24, జులై 2023, సోమవారం

తాంబూలం

 *ప్ర* : *తాంబూలం ఇచ్చేటప్పుడు కూడా పద్ధతులున్నాయా* ? *అమ్మవారి 'కర్పూరవీటికా'కి ఏ సామగ్రియో, ఇతర తాంబూలానికి కూడా అదే వాడాలా?* 


జ : దేవతలకిగానీ, మానవులకి గానీ తాంబూలం ఇచ్చేటప్పుడు కాడలు మనవైపు, కొసలు పుచ్చుకొనే వారివైపు ఉండాలి. మూడు, ఐదు, పది, పన్నెండు ఈ సంఖ్యలో తమల పాకులుండాలి. ఒక వక్క, లేదా మూడు వక్కలు పెట్టడం శ్రేష్ఠం. రెండు వక్కలు కూడదు. ఇక అమ్మవారి 'కర్పూరవీటికా' పద్ధతి వేరు. ఇది కేవలం తాంబూలం కాదు. అది 'కిళ్ళీ' మాదిరి ఒక తాంబూల విధానం.

*🪔శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -2🪔*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🪔శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -2🪔*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


 *భృగువు చరిత్ర:*


 భృగువు బ్రహ్మమానసపుత్రులలో ఒకఁడు. 

ఇతని పుత్రుఁడు కవి. పౌత్రుడు అసురులకు గురువు అయిన శుక్రాచార్యులు. 


భార్గవ వంశ మూలపురుషుడు అయిన  భృగువు బ్రహ్మ హృథయ స్థానం నుండి జన్మించెను


ఇదికాక ఇతనికి ఖ్యాతివలన ధాత, విధాత అని ఇరువురు కొడుకులు కలిగిరి. అందు ధాతకు మృకండుఁడు, విధాతకు ప్రాణుఁడును జన్మించిరి. 


ప్రాణుని కొడుకు వేదశిరుఁడు. వేదశిరుని కొడుకు ఉశేనస్సు. మృకండుని కొడుకు మార్కండేయుఁడు. 


భృగు మహర్షి ప్రజాపతులలో నవ బ్రహ్మలలో అగ్రజుడు కనుక ఆయన అత్యంత శక్తివంతుడే కాకుండ సకల దేవతలకు సకల ఋషులకు మానవులకు పూజ్యుడు

వారుణ యాగమున అగ్ని తేజమున జన్మించెను కనుక "వారుణీ విద్య" కు అధిపతి అయ్యారు.


ఇతఁడు భాగీరథీ దక్షిణతీరమున మహాపద్మము అనియెడు పురమునందు ఉండెను


అతని భార్య  పులోమ గర్భవతిగా ఉన్నప్పుడు, ఒకనాడు భృగువు “నేను నదీ స్నానానికి వెళ్ళొస్తాను, ఈలోగ నువ్వు నిత్యాగ్నిహోత్రానికి అవసరమిన  సామాగ్రి కూర్చుము” అని చెప్పి వెడలినాడు. 


పులోమ హోమగుండంలో అగ్ని వెలిగించి, మిగతా పనులు చేసుకుంటూ వుండగా

పులోముడు అను రాక్షసుడు, అక్కడికి వచ్చి ఆమెను చూసి కామించి, ఆమె గురించి అగ్నిదేవున్ని అడుగుతాడు. 


" నేను నిజం చెప్పిన పులోమకి హాని కలుగును, అబద్ధము చెప్పిన నాకు అసత్య దోషము అంటును అని" అని అగ్నిదేవుడు యోచించి 


చివరికి నిజమ చెప్పాలనే నిర్ణయంతో, ఆమె భృగు మహర్షి భార్య పులోమ అని చెప్తాడు.


పులోముడు ఆమెను పెళ్ళి కాకముందు ప్రేమిస్తాడు 

కాని పులోమ తిరస్కరిస్తుంది. 

ఇప్పుడు సమయం వచ్చిందని ఆమెను చెరబట్టాలని నిశ్చయించి

 పేద్ద వరాహంగా మారి ఆమెను తన భుజాలపై వేసుకుని పారిపోవడానికి ప్రయత్నించగా ఆమెకు ప్రసవం జరిగి మగ పిల్లవాడు జన్మిస్తాడు


అతనే చ్యవనడు, అత్యంత శక్తి మంతుడు

ఆ బాలుడు కోపంతో పులోమున్ని చూడగానె, మంటలలో పులోముడు కాలిపోతాడు. 


అప్పుడు పులోమ ఆ పిల్లవాని తీసుకొని ఆశ్రమానికి పోయి జరిగిందంతా భృగువు కి చెప్తుంది.

భృగువు కోపంతో నీ గురించి ఎవరు చెప్పారు అని అడుగుగా అగ్నిదేవుడు చెప్పాడు అని పులోమ చెప్తుంది. 

అగ్నిదేవుడు నేను అబద్ధం చెప్పిన పాపం చుట్టుకుంటుందని నిజం చెప్పాను అని

 పలుకగా   భృగువు " ఇక నుండి నువ్వు సర్వభక్షకునివి అగుదువు" అని శపిస్తాడు.


అప్పుడు అగ్నిదేవుడు "నేను సర్వభక్షకున్ని అయిన, దేవతలకు హవిస్సులు ఎలా తెసుకెళ్ళలి" అని, తన మంటలను ఆపివేస్తాడు. 


ఇక హోమాలు, దేవతలకు హవిస్సులు లేకపోవడంతో బ్రహ్మదేవుడు అగ్ని దగ్గరికి వచ్చి   "ఓ అగ్నిదేవా, భృగువు శాపం ప్రకారం నువ్వు సర్వభక్షకునివే, 

కానీ నీ పవిత్రత పోలేదు కావున నువ్వు ఎప్పటిలాగే దేవతలకు హవిస్సులు చేరవేస్తూండు" అని చెప్పగా  అగ్నిదేవుడు అంగీకరిస్తాడు


ఇంతటి  శక్తి మంతుడు ఆ భృగు మహర్షి అంతే కాక


భగవద్గీతలో శ్రీ కృష్ణ పరబ్రహ్మ భృగువు గురించి ఇలా పలికెను


శ్లో: *మహర్షీణాం భృగురహం గిరామస్మ్యక మక్షరం!* 

 *యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయం!!* 


మహర్షులలో భృగుమహర్షిని నేనే


అక్షరములలో ఓంకారమును నేనే


యజ్ఞములలో జపయజ్ఞము నేనే


స్థావరములలో హిమాలయమును నేనే యని పరమాత్మ పలికెను


అనగా శ్రీ మహా విష్ణువే "భృగు మహర్షి" యని అవగతమవుతున్నది


తన తపఃశక్తిచే తన పాదమునఒక నేత్రం మొలిచేలా చేసుకున్నమహా విశిష్టత కలిగిన మహాత్ముడు భృగు మహర్షి


ఆందువల్ల త్రిమూర్తులను పరీక్ష జేయగల కార్యమాయన మాత్రమే నిర్వర్తింపగలడు అని నిశ్చయించినారు


 తక్కిన మునులు కూడా ‘‘భృగువును పంపినచో పని చక్కబడును’’ అని ఏకీభవించిన వారయి వారి ఆమోదమును తెలిపిరి. 


భృగువు తన పై బెట్టిన దుష్కర కార్యసాధనకై వారి వద్ద శెలవు గైకొని వెడలినాడు..


 *నిత్యనిర్మల గోవిందా, నీలమేఘశ్యామా గోవిందా,* *పురాణపురుష గోవిందా, పుండరికాక్ష గోవిందా; |* 


 *గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా* *హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. |*  


శ్రీవేంకటేశ్వరునిదివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.

*ఓం నమో వెంకటేశాయా*


*సేకరణ :- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 124*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 124*


🔴 *రాజనీతి సూత్రాణి - రెండవ అధ్యాయం* : 


📕 *సామాన్య నీతులు* : 📕


1. కేవలం ధనాని నిక్షేప్తుః న స్వార్థం, న దానం, న ధర్మః (కేవలం ధనాన్ని కూడబెట్టేవానికి దానివల్ల అతనికేమి ప్రయోజనం లేదు. దానమూ లేదు, ధర్మమూ లేదు. శ్రమ మాత్రం మిగులుతుంది.) 


2. నార్యా ఆగతో ర్థ తద్విపరీత మనర్ధభావం భజతే (స్త్రీ ద్వారా వచ్చిన అర్థం (ధనం) విపరీతంగా 'అనర్థం' (అపకారహేతువు) అవుతుంది.) 


3. యో ధర్మార్ధౌ న వ్యర్థయతి స కామః తద్విపరీతో నర్ధసేవీ (ధర్మార్థాలకి లోపం కలిగించనిదే కామం. వాటికి లోపం కలిగించే విధంగా కామాన్ని సేవించేవాడు అనర్ధాన్నే సేవిస్తున్నట్లు.) 


4. ఋజుస్వభావపరో జనో దుర్లభ 

(కపటం లేని స్వభావం గల మనిషి దొరకడం కష్టం.) 


5. అవమానేనాగతమైశ్వర్యమవమన్యత ఏవ సాధుః (సత్పురుషుడు అవమానపూర్వకంగా వచ్చిన ఐశ్వర్యాన్ని అవమానిస్తాడు.) 


6. బహునపి గుణాన్ ఏకదోషో గ్రసతి 

(ఒక్క దోషం గుణాల నన్నంటినీ మింగేస్తుంది.) 


