11, జూన్ 2024, మంగళవారం

పౌర బాధ్యతలు

 *పౌర బాధ్యతలు -  ఎన్నికలు*




భారత దేశ పౌరులమైన మనకు స్వాతంత్రము వచ్చి   ఇప్పటి వరకు   77 సంవత్సరాలు, 75 గణతంత్ర దినోత్సవములు జరుపుకొని ఉన్నాము. ఇంత సుదీర్ఘ కాలం తర్వాత గూడా మనం అనుకున్నంత, కావల్సినంత పౌర కర్తవ్య భావన (Civic sense) పెంచుకోలేదేమో అన్న అభిప్రాయం కలుగుతున్నది. 


నాయకులు (వారూ  పౌరులే) ఉద్యమ కాలంలో మరియు ఎన్నికల సమయాలలో గొప్ప గొప్ప ఆదర్శాలు, ఆకర్షిత తాయిలాలు ప్రకటించి జనాలను మభ్య పెట్టడం, తీరా అధికారంలోకి వచ్చాక నాయకుల (అధిక శాతము) ధోరణి మరియు ఆచరణ వారి పూర్వ వాగ్దానాల ప్రకారం ఉండకపోవడం సర్వ సాధారణమైనది. 


నాయకుల (అధిక శాతము) మాటలకు, వాగ్దానాలకు మోసపోవడం సామాన్య  ప్రజల అమాయకత్వమా, లేక వారి వ్యక్తిగత స్వార్థమా, ఏది ఏమైనా సమాజం అంధకారంలోనే ఉన్నదను విషయము నిర్వివాదాంశము. *దేశ అభివృద్ధి, భద్రత మరియు భవిష్యత్తు గురించి ఏమాత్రము ఆలోచించని బాధ్యతా రాహిత్య మనుగడనే అధికులు ఇంకా కొనసాగిస్తున్నారన్నది రుజువైన పరమ సత్యము*. ఇందుకు నిరక్ష్యరాస్యులు మరియు అక్షరరాస్యులు సమాన బాధ్యత వహించాల్సి ఉంటుంది.


నిరక్షరాస్యులు (illiterate) తమ స్వార్థ మరియు తాత్కాలిక ప్రయోజనాలశించి, సుదీర్ఘ దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టే  ప్రలోభాలకు లొంగడము, అనర్హులను ఎన్నుకోవడము. అక్షరరాస్యులు (educated) దేశ   పరిపాలనా సౌలభ్యము తద్వారా అభివృద్ధి మరియు భద్రత కొరకు అనువైన ఎన్నికలను నిర్లక్ష్యము చేయడం, క్షమించరాని తప్పిదమే గాకుండా ఇటువంటి నిర్లక్ష్య చర్య దేశానికి అరిష్టమే. *మనం పౌర ధర్మాలను, కర్తవ్యాలను పాటించడం లేదను విషయానికి వేరే (ఇతర)  నిదర్శనాలెందుకు*.


.

కామెంట్‌లు లేవు: