11, జూన్ 2024, మంగళవారం

కొబ్బ‌రికాయ‌

 🥥🍌🥥🍌🥥

పూజా కార్య‌క్ర‌మాల‌కు కొబ్బ‌రికాయ‌ల‌ను, అర‌టి పండ్ల‌నే ఎక్కువ‌గా వాడ‌డాన్ని మీరు గ‌మ‌నించుంటారు. 

🥥🍌🥥🍌🍌

కొబ్బ‌రికాయ‌, అర‌టి పండ్లకు ప‌విత్ర‌మైన ఫ‌లాలుగా పేరు..పూర్వ‌కాలం నుండి వీటినే పూజా కార్య‌క్ర‌మాల్లో ఉప‌యోగిస్తూ వ‌స్తున్నారు. 


ఎందుకంటే ఈ రెండూ ఎంగిలికాని పండ్ల కేట‌గిరీలోకి వ‌స్తాయి. కాయ‌ల నుండి చెట్లుగా మారే క్ర‌మంలో మిగితా వాటికి వీటికి చాలా తేడా ఉంటుంది.


కొబ్బ‌రి_కాయ :


ఇత‌ర పండ్లు తిని గింజ‌ను నాటితే అవి మ‌ళ్లీ చెట్లుగా మార‌తాయి. ..కానీ కొబ్బ‌రి మాత్రం మొత్తంగా నాటితేనే మ‌రో చెట్టును ఇస్తుంది.. ఎంగిలి ప‌డ‌ని పండు మాత్ర‌మే కొత్త చెట్టును ఇస్తుంద‌న్న‌మాట‌!


అర‌టి:


అర‌టి కూడా అంతే పండు తిని కేవ‌లం తొక్క‌తో కొత్త చెట్టును పుట్టించ‌లేము…మొత్తంగా నాటితేనే కొత్త అర‌టి వ‌స్తుంది.


కాబ‌ట్టి ఎంగిలి ప‌డ‌ని ఈ పండ్ల‌ను ప‌విత్ర‌ఫ‌లాలుగా భావించి దేవుడికి స‌మ‌ర్పిస్తార‌ట‌.

🥥🍌🥥🍌🥥

కామెంట్‌లు లేవు: