11, జూన్ 2024, మంగళవారం

దశవిధ స్నానాలు

 💦💦 *దశవిధ స్నానాలు* 💦💦


1.నదీజల స్నానం:-

దేహ పరిశుభ్రత కోసం చేయు స్నానం.

2.మంత్ర స్నానం:-

మార్జన మంత్రాలతో మార్జనమును జరుపుకొనుట.

3.పార్థివ స్నానం:- 

పవిత్ర ప్రదేశముల యందలి  మృత్తికలను దేహమునకు రాచుకొనుట.

4.ఆగ్నేయ స్నానం:- 

త్రాయుషం జమదగ్నే హి యను మంత్రముల చే  భస్మమును దేహం నిండా పూసుకొనుట. 

5. వాయవ్య స్నానం:-

గోవుల గిట్టలచే వెలువడిన ధూళిని దేహమునకు పూసుకొనుట.

6.దివ్య స్నానం:-

ఉత్తరాయణంలో ఎండ కాయుచున్నప్పుడు  వర్షము కురిసిన యెడల ఆ వర్షము నందు స్నానము ఆచరించుట.

7.సారస్వత స్నానం:-

వేద వేత్తలగు పండితులతో "నీవు స్నాతుడవు అయితివి" అని చెప్పబడుట.

8..మానస స్నానం:-

నిర్మల చిత్తముతో భగవంతునితో ధ్యానింపుట.

9. ధ్యాన స్నానం:-

విష్ణు లేక విప్ర పాదోదకములతో గానీ, తులసీ మిశ్రిత జలములతోగానీ, ప్రోక్షింపుకొనుట.

10.కపిల స్నానం:- 

తడిగుడ్డతో దేహమును తుడుచుకొనుట.

కామెంట్‌లు లేవు: