస్కృత జన్యమని నొక్కి వక్కాణించినవాడు. 


ప్రస్తుతానికివద్దాం.

సత్కవులకు మ్రొక్కుతూ అవతారికలో కవిచెప్పిన మాటలే పైపద్యం.


భావం:నాగ్రంధంలో నచ్చినవిషయంమీకు కనిపిస్తే మెచ్చుకోండి.మీమనస్సుకు నచ్చకపోతే మెచ్చుకోకండి.మనస్సులో మెచ్చుకుంటున్నా పైకి గాంభీర్యంనటిస్తూమెచ్చనట్లు ప్రవర్తించకండి.నచ్చకపోయినా కుటిలురై నచ్చినదని మెచ్చుకోకండి.మనఃపూర్వకంగా మెచ్చుకోండి.మీకు మెచ్చు అనుమానమైతే మెచ్చిమెచ్చనట్లుమెచ్చుకోండి. సత్కవులారా! మీకిదే నాప్రణామములు.

            మెచ్చు అనే క్రియను వృత్యనుప్రాసముగా నుపయోగించి అశేషవిమర్శకుల యభిప్రాయములెట్లుండునో సద్విమర్శయెటులుండవలెనో కేతన నిపుణముగా సూచించినాడు.నేడిట్టికవులొక్కరైననుగలరా? సంశయమే!


                               స్వస్తి!

త్ర్యంబకేశ్వరుడు

 _*త్ర్యంబకేశ్వరుడు*_


‘త్ర్యంబకం గౌతమీ తటే’ అని మనం అంటాము. 

సహ్యాద్రి శీర్శే విమలే వసంతం, గోదావరీ తీర పవిత్రదేశే, 

యద్దర్శనాత్ పాతకమాశునాశం, ప్రయాతి తమ్ త్ర్యంబకమీశమీడే!! (ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం – ౧౦)


త్ర్యంబకుడు తనను దర్శనం చేసిన వారిని రక్షించే స్వభావం కలవాడు. ఆయనను స్మరించిన వారిని, ఆయనను నమ్మిన వారిని సర్వకాలముల యందు రక్షించే స్వరూపం ఉన్నవాడు. 


ఇప్పటివరకు చదివిన స్వయంభూలింగముల విశేషం ఒకలా ఉంటుంది. త్ర్యంబకేశ్వరుని వద్దకు వచ్చేటప్పటికి ఒకలా ఉంటుంది. ఇది కేవలము ఒక లింగము ఆవిర్భవించిన కథ కాదు. గౌతమ మహర్షి జీవితమును, ఆయన శీలమును, ఆయన గొప్పతనమును ఇందులో చూస్తారు. అక్కడి శివలింగం గొప్పదా, గౌతముడు గొప్పవాడా అని ఒకసారి ఆలోచిస్తే గౌతముడే గొప్పవాడని అనిపిస్తుంది. ఇక్కడ ఒక నది, ఒక శివలింగం ఆవిర్భవించాయి. 


మనం తెల్లవారి లేస్తే ఏ నదీజలములు త్రాగి బతుకుతున్నామో ఆ నదిని తీసుకువచ్చిన మహాపురుషుని చరిత్ర ఇప్పుడు చదవబోతున్నాము. 


గౌతముడు చాలా గొప్ప మహర్షి. ఆయన తన శిష్యులతో కలిసి ప్రతిరోజూ శంభు లింగారాధనము చేస్తుండేవాడు. ఆ లింగానికి శంభులింగము అని పేరు పెట్టాడు. ‘శం భావయతి ఇతి శంభుః’ – మంచి భావములను కల్పించ గలిగిన లింగమును ఆరాధనా చేశాడు. అటువంటి మహర్షి కోరుకునేది ఒక్కటే. లోకమంతటినీ లోకేశ్వరునిగా చూడడం. 


చాలామంది శిష్యులు ఆయనను అనుగమించి ఉండేవారు. వాళ్ళందరికీ అనేక శాస్త్రములను బోధిస్తూ బ్రహ్మగిరి అనే పర్వతశిఖర పాదమూలమునందు ఆశ్రమమును నిర్మాణము చేసుకుని లింగారాధన చేస్తూ పవిత్రమయిన జీవితమును గడుపుతున్నాడు. 


ఇలా నడుస్తుండగా కొంతకాలమునకు అనావృష్టి వలన భయంకరమయిన క్షామం వచ్చింది. వర్షములు పడలేదు. ఎక్కడా నీరు లేదు. ఇప్పటికీ లోకమునందు నీరు లేకపోతే శివలింగామునకు సహస్ర ఘటాభిషేకం చేస్తారు. చేస్తే వర్షములు పడతాయి. 


ఇటువంటి పరిస్థితిలో ఒక్కొక్కరు నీరు ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోతున్నారు. దీనిని గౌతముడు చూసి నేను ఎలాగయినా ఈ లోక బాధను తీర్చే ప్రయత్నం చేస్తాను’ అని జలముల యొక్క అధిదేవతను గురించి తపస్సు చేశాడు. ‘నీవు తపస్సు చేశావు. సంతోషించాను. కానీ నేను మాత్రం వర్షించడం కుదరదు. కానీ నీకు ఒక ఉపకారం చేస్తాను. లోకమునకంతటికీ నేను నీరు ఇవ్వలేను. నీవు ఒక చిన్న గుండం తవ్వు. నేను అందులో నీళ్ళు పోస్తాను. ఒక వరం ఇస్తాను. ఆ కుండం ఆరదు. ఎప్పుడూ నీళ్లు ఉంటాయి’ అని చెప్పాడు వరుణుడు. 


అపుడు గౌతముడు ఇంతకన్నా నాకు అదృష్టం ఎక్కడ ఉంటుంది. తప్పకుండా అలా చేస్తాను’ అని తన భార్య అయిన అహల్యతో కలిసి ఒక గుండం తవ్వాడు. అహల్య గొప్ప పతివ్రత. వారు తవ్విన గుండంలో నీరు నింపాడు వరుణుడు. అపుడు గౌతముడు అహల్య కలిసి ఈ నీటిని పట్టుకు వెళ్ళి సేద్యం చేసి అనేకమయిన పంటలు పండించాడు. 


అందరికీ ఉచితంగా భోజనం లభించింది. అక్కడి ప్రజలు గౌతమ మహర్షి ఆశ్రమమునకు వెళ్లి చక్కగా ఆ పెట్టిన పదార్థముల నన్నిటిని తినడమే కాక ఈ కీర్తిలో వాటా కోసం కొందరు గౌతమునితో బంధుత్వం కలదని చెప్పుకోవడం ప్రారంభించి ఆయన దగ్గరకు చేరారు. 


ఇలా జరుగుతుండగా గౌతమాశ్రమంలో ఒక విచిత్రం జరిగింది. ఒకరోజు తెల్లవారు జామున మహర్షి శివలింగమునకు అభిషేకం చేయాలి. వరుణ గుండంలోకి వెళ్ళి నీళ్ళు పట్టుకురండి అన్నారు శిష్యులను మహర్షి. వాళ్ళు నీళ్ళు తేవడానికి వెళ్ళారు. అదే సమయమునకు మునుల భార్యలు అక్కడికి స్నానం చేయడానికి వచ్చారు. వాళ్ళు స్నానం చేశాక పట్టుకుందాములే అని అక్కడ నిలబడడం బ్రహ్మచారికి దోషం అవుతుంది కాబట్టి అమ్మలారా, మీరు ఒక్కదారి అలా ప్రక్కకి తొలగితే మీము నీళ్ళు పట్టుకుని వెళ్లిపోతాము అని చెప్పారు. స్త్రీలు అన్నారు ‘ మీకు ఎంత మిడిసిపాటు వచ్చింది. మా స్నానం కన్నా గౌతముడికి సంధ్యావందనం, అభిషేకం ఎక్కువయ్యాయా?అవతలికి పొండి ’ అన్నారు. ఆ మాటలకు శిష్యులు చిన్నబుచ్చుకుని ఖాళీ కుండతో తిరిగివచ్చారు. అప్పుడు వాళ్లకి ఏమి చేయాలో అర్థం కాక అహల్య దగ్గరికి వెళ్ళి ‘అమ్మా, ముని పత్నులు మమ్మల్ని అనరాని మాటలు అని పంపించి వేశారు. ఇప్పుడు గురువుగారి వద్దకు ఎలా వెళ్ళడం’ అని అడిగారు. ఆమాటలను విన్న అహల్య వెంటనే తాను వెళ్ళి నీళ్ళు ముంచుకుని వెళ్ళిపోయింది. 


వెంటనే వాళ్ళు అహల్య మనల్ని చూసి ఏమీ మాట్లాడకుండా చులకన చేసి వెళ్ళిపోయింది అని దెప్పిపొడిచారు. వాళ్ళలో అక్కసు బయలుదేరింది. వెళ్ళి భర్తలను “మా భర్తలు ఒకళ్ళు పెడితే అంగలారుస్తూ తినేవాళ్ళు అనుకుంటున్నారా?” అని అడిగారు. అలా భార్యలు అడిగేసరికి వాళ్లకి కష్టం వచ్చింది. 


వెంటనే వీళ్ళు గణపతి హోమం మొదలు పెట్టారు. వీళ్ళు విఘ్నేశ్వరుని ఉద్దేశించి దంతిమఖము అనే మఖము ఒకటి చేశారు. వీళ్ళు చేసినటువంటి మఖమునకు తృప్తిపొందిన గణపతి యజ్ఞ గుండంలోంచి ఆవిర్భవించాడు. ‘నేను మీకు ఏమి చేసిపెట్టాలి?” అని అడిగాడు. అపుడు వాళ్ళు ‘గౌతముడు పొగరెక్కి ఉన్నాడు. కాబట్టి ఈ ఆశ్రమంలోంచి గౌతముడు తరమబడేటట్లు నీవు ఏదో ఒక పథకం చేసి మమ్మల్ని రక్షించాలి’ అన్నారు.

అపుడు విఘ్నేశ్వరుడు ‘ఇది మీరు అడగవలసిన మాట కాదు.ఒకనాడు మీకు తాగడానికి నీళ్ళు లేక, తినడానికి అన్నం లేకపోతె ఆ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మీకు వడ్డించి అన్నం పెడుతుంటే ఆయనను ఈ ఆశ్రమం నుండి తరిమి క్షామంలోకి తొరి మీరు సుఖములను అనుభవిద్దామని అనుకుంటున్నారా? ఇది ఎంత కృతఘ్నత! ఇలా చేయకూడదు. అలా చేస్తే మీరు లోకంలో నశించిపోతారు” అన్నాడు.


అపుడు వాళ్ళు “నీ దగ్గర నీతులు వినదానిమి మేము ఈ మఖము చేయలేదు. మాకోరిక ఒక్కటే. గౌతముడు ఈ ఆశ్రమం నుండి తరమబడాలి. అలా నువ్వు చేస్తే మేము చేసిన మఖమునకు ఫలితం ఇచ్చినట్లు అవుతంది. కానినాడు నీవు కృతఘ్నుడవు అయిపోయినట్లు మేము భావిస్తాము” అన్నారు. అపుడు విఘ్నేశ్వరుడు ‘మీరు చేసిన మఖమునకు నేను ప్రీతి చెందాను. తప్పకుండా మీకోరిక తీరుస్తాను. కానీ మీరు పాడయిపోతారు. తన ఉపాసన యందు భంగము లేకుండా నడిచి వెళ్ళిపోయినటువంటి గౌతముడు సర్వోత్క్రుష్టమయిన కీర్తిని పొందుతాడు. దీనిని మీ మనస్సులో పెట్టుకోండి. మీ కోరిక తీర్చడంలో నాకు అభ్యంతరం లేదు’ అన్నాడు. ఒక వృద్ధ గోవు ఆయన కష్టపడి వేసిన పళ్ళు, ఆకుకూరలు వచ్చి తినేస్తోంది. గణపతి ఆ వృద్ధ గోవు రూపంలో వచ్చాడు మునుల కోర్కెను తీర్చడానికి గాను. బక్క ఆవు మేస్తుంటే ఆవును కర్రతో కొట్టినా, చేతితో కొట్టినా గోమోదక దోషం వస్తుందని మహానుభావుడు గౌతముడు ఒక ఎండిపోయిన గడ్డిపరక తీసి ఆవుమీద పడేసి ‘హ హ’ అన్నాడు. ఆ గడ్డిపరక పడగానే ఆవు చచ్చిపోయింది. నాకు గోహత్యాదోషం వచ్చింది’ అని ఏడ్చాడు. ప్రాయశ్చిత్తం కోసం వెంపర్లాడలేదు. అక్కడికి అహల్య, ఆయన శిష్యులు వచ్చి ఏడుస్తున్నారు. మునులు, మునిపత్నులు వచ్చారు. ఏమయిందని గౌతముని అడిగారు. జరిగింది చెప్పాడు గౌతముడు. 


అపుడు వారు’ఆవును చంపిన నీ ముఖం చూస్తే మహా పాతకములు వస్తాయి. నీవు నీ భార్యను, శిష్యులను తీసుకుని ఆశ్రమం వదలి ఎక్కడికయినా పో’ అన్నారు. అక్కడితో ఊరుకోక నువ్వు గోహత్య చేసిన వాడివి, ఇక్కడ నీవు ఉంటె మేము ఉండము అంతేకాక ఈవేళ నుండి నీవు దేవతలను ఆరాధించకూడదు. 


గోహత్య చేసిన నీలాంటి దుర్మార్గుడు పూజచేస్తే భగవంతుడు నొచ్చుకుంటాడు. అదేమీ కుదరు పో’ అన్నారు. గౌతముని ప్రాణం ఈశ్వరార్చన. అప్పుడు ఆయన ‘అయ్యో, నేను తప్పకుండా వెళ్ళిపోతాను. అని వెళ్ళిపోయాడు. అక్కడ నుండి బయలుదేరి అక్కడ అక్కడ తిరిగి ఎంతో దుఃఖమును అనుభవించి ఆ మునులను ఏదైనా ప్రాయశ్చిత్తం వుంటే చెప్పండి. నేనది చేసుకుని మరల నా జీవితమును ఈశ్వరాభిముఖం చేసుకుంటాను’ అన్నాడు. 


నిజానికి ఆయనకు తెలియని విషయమా? ఆయన ఇంకా మెట్లు దిగి వినయమునకు వెళుతున్నాడు. వీళ్ళు మెట్లెక్కి అహంకారమునకు వెడుతున్నారు. అపుడు వీళ్ళు ‘అయితే ఈ భూమండలమునంతటినీ మూడు మార్లు ప్రదక్షిణ చెయ్యి. అలా చేస్తున్నప్పుడు అడుగుతీసి అడుగు వేసినప్పుడల్లా గోవును చంపిన మహా పాతకుణ్ణి నేను అని అంటూ చెయ్యి. వచ్చిన తరువాత చాంద్రాయణ వ్రతం చెయ్యి. అప్పుడు నీకు ఆవును చంపిన పాపం పోతుంది’ అని చెప్పారు. 


ఒకవేళ అలా చేయలేక పోయినట్లయితే వెళ్లి శంకరుని గూర్చి తపస్సు చెయ్యి. శంకరుడు ప్రత్యక్షమయిన తర్వాత గంగను ఇమ్మని అడుగు. ఎక్కడ ఆవును చంపావో అటువైపు నుంచి గంగను ప్రవహింపజెయ్యి. తర్వాత అఘమర్షణవ్రతం చెయ్యి. కోటి లింగములు పెట్టు. వాటికి అర్చన చెయ్యి. అలా చెయ్యి అన్నారు. మరల గౌతముడు ఆశ్రమమునకు తిరిగి రాకుడా ఉండేవిధంగా ఉపదేశం చేశారు. 


గౌతమ మహర్షి వెళ్లి అద్భుతమయిన తపస్సు ప్రారంభం చేశారు. ఒక పార్థివ లింగమును తీసుకుని పంచాక్షరీ మహామంత్రముతో తదేక నిష్ఠతో శివుణ్ణి ఆరాధన చేశారు. అలా తపస్సు చెయ్యగా శంకరుడు ప్రత్యక్షం అయి ‘నాయనా, ఎందుకింత గొప్ప తపస్సు చేశావు?” అన్నాడు. కన్నుల నీరు కారుస్తూ గౌతముడు ‘ఈశ్వరా నీకు తెలియనిది ఏముంటుంది? నేను ఆవుని చంపి మహాపాపం చేశాను. నేను చేసిన గోహత్యా పాపమును నా నుంచి తీసివేసి నేను పాపాత్ముడను కానన్న స్థితిని నాక్కు కల్పించవలసినది’ అని ప్రార్థించాడు. 


శంకరుడు ‘అయ్యో పిచ్చివాడా. ఇంత తపస్సు చేసి పాపమును తియ్యమని అడుగుతున్నావా? నీకు పాపం ఉన్నాడని అనుకుంటున్నావా? అసలు నీకు పాపం లేదు. నీవు గోహత్య చేశావని చెప్పిన వాళ్ళు దుర్మార్గులు. జగత్తులో ఎవడయినా గౌతమమహర్షి అన్న పేరు పలికినా, గౌతమ మహర్షిని చూసినా వాడి పాపములు నశించిపోతాయి. నీవు అంతటి పుణ్యాత్ముడవు. నిన్ను చూడడానికి నేను వచ్చాను’ అన్నాడు. గౌతముడు ఒక్కసారి అంతర్ముఖుడై చూశాడు. సత్యం తెలిసిపోయింది. వెంటనే ఆయన కళ్ళు తెరచి శంకరుని చూసి ఆహా పరమేశ్వరా, వాళ్ళు నాకు ఎంతో ఉపకారం చేశారు. వాళ్ళు నన్ను అలా తిట్టక పొతే నిన్ను ఇలా తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుని ఉండేవాడిని కాదు. వాళ్ళ వల్లనే కదా నాకు నీ దర్శనం అయింది. వాళ్లకు నేను ఋణపడిపోయాను అన్నాడు.


తరువాత శివుడు ‘గౌతమా! ఏదైనా వరం కోరుకో ఇస్తాను’ అన్నాడు. అపుడు గౌతముడు స్వామీ మీరు నిజంగా నన్నుకానీ అనుగ్రహించాలి అనుకుంటే ఒక్కసారి మీ జటాజూటంలో ఉన్న గంగను విడిచి పెట్టండి.

నేను ఆంద్రదేశమునకు తీసుకువెడతాను’ అనగానే గభాలున గంగ స్త్రీరూపంలో పైనుండి క్రిందికి దూకి తెల్లటి వస్త్రములతో నిలబడింది. గౌతమునికి గంగాదర్శనం అయింది.


వెంటనే ఆయన తన రెండు చేతులు ముకుళించి నన్ను నిర్మలుడిని చెయ్యి తల్లీ అన్నాడు. అపుడు ఆ తల్లి నీవు కోరుకున్నట్లుగా ఇక్కడ ఒక్కసారి నేను ఆగుతాను. నీటి రూపంలో నీ తలమీద పడతాను. అపుడు నీవు గంగా స్నానం చేసిన వాడవు అవుతావు. నీవు నిర్మలుడవు అయినట్లే. వెంటనే శివుని తలమీద వెళ్ళిపోతాను. ఇంకొకసారి భూమిమీద ప్రవహించను అన్నది. అపుడు గౌతముడు ‘అమ్మా, లోకం అంతా సుభిక్షం కావాలి. నీవు ప్రవహించాలని కదా తల్లీ నేను కోరింది అన్నాడు. అపుడు గంగ శంకరుని వంక చూసి స్వామీ, గౌతముని కోరిక ప్రకారం నేను ప్రవహిస్తాను. మీరు లింగరూపంలో ఇక్కడ వెలయండి. 33 కోట్ల దేవతలు నా ప్రవాహం ఎటువెడుతుందో అటు ఉండాలి. అంది. శివుడు తప్పకుండా అలాగే ఇక్కడ వెలుస్తాను అన్నాడు. అప్పుడు దేవతలు అమ్మా మేము మాత్రం ఏడాదికి ఒకమారు వచ్చి ఇక్కడ కూర్చుంటాము. పుష్కరములు వచ్చినప్పుడు మాత్రం ఏడాది అంతా ఉంటాము. అని గంగామాతను ప్రార్థించారు. గంగ సరే సంవత్సరమునకు ఒకరోజు వచ్చి ఈ తటంలో కూర్చోండి అంది. 