7. మహాత్మానా పరేణ సాహసం న కర్తవ్యమ్ (మహాత్ముడైన శత్రువు విషయంలో సాహసకృత్యానికి దిగకూడదు.)


8. కదాచిదపి చారిత్రం న లజ్ఞయేత్ 

(మంచి నడవడికను ఏనాడూ విడువకూడదు.) 


9. క్షుధార్తో న తృణం చరతి సింహః 

(ఆకలితో బాధపడుతున్నా సింహం గడ్డి మేయదు.) 


10. ప్రాణాదపి ప్రత్యయో రక్షితవ్య 

(ప్రాణాల కంటే ఎక్కువగా జనవిశ్వాసాన్ని రక్షించుకోవాలి.) 


11. పిశునో నేతా పుత్ర దారైరపి త్యజ్యతే 

(చాడీలు చెప్పే నాయకుడ్ని భార్యాపుత్రాదులు కూడా విడిచివేస్తారు.) 

(ఇంకా ఉంది)...


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

ॐ శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్

 ॐ   శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్ 


                             శ్లోకం :26/150 


హుతాశనసహాయశ్చ 

ప్రశాంతాత్మా హుతాశనః I 

ఉగ్రతేజా మహాతేజా 

జన్యో విజయకాలవిత్ ॥ 26 ॥  


* హుతాశన సహాయః = అగ్ని సహాయముగా కలవాడు, 

* ప్రశాంతాత్మా = శాంతమైన ఆత్మకలవాడు, 

* హుతాశనః = తానే అగ్నిరూపమైయున్నవాడు, 

* ఉగ్రతేజాః = తీవ్రమైన తేజస్సు కలవాడు, 

* మహాతేజాః = గొప్పదైన తేజస్సు కలవాడు, 

* జన్యః = సమస్త జంతువులరూపము తానే అయినవాడు, 

* విజయకాలవిత్ = విజయము పొందుకాలము తెలిసినవాడు.


                    కొనసాగింపు ... 


https://youtu.be/L4DZ8-2KFH0 


                    =x=x=x= 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం

జనన మరణాల మధ్య

 *జనన మరణాల మధ్య…!*

                

మహా బలవంతుడు, మల్లయుద్ధ వీరుడైనా కాలం గడుస్తూ వయసు పెరుగుతుంటే వృద్ధుడై బలహీనపడతాడు.


కాలం పరుగెడుతుంటే యౌవనంలోని అందాల రాశి ముసలితనంలో కళాకాంతులు పోగొట్టుకుంటుంది. 


మహాజ్ఞాని సైతం వయసు మళ్ళాక జ్ఞాపకశక్తి తగ్గి చింతిస్తుంటాడు. 


జనన మరణాల మధ్య ప్రతి ఒక్కరూ దేహంలో మార్పులకు తలవంచవలసిందే!


గడిచిన క్షణం తిరిగిరాదు! ఈ నిజాన్ని జీర్ణించుకున్న విజ్ఞులు... నేను,నాది అనే అహంకారాన్ని తలకెక్కించుకోరు. స్వార్థాన్ని కట్టడి చేసుకుని సన్మార్గంలో జీవనయానం సాగిస్తారు. తమకు తెలియని శక్తి ఏదో తమను నడిపిస్తోందని విశ్వసిస్తారు. ఆ శక్తినే దైవంగా భావిస్తారు. తమ జీవితం ఆ దైవలీలకు లోబడిందని గ్రహిస్తారు. 

ఈ జగతిని సృష్టించి పాలిస్తున్న పరమేశ్వరుడిని వినమ్రంగా సేవిస్తూ కృతజ్ఞులై ఉంటారు. 


పరమేశ్వరుడి సృష్టిలో అత్యంత కీలకమైనది మాట! పుట్టిన వెంటనే మాట రాదు. మరణ సమయంలో మాట పడిపోతుంది. మధ్యకాలంలో సత్య సంభాషణం మనిషి విలువను పెంచుతుంది. కష్టసుఖాల్లో పాలుపంచుకునే బంధుమిత్రులను ఆదరించినవారి జీవితం ఆనందమయమౌతుంది. 


స్నేహబాంధవ్య పరిమళాలను నిరంతరం ఆస్వాదించాలి. జనన మరణాల మధ్య కాలంలో లోభ మోహాలను, మదమాత్సర్యాలను మనసు నుంచి తరిమికొట్టి మంగళకరమైన ఆలోచనలతో మనసును పరిపూర్ణం చేసుకుంటే జీవనం ఉత్సాహభరితమవుతుంది. 


