11, జూన్ 2024, మంగళవారం

కర్మ ఫలము

 *అసాధ్యమైనదానికోసం వెతకకండి - నష్టాన్ని చూసి బాధ పడకండి* 


 మనుషులలో వింత పాత్రలు,ప్రవర్తనలు ఉన్నాయి. అసాధ్యమైన వాటి కోసం కొందరు ఆశపడతారు. పోగొట్టుకున్న వాటిపై కొందరు విలపిస్తున్నారు. ఈ రెండు రకాలు కేవలం అజ్ఞానం.

 సాధించలేని వస్తువు ఎంత తీవ్రమైన కోరికను పొందలేదనేది వాస్తవం. కాబట్టి అలాంటి వాంఛలో ప్రయోజనం ఏమిటి? ఉదాహరణకు, చంద్రకాంతి మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. దాని కారణంగా, చంద్రుడిని మన తలుపు మెట్ల వద్ద ఉంచాలని ఆశించడం సాధ్యమేనా?

 అదేవిధంగా, కోల్పోయిన వస్తువులపై బాధపడటం (ఏడ్వడం) వల్ల ఉపయోగం లేదు. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది విపరీతంగా దుఖిస్తారు. సన్నిహితులు మరియు ప్రియమైనవారి మరణంతో కొంతమంది విపరీతంగా దుఖిస్తారు. మరికొందరు ఇష్టపడే వస్తువులను కోల్పోయినప్పుడు తీవ్రంగా భాధ పడతారు. వారు తిరిగి రాలేరు; లేదా పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందలేరు . అటువంటి పరిస్థితులలో, నష్టం గురించి ఏడ్వడం అజ్ఞానం తప్ప మరొకటి కాదు.

 కొందరువ్యక్తులుబాధపడుతున్నప్పుడు వారి సమతుల్యతను కోల్పోయి భగవంతుని, శాస్త్రాల సమర్థత గురించి అవహేళన చేస్తారు. అది చాలా తప్పు.

మన కర్మ ఫలముల పరిణామాలను మనం మాత్రమే భరించాలి. దానికోసం ఇతరులను నిందించకూడదు. అలా చేయడం అజ్ఞానం.అందువల్ల, అజ్ఞానానికి తావు ఇవ్వకుండా అందరూ తెలివిగా వ్యవహరించాలి.

 

 *राप्यमभिवाञ्यमभिवाञ्छन्नषटंटं छन्ति्ति|* 

 *स्स्वपि न्मुह्ति नराःडितबुद्धयः ||* 


 *--జగద్గురుశ్రీ శ్రీ భారతీ తీర్థ* 

 *మహాస్వామి వారు*

కర్పూరం కథ

 *మనం పూజలో వాడే కర్పూరం కథ తెలుసా.*


🚩🚩🚩🚩🚩🚩🚩🚩


🌸కర్పూరం భారతీయులు ఎక్కువగా పూజాది కార్యక్రమాల్లో వాడే పదార్థం. ఇది అన్ని రకాల ఆర్థరైటిస్, రుమాటిక్ నొప్పుల నివారిణిగా, నరాల సంబంధమైన సమస్యలు, వీపు నొప్పి నివారణకి కర్పూరం బాగా పనిచేస్తుంది. నాసికా సమస్యలకు యాంటిసెప్టిక్గా కర్పూరాన్ని ఉపయోగిస్తారు. కర్పూరం కాలుష్యాన్ని పోగొట్టి, వాతావరణాన్ని స్వచ్ఛంగా మారుస్తుంది. కళ్ళకు మేలు చేస్తుంది కనుకనే కర్పూరాన్ని కాటుకలో వాడుతారు. అయితే కర్పూరంలో అనేక రకాలున్నాయి. వీటితో అనేక ప్రయోజనాలూ ఉన్నాయి. 


కర్పూరం ఎన్ని రకాలు?

🌸కర్పూరం చెట్టు గురించి కర్పూరంతో ఆరోగ్యం గురించి, కర్పూరం సువాసన గురించి తెలుసుకుందాం. కర్పూరం అనేది మనకి తెలిసినంత వరకు సుగంధం గానూ, కొన్ని వంటకాలలోనూ, పూజా కార్యక్రమాలలో దేవునికి హారతి ఇవ్వడానికి ఉపయోగిస్తారు. ఇది మైనములా తెల్లగానూ, పారదర్శకం గానూ ఉండే ఒక ఘాటైన వాసన గల పూజా ద్రవ్యము. ఇది రసాయనాలతో కృత్రిమంగా తయారయింది అనుకుంటారు చాలామంది. కానీ, కర్పూరం చెట్టు నుండి ఉత్పత్తి అవుతుంది అన్నది అక్షర సత్యం. కర్పూరం కాంఫర్ లారెల్ లేదా సిన్నమొముం క్యాంఫొర (కుటుంబం: లారేసీ ) అనే చెట్టు నుండి లభ్యమవుతుంది.


🌸కర్పూరాన్ని ఆ చెట్ల ఆకులు, కొమ్మల నుండి తయారు చేస్తారు. అలాగే కొన్ని రకాలైన తులసి (కర్పూర తులసి) జాతుల నుండి కూడా కర్పూరాన్ని తయారుచేస్తారు. కర్పూర చెట్ల కాండం మీద గాట్లు పెడతారు. ఆ గాట్ల లోంచి పాలు వస్తాయి. ఆ పాలతో కర్పూరం తయారౌతుంది. కర్పూరం చెట్టు వంద అడుగుల వరకూ పెరిగే సుందరమైన నిత్య హరిత వృక్షం. చక్కని సువాసన కలిగిన పట్ట కలిగి ఉంటుంది. ఆకులు పొడవుగా ఉండి ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాలతాయి. పువ్వులు చిన్నవిగా ఉంటాయి.. పండ్లు ముదురు ఆకుపచ్చని రంగులో ఉండి అక్టోబర్లో పక్వానికి వస్తాయి. ఈ చెట్లు చైనా, జపాన్ దేశాల్లో విస్తారంగా పెరుగుతాయి. మన దేశంలో వీటిని నీలగిరి కొండల్లో పెంచుతారు. అలాగే మైసూర్ లోనూ, మలబార్ ప్రాంతంలోనూ కర్పూరం చెట్లు కనిపిస్తాయి.


కర్పూరం చాలా రకాలుగా ఉంటాయి. ఒక్కో రకం ఒక్కో విధంగా ఉపయోగ పడుతుంది. పచ్చ కర్పూరం: 

కర్పూరం చెట్టు వేర్లు, మాను, కొమ్మలను నీళ్లలో వేసి మరిగించి, డిస్టిలేషన్ పద్ధతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చకర్పూరం అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడుకోవచ్చు. దీనిని ఎక్కువగా వంటలలో వాడతారు. కాటుకని ఈ పచ్చ కర్పూరం తోనే చేస్తారు.


హారతి కర్పూరం:

టర్పంటైన్ నుంచి రసాయనిక ప్రక్రియ ద్వారా తయారు చేసే కృత్రిమ కర్పూరాన్ని హారతి కర్పూరం (C10H16O) అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడకూడదు.


రస కర్పూరం: 

చిన్న పిల్లలకి ఒంట్లో ఉన్న దోషాలు పోవడానికి ఆముదంతో కలిపి కర్పూరం పట్టిస్తారు. దానిని రస కర్పూరం అంటారు.


భీమసేని కర్పూరం: 

సహజంగా మొక్క నించి తయారుగా లభించే కర్పూరాన్ని భీమసేని కర్పూరం లేదా అపక్వ కర్పూరం అంటారు. దీనిని ఔషధ ఉపయోగాల కోసం విరివిగా వాడుతూ ఉంటారు.


సితాభ్ర కర్పూరం: 

ఇది తెల్లని మేఘం లాగా కనిపిస్తుంది కనుక దీనికి ఆ పేరు వచ్చింది.


హిమవాలుక కర్పూరం: 

ఇది మంచులాంటి రేణువుల్లా ఉంటుంది.


ఘనసార కర్పూరం: 

ఇది మేఘం లాంటి సారం కలిగి ఉంటుంది.


హిమ కర్పూరం:

ఇది మంచులాగా చల్లగా ఉంటుంది.


ఇవే కాక ఉదయ భాస్కరము, కమ్మ కర్పూరము, ఘటికము, తురు దాహము, హిక్కరి, పోతాశ్రయము, పోతాశము, తారాభ్రము, తుహినము, రాత్రి కరము, విధువు, ముక్తాఫలము, రస కేసరము, ప్రాలేయాంశువు, చంద్ర నామము, గంబూరము, భూతికము, లోక తుషారము, శుభ్ర కరము, సోమ సంజ్ఞ, వర్ణ కర్పూరం, శంకరావాస కర్పూరం, చీనా కర్పూరం అని చాలా రకాల కర్పూరాలున్నాయి. కర్పూరం వలన అనేక ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. ఆయుర్వేద చికిత్సలో కర్పూరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అసలు కర్పూర సువాసన పీలిస్తే చాలు శారీరక రుగ్మతలన్నీ పోయినట్లు, సేద తీరినట్లు ఉంటుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది.


కర్పూరంతో కొన్ని ముఖ్యమయిన ఆరోగ్య లాభాలు:

* గుండె సమస్యలు, అలసట సమస్యలకు కొద్ది మొత్తం కర్పూరం వాడితే ఫలితముంటుంది.


* అన్ని రకాల ఆర్థరైటిస్, రుమాటిక్ నొప్పుల నివారిణిగా, నరాల సంబంధమైన సమస్యలు, వీపు నొప్పికి కూడా ఇది బాగా పనిచేస్తుంది.


* పుండ్లు మానడానికి, పిల్లలకు గజ్జి, బొబ్బలు తగ్గడానికి, బ్రాంకయిటిస్, పలు రకాల ఇన్ఫెక్షన్లకు కర్పూరం ఉపయోగిస్తారు.


* నాసికా సమస్యలకు యాంటిసెప్టిక్ గా కూడా దీనిని ఉపయోగిస్తారు. 


* కర్పూరం నూనెలో దూదిని తడిపి లెప్రసీ వ్యాధి వల్ల ఏర్పడిన గాయం మీద ప్రయోగిస్తే త్వరితగతిన మానుతుంది.


* కాలుష్యాన్ని పోగొట్టి, వాతావరణాన్ని స్వచ్ఛంగా మారుస్తుంది.


* అంటువ్యాధులు ప్రబలకుండా చేస్తుంది.


* కళ్ళకు మేలు చేస్తుంది కనుకనే కాటుకలో దీనిని వాడతారు.


* మానసిక జబ్బులను సైతం పోగొడుతుంది.


* జలుబును, కఫాన్ని తగ్గిస్తుంది.


* అలజడులు, ఆందోళనలు తగ్గించి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తుంది.


* పురుగుల మందులు, చెడు వాసనల నిర్ములానికి, బట్టలను కొరికి తినే చెద పురుగులు నిర్ములనకు ఉపయోగిస్తుంటారు

🚩🚩🚩🚩🚩🚩🚩🚩

పౌర బాధ్యతలు

 *పౌర బాధ్యతలు -  ఎన్నికలు*




భారత దేశ పౌరులమైన మనకు స్వాతంత్రము వచ్చి   ఇప్పటి వరకు   77 సంవత్సరాలు, 75 గణతంత్ర దినోత్సవములు జరుపుకొని ఉన్నాము. ఇంత సుదీర్ఘ కాలం తర్వాత గూడా మనం అనుకున్నంత, కావల్సినంత పౌర కర్తవ్య భావన (Civic sense) పెంచుకోలేదేమో అన్న అభిప్రాయం కలుగుతున్నది. 


నాయకులు (వారూ  పౌరులే) ఉద్యమ కాలంలో మరియు ఎన్నికల సమయాలలో గొప్ప గొప్ప ఆదర్శాలు, ఆకర్షిత తాయిలాలు ప్రకటించి జనాలను మభ్య పెట్టడం, తీరా అధికారంలోకి వచ్చాక నాయకుల (అధిక శాతము) ధోరణి మరియు ఆచరణ వారి పూర్వ వాగ్దానాల ప్రకారం ఉండకపోవడం సర్వ సాధారణమైనది. 


నాయకుల (అధిక శాతము) మాటలకు, వాగ్దానాలకు మోసపోవడం సామాన్య  ప్రజల అమాయకత్వమా, లేక వారి వ్యక్తిగత స్వార్థమా, ఏది ఏమైనా సమాజం అంధకారంలోనే ఉన్నదను విషయము నిర్వివాదాంశము. *దేశ అభివృద్ధి, భద్రత మరియు భవిష్యత్తు గురించి ఏమాత్రము ఆలోచించని బాధ్యతా రాహిత్య మనుగడనే అధికులు ఇంకా కొనసాగిస్తున్నారన్నది రుజువైన పరమ సత్యము*. ఇందుకు నిరక్ష్యరాస్యులు మరియు అక్షరరాస్యులు సమాన బాధ్యత వహించాల్సి ఉంటుంది.


నిరక్షరాస్యులు (illiterate) తమ స్వార్థ మరియు తాత్కాలిక ప్రయోజనాలశించి, సుదీర్ఘ దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టే  ప్రలోభాలకు లొంగడము, అనర్హులను ఎన్నుకోవడము. అక్షరరాస్యులు (educated) దేశ   పరిపాలనా సౌలభ్యము తద్వారా అభివృద్ధి మరియు భద్రత కొరకు అనువైన ఎన్నికలను నిర్లక్ష్యము చేయడం, క్షమించరాని తప్పిదమే గాకుండా ఇటువంటి నిర్లక్ష్య చర్య దేశానికి అరిష్టమే. *మనం పౌర ధర్మాలను, కర్తవ్యాలను పాటించడం లేదను విషయానికి వేరే (ఇతర)  నిదర్శనాలెందుకు*.


.

కనకధారా స్తవం*

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝   *నమోఽస్తు దేవ్యై భృగునందనాయై*

       *నమోఽస్తు విష్ణోరురసి స్థితాయై*,

       *నమోఽస్తు లక్ష్మి కమలాలయాయై*

       *నమోఽస్తు దామోదర వల్లభాయై*. (14)


               { _/  *కనకధారా స్తవం* _/ } 


తాత్పర్యం: పుత్రికయు, విష్ణువు యొక్క వక్షఃస్థలంలో నెలకొన్నదియు, పద్మాసనాసీనురాలు, కేశవుని ప్రియురాలగు లక్ష్మీదేవికి వందనాలాచ రిస్తున్నాను.

ఆకులు చెప్పిన పాఠాలు."*

 *"ఆకులు చెప్పిన పాఠాలు."*


*మామిడి ఆకు* - "ప్రతీ శుభ కార్యంలోనూ నేను తప్పని సరి. నేను లేనిదే ఏ శుభకార్యం జరుగదు" అంది గర్వముగా. దేవుడు చిన్నగా నవ్వాడు. తలుపు గుమ్మానికి తల క్రిందులుగా వేలాడే శిక్ష విధించాడు.


*కరివేపాకు* - "వంటలలో నేను లేనిదే రుచి లేదు" అంది గర్వముగా. తినేటప్పుడు కరివేపాకుని ఏరి పార వేసే ఆలోచనను మనిషికి కలిగించాడు.


*అరటి ఆకు* - "ఈ మనుషులు భోజనం చేయడానికి నన్ను వాడతారు. నేను మీకంటే గొప్ప" అని అన్నది. దేవుడు ఆలోచించాడు. అరటి ఆకు తిన్న తరువాత దాని బ్రతుకు చెత్తకుప్పలో పడేటట్లు చేశాడు.


*తమలపాకు* -"నేను శుభ కార్యాలకే కాదు, నన్ను తాంబూలం గా వేసుకొంటే నోరు ఎర్రగా పండుతుంది. నాకు సాటి ఎవరూ లేరు" అన్నది. దేవుడు దాని పొగరు అణచాలను కొన్నాడు. తమలపాకు నమిలి రసం మ్రింగి, తరువాత బయటకు ఉమ్మేసేలా చేసాడు.


*తులసి ఆకు:* "నన్ను కూడా దేవుని పూజలో వాడతారు కానీ నా చివరి క్షణాలు దేవుని నిర్ణయం" అంది వినయంగా. దేవుడు సంతోషించాడు. తన మెడలో హారంగా, తన పాదాల చెంత తులసీదళంలా భక్తులు సేవించే తీర్ధంలో ఉండేటట్లుగా పవిత్ర జీవితం ఇచ్చాడు.


*నీతి* - "నేను, నా వల్లే," అనే అహంకారంతో ఉన్నవారు పతనం చెందుతారు. వినయంగా వున్నవారు ఉన్నత స్థానం పొందుతారు.


(సేకరణ)

_జూన్ 11, 2024_*

 ॐ శుభోదయం  ॐ 

 *ఓం శ్రీ గురుభ్యోనమః* 

     *_జూన్ 11, 2024_*  

*శ్రీ క్రోధి నామ సంవత్సరం*

*ఉత్తరాయణం*

*గ్రీష్మ ఋతువు*

*జ్యేష్ఠ మాసం*

*శుక్ల పక్షం*

తిథి: *పంచమి* సా5.48

వారం: *భౌమవాసరే*

(మంగళవారం)

నక్షత్రం: *ఆశ్రేష* రా12.24

యోగం: *వ్యాఘాతం* సా6.02

కరణం: *బాలువ* సా5.48

వర్జ్యం: *మ12.24-2.06*

దుర్ముహూర్తము: *ఉ8.04-8.56*

*రా10.53-11.37*

అమృతకాలం: *రా10.41-12.24*

రాహుకాలం: *మ3.00-4.30*

యమగండం: *ఉ9.00-10.30*

సూర్యరాశి: *వృషభం*

చంద్రరాశి: *కర్కాటకం*

సూర్యోదయం: *5.28*

సూర్యాస్తమయం: *6.29*

*లోకాః సమస్తాః*

  *సుఖినోభవంతు*

సంకల్పము

 *శుభోదయం*

*********

 సంధ్యావందనం 

మరియు ఇతర 

పూజాకార్యక్రమాల 

సంకల్పము.

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ 11.06.2024

మంగళ వారం (భౌమ వాసరే) 

********

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ  క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే

గ్రీష్మ ఋతౌ జ్యేష్ఠ మాసే శుక్ల పక్షే పంచమ్యాం

(సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

భౌమ వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర  ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ క్రోధి  నామ సంవత్సరే ఉత్తరాయణే

గ్రీష్మ ఋతౌ 

జ్యేష్ఠ మాసే  శుక్ల పక్షే పంచమ్యాం

భౌమ వాసరే అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.5.28

సూ.అ.6.30

శాలివాహనశకం 1946 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2081 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5125 వ సంవత్సరం. 

శ్రీ క్రోధి నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

గ్రీష్మ ఋతువు

జ్యేష్ఠ మాసం 

శుక్ల పక్షం

పంచమి సా.5.44 వరకు. 

మంగళ వారం. 

నక్షత్రం ఆశ్రేష రా.12.18 వరకు.

అమృతం రా. 10.35 ల 12.18 వరకు. 

దుర్ముహూర్తం  ఉ.8.04 ల 8.56 వరకు.

దుర్ముహూర్తం రా.10.53 ల 11.37 వరకు. 

వర్జ్యం మ. 12.19 ల 2.02 వరకు.

యోగం వ్యాఘాత సా. 6.00 వరకు. 

కరణం బాలవ సా. 5.44 వరకు. 

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం సా.3.00 ల 4.30 వరకు. 

గుళిక కాలం మ.12.00 ల 1.30 వరకు. 

యమగండ కాలం ఉ.9.00 ల 10.30 వరకు. 

***********   

పుణ్యతిధి జ్యేష్ఠ శుద్ధ పంచమి. 

********

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

*వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

వధూవరుల వివరాలకై సంప్రదించండి.

 80195 66579.

****************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.


ఈ రోజు పుట్టినరోజు  మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

🙏🙏🙏

జప మాలలు

 జప మాలలు  -  ఫలితాలు.


 * స్వచ్చమైన స్పటిక మాలతో జపం చెస్తే రాజ్యాధికారం, లభించును. సర్వ భోగములు సిద్ధించును. గుణవంతులైన సంతానం లబించును.

 

 * ముత్యాల మాలతో జపం చేస్తే సర్వ శాస్రములు, సర్వ విద్యలు నాలుక పై తాండవ మాడును.

 

 * పగడ మాలతో జపం చేసిన లోకం లొని సమస్త మానవులు, జంతువులు, పశువులు, క్రూర జంతువులు ను వశీకరణం చేసుకొవచ్చు .

 

 * ఇంద్ర నీల మణుల మాలతో గాని , మరకత మణుల మాలతో కాని జపం చేయడం వలన శత్రు భయంకరులు అవుతారు.

 

 * బంగారు మాలతో జపం చేయడం వలన అష్టైశ్వర్యములు పొందుదురు.

 

 * మాణిక్య మాలతో జపం చేసిన వారు తాను కొరిన కన్యను పొందుదురు.

 

 * పాదరస గులికలతో  కూర్చబడిన మాలతో జపం చేసిన సమస్త ప్రయోజనములు పొందగలుగు శక్తి వంతులగురు .


  

         ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

భోజ కాళిదాస కథలలో

 భోజ కాళిదాస కథలలో ఎక్కువ కథలు భోజుడి ఔదార్యాన్నీ ,కాళిదాసు కవిత్వ మహాత్వాన్నీ ప్రశంసిస్తూ 

చెప్పేవి కొన్ని కథలలో కాళిదాసు యుక్తితో సమస్యల నుంచి తప్పించుకోవడం గురించి చెప్తారు.యిది అలాంటి కథ.


ఒక దూరదేశం లో దుర్యోధను డనే కవి వుండేవాడు.ఆయన కాళిదాసు కవిత్వము గురించీ ఆయన పొందుతున్న సత్కారాలను గురించీ విన్నాడు.భోజుడి రాజ్యం లో కాళిదాసునే భోజుడికంటేఎక్కువ గౌరవిస్తారానీ విన్నాడుదుర్యోధనుడు స్వయం గా మంచి విద్వాంసుడూ.కవీ దానికి తోడు మహా భక్తుడు,దేవీ ఉపాసకుడు కూడా.అయితేనేమి కొంచెం అసూయా పరుడు.కాళిదాసును మించిన కవిత్వం చెప్పాలనే కోరిక తో 

దేవిని గూర్చి తపస్సు చేశాడు.దేవి ప్రత్యక్ష మైంది.మాతా!నాకు కాళిదాసు ను మించిన కవితా పాటవాన్ని ప్రసాదించు.కాళిదాసును ఓడించాలని నాకోరిక. అని అడిగాడు..అప్పుడు దేవి భక్తా! నీ కోరిక లో ఈర్ష దాగి వుంది అది నీకు మంచిదికాదు.కాళిదాసు నా భక్తుడు.నా వరం తోనే మహా కవి యైన వాడు.ఆయన తో నీకు పోటీ కూడదు.అయినా తపస్సు చేసి నన్ను మెప్పించావు కాబట్టి,నీకు ఆ శక్తిని ప్రసాదిస్తున్నాను. కానీ 

రాబోయే పౌర్ణమి నాటికి భోజుడి ఆస్థానం చేరితే ఆ రోజు ఒక్కరోజు మాత్రమే ఆ శక్తి పనిచేస్తుంది. అని చెప్పి అంతర్ధాన మైంది.


సంతోషం తో తన పరివారాన్ని తీసుకొని ధారనగారానికి వెళ్లి నగర శివార్లలో విడిది చేసి 

  పొర్ణమి నాడు తను 

  రాజాస్థానానికి వస్తున్నానని కబురు పంపాడు.


ఆ సాయంత్రం కాళిదాసు రోజు లాగే కాళీమాతను పూజిస్తూండగా దేవి పలుకులు వినిపించాయి కాళిదాసా! రేపు మీ ఆస్థానం చేరబోతున్న దుర్యోధన కవికి ఈ ఒక్క రోజుకూ నేను నిన్ను ఓడించగల శక్తి ప్రసాదించినాను.ఈ ఒక్కరోజూ దుర్యోధనుడిని గెలవటానికి నేను ఏమీ సహాయం చేయలేను.నీ వేమయినా జాగ్రత్త పడతావేమో నని నిన్ను హెచ్చరిస్తున్నాను.అని చెప్పి మాయమై పోయింది.


.కాళిదాసు ఒక యుక్తి పన్నాడు.గడ్డి మోపులు అమ్మేవాడిలాగా వేషం వేసుకొని ఊరిబయట వున్నగుడారాలలో విడిది చేసిన దుర్యోధనుడి పరివారాల దగ్గరికి వెళ్లి గుర్రాలకు కావలిసిన మేత కారు చౌకగా అమ్మాడు.రాత్రయిపోయిందని సాకు చెప్పి అక్కడే వుండి పోయాడు. 


గుడారం లో దుర్యోధనుడికి నిద్ర పట్టలేదు,కాళిదాసుకూ  నిద్ర పట్టలేదు.యిద్దరికీ రేపేంజరుగుతుందో నని ఆందోళనా భయం.దుర్యోధనుడు తెల్లవారక ముందే తన గుడారం నుంచి బయటికి వచ్చిఅక్కడే తిరుగుతున్నాడు. 


కాళిదాసు అయన ప్రక్కన చేతులు కట్టుకొని నిలబడ్డాడు.పడమటి దిక్కున చంద్రుడు యింకా ప్రకాశిస్తున్నాడు.సూర్యోదయం యింక కాలేదు.పక్షుల కలకలా రావాలు అప్ప్దప్పుడే మొదలవుతున్నాయి.ప్రకృతి ఎంత అందం గా వున్నది. ఇదంతా  చూస్తుంటే నీ హృదయం స్పందించడం లేదా?అని అడిగాడు.దుర్యోధనుడు మారువేషం లో వున్న కాళిదాసును.గడ్డి అమ్ముకునే వాడిని నాకవన్నీ 

ఏమి తెలుస్తాయి?మీరే  ఏదైనా మంచి వర్ణన  చెప్పండి వింటాను అన్నాడు.అయితే విను

అంటూ ఈ శ్లోకం చెప్పాడు దుర్యోధన కవి.