గౌతముని మీద వెడుతున్న గంగ పాయ కనుక దీనిని గౌతమి అని పిలుస్తారు. స్వామి ఇక్కడ త్ర్యంబకుడు అనే పేరుతో వెలశాడు. ఇది పరమశివుని అపారమయిన కారుణ్యమును, సౌలభ్యమును తెలియజేస్తుంది. ఇప్పటి వరకు ఏ మునులయితే గౌతమ మహర్షిని పో పో అని తరిమేశారో వాళ్ళందరూ గంగ క్రింద పడిందిట మనం స్నానం చేద్దాం రండి అని భార్యలతోటి, శిష్యుల తోటి, దిగుతున్నారు. గంగ వారిని చూసి ‘ఆయన పేరు మీద పుడితే మళ్ళీ అందులో స్నానం చేసి పాపములు పోగొట్టేసుకుందాం అనుకుంటున్నారా దూర్తులారా? అని అంతర్ధానం అయిపోయింది. గౌతముడు ఏడ్చాడు. 


ఈయన ఏడుపు చూడలేక గంగాదేవి తిరిగి వచ్చింది. అప్పుడు వీళ్ళందరూ చక్కగా లోపలికి దిగి స్నానం చేశారు.


కొన్నిచోట్ల గౌతముడు మునులను శపించాడు అని వ్రాయబడింది. అలా చెప్తే ఈ ఆఖ్యానమునకు అర్థం ఉండదు. గౌతముడు శపించలేదు. తమ గురువుగారు ఇంత చేసినా సరే, గంగాస్నానమునకు మళ్ళీ ఏర్పాటు చేసిన అసారే స్నానం చేసి వచ్చి క్షమాపణ చెప్పి ఆయన కాళ్ళు పట్టని మునులను చూసి గౌతమ శిష్యులు మీకు శివభక్తి లేకుండుగాక అని శపించారు. 


ఆనాటి నుండి వాళ్ళు జడులై, తమ జీవితములను పాడుచేసుకుని తిరగసాగారు. ఆనాడు వెలసిన త్రయంబక లింగమే మహారాష్ట్రలోని త్ర్యంబకేశ్వరుడు అని పిలవబడుతూ గౌతమీ తటి ఒడ్డునే మనం చూస్తున్నది. ఆయన త్ర్యంబకుడు. అనగా మూడు కన్నులు కలవాడు. ఆ త్ర్యంబకుడిని చూసి ఒక్కసారి మూడు కన్నుల వాడా మహాదేవా అని ఒక్కసారి నమస్కరిస్తే చాలు మీకింత ఫలితమును ఇచ్చేస్తాడు. ఒకనది ప్రవహించేటట్లు చేసి ఆనాటి నుండి ఈనాటి మనవరకు బ్రతుకుతున్నాం అంటే ఇన్ని క్షేత్రములు వచ్చాయి అంటే మహాపురుషుడయిన గౌతముడిని మనం ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ఉండాలి.


ఓం శివాయనమః 🙏☘️🌿

సర్వాత్ముడు

 


సర్వాత్ముడు!!


అణువోగాక కడున్ మహావిభవుఁడో, యచ్ఛిన్నుఁడో, ఛిన్నుఁడో, 

గుణియో, నిర్గుణుఁడో, యటంచు విబుధుల్ గుంఠీభవత్తత్త్వమా

ర్గణులై యే విభుపాదపద్మ భజనోత్కర్షంబులం దత్త్వ వీ

క్షణముం జేసెద రట్టి విష్ణుఁ బరమున్ సర్వాత్ము సేవించెదన్.


భావం:


అత్యంత సూక్ష్మమైన అణుస్వరూపుడా, 

లేక  అత్యధికమైన  గొప్ప  వైభవము కలవాడా.. 

విభజింపశక్యముకాని వాడా, 

లేక ఎక్కడికక్కడే భిన్న భిన్న స్వరూపాలుగా ఉన్న వాడా.. 

సమస్త గుణములు తానైన వాడా లేక గుణ రహితుడా..

అనుకుంటూ..


ఎవ్వాని అన్వేషణలో మహా జ్ఞానులైనవారి

యథార్థ జ్ఞాన తత్త్వము సైతము మొక్కపోయినదై యుండగా.. 


వారు కూడా వినమ్రతతో.. 

ఏ ప్రభువు యొక్క పాద పద్మములను భజన చేస్తూ, 

ఉత్కర్ష విన్యాసాలతో మైమరచి యుంటారో!!  అటువంటి సర్వాంతర్యామిని, 

సర్వమునకు ఆత్మయైన విష్ణు దేవుని సేవించెదను.


