28, జూన్ 2023, బుధవారం

తొలి ఏకాదశి

 _*🚩 తొలి ఏకాదశి , శయన ఏకాదశి🚩*_


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


*తొలి ఏకాదశి అంటే ఏమిటి , ఎందుకు చేసుకుంటారు , దీని విశిష్టత ఏంటి ?*


హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది.  తెలుగు సంవత్సరంలో అన్ని పండగలను వెంటపెట్టుకోచ్చే తొలి ఏకాదశి విశిష్టత ఏంటో తెలుసుకుందాం.


తొలి ఏకాదశి అంటే ఏమిటి

ఆషాడ శుద్ధ ఏకాదశిని *“తొలి ఏకాద‌శి”* అంటారు. సంవత్సరం మొత్తం మీద వచ్చే 24 ఏకాదశులు (ప్రతీ నెల కృష్ణ పక్షంలో ఒకటి , శుక్ల పక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశులు వస్తాయి.) ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంటాయి. ఏకాదశి అంటే పదకొండు అని అర్థం. మనకు ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు , ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయించే అంతరేంద్రియం అయిన మనసు కలిపితే పదకొండు. ఈ పదకొండు ఏకోన్ముకంగా పనిచేసే సమయమే ఏకాదశి.


తొలి ఏకాదశి – విశిష్టత

ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా (ఆషాఢ శుద్ధ ఏకాదశిగా) జరుపుకుంటారు. దీనినే *“శయన ఏకాదశి , ప్రధమ ఏకాదశి”, “హరివాసరం”* అని కూడా అంటారు. ఈ రోజు నుంచీ శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధి యందు శేషపాన్పు పైన శయనిస్తాడు. కనుక దీన్ని *“శయన ఏకాదశి”* అంటారు. నిజానికి ఒకరకంగా పరిశీలిస్తే , ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు , సూర్య చంద్రులు , గ్రహాలు పరస్పర సంబంధాన్నీ , వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈరోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు ( సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు , ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది). అంతేగాక చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని , కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని పురాణాలు చెబుతున్నాయి.


*తొలి ఏకాదశి జరుపుకొను విధానం , నియమాలు*


మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత , అశ్వమేధ యాగం చేసినంత , అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి. మహాసాధ్వీ సతీ సక్కుభాయి ఈ వ్రతాన్నే ఆచరించి మోక్ష సిద్ధి పొందటం జరిగింది. వ్రతంలోని ప్రధాన నియమాలు.


*ఉపవాస ఫలితాలు:*


ఈ వ్రతాన్ని ఆచరించదలచినవారు దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. 


అసత్యమాడరాదు. స్త్రీ సాంగత్యం పనికి రాదు. కాని పనులు , దుష్ట ఆలోచనలు చేయకూడదు. 


ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. 


అన్నదానం చేయడం చాలా మంచిది. 


*ఏకాదశి వ్రతమాచరించేవారు ఇవి తినరాదు.*


ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి , శుచిగా స్నానమాచరించి , శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు , కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి.


ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి , మాంసాహారం , పుచ్చకాయ , గుమ్మడి కాయ , చింతపండు , ఉసిరి , ఉలవలు ,  మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించారు. అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ , ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ , మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొన్నారని చెప్తుంటారు.


ఈరోజు నుండి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు *‘చాతుర్మాస్య వ్రతం’* అవలంబిస్తారు. శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది , ఈ చాతుర్మాస్య వ్రత నియమం. ఏకాదశినాడు ఉపవసించి , మర్నాడు పారణ చేసి , ప్రసాదం తీసుకొని వ్రతం ముగిస్తారు. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి , అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని , పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని , ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు. తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి , అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి , ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు. 


*తొలి ఏకాదశి రోజున శేషసాయిని పూజిస్తే..*


ప్ర‌తినెలా వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఈ మాసంలోనే బోనాలు , పశుపూజ , శకట ఆరాధనలు చేస్తారు.


*ప్రాశస్త్యం*


ముఖ్యంగా ఆషాఢమాసం వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటి పూట భోంచేసి , శేషశాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం. ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి , రాత్రికి జాగారం చేసి , మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేస్తారు.

🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏


 

అద్భుతం

 


మహా అద్భుతం.ఇది వినాలంటే ఎన్నో కోట్ల జన్మలు పుణ్యం ఉండాలని చెబుతారు. ఇది డిలీట్ చెయ్యకండి.వీలయినంత ఎక్కువసార్లు ప్రతినిత్యం వినడానికి ప్రయత్నం చెయ్యండి.      ఇది  శ్రీరామ గద్య.  రోజుకొకసారి వింటే చాలు మీ ఆరోగ్యంలో ఉన్న ఎటువంటి లోపాలనైన నయం చేయగలదని రుగ్వేదంలో రాయబడింది. దయచేసి మీరు వినండి మరియు మీ మిత్రులకు కూడ పంపండి .

గగన విహారం

 అది ఒక మారుమూల పల్లె ఆ ఊరికి బస్సుకూడా రాదు.  అక్కడికి దగ్గర్లో వున్న వూళ్ళో బస్సు దిగి ఒక అర గంట నడిస్తేకాని ఆ పల్లెకు చేరుకోలేము.  చుట్టూరా అడవి.  వూరు ప్రక్కనే ఎప్పుడు పారె ఒక ఏరు.  ఊళ్లోని వారంతా ఆ యెట్లోకి వెళ్లే ప్రొద్దున్నే కాలకృత్యాలు చేసుకొని స్నానం చేసి వస్తారు. రామదాసు ఒక నడి వయస్సు వాడు.  ఒక చిన్న గుడిసెలో వుంటూ కూలి,నాలి చేసుకొని పొట్ట పోసుకుంటున్నాడు.  అతనికి పెద్దగా ఏమి ఆశలు లేవు.  కానీ ఎప్పుడైనా రైలు ఎక్కాలని మాత్రము అతని కోరిక. కానీ తానువున్న పరిస్థితిలో తన జీవితంలో రైలు ఎక్కలేనని తెలుసుకున్నాడు. జీవితం మాములుగ నడుస్తున్నది రోజులు గడుస్తున్నాయి. ఒకరోజుఎక్కడి నుండి వచ్చాడో కానీ ఒక సాధువు ఆ ఊరికి వచ్చి మర్రిచెట్టు క్రింద వున్నాడని అతను అందరికి వారికి జరిగినవి జరగబోయేవి చెపుతున్నాడని ఊరంతా కోడై కూస్తే రామదాసు కూడా ఆ సాధువుని చూడటానికి వెళ్ళాడు. రామదాసుని చూడగానే ఆ సాధువు అతని జీవితంలో జరిగినసంఘటనలు చెప్పి నీకు రైలు ప్రయాణం చేయాలని  వుంది అవునా అన్నాడు.  దానికి రామదాసు ఆశ్చయపోయి అవును స్వామి నాకు నిజంగా రైలు ఎక్కాలని వుంది నేను నా జీవితంలో రైలు ఎక్కగలనా అని అతృతతో అడిగాడు.  దానికి ఆ సాధువు అతని కుడి చేయిని పరిశీలనగా చూసి నొసలు చిట్లిచ్చాడు.  రామదాసు ఆశ కాస్త అడియాస ఐయ్యింది.  వెంటనే ఆ సాధువు నీవు రైలుఎక్కుతావు అంతే కాదు విమానం కూడా ఎక్కుతావు అని చెప్పాడు.  వెంటనే రామదాసు పెద్దగా నవ్వాడు. ఏమిటి స్వామి రైలు ఎక్కటానికి పైసలు లేని నేను విమానం యెట్లా ఎక్కుతాను అన్నాడు.  నాయన నేను నీ జాతకంలో వున్నది చెప్పాను.  నీవు నమ్మితే నమ్ము లేకపోతేలేదు కానీ ఒక్క విషయం నేను చెప్పింది ఇంతవరకు జరగకుండా ఎన్నడు లేదు.  నిజమే ఆ స్వామి తనగూర్చి చెప్పినవన్నీ నిజానికి చూసినట్లుగా చెప్పాడు అటువంటప్పుడు తాను ఎందుకు తప్పు చెపుతాడు అని అనుకున్నాడు.  తన చుట్టూ ప్రక్కల వున్నవారు కూడా అది విని రామదాసు విమానం ఎక్కుతాడు అని అనటం మొదలు పెట్టారు.  నిజానికి తాను విమానం ఎక్కుతాడో లేదో కానీ ఆ నిమిషంలో మాత్రం రామదాసు మనసు గాలిలో తేలిపోసాగింది.  ఆ నోటా ఆ నోటా పడి ఊరంతా ఆ వార్త గప్పుమన్నది.  ఆ రోజునించి వూళ్ళో వారంతా రామదాసుని ఏదో తెలియని ప్రత్యేకతతో చూడటం మొదలు పెట్టారు.  తాను విమానం ఎక్కటం విషయం దేముడికి తెలుసు కానీ రామదాసుకు మాత్రం విమానం ఎక్కిన దానికన్నా ఎక్కువ ఆనందంగా ఉంది.  తాను రైలు ఎక్కలేదే మరి విమానం యెట్లా ఎక్కుతాను, నిజంగా విమానం ఎక్కుతాన ఎక్కుతే ఎక్కడ ఎక్కుతాను ఎక్కడికి పోతాను. నా దగ్గర అంత డబ్బు లేదే. ఇలాంటి ప్రశ్నలు రామదాసుని పట్టి పీడిస్తున్నాయి.  రోజులు గడుస్తున్నాయి.  ఒక రోజు పెద్ద వర్షం వచ్చింది ఏదో పనిమీద రామ దాసు యేరు దాటి ప్రక్క ఊరికి వెళ్ళాడు.  ఆ వూరు చాల పల్లంగా ఉంటుంది.  రామదాసు వూరు దాదాపు ఒక కొండ లాగ ఉంటుంది.  కాబట్టి యెంత పెద్ద వాన వచ్చినా ఏరుకి వరద వచ్చినా వాళ్ళ ఊరికి యే ప్రమాదం లేదు.  కానీ రామదాసు వెళ్లిన వూరు చాలా పల్లంలో ఉండటంలో తరచూ ఆ ఊరికి యేటి వరద తాకిడికి గురి అవుతుంది.  రామదాసు సాయంత్రం కల్లా తిరిగి వద్దామని ఊరికి వెళ్ళాడు కానీ వచ్చే రప్పుడు యేరు ఉర్రుతలు వూగుతున్నది తాను ఎక్కిన పడవ అటు ఇటు వుగ సాగింది పడవలో వున్న వారంతా దేముడిని తలుచుకుంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వున్నారు. ఒక్క నిమిషములో పడవలోకి నీరు వచ్చి పూర్తిగా పడవ మునిగి పోయింది.  పడవలో వాళ్లంతా నీటిలో కొట్టుకొని పోయారు.  ఎవరికి ఎవరు కనపడటం లేదు అంతా పెద్దగా అరుస్తున్నారు. రామదాసు కుడా వరద ఉధృతికి కొట్టుకొని పోయాడు.  ఈత సరిగా రాదు కానీ ప్రాణాలు కాపాడుకోవటం కోసం చేతనైనంత వరకు ఈత కొట్టి,కొట్టి అలసి పోయాడు.  ఏమైందో ఏమో తెలియతు ఎంతసేపు తానూ నీళ్లలో వున్నది తెలియదు. పూర్తిగా చీకటి మగత నిద్రగా వుంది కాపాడమని అరవటానికి కూడా నోరు రావటంలేదు.  అయోమయం తాను బ్రతికి వున్నది మరణించింది కుడా తనకి తెలియటం లేదు.  ఏమిటి ఈ వింత యెంత సేపు ఆలా గడిచిందో ఏమో రామదాసుకి తెలియదు తన మీద ఏదో ఒక వస్తువు పైనుంచి వ్రాలాడుతూ తాకుతున్నట్లు అనిపిస్తుంది. కళ్ళు తెరిచే శక్తి కూడా లేదు.  అతి కష్టంగా కళ్ళు తెరిచి చూసాడు  కడుపులో ఆకలి దంచుతున్నది.  వంట్లో ఏమాత్రము శక్తి లేదు. కళ్ళు తెరవంగానే సూర్య భగవానుడు తన ఉగ్ర రూపంతో ప్రత్యక్షమైనాడు.  టైం దాదాపు పది పదకొండు కావచ్చు, తాను ఒక చిన్న రాతి కొండపై వున్నాడు చుట్టూరా  నీళ్లు. పైనించి ఒక తాటి నిచ్చెన వ్రాలాడుతున్నది.  దానిని చూడంగానే రామదాసుకి ప్రాణం లేచి వచినట్లయింది.  అది పైన ఎగురుతున్న మిలిటరీ విమానం నుంచి వ్రాలాడుతూ వున్నది.  ఆ విమానం తన చుట్టూ తీరుగుతూ వున్నది. అతి కష్టంమీద ఆ తాటి నిచ్చనని పట్టుకో గలిగాడు రామదాసు. తాను ఆ తాటి నిచ్చనని పట్టుకోవటమే ఆలస్యం అది వెంటనే పైకి పోవటంమెదలైయింది.  ఒక్క నిముషంలో రామదాసు తాటితో పాటు విమానంలోకి వెళ్ళాడు. ఇద్దరు మిలటరీ వాళ్ళు రామదాసు రెండు చేతులని పట్టుకొని విమానంలోకి తీసుకుని విమానం తలుపు వేశారు.  అప్పుడు రామదాసుకి గతంలో సాధువు చెప్పిన జోస్యం జ్ఞ్యాపకం వచ్చింది.  నిజమే తానూ నిజంగా విమానం ఎక్కాడు. రామదాసు తనను తానూ గిల్లుకొన్నాడు అది కల నిజామా అని, నిజమే.  రామదాసుని ఆ మిలటరీ వాళ్ళు తాను ఎలా వరదలో కొట్టుకొని పోయంది అడిగారు.  రామదాసు జరిగిందంతా చెప్పాడువాళ్ళు రామదాసుని ఒక పెద్ద ఊరికి తీసుకొని వెళ్లారు.  వాళ్లే రామదాసుని ఆ వురి రైల్వే స్టేషనుకి తీసుకొని వెళ్లి తన ఊరికి ఎలా వెళ్లాలో చెప్పి రామదాసు ఊరికి దగ్గర్లోని రైల్వే స్టేషన్కి టిక్కెటు కొని యిచ్చి కొంత డబ్బు కుడా ఇచ్చి అక్కడనుండి తన ఊరికి ఎలా వెళ్లాలో చెప్పారు.  మరుసటి రోజు రామదాసు చస్తుపడుతూ తన వూరికిచేరాడు.  ఊళ్లోని వారంతా రామదాసు కూడా మిగిలిన వారితోపాటు పడవ ప్రమాదంలో చనిపోయాడని అనుకున్నారు. రామదాసు ఊర్లోని వాళ్ళకి జరిగిందంతా చెప్పాడు. సాధువు చెప్పినట్లు రామదాసు విమాన ప్రయాణం చేసినందుకు రామదాసుతో పాటు వూరి వాళ్ళు కూడా ఆనందించారు.  అప్పటినుండి రామదాసుని  విమానం రామదాసు అని పిలవటం మొదలుపెట్టారు.  వరద పుణ్యమాని రామదాసుకి జీవిత కోరిక ఐన రైలు ప్రయాణం మరియు విమాన ప్రయాణం చేయగలిగాడు. 

వీక్షిణులకు విజ్ఞప్తి

 ప్రపంచవ్యాప్తంగా ఈ బ్లాగును వీక్షిస్తున్న పాఠకులకు కృతజ్ఞతలు.  రోజు రోజుకు పెరుగుతున్న వీక్షిణికుల సంఖ్య నాకు కొండత అండగా వుంది. దయచేసి మీరు మీ మీఅభిప్రాయాలను  కామెంట్ రూపంలో వ్రాయగలరు.  అది నాకు ఈ బ్లాగును ముందుకి తీసుకొని పోవటానికి సాయపడుతుంది.  మీరు సహృదయంతో  సూచనలను చేయ మనవి.  ఈ బ్లాగ్ తెలుగు  సాహిత్యలోకానిది మీరు దీనిలో భాగస్వాములు కండి.  

 


హనుమ రోజూ సరిగ్గా తిండైనా తింటున్నాడో లేదో  .... ఈ రోజు హనుమని భోజనానికి పిలుస్తున్నాను  .... నేనే స్వయంగా  వంటచేసి దగ్గర కూర్చుని తినిపిస్తాను అంది సీతమ్మ  .... పిలు పిలు .... నీకే అర్థం అవుతుంది అన్నాడు రామచంద్రుడు నవ్వుతూ.  అన్నట్టుగానే సీతమ్మ స్వయంగా వంటచేసి  .... హనుమను భోజనానికి పిలిచింది  .... తానే పక్కన కూర్చుని స్వయంగా వడ్డిస్తూ  .... కడుపునిండా తిను నాయనా  .... మొహమాటపడకు  అని చెప్పింది  ..

"సరేనమ్మా" అని చెప్పి హనుమ తలవంచుకుని భోజనం చేయసాగాడు  .... సీతమ్మ కొసరి కొసరి వడ్డిస్తోంది  .... హనుమ వద్దు అనకుండా .... వంచిన తల ఎత్తకుండా పెట్టినదంతాతింటున్నాడు.  .... కాసేపట్లో సీతమ్మ స్వయంగాచేసిన వంటంతా అయిపోయింది .... సీతమ్మ కంగారు పడి అంఃతపురవాసుల కోసం వండినవంటతెప్పించింది  .అదీ అయిపోయింది  .... తలవంచుకునే  ఆహరం కోసం నిరీక్షీస్తూన్నాడు ....  హనుమ  ఆవురావురమంటూ  .... సీతమ్మకి కంగారు పుట్టి .... "రోజూ ఏం తింటున్నావు నాయనా"  .... అని అడిగింది వినయంగా  ...

"రామ నామం తల్లీ"  .... వంచిన తలెత్తకుండా జవాబిచ్చాడు  హనుమ  .... సీతమ్మ త్రుళ్లిపడింది  .... నిరంతరం  రామనామం భుజించేవాడు  .... భజించేవాడు  .... శివుడొక్కడే గదా  .... సీతమ్మతల్లి తేరిపార జూసింది  .... అపుడు కనిపించాడు సీతమ్మకి  .... హనుమలో శంకరుడు  .... శంకరుడే హనుమ  .... నిత్యం రామనామం ఆహరంగా స్వీకరించే వాడికి  .... తాను మరి ఏమి పెట్టగలదు! 

సీతమ్మ ఒక అన్నపు ముద్దను పట్టుకుని  .... రామార్పణం అని ప్రార్థించి వడ్డించింది  .... ఆ ముద్దని  భక్తితో కళ్లకు అద్దుకోని స్వీకరించి  .... అన్మదాత సుఖీభవా అన్నాడు హనుమ త్రుప్తిగా  .... హనుమలోని పరమేశ్వరుడుకి భక్తితో నమస్కరించింది సీతమ్మతల్లి  ....

తొలి ఏకాదశి

  "తొలి ఏకాదశి!"* 


"మహావిష్ణువు" యోగ నిద్రకు ఉపక్రమించే రోజు. అందువల్ల ఈ ఏకాదశిని "తొలి ఏకాదశి" లేదా "శయన ఏకాదశి" అని అంటారు. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం మాసాలు ముగిశాక కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్ర లేస్తాడు. దీన్నీ చిలుకు ద్వాదశి , ఉత్తాన ద్వాదశి అని  అంటారు. అందుచేత ఈ నాలుగు మాసాలు విష్ణువుని ఎవరైతే అర్చిస్తారో వారికి హరిపద ప్రాప్తి కలుగుతుంది.