చెడుతలపులకు తలుపులు తెరిస్తే చివరి రోజులు దుఃఖమయమే. భూమి  మీద పడగానే భగవంతుడున్నాడన్న జ్ఞానం కలగదు. ముసలితనంలో యమ భటులు వాకిట ముందుకొచ్చినప్పుడు రోగంతో గొంతు పూడుకుపోయి భగవంతున్ని తలచగలమో లేదో? భజింపగలమో లేదో? తెలియదుకనుక ఆరోగ్యంగా ఉన్నప్పుడు భగవంతుణ్ని ధ్యానించి పూజించాలని బోధిస్తుంది దాశరథీ శతకపద్యం.


జీవితంలో ప్రతిక్షణం విలువైనదని తెలుసుకోగలగాలి అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి, సోమరితనంతో కాలాన్ని వృదా చేసుకునేవారు అజ్ఞానులు.


మనసులో రూపుదిద్దుకొన్న మంచి ఆలోచనలను తక్షణం ఆచరణలో పెట్టడం ఉత్తముల లక్షణం. 


తమతోనే నిక్షిప్తమైపోకుండా తమ జ్ఞాన సంపదను ఇతరులకు పంచేవారే విజ్ఞులు, నిర్దేశించుకున్న లక్ష్యాలను కాలయాపన చేయకుండా పట్టుదలతో సాధించేవారు మార్గదర్శకులై ప్రకాశిస్తారు. కదలలేని స్థితిలో 

చేసిన తప్పులు తలచుకుంటూ కన్నీరు కార్చే పరిస్థితి కల్పించుకోకూడదు. చివరి క్షణంలో నిర్మలమైన మనసుతో భగవంతుడనుగ్రహించిన జీవితాన్ని సార్ధకం చేసుకున్నామన్న తృప్తితో ఆనందంగా పరమేశ్వరుడి పిలుపునందుకోవాలి.


🙌సర్వేజనాః సుఖినోభవంతు 🙌

23, జులై 2023, ఆదివారం

Sun God

 


Pension


 

Don't drive fast


 

వృద్ధుడు వ్యర్థుడు కాదు

 *వృద్ధుడు వ్యర్థుడు కాదు... ఇంటికి ఈశ్వరుడు---//-*


*మూలన పడేస్తే వృద్ధుడు వ్యర్థుడు... ముంగిట్లో కూచోబెడితే ఇంటిని కాచే ఈశ్వరుడు...*


*బతుకుబాటలో గతుకుల్ని ముందుగా హెచ్చరించి. కాపాడే సిద్ధుడు వృద్ధుడు...* *వృద్ధులు సారధులైతే యువకులు విజయులౌతారు... అనుభవాల గనులు... ఆపాత బంగారాలు...*


*వదిలేస్తే వృద్ధుడు మంచానికి బద్ధుడు...* *చేయూతనిస్తే ప్రతి వృద్ధుడు ఓ బుద్ధుడు..* 

*నిర్లక్ష్యంగా చూస్తే కేవలం మూడుకాళ్ల ముసలివాడు..*

*తగిన గుర్తింపునిస్తే విజయాన్నిచ్చే త్రివిక్రముడు...*


*ఒకనాటి బాలుడే ఈనాటి వృద్ధుడు... తనను పట్టించుకోకున్నా నువ్వు పచ్చగా ఉండాలని తపించే ఉదాత్తుడు వృద్ధుడు...*


*పలకరిస్తే చాలు పాలకడలిలా పొంగులు వారే పసివాడు వృద్ధుడు... వృద్ధుడంటే పైపైన చూస్తే జుట్టు తెల్లబడిన ఫలిత కేశాలవాడు... అంతర్గతంగా తలపండిన పండితుడు...*     


*వృద్ధుడు వ్యర్థుడు కాదు... ఇంటికి ఈశ్వరుడు...*


*వృద్దులకు గౌరవం ఇద్దాం*

*మన గౌరవం పెంచుకుందాం ---//-*

మేము అరవై లో ఇరవై. 


పచ్చగా మెరిసే పండుటాకులమే గాని

             చప్పుడు చేసే ఎండుటాకులం కాదు

కలలు పండినా పండకపోయినా

            మేము తలలు పండిన తిమ్మరుసులం


కొరవడింది  కంటి చూపు గాని

          మందగించలేదు ముందు చూపు


అలసిపోయింది  దేహమే గాని

          మనసుకు లేనే లేదు సందేహం


ఎగిరి అంబరాన్ని అందుకోకున్నా

                      ఈ భూమికి కాబోము భారం


అరవై లో ఇరవై కాకున్నా

                      అందని ద్రాక్ష కై అర్రులు చాచం


కుందేళ్ళమై పరుగులు తీయకున్నా

               తాబేళ్లమై గెలుపు బాట చూపగలం


చెడుగుడు కూతల సత్తా లేకున్నా

              చదరంగపు ఎత్తులు నేర్పగలం


సమయం ఎంతో మాకు లేకున్నా

            సమయమంతా మీకు సమర్పిస్తాం


అనుకోకుంటే అధిక ప్రసంగం

              అనుభవ సారం పంచుకుంటాం


వాడిపోయే పూవులమైనా

                        సౌరభాలు వెదజల్లుతాం


రాలిపోయే తారలమైనా

                        కాంతి పుంజాలు వెదజల్లుతాం

శ్రీ నాగశంకర్ మందిర్

 🕉 మన గుడి : 




⚜ అస్సాం : సూటియా ( నాగశంకర్ మౌజా)


⚜ శ్రీ నాగశంకర్ మందిర్



💠 నాగశంకర్ టెంపుల్ అనేది అస్సాంలోని సోనిత్‌పూర్ జిల్లాలో, తేజ్‌పూర్‌కు తూర్పున, సూటియా సమీపంలోని నాగశంకర్ మౌజాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. 

 ఈ ఆలయాన్ని 4వ శతాబ్దంలో నాగఖారాజు నరశంకరుడు నిర్మించాడని నమ్ముతారు.


💠 ఒక నమ్మకం ప్రకారం, నాగశంకర్ ఆలయం 4వ శతాబ్దం చివరిలో లోహిత్య రాజవంశానికి చెందిన నాగ్ శంకర్ అనే రాజుచే నిర్మించబడింది.  

నాగశంకర్ 378 సం.లో తూర్పు కామరూప (అస్సాం యొక్క పురాతన పేరు)ని పాలించాడు. 


💠 మరొక నమ్మకం ప్రకారం, ఈ ఆలయాన్ని నాగమత్త రాజు నిర్మించాడు.  నాగమట్ట అనేది అస్సాం యొక్క శక్తివంతమైన రాజు అరిమట్ట యొక్క మరొక పేరు.  

పురాణాలలో కూడా అరిమట్టకు ముఖ్యమైన స్థానం ఉంది. 

 


💠 ఒక పురాణం ప్రకారం,  సతీదేవి  నాభి భాగం నాగశంకర్ ఆలయంలో పడింది అంటారు.

అందుకే, ఈ ఆలయానికి మొదట నాభిశంకర్ అని పేరు వచ్చింది తరువాత అది నాగశంకర్‌గా మారింది.  

 

💠 అహోం రాజు సు-సేన్-ఫా 1480లో నాగశంకర్ ఆలయాన్ని మరమ్మత్తు చేసాడు.

ఈ పనితో రాజు తన రాజ్యాన్ని బ్రహ్మపుత్ర నది ఉత్తర ఒడ్డుకు విస్తరించి, ఆ ప్రాంత ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోగలిగాడు.


💠 ఈ ఆలయంలో శివరాత్రి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించబడతాయి.  శివరాత్రి మరియు వివిధ కార్యక్రమాలతో స్థానిక ప్రజలు రెండు రోజుల పాటు ఘనంగా ఆచరిస్తారు మరియు ఈ సమయంలో దాదాపు 5 వేల మంది యాత్రికులు ఎల్లప్పుడూ ఆలయ ప్రాంగణంలో దర్శనానికి వస్తారు

 

💠 ఆలయానికి పక్కనే పెద్ద చెరువు ఉంది. 

ఈ చెరువు పెద్ద రకాల తాబేళ్లు మరియు చేపలకు నిలయం. కొన్ని తాబేళ్లు వందల సంవత్సరాల నాటివని నమ్ముతారు.

100 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న తాబేళ్లు కొన్ని ఉన్నాయని నమ్ముతారు. 


💠 తాబేళ్లు భగవంతుని రూపమని, అందుకే తాబేళ్లను ఎవరూ చంపరని ఈ ప్రాంతంలోని స్థానికులు విశ్వసిస్తారు. 

ఆలయంలో మరియు చుట్టుపక్కల ఉన్న మరొక ఆకర్షణ ఏమిటంటే, జింకలు, కొండచిలువ మరియు ఇతర జంతువులు వంటి అడవి జంతువులు కూడా నాగశంకర్ ఆలయాన్ని సందర్శించినప్పుడు చూడవచ్చు మరియు జంతువులు ఆలయ వాతావరణాన్ని మరింత ఆకర్షణీయంగా ఉంచుతాయి.


💠 నాగశంకర్ ఆలయానికి సమీపంలోని విమానాశ్రయం తేజ్‌పూర్ విమానాశ్రయం మరియు సమీప రైల్వే స్టేషన్ తేజ్‌పూర్ రైల్వే స్టేషన్.

ఇది తేజ్‌పూర్ పట్టణం నుండి దాదాపు 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. 

తేజ్‌పూర్ విమానాశ్రయం ప్రధాన నగరం నుండి దాదాపు 40 కిమీ (25 మై)దూరంలో ఉంది మరియు దీనికి 30 నుండి 40 నిమిషాల ప్రయాణం మాత్రమే పడుతుంది.