సేకరణ!🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏

మానవజన్మ సార్ధకత

 *ఈ మానవజన్మ సార్ధకతకు ధర్మాన్ని ఆచరించండి* 


ప్రపంచంలో మనిషిగా పుట్టడం చాలా అరుదు.. ఇలాంటి అరుదైన మానవజన్మ మనకు లభించింది.. ఈ జన్మలో విశ్వాసం లేదు, ధర్మాచరణం లేదు అని చెబితే ఈ మానవ జన్మకు అర్థం లేదు..                                                        

  అయితే ఈ పుణ్య భారతంలో ఇంతటి పుణ్య జన్మ తీసుకున్నాం అని అంటున్నాం కదా,మరి దాన్ని సాకారం చేసుకోవాలిఅంటే..?! అదీ మనిషి స్వభావాన్ని బట్టి ఉంటుంది. నిత్య ధర్మాచరణ చేసేవారి సాంగత్యంలో ఉంటే వారి స్వభావం అతడికి వస్తుంది..అదే అతను వివిధ దుర్మార్గపు పనులెజ్ చేసే వారి సాంగత్యంలో ఉంటే దుర్మార్గుల సాంగత్యం, దుర్మార్గుల స్వభావమే అతడికి వస్తుంది.ఈ పుణ్య భారతంలో పుడితేనే, ఈ సనాతన ధర్మ వంశంలో పుడితేనే అర్థం ఉంటుంది.. లేకుంటే ముందు చెప్పినట్లుగా జంతువులతో మనం సమానం అవుతాం. .అలా ఉండకూడదు.. ఈ జన్మకు సార్థకత కలగాలి.. ఈ ధర్మాన్ని పాటించే విషయంలో గొప్పవారు ఎప్పటికీ మనకు ఆదర్శం.వారు చూపించింన మార్గాన్నే తప్పక పాటించండి..


 -- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ* 

 *మహాస్వామి వారు*

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*22-05-2024 / బుధవారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


చేపట్టిన వ్యవహారాలలో అవరోధలు తప్పవు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

---------------------------------------

వృషభం


ప్రయాణాలు జాగ్రత్తగా వ్యవహరించాలి. కీలక విషయాలలో శ్రమపడ్డా ఫలితం లభించదు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు స్వల్పంగా లభిస్తాయి. ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది.

---------------------------------------

మిధునం


ఆత్మీయుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. మంచి మాట తీరుతో ఇంటా బయట అందర్నీ ఆకట్టుకుంటారు. చేపట్టిన పనులు నూతనోత్సాహంతో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

---------------------------------------

కర్కాటకం


ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు.

---------------------------------------

సింహం


వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. చేపట్టిన వ్యవహారాలలో ప్రతిబంధకాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. గృహ వాతావరణం చికాగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

---------------------------------------

కన్య


ఆర్థిక వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కష్టపడ్డా ఫలితం ఉండదు. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. గృహమును కొందరు ప్రవర్తన వలన మానసిక సమస్యలు కలుగుతాయి. ఉద్యోగాలలో ఇబ్బందికర వాతావరణం ఉంటుంది.

---------------------------------------

తుల


కీలక వ్యవహారంలో అందరిని ఒక మాట మీదకు తీసుకువస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపారాలు కొంత సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

---------------------------------------

వృశ్చికం


ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. బంధు మిత్రులతో మాటపట్టింపులు తప్పవు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ధన పరంగా ఇబ్బందులు తప్పవు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.

---------------------------------------

ధనస్సు


సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. నిరుద్యోగుల శ్రమ ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. నూతన మిత్రులు పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

---------------------------------------

మకరం


ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు అధికమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు పనిభారం ఉంటుంది.

---------------------------------------

కుంభం


సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అధికారులు సహాయ సహకారాలతో నూతన అవకాశాలు అందుకుంటారు.

---------------------------------------

మీనం


చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. భూ సంబంధిత క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వాహనాలు కొలత కలుగుతుంది. వ్యాపారాలలో భాగస్వామితో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగాలు గతం కంటే మెరుగైన వాతావరణం ఉంటుంది.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

ఆకొన్నకూడె

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


*ఆకొన్నకూడె యమృతము*

     *తాకొందక నిచ్చువాడె దాత ధరిత్రిన్*

     *సోకోర్చువాడె మనుజుడు*

     *తేకువ గలవాడె వంశతిలకుడు సుమతీ!*


భావం : ఈ భూమి మీద బాగా ఆకలివేసినప్పుడు తిన్న అన్నమే అమృతం.... అది చాలా రుచిగా ఉంటుంది..... ఎవరైనా దానం కోరితే విసుక్కోకుండా దానం చేసేవాడే నిజమైన దాతృత్వం కలిగినవాడు.... అలాగే ఎప్పుడైనా *కష్టాలు కలిగితే వాటిని ఓర్చుకోగలవాడే నిజమైనమానవుడు.....ధైర్యం ఉన్నవాడే వంశానికి మంచి పేరు తేగలుగుతాడు*....


   👇 //------ ( *మోహముద్గరం* )-----// 👇


శ్లో𝕝 

*సుఖతః క్రియతే రామాభోగః*

*పశ్చాద్ధంత శరీరే రోగః* ౹

*యద్యపిలోకే మరణం శరణం*

*తదపి నముంచతి పాపాచరణం* ॥28॥


భావం: సుఖాన్ని పొందాలని స్త్రీ పురుషులు రతి కార్యంలో నిమగ్నమవుతారు. దాని కారణంగా శరీరం రోగాలపాలవుతుంది. చివరికి మరణం అనేది ఎవరికి తప్పదు. ఐనా సరే *మానవుడు పాప కార్యములను వదలనే వదలడు*.