 

చరమగిరి కురంగీ శృంగ కండూయనేన 

స్వపితి పునరిదానీం అంతరిందో:కురంగః 


అంటే అర్థ మయిందా?నీకు కాలేదనుకుంటాను నేను చెప్తాను అన్నాడు.చిత్తం అవసరం లేదండీ.కాళిదాసు గారి గుర్రాలకు కూడా నేనే గడ్డి అమ్ముతాను అక్కడి సేవకులతో మాట్లాడుతుంటాను.కాళిదాసుగారి కవిత్వం అప్పుడప్పుడూ వింటూ వుంటాను మరీ కఠిన  మైనవి అర్థం కావు కానీ ఇలాంటి చిన్న చిన్న శ్లోకాలు అర్థం చేసుకోగలను.అన్నాడు.దుర్యోధనుడు నివ్వెర పోయి ఏదీ చెప్పుచూద్దాం అన్నాడు.


చరమగిరీ అంటే పడమటి కొండ కురంగీ అంటే లేడి శృంగం అంటే క్మొమ్ము కండూయనం అంటే దురద పోయేలా హాయి కలిగించేలా మెల్లగా గీరటం.అంతరిందో:కురంగః అంటే ఆ చంద్రుని లోపల కనిపిస్తున్న లేడి.

(చంద్రుడికి హరిణాంకుడు అని పేరు.మధ్యలో హరిణం వున్నవాడు.అని అర్థం)వెరసి మీరనేది పడమటికొండ అనే లేడి తన కొమ్ములతో చంద్రుడి లో వున్న లేడికి హాయి గొలిపేలా గీరుతూ వుంటే అది నిద్రావస్థ లోకి యిప్పుడు జారుకుంటున్నది అని అంతే కదా కవిరాజా! అన్నాడు.అమాయకత్వం నటిస్తూ.ఆరి పిడుగా అని ఆశ్చర్య పోయాడు దుర్యోధనుడు.గడ్డి అమ్ముకునే వాడికే యింత పాండిత్యం వుంటే యిక ఆస్థానం లోని కవులేంతటి వారో అని అతనికి వణుకు పుట్టింది.పైకి మాత్రం డాంబికంగా చూశావాఅలంకారం యెంత బాగా వేశానో అన్నాడు దుర్యోధన కవి.

.అలంకారానికేమి స్వామీ అద్భుతం గా వున్నది.కాకపొతే నాదొక చిన్న సందేహం

'చరమగిరి కురంగీ' అన్నారు కదా!కురంగీ అంటే ఆడలేడి.ఆడ లేడికి కొమ్ములు వుండవు కదండీ మీరు యే భావం తో చెప్పారో వివరం చెప్పరా?అన్నాడు కాళిదాసు


.దుర్యోధనుడి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది.తను పప్పులో కాలేశాడు.వీడే తన కవిత్వం లో తప్పులు చూపిస్తున్నాడే అని కొంత ఆందోళన పెరిగింది.


పైకి మాత్రం ఆ ఏదో తెల్లవారు ఝాముననె నిద్రకళ్ళతో ఆశువుగా రెండు ముక్కలు చెప్పానులే నువ్వు కనుక్కో గలవో లేదో అని నిన్ను పరీక్షించ డానికి చెప్పాను అన్నాడు. 

 ఇది అద్భుతమైన ఊహండీ ఇలాంటి తప్పులు సవరించడం నేను కాళిదాసు గారి దగ్గర నేర్చుకున్నానండీ! మీరు నన్నుప్రోత్సహిస్తున్నారు కాబట్టి నేను దీన్ని సవరించి చెప్తానండీ మీకు నచ్చుతుందో లేదో తెలియదు.


.

మీ శ్లోకం లో కురంగీ కి బదులుగా 'తుండీ' అని మారిస్తే సరిపోతుందండీ తుండి అంటే ముట్టే అని అర్థం వస్తుంది కదండీ అందుకని సరిపోతుంది.మిగతా రెండు పాదాలూ చెప్పేయండి.అన్నాడు.


శ్లోకం పూర్తి  చెయ్యటం అంటే గడ్డిమోపులు అమ్మినంత సులభం కాదు.అలంకారం,ధ్వనీ రసం అన్నీ సరిచూసుకోవాలి కదా!వున్న పళాన చెప్పేది కాదు అన్నాడు.నిజమే లెండి అవన్నీ ఆలోచించి మీరు శ్లోకాన్ని ఎలా పూరిస్తారో నాకు తెలియదు కానీ నేను పూరిస్తాను చూడండి.  నేను  కాళిదాసు గారు పండితులతో ముచ్చటిస్తూ వుంటే  విని నాకూ కొంచె పూర్తి  చెయ్యటం అబ్బింది లెండి అని  ఈ శ్లోకం చెప్పాడు.

 


'పరిణత రవి గర్భ వ్యాకులా పౌరుహూతీ 

దిగపి ఘన కపోతీ హుంకృతై:క్రంద తీవః 


మీరు పడమటి దిక్కు గురించి రెండు పాదాలు చెప్పారు.తూర్పుదిక్కు గురించి మిగతా రెండు పాదాలూ 

చెప్తే సరిపోతుంది కదా! అని చెప్పాను..పౌరుహూతి అంటే తూర్పు దిక్కు కదండీ 'పరిణత రవి గర్భ వ్యాకుల'

అంటే సూర్యుడిని గర్భం లో వుంచుకొని నెలలు నిండిన వనితలా ప్రసవ వేదన తో కేకలు పెడుతున్నది కదండీ అదిగో 'ఘన కపోతీ హుంకృ తై క్రందతీ యివ" అంటే పక్షుల పెద్ద పెద్ద అరుపుల రూపం లో ఆమె ప్రసవ వేదన పడుతున్నట్లు అనిపించడం లేదూ?అంటూ అప్పుడే లేచి కలకలా రావాలు చేస్తున్న పక్షులను చూపించాడు.కాళిదాసు.శ్లోకం పూర్తయింది.


చరమగిరి కురంగీ తుండ కండూయ నేన

స్వపితి పునరిదానీం అంతరిందో:కురంగః 

పరిణత రవి గర్భ వ్యాకులా పౌర హూతీ 

దిగపి, ఘన కపోతీ హుంకృతై :క్రందతీవః 


పడమటి కొండ అనే ఆడ లేడి తన ముట్టెతో చంద్రుడిలో వుండే హరిణాన్ని  దానికి హాయి గోలిపేలా గీరుతున్నది.  ఇక  తూర్పుదిక్కు సూర్యుడిని తన గర్భం లో దాచుకొని నెలలు నిండిన వనిత ప్రసవ వేదన పడుతున్నప్పుడు చేసే ఆక్రందనల్లాగా పక్షుల కిలకిలా రావాలు అనిపిస్తున్నాయి. 