తొలి ఏకాదశి రోజు చాలా మంది ఉపవాసము ఉంటారు. పీఠాధిపతులు, మఠాధిపతులు, ఏటీశ్వరులు చాతుర్మాస్య వ్రతం ప్రారంభిస్తారు. 


మహావిష్ణువుకు అత్యంత ప్రేమ పాత్రమైన "తులశమ్మ" దగ్గర పద్మం ముగ్గువేసి, దీపం వెలిగించి, వివిధరకాల పండ్లను నివేదిస్తారు. 


శ్రీకృష్ణావతారంలో తాను భక్తితో ఇచ్చే నీటినైనా సంతోషంతో స్వీకరిస్తాను అని చెప్పిన భగవానుని తలుచుకుని శ్రీహరికి ఇష్టమైన "పేలపిండి" ని బెల్లంతో కలిపి నైవేద్యంగా అర్పిస్తారు. 


స్వామి అలంకార ప్రియుడు కనుక మహావిష్ణువుకు "జాజి" పూలతో అలంకారం చేసి, "శాంతాకారం భుజగశయనం, పద్మనాభం" అంటూ మహావిష్ణువును పూజించే ఈ ఏకాదశే "తొలి ఏకాదశి."


*పేలాల పిండి!*


ఇది రైతుల పండుగ కూడా. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఎలాంటి తెగుళ్లు సోకకూడదని, ఏ ఆటంకాలు ఎదురవకూడదని వేడుకుంటారు.


*తొలి ఏకాదశి నాడు మొక్కజొన్న పేలాలను పొడి చేసి, అందులో బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు.* 


"తొలి ఏకాదశి" రోజు రైతులు పూజ పూర్తిచేసి పొలానికి వెళ్లి పని చేసుకుంటారు. ఈ రోజు తప్పనిసరిగా పని చేయాలనే నమ్మకం ఉంది. కొత్త కూలీలను మాట్లాడ్డం లాంటి పనులు చేస్తారు. కొత్త ఒప్పందాలు ఈ రోజు కుదుర్చుకుంటే మంచిదని నమ్మి అలా చేస్తారు.

పూజలు

 🕉️🙏शुभोदयः।🙏🕉️


इक्षुरापः पयो मूलं 

ताम्बूलं फलमौषधम्। भक्षयित्वापि कर्तव्यः स्नानदानादिकाः क्रियाः ॥


ఇక్షురాపః పయో మూలం తాంబూలం ఫలమౌషధమ్।భక్షయిత్వాపి కర్తవ్యః స్నానదానాదికాః క్రియాః ॥


నీరు, చెరకు, పాలు, దుంపలు, పాన్, పండ్లు మరియు ఔషధాలను పవిత్ర గ్రంథాలలో వర్ణించారని చాణక్యుడు ఈ శ్లోకంలో చెప్పాడు. అందుకే వాటిని తిన్న తర్వాత కూడా ఒక వ్యక్తి మతపరమైన పని చేయవచ్చు. సాధారణంగా భారతీయులకు నీరు, పాలు, పండ్లు మరియు మందులు పూజ చేసిన తర్వాత మాత్రమే తినాలని నమ్ముతారు, అయితే అనారోగ్యం లేదా మరేదైనా స్థితిలో పాలు, నీరు, పండ్లు, దుంపలు, తమలపాకులు, చెరకు వంటివి తీసుకోవాలని చాణక్యుడు చెప్పాడు. ముందు వీటిని తినడం ద్వారా ఒక వ్యక్తి అపరాధ భావాన్ని పొందలేడని చాణక్యుడు చెప్పాడు. ఒక వ్యక్తి ఈ ఏడు వస్తువులను సేవించిన తరువాత పూజలు మరియు మతపరమైన పనులు చేయవచ్చును.


Chanakya Niti - 8/2.


Acharya Chanakya says that for those who are patients, taking sugar cane, sugar cane juice, water, milk, herbs, pan, fruits and medicines are allowed before taking bath and before performing puja and other rituals and such acts are nottreated as sin and dharma sastras permit such exemptions. 


हरिः ॐ।

ఆకలి లేనివారికోసం

 ఆకలి లేనివారికోసం సులభ యోగాలు  - 


 *  మిరియాలను నూరి తీసిన రసం గాని మిరియాల కషాయం కాని తీసుకొనుచున్న అగ్నిమాంద్యం , ఆకలి లేకపోవటం వంటి సమస్య తొలగి జీర్ణశక్తి వృద్ది అగును.


 *  వేడిగా ఉన్న అన్నం వార్చిన గంజిలో కొంచం పొంగించిన ఇంగువ , సౌవర్చ లవణం కలిపి తాగుచున్న అగ్నిమాంద్యం తొలగును .


 *  యవాక్షారం , శొంఠి సమాన భాగాలుగా తీసుకుని చూర్ణం చేసి పూటకు 5 గ్రాముల చొప్పున ఉదయం , సాయంత్రం తీసుకొనుచున్న మంచి ఆకలి కలుగును.


 *  బెల్లం , జీలకర్ర సమాన భాగాలుగా కలిపి తినుచున్న ఆకలి పెరుగును .


 *  పిప్పళ్లు చూర్ణం చేసి బెల్లముతో కలిపి తీసుకొనుచున్న ఆకలి పెరుగును .


 *  కరక్కాయ , పిప్పళ్లు , సౌవర్చ లవణం సమపాళ్లలో తీసుకుని నూరి చూర్ణం చేసి పెరుగు పైన ఉండే నీటితో కలిపి సేవించుచున్న అగ్నిమాంద్యం తొలగి ఆకలి పెరిగి జీర్ణశక్తి వృద్దిచెందును.


         పైన చెప్పిన యోగాలలో మీకు ఏది సులభముగా చేయగలరో చూసుకుని పాటించి అగ్నిమాంద్యం సమస్య నుంచి విముక్తి పొందగలరు.


 అగ్నిమాంద్య సమస్య ఉన్నవారు పాటించవలసిన ఆహారనియమాలు  -


 తినవలసినవి  -


 తేలికైన పాతబియ్యపు అన్నం , పెసలు , పేలాలు , పెసర కట్టు, చిన్న చేపలు , లేత ముల్లంగి , వెల్లుల్లి , లేత అరటికాయలు , లేత మునగకాయలు , పొట్లకాయ , బీరకాయ , వంకాయ , నక్క దోసకాయ , కాకరకాయ , అల్లం , చుక్కకూర, చెంచలికూర , ఉశిరికాయ , దానిమ్మపండు , నారింజపండు , పలచని మజ్జిగ , తాంబూలం , వేడినీళ్లు సేవించవలెను , తేనె , కారం , నూనె , చేదు , వగరు పదార్థాలు , వ్యాయమం .


 తినకూడనవి  -


        కొత్తబియ్యం , చేపలు , బచ్చలికూర , ఎక్కువుగా నీరు తాగరాదు , కంద , ఆలుగడ్డ మొదలగు దుంప కూరలు , నేరేడు పండ్లు , గోధుమలు , పిండివంటలు , మాంసపదార్దాలు , పాలు , పాలతో వండిన పదార్దాలు , చారపప్పు , ఎక్కువుగా నూనె ఉండు పదార్థాలు , పూర్తిగా ఉడకని పదార్ధాలు మరియు అన్నం , మద్యపానం,  ముందు తినిన పదార్దాలు పూర్తిగా అరగకముందే మరలా భుజించటం , అమిత భోజనం , నిద్రపోకుండా మేలుకుని ఉండటం, మలమూత్ర నిరోధం .


        పైన చెప్పిన ఆహార నియమాలు పాటిస్తూ ఔషధ యోగాలు వాడుచున్న సమస్య త్వరగా పరిష్కారం అగును.


      మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


    గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

      9885030034                       


        

   కాళహస్తి వేంకటేశ్వరరావు 


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


       9885030034

మార్కెట్ కిశోర న్యాయము, మార్జాల కిశోర న్యాయము*

 *మార్కెట్ కిశోర న్యాయము, మార్జాల కిశోర న్యాయము*


ఈ రెండు న్యాయాలు భక్తుడికి భగవంతుడికి మధ్య సంబంధ బాంధవ్యాలను తెలుపుతుంది. 


ముందుగా మర్కట కిశోర న్యాయము:


మర్కటము అంటే కోతి అని మీకందరికీ తెలిసియుండగలదు. ఈ వానరాలు చెట్ల మీద గెంతుతూ ఉంటాయి. అవి చిటారు కొమ్మకు వెళ్లి ఒక కొమ్మ నుండి మరో కొమ్మ మీదకు ఎగిరి దూకుతూ ఉంటాయి. ఒక్కోసారి తల్లి కోతి కడుపుకు అతుక్కుని పిల్ల కోతి ఉంటే భీతి అన్నదే లేకుండా తల్లి కోతి ఒక కొమ్మ నుండి మరో కొమ్మకు ఎగిరి దూకుతుంది. గోడల మీద దాటుతుంది. తన తల్లి కోతిని ఆ పిల్ల కోతి ఎట్టి భయము లేకుండా అలాగే అతుక్కుని ఉంటుంది. మా అమ్మ కిందపడితే నేను కూడా కింద పడిపోతానేమో అనే సందేహము దానికి ఏ కోశానా ఉండదు.


అలాగే మనము భగవంతుని ఒక కోతి పిల్ల తన తల్లి మీద ఎటువంటి సంకోచం లేకుండా తన తల్లి ఉంది తనకు ఏమీ కాదని భావిస్తుందో అలా భగవంతుని మీద మనము అనన్య ఏకాగ్రతతో ఎటువంటి సంకోచం లేకుండా స్థిర చిత్తముతో నమ్మాలి.


అంటే భక్తి భావనలో భక్తుడు కూడా భగవంతుని ఎల్లప్పుడు అట్టి  పట్టుకొని ఉండాలి. అలా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోను భగవంతుడు కాపాడగలడన్న పూర్తి నమ్మకంతో వ్యవహరించాలి. ఏ కోశానా అపనమ్మకం ఉండకూడదన్నట్టు. 


మార్జాల కిశోర న్యాయం :


మార్జాల మంటే పిల్లి. మీరందరు పిల్లలను పెట్టిన పిల్లిని చూసే ఉందురు. 


ఒక్క రెండు రోజులు ఇక్కడ ఉన్న పిల్లి అక్కడ తన పిల్లలకు రక్షణ లేదు అనిపించిందా లేదా ఏ కుక్క శబ్దమో మరేదైనా విని పసిగట్టిందా వెంటనే తన పిల్లలను నోట గరచుకుని సురక్షితం అనిపించే మరో చోటుకు మార్చివేస్తుంది. 


అంటే ఇక్కడ పిల్లలను కాపాడే పని పిల్లిది. 


మనము నమ్మిన భగవంతుడు ఒక పిల్లి తన పిల్లలను రక్షించడానికి ఎన్ని ఇళ్ళు మారుస్తుందో అలాగే దైవము మన వెంట ఉండి అన్నీ తానై నడిపిస్తాడన్న భావన. దీనినే మార్జాల కిశోర న్యాయము అంటారు

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 104*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 104*


శరదృతువు ప్రవేశించింది. ఆనాడు పౌర్ణమి. 


పాటలీపుత్రవాసులు ప్రతి సంవత్సరమూ ఆ పున్నమినాడు కౌముదీ మహోత్సవమును జరుపుకుంటారు. బ్రహ్మసృష్టి ప్రారంభించిన అనంతరం వేల సంవత్సరాల తర్వాత తానే పురుషుడు - ప్రకృతిగా రూపాంతరం చెంది మైథున కార్యం ద్వారా మానవజాతిని సృష్టించాడు. ఆనాటి నుంచే ఆడా-మగా కలయికతో సృష్టి మొదలైంది. బ్రహ్మ నుంచి అవతరించిన రతీమన్మథులు కామమునకు అధిదేవతలై జీవులను తమ మథనబాణ ప్రయోగాలతో మోహపరవశులను గావిస్తూ జీవుల అభివృద్ధికి కారకులవుతున్నారు. 


ఆ విధంగా మానవజాతి వృద్ధి చెందడానికి, తమ తమ వంశాలు అభివృద్ధి చెందడానికి కారణాభూతులైన కామదేవతలు రతీమన్మథుల ప్రీత్యర్థం సంవత్సరాని కొకసారి జరిపే పండగే కౌముదీ మహోత్సవం. దీనినే 'కాముని పున్నమ' అని కూడా అంటారు. పాటలీ పుత్రవాసులు ప్రతి ఏటా ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. 


ఆనవాయితీ ప్రకారం ఈ యేడాది కౌముదీ మహోత్సవం మరింత ఘనంగా జరుపుకోవాల్సిందిగా చంద్రగుప్తుడు చాటింపు ద్వారా నగరప్రజలకు తెలియపరిచాడు. 


చక్రవర్తి స్వయంగా చాటింపు వేయించేసరికి నగరపౌరులు మరింత ఉత్సాహంతో ఆనాడు 'కాముని పున్నమీ' పండుగ జరుపుకోవాలని నిశ్చయించుకొని ప్రతి ఇంటినీ పూలమాలలతో, రంగురంగుల ముగ్గులతో శోభాస్కరంగా అలంకరించుకున్నారు. అరటి బోదెలతో, మామిడి తోరణాలతో నగరమంతటా అలంకరణలు చేశారు. స్త్రీలు, పురుషులు కొత్త బట్టలు ధరించి వయసు తారతమ్యాలను పాటించకుండా ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ, పన్నీరు చిలకరించుకుంటూ ఆటలూ, పాటలతో ఆ రోజంతా సంతోషంతో పరవాళ్ళు తొక్కారు. 


చంద్రగుప్తునికి ఎప్పటికప్పుడు చారులవలన వార్తలు అందుతున్నాయి. ప్రజలు మహాసంబరంగా ఆ ఉత్సవాన్ని జరుపుకుంటున్నందుకు ఎంతగానో ఆనందించాడతను. 


కౌముదీ దీపమహోత్సవంలో అత్యంత ముఖ్యమైన వేడుక దీపోత్సవం. సాయం సంధ్యావేళలో నగరం అంతటా దీపాలతో అలంకరిస్తారు. ప్రతి ఇంటినీ దీపాలతో అలంకరిస్తారు. అంతేగాక శోణనదీతీరంలో ఆకుదొప్పలతో వేలాది దీపాలు వెలిగించి వాటిని నదీ ప్రవాహంలో విడిచిపెడతారు. ఆ విధంగా దీపకాంతులతో మెరిసిపోయే నగర వైభవాన్ని చూడడానికి దేవేంద్రుడికి ఉన్న వెయ్యి కళ్ళయినా చాలవని ప్రతీతి. రాజభవనమైన సుగాంగ ప్రాసాదము కూడా ప్రత్యేక దీపాలంకరణతో ఇంద్రభవనాన్ని తలపింపజేస్తుంది. అంతట మహోన్నతమైన దీపోత్సవంలో రాజు-ప్రజలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాలుపంచుకుంటారు. అది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. 


ఆ సంవత్సరము ఆ ఆనవాయితీకి గండిపడింది. 


ఆ సాయంత్రంవేళ దీపోత్సవాన్ని నిషేధిస్తూ నగరమంతటా చాటింపు వేయించాడు చాణక్యుడు. ఆ ఆదేశాన్ని దిక్కరించిన వారికి దేశబహిష్కార శిక్ష విధించబడుతుందని హెచ్చరిక జారీ అయింది. ఆ శాసనానికి భయపడిన ప్రజలు దీపోత్సవాన్ని మానుకున్నారు. ఒక్క ఇంట్లో కూడా నిత్యవసరానికి మించి ఒక్క దీపం కూడా అదనంగా వెలిగించబడలేదు. దీపాలు వెలిగించనందుకు నగరవీధులన్నీ వెలవెలబోయాయి. 


ఆ విషయాలేవీ తెలియని చంద్రగుప్తుడు ఆ దీపోత్సవాన్ని కళ్లారా తిలకించి ఆనందించాలన్న ఆకాంక్షతో ఆ రాత్రి ప్రథమఝాము వేళ సుగాంగ ప్రాసాదము పైభాగము మీదికి చేరుకుని అక్కడినుంచీ నగరాన్ని పరిశీలించాడు. 


'ఏముందక్కడ ? ఒక్క దీపం కూడా లేక నగరం బోసిపోయి కనిపిస్తోంది. తానీ దీపోత్సవాన్ని జరుపుకోమని ప్రజలను ఆదేశిస్తే, ప్రజలు దీపాలెందుకు వెలిగించలేదు ? ఏమిటి కారణం ? రాజాధిక్కారమా ?' అని ఆలోచిస్తూ చంద్రగుప్తుడు బిగ్గరగా "ప్రతీహారీ....." అని పిలిచాడు. మరుక్షణం ద్వారపాలకుడు వచ్చి నమస్కరించాడు. 


"ఈనాడు కౌముదీ దీపమహోత్సవం, దీపోత్సవం ఘనంగా జరుపుకోవాలని మేము ప్రజలను ఆదేశించాము కదా ! నగరంలో ఎవ్వరూ దీపాలు ఎందుకు వెలిగించలేదు ?" అసహనంగా ప్రశ్నించాడు చంద్రుడు. 


"చిత్తం. ప్రభువుల ఆదేశాన్ని యీ సాయంత్రం వరకు ప్రజలు పాటించారు. ఆ తర్వాతే... దీపోత్సవం నిషేధించబడింది. ఈ నిషేధాన్ని పాటించని వారికి శిక్ష .... దేశ బహిష్కారం...." చెప్పాడు ప్రతీహారి. 


చక్రవర్తి విస్తుబోతూ "నిషేధమా ? చక్రవర్తులమైన మాకు తెలియకుండా నిషేధమా ? ఎవరు ? ఇంతటి దుస్సహాసానికి ఒడిగట్టినe వారెవరు ?" గద్దించాడు ఆగ్రహంతో. 


"ఆర్య చాణక్యుల వారు...." చెప్పారు ప్రతీహారి. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

ఈ రోజు పదము

 204వ రోజు: (సౌమ్య వారము) 28-06-2023

మన మాతృ భాష సేవలో


ఈ రోజు పదము:

సంతానవతి : కరవీరి, కుటుంబిని, కృమిల, కొదమరి, జీవసువు, బహుసుత, విజాత. 


 ఈ రోజు పద్యము:


ఊరక సజ్జనుండొదిగి యుండిననైన దురాత్మకుండు  ని/

ష్కారణ మోర్వలేక అపకారము చేయుట వాని విద్యగా/

చీరలు నూరుటంకములు చేసెడివైనను పెట్టెనుండగా/

చేరి చినింగిపో గొరుకు చిమ్మట కేమి ఫలంబు? భాస్కరా!


ఎంతో విలువైన బట్టలు పెట్టెలో ఉండగా చిమ్మట పురుగు వాటికి చిల్లులు పెట్టి కొరికి పాడుచేస్తుంది. దానివల్ల ఆ పురుగుకి ఏమి లాభం లేదు. వాటికి పాడు చెయ్యటం ఒక స్వభావము. అలాగే ఎవ్వరినీ ఏమీ పల్లెత్తు మాట అనక తన ఇంట తానున్న సజ్జనుణ్ణి నిష్కారణంగా దుర్జనుడు అపకారం చేసి బాధ పెడతాడు. వాడికి వచ్చే లాభం ఏమీ లేదు. అది చెడ్డవాని గుణం.

మంగళసూత్రం - సుమంగళి

 మంగళసూత్రం - సుమంగళి


పాలక్కాడ్ జిల్లాలోని మంజపర బ్రాహ్మణ సమూహానికి చెందిన ఆర్.జి. వెంకటాచలం కంచి మఠానికి పెద్ద భక్తుడు. చాలా పెద్ద పెద్ద పదవులనలంకరించి ఇప్పుడు చెన్నైలో జీవిస్తున్నారు. కాని తమ జన్మస్థలం అంటే వల్లమాలిన అభిమానం. దాదాపు యాభైలక్షల రూపాయలు విరాళాలు సేకరించి మంజపరలోని గురువాయురప్పన్ దేవస్థానాన్ని పునరుద్ధరింంచారు. వారికి పరమాచార్య స్వామివారితో అనుభవాలు కోకొల్లలు. భక్తిపారవశ్యంతో వారు ఎప్పుడూ ఈ సంఘటనను గుర్తు చేసుకుంటారు. 


ప్రతి సంవత్సరమూ వారు పరమాచార్య స్వామివారి అనుగ్రహం కోసం వచ్చేవారు భిక్షావందనంతో. 1988లో రహదారుల ప్రయాణానికి కొంచం ఆటంకం ఏర్పడడంతో ఆయన రావాల్సిన రోజుకు రారు అని అందరూ తలచారు. కాని ఏలాగో వారు కాంచీపురం చేరుకున్నారు. స్వామివారి దర్శన సమయంలో అతణ్ణి, “నీ సంపాదన ఎంత?” అని అడిగారు. వారు సమాధానం చెప్పగానే వారికి స్వామివారి ఆదేశం అందింది. 


”నువ్వు ఇక ఎప్పుడు భిక్షావందనం చెయ్యడానికి వచ్చినా, కొన్ని మంగళసూత్రాలను చెయ్యించి నీతోపాటు తీసుకుని రా” అని చెప్పారు. 


ఆయన కొద్దిగా అలోచనలో పడ్డారు. ఏ సాంప్రదాయాన్ని అనుసరించి మంగళసూత్రాలను చెయ్యించాలి. స్మార్త, తెలుగు, అయ్యర్ ఇలా చాలా చాలా ఉన్నాయి కదా. ఏ రకంగా తయారు చేయించాలి? ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది అని.


వెంటనే స్వామివారు “ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏ సంప్రదాయమైనా పరవాలేదు. తీసుకుని రా” అని చెప్పారు. వెంకటాచలం ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అతను ఈ విషయమై తన మనసులో ఆలోచిస్తున్నాడు. స్వామివారిని అడగనేలేదు. మరి స్వామివారికి ఎలా తెలిసిసింది? అడగకముందే స్వామివారు సమాధానం ఇవ్వడం అతణ్ణి ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. 


ఈ సంఘటన జరిగి మూడు సంవత్సరాలు గడిచిపోయింది. ప్రతి సంవత్సరం లాగే ఆ సంవత్సరం కూడా భిక్షావందనానికి శ్రీమఠానికి వచ్చారు. ఆరోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కొద్ది దూరంలో నిలబడి వెంకటాచలం తనవంతు కోసం ఎదురుచూస్తున్నాడు. ఒక పెద్ద ముత్తైదువ బహుశా పేదరాలు, స్వామివారితో ప్రాధేయపూర్వకంగా మాట్లాడుతోంది. స్వామివారి ముఖమండలంలో అనంతమైన శాంతి గోచరిస్తోంది. 


వెంకటాచలం తనవంతు రాగానే మహాస్వామి వారిముందు నిలబడి, “స్వామివారి ఆదేశం ప్రకారం మంగళసూత్రాలను తెచ్చాను” అని చెప్పాడు. స్వామివారు చేతివేళ్ల శబ్ధంతో ఆ సుమంగళిని దగ్గరకు రమ్మన్నారు. వెంకటాచలం వైపుకి తిరిగి “ఆమె కుమార్తెకి పెళ్ళి అట. మంగళసూత్రం కావాలి అట. తీసుకో ఇక్కడే నీ చేతులతోనే ఆమెకి ఇవ్వు” అని ఆదేశించారు. వెంకటాచలం చాలా సంతోషించారు.


“సార్, నేను చాలా పోగొట్టుకున్నాను. జీవనం సాగించడానికి కూడా కష్టపడ్డాను. అయినాకూడా, ఎప్పుడూ తిరుమాంగల్యాలు చెయ్యించడం మానలేదు. అది పరమాచార్య స్వామి వారి ఆజ్ఞ కదా? మరి ఎలా వదిలిపెట్టగలను? స్వామివారి ఏమి తెలియదా? అంతా తెలుసు. నా భార్య ఏ బాధాలేకుండా సుమంగళీగానే కన్ను మూసింది. మరి ఇంతకంటె ఇక ఏమి అడగాలి ఆ సర్వేశ్వరుణ్ణి?” అని కంఠం గాద్గదికమవుతుండగా వారి అనుభవాన్ని చెప్పుకొచ్చారు వెంకటాచలం.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

గురుపౌర్ణమి

 ఊళ్ళో పెళ్ళికి ఏవో హడావిడి చేశాయి అన్నట్లు  సాయిబు గుళ్ళలో మొదలైన షిర్డీ గురు పౌర్ణమి ఉత్సవాలంటా వీళ్ళు కొత్త కొత్త అర్థాలు చెప్పుతున్నారు


వ్యాసపౌర్ణమి గురుపౌర్ణమి అనగా ఆషాడ శుద్ధ పౌర్ణమి నాడు వచ్చే పర్వదినం వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమి.


చాలా మంది తెలియక ఎలా పడితే ఆలా ఎవరికి పడితే వారికి పూజ చేస్తున్నారు. అసలు గురు పూజ మొదట ఎవరికీ చెయ్యాలి ఎలా చెయ్యాలి అని పెద్దలు ఒక పద్దతిని తీసుకొనివచ్చారు.


 అదే వ్యాస పౌర్ణమి నాడు జగద్గురువులైన వేదవ్యాసులవారికి చేసే గురు పూజ.


సాధారణంగా గురుస్వరూపాలకి ఆరాధన ప్రక్రియ లేదు కానీ ఏ మహాపురుషుడి వలన వేద విభాగం జరిగిందో, సమస్త వాఙ్మయం భూమిమీదకు వచ్చిందో అట్టి జగద్గువులైన వేదవ్యాసులవారికి శిష్యులు మరియు మిగతా గురు పరంపర అంతా కలిసి ఒకరోజు కృతజ్ఞతగా పూజ చేస్తారు.


అదే గురు పౌర్ణమి. పువ్వు జ్ఞానానికి గుర్తు. కాబట్టి అటువంటి జ్ఞానం మనందరికీ కలగాలని ఆరోజున శ్రీకృష్ణ పరమాత్మ ఫోటోని, వ్యాసుల వారి ఫోటోని కానీ లేదా వ్యాస పాదుకల దగ్గర శిష్యులు, మిగతా గురుపరంపర ఒక్కో పువ్వుని సమర్పిస్తారు.


వేద వ్యాస మహర్షుల వారు మన జాతికి చేసిన సేవ అంతా యింతా కాదు. కలియుగంలో వేదాన్ని పూర్తిగా చదవలేరని, కనీసం అర్ధం కూడా చేసుకోలేని రోజులువస్తాయని భవిష్యత్తు దర్శనం చేసి ఒక వేదాన్నినాలుగు వేదాలుగా విభజించి, అవి కూడా పఠనం చేయలేకపోతారేమోనని అష్టాదశ పురాణాలను పంచి పెట్టారు, పంచమ వేదమైన మహాభారత ఇతిహాసాగ్రంధాన్ని ఇచ్చి ఒక్కొక్క వేదాన్ని ఒక్కో శిష్యుడి ద్వారా ప్రచారం గావించి, పురాణాలను శూత మహర్షుల చేత ప్రచారం చేయించారు.


 ఒకవేళ కలియుగంలో ఈ గ్రంధాలని కూడా మనుషులు అర్ధం చేస్కోగలరో లేదో అన్న దూరదృష్టితో సమస్త వేద, పురాణ, ఉపనిషదుల యొక్క సారాంశమైన శ్రీకృష్ణ భగవానుడి కథలను, హరి నామ వైభవాన్ని శ్రీమద్భాగవతంలో నిక్షిప్తం చేసి ఎప్పుడు భక్తితత్పరతతో ఉండే తన కుమారుడైన శుకమహర్షుల వారి చేత ప్రచారంగావింపబడి సమస్త మానవాళిని ఉద్ధరించిన మహాపురుషుడు వ్యాస మహర్షి.


వ్యాసుమహర్షుల వారు ఇచ్చిన వాఙ్మయాని ఆధారం చేసుకొని తర్వాతి కాలంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య, అన్నమాచార్య, రామదాస, మహర్షులవంటి మహాత్ములు గురుపరంపరగా భగవానుడి యొక్క కథలను, గుణవిశేషాలను శిష్యులకి ప్రచారం గావించి సనాతనధర్మాన్నిమానవాళికి అందించారు, నేటి కి మన గురువు చే అందిపుచ్ఛుకుంటునం


సమస్త వాఙ్మయం వ్యాస ఉచ్చిష్టమ్ అంటారు పెద్దలు అంటే ఎవరు ఏ వాఙ్మయాన్ని చెప్పిన అది వ్యాసులవారు ఏది చెప్పారో దాని నుంచే చెప్పబడింది తప్ప వేరుగా ఏది లేదు అని. అంత గొప్ప వాఙ్మయాన్ని ఇచ్చారు. మనకి ఇంతటి భక్తి, జ్ఞాన బోధనలు చేసి, గురు పరంపరను తీస్కొని వచ్చి సనాతన ధర్మాన్ని ప్రచారంగావించిన అటువంటి మహాపురుషుడికి గురుపౌర్ణమి రోజున పూజ చేసుకోవడం మన అదృష్టం.


అలాంటి గొప్ప అదృష్టం ని అందిపుచ్ఛుకొకుండ మన పురాతనమైన సంస్కృతి ని వేదాలను అపహస్యం చేస్తు మన వేద పండితుల ను గురువర్యులను పక్కున పెట్టి ముస్లిం బాబా లను సాయిబులను   గురువులను చేస్తున్నాం


మన భారత దేశ సనాతన ధర్మం ని భ్రష్టు పట్టిస్తున్నం మన  వేలితో మన కంటినే పొడుచుకుని గుడ్డివలం అవుతున్నాం ఇక నుంచైనా మారుద్దాం మన ధర్మాన్ని సంస్కృతి ని వేదాలను మనకు అందించిన గురువులను గుర్తించి వారిని గౌరవించి మన సనాతన ధర్మాన్ని మనమే రక్షించుకుందాం


 శ్రీమన్నారాయణుడి అంశావతారమైన వ్యాస మహర్షులవారిని గురు పౌర్ణమి రోజున స్మరించినందువలన మన పాపరాశి దగ్దమైపోతుంది.

  - శ్రీ గురుభ్యోనమః

అద్వైత సత్యం

 అద్వైత సత్యం


ద్వైతం అనేది వ్యావహారికం. అద్వైతం అనేది పారమార్థికం. భగవంతుడు వేరు, నేను వేరు అనే భావన ఉంటేగానీ మనం భగవంతుడిని పూజించలేం. జ్ఞానం వచ్చేంత వరకు ద్వైతం ఉపయోగపడుతుంది. జ్ఞానం వచ్చాక అద్వైతం మాత్రమే ఉంటుంది.


నిద్రలో కల కంటున్నంతసేపు అది కల అని తెలియదు. బాహ్యస్మృతిలోకి వచ్చాక మాత్రమే అది కల అని తెలుస్తుంది. ద్వైతంలో ఉన్నా, విశిష్టాద్వైతంలోకి వెళ్లినా, ఆఖరికి అద్వైతంలోకి రావలసిందే. ఎందుకంటే, జగత్తు అంతా మిథ్య, బ్రహ్మం ఒక్కడే అంటే అందరూ అర్థం చేసుకోలేరు. ఈ ఉపాసనలు, ఆరాధనలు అద్వైతం కోసమే. కాబట్టి ఏ సిద్దాంతం ఆచరిస్తున్నా చివరికి అద్వైతానికి చేరుకోవాల్సిందే.


ఏకేశ్వరోపాసన చేసినా, అనేకమంది దేవతలను పూజించినా ఏ వ్యత్యాసమూ లేదు. ఎందుకంటే భగవంతుడు ఒక్కడే. కానీ రూపాలు, నామాలు అనేకం ఉన్నాయి. ఆ రూపాల వెనకాల ఉండే చైతన్యరూపం మాత్రం ఒక్కటే. మనం ఈశ్వరుణ్ణి ఆరాధించినా, విష్ణువును ఆరాధించినా ఫలంలో ఎటువంటి తేడా లేదు. ఈశ్వరుడు ఎటువంటి ఫలాన్నిస్తాడో, విష్ణువు కుడా అదే ఫలాన్నిస్తాడు. ఇతర దేవతలు అదే విధమైన ఫలాన్ని ప్రసాదిస్తారు.


మనం వినాయకచవితికి గణపతిని, నవరాత్రికి అమ్మవారిని, శివరాత్రికి శివుణ్ణి, ఇలా ఏ పర్వదినానికి తగ్గట్టు ఆ దేవుడుని పూజిస్తాం. అలాగని మనం నలుగురు దేవతలను ఆరాధించినట్టు కాదు. ఒకే దేవుణ్ణి నాలుగుమార్లు పూజించినట్టు. మరి ఎందుకని అన్ని రూపాలు అంటే, సాధకులను అనుగ్రహించడం కోసం భగవంతుడు వారికి రుచించిన రూపంలో వస్తాడు, అందుకనే ఇన్ని రూపాలని ఆదిశంకరులు చెబుతారు.