నృసింహ జయంతి

 *ॐ నృసింహ జయంతి శుభాకాంక్షలు.* 


*హిరణ్యకశిపుడు అడిగిన వరం :*  


       ఇంట్లోగానీ - బయటగానీ, 

        పగలుగానీ - రాత్రిగానీ, 

       మానవునిచేతగానీ - ఏ జంతువుచేతనైనా గానీ, 

       ప్రాణం ఉన్నటువంటివాటితోగానీ - ప్రాణం లేనటువంటివాటితోగానీ,     

      తనకి మరణం లేకుండా ఉండాలని. 


*హిరణ్యకశిపుని మరణం*  


    శ్రీమన్నారాయణుడు హిరణ్యకశిపుని,


       ఇంటిలోపలా బయటా కాక, గుమ్మం మధ్యలో, 

       పగలూ రాత్రీ కాక సాయం సంధ్యవేళ, 

        అటు మానవుడూ, ఇటు జంతువూకాని నరసింహుడుగా, 

       ప్రాణం ఉన్నవీకాని, లేనివీకాని గోళ్ళతో సంహరించాడు. 

       

*నారసింహావతారం - అంతరార్థం*   


**హిరణ్యకశిపుడు*   


హిరణ్యము - ప్రకృతి

    ప్రకృతినే చూచి, దానితోనే ఆనందం పొందువాడు.


**ప్రహ్లాదుడు*  


ప్ర - ఉత్తమమైన 

హ్లాద - (జ్ఞాన) ఆనందం.


**నరసింహ*    

*సింహ(దైవీ) ఆలోచన - నర(మానవీయ) క్రియ*  


నర మొండెం - మానవ క్రియ 


సింహం శిరస్సు - దైవ ఆలోచన   

( "మృగములలో మృగేంద్రుడైన సింహాన్ని నేను"

    మృగాణాం మృగేంద్రోఽహం - భగవద్గీత ) 


**స్తంభం - నిశ్చలతత్త్వం*  


జ్ఞానానందాన్ని కాపాడటంకోసం, 

హింసాత్మకమైన ప్రకృతిపట్ల ఉన్న ప్రలోభాన్ని నాశనం చేయటం "నరసింహావతారం"


    ఈ నరసింహావతారం జరిగి ఇప్పటివరకు 8,64,59,204 సంవత్సరాలయింది. 


                    =x=x=x=


    — రామాయణం శర్మ 

             భద్రాచలం

డొనెషన్లు

 

మిత్రులారా మన బ్లాగు అభివ్రుద్దికి డొనేషనులు 9848647145 మొబేలు నంబరుకు జీ పే, ఫొనె పె, పేటియం లొ దేనితొ నయినా పంప వచ్హు. మీ స్క్రీన్ షాట్ పంపిస్తె మన బ్లాగులొ పబ్లిష్ చేస్తాము. ఇక ఆలశ్యం యెందుకు ఇప్పుడె మీరు డొనెషన్ పంపండి. మన బ్లాగు అభివ్రుద్దికి తొట్పడండి 

సంకల్పము

 *శుభోదయం*

*********

సంధ్యా వందన మరియు

 ఇతర పూజాకార్యక్రమాల 

సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.22.05.2024

బుధ వారం (సౌమ్య వాసరే) 

***********

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ  క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ వైశాఖ మాసే శుక్ల పక్షే చతుర్దశ్యాం

(సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)సౌమ్య వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర  ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ క్రోధి  నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ 

వైశాఖ మాసే  శుక్ల పక్షే  చతుర్దశ్యాం

సౌమ్య వాసరే అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.5.30

సూ.అ.6.21

శాలివాహనశకం 1946 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2081 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5125 వ సంవత్సరం. 

శ్రీ క్రోధి నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

వసంత ఋతువు

వైశాఖ మాసం 

శుక్ల పక్షం 

చతుర్దశి సా. 5.42 వరకు. 

మంగళ వారం. 

నక్షత్రం స్వాతి ఉ.7.04 వరకు. 

అమృతం రా.11.22 ల 1.05 వరకు. 

దుర్ముహూర్తం ఉ. 8.04 ల 8.55 వరకు.

దుర్ముహూర్తం ప.11.30 ల 12.21 వరకు

వర్జ్యం ప. 1.04 ల 2.47 వరకు. 

యోగం వరీయాన్  ప.12.16 వరకు.  

కరణం వనజి సా.5.42 వరకు. 

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం మ. 12.00 ల 1.30 వరకు. 

గుళిక కాలం ఉ.10.30ల 12.00 వరకు. 

యమగండ కాలం ఉ.7.30 ల 9.00 వరకు. . 

 ************   

పుణ్యతిధి వైశాఖ శుధ్ధ చతుర్దశి. 

  ****************

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

*వారి* 

బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక

*పరిచయం - పరిణయం*

26/05/2024(ఆదివారం) రోజు వనస్థలిపురం లో

ఏర్పాటు చేయటం జరిగినది. రిజిస్ట్రేషన్ లు  జరుగుతున్నాయి ఇతర వివరాలకై సంప్రదించండి.

98487 51577 / 80195 66579.

****************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.


ఈ రోజు పుట్టినరోజు  మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

🙏🙏🙏

తప్పులను

 ఇతరులు 

చేసిన తప్పులను 

కష్టం లేకుండా 

లెక్కపెట్ట వచ్చు. 


తేలికగానే 

క్షమించవచ్చు కూడా. 


మన తప్పులను 

ఒప్పుకోవడం కష్టం 


వాటిని 

ఎత్తిచూపే వారిని క్షమించడం 

అసాధ్యమేనని 

చెప్పవచ్చు. 


*శుభోదయం*

పంచాంగం 22.05.2024

 ఈ రోజు పంచాంగం 22.05.2024  Wednesday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం వసంత ఋతు వైశాఖ మాస శుక్ల   పక్ష: చతుర్థశి తిధి సౌమ్య వాసర: స్వాతి నక్షత్రం వరీయాన్ యోగ: గరజి తదుపరి వణిజ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


త్రయోదశి సాయంత్రం06:44 వరకు.

స్వాతి ఉదయం 07:44 వరకు.

సూర్యోదయం : 05:46

సూర్యాస్తమయం : 06:40


వర్జ్యం : మధ్యాహ్నం 01:41 నుండి 03:23 వరకు.


దుర్ముహూర్తం : మధ్యాహ్నం 11:47 నుండి 12:39 వరకు.


అమృతఘడియలు : రాత్రి 11:52 నుండి 01:34 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.


యమగండం: పగలు 07:30 నుండి 09:00 వరకు.

 


శుభోదయ:, నమస్కార:

బొట్టు" హిందువు

 🛑 "బొట్టు" లేకుండా ఒక హిందువు ఉన్నారంటే అది వారి దౌర్భాగ్యం అనుకోవాలి. పుట్టిన 11 వ రోజునుండి చనిపోయిన 11 వ రోజువరకూ బొట్టు మన జీవితంలో ఒక భాగం. చివరికి చనిపోయాక శవానికి కూడా బొట్టు పెడతారుగా! నువ్వు ఏ రకం బొట్టు ఆయినా పెట్టుకో! కానీ, నీ నుదురు స్మశానం లా ఉండకుండా చూసుకో! నీ నుదురు ఖాళీగా ఉందంటే దరిద్రానికి Fashion అనే పేరుపెట్టి మరీ ఆహ్వానిస్తున్నావని అర్థం.

🛑 చందనం గుండ్రంగా పెట్టుకుంటావా? పెట్టుకో! అది పూర్ణత్వానికి చిహ్నం!


🔴 విభూతి పెట్టుకుంటావా? పెట్టుకో! అది ఐశ్వర్యానికి ప్రతీక! ఏనాటికైనా ఈ శరీరం భస్మం కావాల్సిందేగా!


🩸నామం పెట్టుకుంటావా? పెట్టుకోండి! అది నువ్వు ఉన్న స్థితినుండి, నిన్ను ఉన్నతస్థితికి చేరుకోమనీ అంటోంది!


🔴 కుంకుమ పెట్టుకుంటావా? పెట్టుకో! ఇది సౌభాగ్యానికి సోపానం!


🔴 సింధూరం పెట్టుకుంటావా? పెట్టుకో! హనుమంతుడి ఆశీర్వాదం లభిస్తుంది. 


🔴 కనుబొమ్మల మధ్యనుండేది ఆజ్ఞాచక్రం. 72000 నాడులకది నిలయం. అక్కడ తప్పకుండా ఏదో ఒక బొట్టుపెట్టు! బొట్టుపెట్టుకుంటే నీలో భక్తి భావన కలుగుతుంది. బొట్టుపెట్టుకున్న నీముఖం చూసినవారికి నీ గురించి ఒక పవిత్రమైన భావన కలుగుతుంది. నీకు కీడు చేయాలన్నా చేయలేరు. మంచిని నువ్వు అడగకపోయినా చేసిపెడతారు. కనుక నీ మంచి కోసమైనా నువ్వు బొట్టు పెట్టుకో!                                

                                                 

మీ ఆరోగ్య ఐశ్వర్యాభిలాషి🪷🕉️🚩

సంపదలు ఉన్నచోట

 💐🙏 జై శ్రీ రామ్ 


కంచర్ల వెంకట రమణ శుభదినం💐🙏

"సంపదలు ఉన్నచోట దొంగలు, బంధువులు, స్నేహాలు..

కోర్కెలు ఆశలు ఉన్నచోట రోగాలు సమస్యలు తిష్ఠ వేసుకొని కూర్చుంటాయి కానీ జ్ఞానం ఉన్నచోట

ప్రపంచమే నీ కాళ్ళకి మ్రొక్కుతుంది."

     

👉"శాంతంగా ఉంటేనే జీవితంలో దృఢంగా ఉండగలం.

చల్లగా ఉన్నప్పుడు అత్యంత దృఢంగా ఉండే ఇనుము వేడెక్కితే బలహీనం అయిపోతుంది.

🙏