దుర్యోధనుడికి ఆ కవిత్వ సౌందర్యానికి ఒళ్ళు పులకరించింది.తనకు రాజాస్థానం లోపరాభవం తప్పదని 

భయం వేసి దేవీ కటాక్షం మీద కూడా నమ్మకం పోయి ఈ కవుల ముందు తాను  నిలువ లేనని పించి 

అప్పటికపుడే తన సేవకులందరినీ లేపేసి తెల్లవారక ముందే సపరివారం గా వూరు విడిచి వెళ్లి పోయాడు.


కాళిదాసు ' మాణిక్యవీణా ముపలాలయంతీం' అని అమ్మవారిని స్తోత్రం చేసుకుంటూ ఇల్లు చేరాడు. 


(భోజ కాళిదాసు కథలు చమత్కార శతం పుస్తకము నుండి)

తల్లి చేసిన పుణ్యం

 ☝️ శ్లోకం 

సుశీలో మాతృ పుణ్యేన

 పితృపుణ్యేన బుద్ధిమాన్ ।

ధార్మికో పూర్వపుణ్యేన

 స్వీయపుణ్యేన భాగ్యవాన్ ।।



భావం : ఏ వ్యక్తియైనా తన తల్లి చేసిన పుణ్యం వలన మంచి శీల సంపద కలవాడవుతాడు. తండ్రి చేసిన పుణ్యం వలన బుద్ధిమంతుడవుతాడు. తమ వంశపూర్వికులు చేసిన పుణ్యం వలన ధర్మాత్ముడవుతాడు. తాను స్వయంగా చేసిన పుణ్యం వలన ధనవంతు డవుతాడు.

పంచాంగం 11.06.2024 Tuesday.

 ఈ రోజు పంచాంగం 11.06.2024  Tuesday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం గ్రీష్మ ఋతు జ్యేష్ఠ మాస శుక్ల పక్ష: పంచమి తిధి భౌమ వాసర: ఆశ్రేష నక్షత్రం వ్యాఘాత యోగ: బాలవ  కరణం. ఇది ఈరోజు పంచాంగం.


పంచమి సాయంత్రం 05:31 వరకు.

ఆశ్రేష రాత్రి 11:41 వరకు.


సూర్యోదయం : 05:45

సూర్యాస్తమయం : 06:46


వర్జ్యం : మధ్యాహ్నం 11:34 నుండ 01:18 వరకు.


దుర్ముహూర్తం : పగలు 08:21 నుండి 09:13 వరకు తిరిగి రాత్రి 11:10 నుండి 11:54 వరకు.


అమృతఘడియలు : పగలు 09:57 నుండి 11:41 వరకు..


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.


యమగండం: పగలు 09:00 నుండి 10:30 వరకు.

 


శుభోదయ:, నమస్కార:

తిరుపతి ఆలయంలో రాయల విగ్రహాలు

 *మీకు తెలుసా?*

*శ్రీవారికి రాయలు  సమర్పించుకున్న ఆభరణాలు  ఎన్ని?* 

*తిరుపతి ఆలయంలో రాయల విగ్రహాలు ఎందుకు ఉన్నాయి?*

*రాయలవారు తిరుపతికి ఎన్ని సార్లు వచ్చారు*

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°° సువర్ణాక్షరాలతో లిఖించబడిన చరిత్ర....

దేశభాషలందు తెలుగులెస్స అని చాటిన కీర్తి....

వజ్రాలను వీధుల్లో రాసులుగా పోయించిన ఘనత....

సాహితీ సమరాంగణ సార్వభౌముడుగా ప్రఖ్యాతి....

కృష్ణదేవరాయల సొంతం !


విజయనగర సామ్రాజ్యాన్ని కృష్ణదేవరాయలు 1509 నుంచి 1529 వరకు జనరంజకంగా పాలించాడు.  అందుకే ప్రజలు రాయలవారిని దేవుడిగా భావించారు. కాగా రాయలవారు తిరుమల వెంకటేశ్వరస్వామిని మనసారా ఆరాధించాడు ! మొక్కులు చెల్లించుకున్నాడు. శ్రీనివాసుడికి అపురూప కానుకలు సమర్పించిన మహారాజుల్లో దేవరాయలది మొదటి వరస! 


👉తిరుమల దర్శనం - ఆభరణాలు 


రాయలవారు తన జీవితకాలంలో....1513 నుంచి  1521 మధ్యకాలంలో ఎనిమిది సార్లు  వెంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకున్నట్టు 

శాసనాలు ఆధారంగా తెలుస్తున్నది. తిరుమల  శాసనాల్లో మాత్రం  ఏడుసార్ల దర్శనం తాలూకు వివరాలు లభ్యం అవుతున్నాయి.  దర్శనం సమయంలో అత్యంత విలువైన  వెలకట్టలేని ఆభరణాలను శ్రీవారికి సమర్పించారని కూడా ఈ శాసనాలు చెబుతున్నాయి.


తిరుమల ఆలయంలో లభ్యమైన 1200కు పైగా శాసనాల్లో.... 50 శాసనాలు  కృష్ణరాయలవారికి సంబందించినవే. ఈ శాసనాలు తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఉన్నాయి. వీటిలో కృష్ణదేవరాయలుతో పాటుగా ఆయన దేవేరులైన తిరుమలాదేవి, చిన్నాదేవిల ప్రస్తావన ఉన్నది.


▪️మొదటిసారి దర్శనం


1513, ఫిబ్రవరి 10 వ తేదీన కృష్ణదేవరాయలు మొట్టమొదటిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంలో....


1 )  3.3 కేజీల నవరత్న కిరీటం,

2)  ముత్యాలు పొదిగిన మూడుపేటల కంఠహారం,

3)  25 వెండి హారతి పళ్లాలు

4 )శ్రీనివాసుడి ఏకాంతసేవలో ఉపయోగించే రెండు బంగారు గిన్నెలు దేవేరులైన చిన్నాదేవి, తిరుమలదేవిల సమేతంగా ప్రత్యేకంగా సమర్పించారు.


▪️రెండవసారి దర్శనం


1513, మే 2 వ తేదీన రెండు నెలల వ్యవధిలో కృష్ణదేవరాయలు రెండోసారి తిరుమలకు యాత్ర చేసాడు..ఈ సందర్భంలో


5 ) వజ్రాలు, కెంపులు, పచ్చలు, రత్నాలు పొదిగిన   

      662 గ్రాముల మొలతాడు

7) వైజ్రవైఢూర్యాలు పొదిగిన కత్తి,

8) 132 గ్రాముల నిచ్చకం కఠారి,

9) ముత్యాలతో కూడిన కఠారి,

10) వజ్రాల కఠారి,

11) 98 గ్రాముల వజ్రాల పతకం,

12) 168 గ్రాముల నిచ్చకం భుజకీర్తుల జోడు,

13) 205 గ్రాముల బంగారుపేట,

14)  276 గ్రాముల వజ్రాలమాల

15 ) 573 గ్రాముల వజ్రాల భుజకీర్తులు,

16)  ఉత్సవమూర్తులను అలంకరించేందుకు 380 గ్రాముల బరువైన మూడు వజ్ర కిరీటాలు

సమర్పించుకున్నాడు


▪️మూడవసారి దర్శనం


 1513, జూన్‌ 13 వ తేదీన  ఒక నెల  వ్యవధిలో దేవరాయలవారు మూడోసారి శ్రీవారిని దర్శించుకున్నాడు.

ఈ సందర్భంలో....


17) జతలకొద్ది బంగారు గిన్నెలు 

18) జతలకొద్ది నవరత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు

వీటితో పాటుగా 

19) నిత్య నైవేద్యాల  నిమిత్తం ఐదు గ్రామాలను   దానముగా రాసి ఇచ్చాడు


ఇదే సమయంలో ప్రతి ఏటా తమిళనెల  తైమాసంలో తన తల్లిదండ్రుల ఆత్మోద్ధరణ  కోసం  ఉత్సవం ప్రారంభించారు.


▪️నాల్గవసారి దర్శనం


1514, జులై 6 వ తేదీన తన జైత్రయాత్రలో భాగంగా  తిరుమలేశుని  నాల్గవమారు దర్శించుకున్నాడు. ఆ సమయంలో కృష్ణదేవరాయలు ఉదయగిరి కోటను జయించి విజయనగరానికి తిరిగివెళుతున్నాడు. తన  విజయానికి జ్ఞాపకంగా సతీ సమేతముగా శ్రీవారికి కనకాభిషేకం చేశాడు.

20)  30వేల బంగారు వరహాలతో ఈ అభిషేకం  

       గావించాడు.

21)  250 గ్రాముల బంగారు త్రిసరం దండ, రెండు    

        వజ్రాల కడియాలు ఇచ్చుకున్నాడు.


22)వేంకటేశ్వరుడి నిత్యారాధనకు తాళ్లపాక గ్రామాన్ని దానంగా రాసిచ్చాడు.

23) ముత్యాలు, పచ్చలు, వజ్రాలు పొదిగిన 225న్నర గ్రాముల చక్రపాదకం   తిరుమలాదేవి తరుపున సమర్పించడం జరిగింది.

 24 ) చిన్నాదేవి తరుపున  _

200 గ్రాముల వజ్రాలు పొదిగిన మూడు కంఠమాలలు,

25 ) నిత్య కైంకర్యాల కోసం ఓ గ్రామం,

సమర్పించడం జరిగింది.


▪️ ఐదవసారి దర్శనం


1515, అక్టోబరు 25 వ తేదీన రాయలవారు...

కళింగ వరకు తన విజయనగర సామ్రాజ్యం విస్తరించిన  శుభ సమయాన్ని పురస్కరించుకొని ఐదవసారి శ్రీనివాసుడి దర్శనం చేసుకున్నాడు.

ఈ విజయోత్సాహంలో


26) 27 కేజీల బరువున్న మకరతోరణాన్ని కానుకగా ఇచ్చాడు.


▪️ఆరవసారి దర్శనం


1517, జులై 2వ తేదీన....కళింగ

దేశాన్ని పూర్తిగా స్వాదీనపరుచుకుని  తిరుగులేని మహారాజుగా రాయలవారు  ఆరవసారి తిరుమల సందర్శించారు. ఈ సందర్బంగా....


27) వేంకటేశ్వరుడి ఆనంద నిలయానికి 30 వేల వరహాలతో బంగారు తాపడం చేయించాడు .

ఆనంద నిలయ గోపురానికి బంగారు తాపడం 1518 సెప్టెంబరు 9న పూర్తయింది

28) స్వామి వారికి ప్రత్యేకంగా బంగారు కంఠమాల 29) విలువైన బంగారు పతకం

సమర్పించుకున్నాడు


▪️పట్టపురాణులతో తన విగ్రహం


ప్రస్తుతం భక్తులు  తిరుపతి యాత్ర వెళ్లి   శ్రీవారిని దర్శించడానికి ముందు కృష్ణరాయమండపంలోకి ప్రవేశిస్తారు. ఈ మండపం కుడివైపున కృష్ణదేవరాయలు విగ్రహం తన దేవేరుల తో కలిసి ఉంటుంది. శ్రీచక్ర శుభనివాసుడికి ఈ విగ్రహాలు భక్తి పూర్వకంగా ప్రణమిల్లుతున్నట్టు ప్రతిష్టితులై కనిపిస్తారు. ఈ విగ్రహాలను  దేవస్థానం వారు  ప్రతిష్టించలేదు. కృష్ణదేవరాయలు  వారే  స్వయంగా  తన ఆరవసారి తన దర్శనంలో భాగంగా

ఆలయంలో ప్రతిష్టించుకున్నారు. తనకు అంతులేని సంపదను రాజ్యాన్ని ఇచ్చిన శ్రీవారి చెంతన తాను శాశ్వతంగా మిగిలిపోయి  తిరుమల వైభవాన్ని మహిమను చాటుతూనే ఉండాలనే ఉద్దేశంతో రాయలు వారు  విగ్రహరూపంలో  ఇక్కడ మిగిలిపోయారు.రాజైనా మహారాజైనా దేవుడి ముందు దాసోహులే కదా! 


▪️ఏడవసారి దర్శనం


518, అక్టోబరు 16 వ  తేదిన దేవేరి తిరుమలాదేవితో కలిసి రాయలవారు  ఏడవమారు తిరుమలకు వచ్చాడు. కమలాపురం శాసనాల్లో ఈ సమాచారం ఉన్నది.ఈ యాత్రకు సంబంధించిన ఆధారాలు తిరుమల శాసనాల్లో లేవు కాబట్టి, ఈ సందర్బంగా సమర్పించుకున్న  కానుకల వివరాలు  లభ్యం కావడం లేదు.


▪️ఎనిమిదవసారి దర్శనం


క్రీ.శ. 1521, ఫిబ్రవరి 17 వ తేదీన కృష్ణదేవరాయలు  తిరుమల శ్రీవారిని ఎనిమిదవమారు 

దర్శనం  చేసుకున్నాడు. ఈ సందర్భంలో...


30) రత్నాలు పొదిగిన వింజామర..

31) 31 కేజీల 124 గ్రాముల మకర తోరణం 

32) నవరత్న ఖచిత పీతాంబరం..

33) 10 వేల బంగారు వరహాలు

34)  రత్నాలు, పచ్చలు, నీలాలు పొదిగిన కుళ్లాయి, సమర్పించుకున్నాడు.


👉స్వామివారి విశిష్టత


స్వామివారి విశిష్టత, తిరుమల వైభవం, రాయలు సమర్పించుకున్న ఆభరణాలు, ఈ మొత్తం వివరాలు

డా..సాదు సుబ్రమణ్యశాస్త్రిగారు తన 

 ""‘తిరుపతి శ్రీ వెంకటేశ్వర"" పుస్తకంలో రాసారు. ఈ పుస్తకం 1921లో ప్రచురించబడింది. ఈ పుస్తకం ప్రకారం పైన తెలిపిన ఆభరణాలు మాత్రమే  కాకుండా, వెలుగులోకి రాని మరెన్నో ఆభరణాలు ఉన్నట్టుగా తెలుస్తున్నది.🙏


సేకరణ  : *~శ్రీశర్మద*

8333844664 


సర్వేజనాసుఖినోభవంతు 🙏

మంగళవారం,జూన్ 11,2024

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హo*


మంగళవారం,జూన్ 11,2024

శ్రీ క్రోధి నామ సంవత్సరం

ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు

జ్యేష్ఠ మాసం - శుక్ల పక్షం

తిథి:పంచమి సా5.48 వరకు

వారం:మంగళవారం(భౌమవాసరే)

నక్షత్రం:ఆశ్రేష రా12.24 వరకు

యోగం:వ్యాఘాతం సా6.02 వరకు

కరణం:బాలువ సా5.48 వరకు

వర్జ్యం:మ12.24 -2.06

దుర్ముహూర్తము:ఉ8.04 - 8.56 మరల రా10.53 - 11.37.

అమృతకాలం:రా10.41 - 12.24

రాహుకాలం:మ3.00 - 4.30

యమగండ/కేతుకాలం:ఉ9.00 - 10.30

సూర్యరాశి: వృషభం

చంద్రరాశి: కర్కాటకం 

సూర్యోదయం:5.28

సూర్యాస్తమయం:6.29


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*పద్య కవితా శిల్పకళానిధి*

 *మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

 *మిట్టాపల్లి*

హనుమజ్జయంతి ప్రత్యేకం - 11/11

 ॐ         హనుమజ్జయంతి ప్రత్యేకం -  11/11

       (ఈ నెల 1వ తేదీ హనుమజ్జయంతి) 


XI. హనుమ - శ్రీరాముడు 


1.మొదటిసారి వచ్చి చూసి,  హనుమ పలికిన మాటలు విన్న శ్రీరాముని వ్యాఖ్య : 


    ఇట్టి గుణగణములు గల కార్యసాధకులైన దూతలు ఏ రాజువద్ద ఉంటారో, 

    ఆ రాజు కార్యములు ఆ దూతలచే నిర్వర్తించబడి సిద్ధిస్తాయి. 


ఏవం గుణగణైర్యుక్తా 

యస్య స్యుః కార్యసాధకాః I 

తస్య సిధ్యన్తి సర్వార్థా 

దూతవాక్యప్రచోదితాః ॥ 

             - కిష్కింధ 3/35 


2.సీతాన్వేషణకై వానర భల్లూక  సైన్యం నలుదిశలా పంపబడుతున్నప్పుడు,  హనుమగూర్చి శ్రీరాముడు : 


    మహాతేజశ్శాలియైన ఆ శ్రీరాముడు, 

    ఉద్యమము చేయడంలో చాల సమర్థుడైన ఆ హనుమంతుని చూచి, 

    ఇంద్రియములు మనస్సు ఆనందంతో నిండగా, 

    తన పని పూర్తి అయినట్లు భావించాడు. 

    పిమ్మట ఆ రాముడు సంతోషిస్తూ, 

    సీతకు ఆనవాలు కోసమై,    

    తన నామధేయం చెక్కిన ఉంగరాన్ని హనుమంతునకు ఇచ్చాడు.


తం సమీక్ష్య మహాతేజా 

వ్యవసాయోత్తరం హరిమ్ I 

కృతార్థ ఇవ సంవృత్తః 

ప్రహృష్టేన్ద్రియమానసః ৷৷ 

దదౌ తస్య తతః ప్రీత| స్వనామాఙ్కోపశోభితమ్ I 

అఙ్గులీయమభిజ్ఞానం 

రాజపుత్ర్యాః పరన్తపః ৷৷ 

          - కిష్కింధ 44/11,12 


3.సీతామాత జాడ తెలుసుకొనివచ్చిన హనుమ గూర్చి శ్రీరాముని ప్రశంస, సత్కారం : 


   "కార్యము చేయుటకై నియుక్తుడైన హనుమంతుడు ఆ పనిని సాధించినాడు. తనను ఏ మాత్రము తేలికపరచుకోలేదు. సుగ్రీవునకు సంతోషం కలిగించాడు. 

    హనుమంతుడు ఇప్పుడు సీతను చూచివచ్చి, నన్నూ రఘువంశమునూ, మహాబలుడైన లక్ష్మణునీ ధర్మానుసారము రక్షించినాడు. 

    కానీ నేను, ఈ ప్రియవార్తను చెప్పిన ఇతనికి తగు ప్రాయమును చేయజాలకున్నాను. 

    అదియే దీనుడనైన నా మనస్సును చాలా పీడిస్తోంది. 

    అట్టి మహాత్ముడైన హనుమంతునికి, ఈ సమయమున నేను, 

    నా సర్వస్వమైన ఆలింగనమును ఇస్తున్నాను."  


తన్నియోగే నియుక్తేన 

కృతం కృత్యం హనూమతా I 

న చాత్మా లఘుతాం నీతః 

సుగ్రీవశ్చాపి తోషితః ।। 

అహం చ రఘువంశశ్చ 

లక్ష్మణశ్చ మహాబలః I 

వైదేహ్యా దర్శనేనాద్య 

ధర్మతః పరిరక్షితాః ।। 

ఇదం తు మమ దీనస్య 

మనో భూయః ప్రకర్షతి I

యదిహాస్య ప్రియాఖ్యాతుః 

న కుర్మి సదృశం ప్రియమ్ ।।         

ఏష సర్వస్వభూతే 

పరిష్వఙ్గో హనూమతః I 

మయా కాలమిమం ప్రాప్య  

దత్తస్తస్య మహాత్మనః ।।

                   - యుద్ధ 1/10,11,12,13 


    హనుమని ప్రార్థిస్తూ, హనుమ చూపిన శ్రీరామ సేవా మార్గంలో పయనించి, స్వామి అనుగ్రహం పొందుదాం. 


               జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 


          జై హనుమాన్ జై జై హనుమాన్                    


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం 

        (86399 68383)

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - గ్రీష్మ ఋతువు - జే‌ష్ట మాసం - శుక్ల పక్షం  -‌ పంచమి  - ఆశ్రేష -‌‌  భౌమ వాసరే* (11.06.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*