పరాశర మాధవీయె*

 *కలౌ బ్రాహ్మణ నిందా న కర్తవ్యా!* ఇతి

 *పరాశర మాధవీయె* 


కలౌహి పాపబాహుళ్యం దృశ్యతే స్మర్యతే2 పిచ|

నరాః ప్రాయో2ల్ప సామర్ధ్యాస్తేషామనుజి ఘృక్షయా|| 


సమకోచ యదాచారం

ప్రాయశ్చిత్తం వ్రతాని చ|

తేషాం నిందా న కర్తవ్యా  యుగరూపాహి తే ద్విజాః|


కలియుగమునందు

అనేక పాపములు స్మరించ బడుచున్నవి కనబడుచున్నవి!

కలియుగంలో మనుషులందరూ

కఠినమైన ఉపవాసాది నియమాలు

ఆచరించ సామర్థ్యం లేని వారు కావున

వారిపైన దయతో

ఆచారములను తగ్గించి,

ప్రాయశ్చిత్త వ్రతా దులు చెప్పబడినవి!

    అలాంటి అల్పవ్రత నిష్ఠా పరులైన బ్రాహ్మణులను నిందించరాదు!

ఎందుకనగా *కలి* సంబంధమైన వ్యక్తిత్వం కలవారు కనుక!

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 123*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 123*


🔴 *రాజనీతి సూత్రాణి - రెండవ అధ్యాయం* :


📕 *ఇష్టమైన ఆయా కార్యాలు సాధించే ఉపాయాలు* : 📕


1. అర్ధమూలం సర్వం కార్యమ్ యదల్ప ప్రయాత్నాత్ కార్యం భవతి 

(అన్ని కార్యాలకూ మూలం ధనం. ఉన్నవాడు స్వల్పప్రయత్నంతోనే కార్యం సాధిస్తాడు.) 


2. ఉపాయపూర్వం కార్యం న దుష్కరం స్యాత్ (ఉపాయంతో చేసే పనిలో శ్రమ ఉండదు.) 


3. అనుపాపూర్వం కార్యం న దుష్కరం స్యాత్ (ఉపాయం లేకుండా చేసినా పని జరిగినా కూడా చెడిపోతుంది.) 


4. కార్యార్థినాముపాయ ఏవ సహాయః 

(పనులు తలపెట్టినవారికి నిజమైన సహాయం ఉపాయమే.) 


5. కార్యం పురుషకారేణ లక్ష్యం సంపద్యతే (పురుషప్రయత్నం సరిగా చేస్తే కార్యస్వరూపం స్పష్టంగా కనబడుతుంది. అప్పుడు లక్ష్యాన్ని సాధించవచ్చు.) 


6. పురుషకారమనువర్తతే దైవమ్ 

(దైవం పురుషప్రయత్నాన్ని అనుసరించి ఉంటుంది. పురుషప్రయత్నం చేస్తే దైవం దానంతట అదే తోడ్పడుతుంది.) 


7. దైవం వినాతిప్రయత్నం కరోతి తద్విఫలమ్ 

(దైవం ప్రతికూలంగా ఉన్నప్పుడు ఎంత ప్రయత్నం చేసినా అది వ్యర్థమే అవుతుంది.) 


8. అసమాహితస్యకార్యం న విద్యతే 

(బుద్ధి నిలకడలేనివానికి పనులేమిటి ?) 


9. పూర్వం నిశ్చిత్య పశ్చాత్కార్యమారభేత

(ఎలా చెయ్యాలో ముందు నిశ్చయించుకున్న తర్వాత ఆ పని ప్రారంభించాలి.) 


10. కార్యాంతరే దీర్ఘసూత్రతా న కర్తవ్యా 

(కార్యం ప్రారంభించిన తర్వాత మధ్యలో తెగతెంపులు లేని ఆలోచనలు చెయ్యకూడదు.) 


11. న చలచిత్తస్య కార్యావ్యాప్తిః 

(చపలచిత్తుడు ఏ పని చేయలేడు.) 


12. హస్తగతావమానాత్ కార్యవ్యతిక్రమో భవతి (చేతిలో ఉన్నదాన్ని చిన్నచూపు చూస్తే కార్యం చెడుతుంది.) 


13. దోషవర్జితాని కార్యాణి దుర్లభాని 

(దోషాలు లేని కార్యాలు అంటూ ఉండవు.) 


14. దురనుబస్థం కార్యం నారభేత 

(చెడుగా పరిణమించే కార్యాన్ని ప్రారంభించకూడదు.) 


15. కాలవిత్ కార్యం సాధయేత్ (సమయాసమయాలు తెలిసినవాడు కార్యం సాధించగలుగుతాడు.) 


16. కాలవితిక్రమాత్ కాల ఏవ ఫలం పిబతి (సమయం దాటబెడితే కాలమే ఫలాన్ని మింగేస్తుంది.) 


17. క్షణం ప్రతి కాలవిక్షేపం న కుర్యాత్ సర్వకార్యేషు (ఏ పని విషయంలోనూ ఒక్క క్షణమైనా ఆలస్యం చెయ్యకూడదు.) 


18. దేశకాలవిభగౌ జ్ఞాత్వా కార్యమారభేత 

(ఏ దేశంలో ఏ కాలంలో ఏమి చెయ్యాలో తెలుసుకుని పని ప్రారంభించాలి.) 


19. దైవహీనం కార్యం సుసాధ్యమపి దుస్సాధ్యం భవతి 

(సులభంగా జరగవలసిన పనికూడా దైవం ప్రతికూలంగా ఉంటే కష్టసాధ్యమవుతుంది.) 


20. నీతిజ్ఞో దేశకాలౌ పరీక్షతే 

(నీతి తెలిసినవాడు దేశాన్ని, కాలాన్ని జాగ్రత్తగా పరీక్షించుకోవాలి.) 


21. పరీక్ష్యకారిణి శ్రీ శ్చీరం తిష్టతి 

(ఏ పనైనా పరీక్షించి చేసేవాడి దగ్గర లక్ష్మి చాలా కాలం ఉంటుంది.) 


22. సర్వాశ్చ సంపద సర్వోపాయేన పరిగృహ్నీయాత్ (అన్ని ఉపాయాలూ ప్రయోగించి అన్ని సంపదలూ సమకూర్చుకోవాలి.) 


23. భాగ్యవంత మప్యపరీక్ష్యకారిణిం శ్రీపరిత్యజతి (విషయం బాగా తెలుసుకొని ఊహించుకొని పరీక్ష చెయ్యాలి.) 


24. యో యస్మిన్ కర్మణి కుశలస్తం తస్మిన్నేవ యోజయేత్ 

(ఎవడికి ఏ పనిలో నేర్పు ఉందో వాడిని ఆ పనిలోనే నియమించాలి.) 


25. దుఃసాధమపి సుసాధం కరోత్యుపాయజ్ఞః (ఉపాయం తెలిసినవాడు కష్టమైన కార్యాన్ని కూడా సులువుగా చేసేస్తాడు.) 


26. అజ్ఞానినా కృతమపి వ బహుమనస్తవ్యమ్: యాదృచ్చికత్వాత్ 

(తెలివి తక్కువవాడు ఏదైనా సాధించినా వాడిని మెచ్చుకోకూడదు. ఎందుచేతనంటే అతడా పని యాదృచ్ఛికంగా చేయగలిగాడు.) 


27. కృపయో పి హి కదాచిద్రూపాంతరాణి కుర్వంతి (పురుగులు కూడా కర్ర దొలచి కొన్ని ఆకారాలు తయారుచేస్తాయి. కదా.) 


28. సిద్దస్థైవ కార్యస్య ప్రకాశనం కర్తవ్యమ్ 

(కార్యాన్ని పూర్తి చేశాకే పైకి ప్రకటించాలి.) 


29. జ్ఞానవతామపి దైవమానుషదోషాత్ కార్యాణి దుష్యంతి 

(ఎంత తెలివైనవాళ్ళయినా దైవదోషం చేత, మానవదోషం చేతా కార్యాలు చెడిపోతుంటాయి.) 


30. దైవం దోషం శాంతికర్మణా వినివారయేత్ (దైవదోషాన్ని శాంతికర్మలు చేసి నివారించుకోవాలి.) 


31. మానషీం కార్యవిపత్తం కౌశలేన వనివారయేత్ (మనుష్యుల వల్ల కలిగే కార్యవిఘాతాన్ని నేర్పుతో తప్పించుకోవాలి.) 


32. కార్యవిత్తౌ దోషాన్ వర్ణయంతి బాలిఇశాః 

(కార్యం చెడిపోతే మందబుద్ధులు తమ ప్రయత్నలోపం అని చెప్పకుండా ఏవేవో దోషాలు వర్ణించి చెబుతారు.) 


33. కార్యార్థినా దాక్షిణ్యమ్ న కర్తవ్యమ్ 

(పని కావలసినవాడు అనవసరంగా మొహమాట పడకూడదు.) 


34. క్షీరార్థీ వత్స మాతురూథః ప్రతిహంతి 

(పాలుకోరే లేగదూడ తల్లి పొదుపు పొడుస్తుంది.) 


35. అప్రయత్నాత్ కార్యవిపత్తి ర్భవేత్ 

(సరిగా ప్రయత్నం చేయకపోతే కార్యం చెడిపోతుంది.) 


36. న దైవమాత్రప్రమాణానాం కార్యసిద్ధి 

(అన్నిటికీ దైవమే ఉన్నదనుకొనేవాళ్ళకు పనులు జరగవు.) 


37. కార్యబాహ్యోన పోషయత్యాశ్రితాన్ 

(ఏ పనులూ చేయలేనివాడు తన వాళ్ళని పోషించజాలడు.) 


38. యః కార్యం న పశ్యతి సో స్థః 

(కార్యాన్ని గుర్తించనివాడే గుడ్డివాడు.) 


39. ప్రత్యక్షపరోనుమానైఃకార్యం పరీక్షేత 

(ప్రత్యక్షంగా చూచి, పరోక్షంగా ఇతరులవల్ల విని తాను ఊహించుకొని కార్యాన్ని పరీక్షించాలి.)


40. అపరీక్ష్యకారిణం శ్రీ పరిత్యజతి 

(పరీక్షించకుండా పనులు చేసేవారిని లక్ష్మీ త్యజిస్తుంది.) 


41. పరీక్ష్య తార్యా విపత్తి 

(ఆపద వచ్చినప్పుడు బాగా పరీక్షించి దాన్ని దాటాలి.) 


42. స్వశక్తీం జ్ఞాత్వా కార్యమారభేత 

(తనకి ఎంత శక్తి ఉందో తెలుసుకొని ప్రారంభించాలి.) 


43. స్వజనం తర్పయిత్వా యః శేషభోజీ సో మృతభోజీ 

(తనవాళ్ళ కందరికీ తృప్తి కలిగించి మిగిలినది భుజించేవాడు అమృతభోజి (అమృతం తినేవాడు).)


44. సమ్యగనుష్టానాదాయముఖాని వర్ధంతే (పనులు సక్రమంగా నిర్వహించడంవల్ల రాబడికి దారులు పెరుగుతాయి.) 


45. నాస్తి భీరో కార్యచింతా 

(పిరికివాడు ఏ కార్యాన్ని గుర్చీ ఆలోచించజాలడు.) 


46. స్వామినః శీలం జ్ఞాత్వా కార్యార్థీ కార్యం సాధయేత్ 

(పని కావాల్సినవాడు ప్రభువు స్వభావం ఎలాంటిదో తెలుసుకొని తన పని సాధించుకోవాలి.) 


47. ధేనో శీలం జ్ఞాత్వా కార్యార్థీ కార్యం సాధయేత్ (ఆవు స్వభావం తెలిసినవాడే దాని పాలు త్రాగగలుగుతాడు కదా.)


48. క్షుద్రే గుహ్యప్రకాశనమాత్మవాన్ న కుర్యాత్ (తెలివైనవాడు నీచబుద్ధికి రహస్యవిషయాలు చెప్పకూడదు.) 


49. ఆశ్రితై రప్యపమన్యతే మృదుస్వభావః (మెత్తటివాడిని ఆశ్రితులు కూడా అవమానిస్తారు.) 


50. తీక్ష్ణ దండ సర్వేషాముద్వేజనీయో భవతి (తీక్షణంగా శిక్షించేవాడ్ని అందరూ ఏవగించుకుంటారు.) 


51. యథార్హదండకారీ స్యాత్ 

(తగు విధంగానే శిక్ష విధించాలి.) 


52. అల్పసారం శ్రుతవంతమపి న బహుమన్యతే లోకః 

(ఎంత చదువుకున్నవాడైనా శక్తి లేనివాడ్ని లోకం గౌరవించదు.) 


53. అతిభారః పురుషమవసాదయతి 

(ఎక్కువ కార్యభారం మనిషిని కృంగదీస్తుంది.) 


54. యః సంసది పరదోషం శంసతి స స్వదోషబహుత్వమేవ వ్రఖ్యాపయతి 

(పదిమందిలో ఇతరుల దోషాలను గూర్చి చెప్పేవాడు తనలో ఉన్న దోషాలను చాటి చెప్పుకున్న వాడవుతాడు.) 


55. ఆత్మానమేవ నాశయత్యనాత్మవతాం కోపః (తనను తాను అదుపులో ఉంచుకొనలేనివాని కోపము తననే నశింపజేస్తుంది.) 


56. నాస్త్యప్రాప్తం సత్యవతామ్ 

(సత్యమే పలికేవాళ్ళకి లభ్యం కానిదంటూ ఉండదు.) 


57. న కేవలేన సాహసేన కార్యనసిద్దర్భవతి (సాహసం చేత మాత్రమే పనులు జరగవు.) 


58. వ్యసనార్తో విస్మరత్యవశ్యకర్తవ్యాన్ (వ్యసనాలలో చిక్కుకొన్నవాడు తప్పనిసరిగా చేయవలసిన పనులు కూడా మరిచిపోతాడు.)


59. నా స్త్యనంతరాయః కాలవక్షేపే 

(కాలవిలక్షేపం చేస్తూ పోతే పనికి విఘ్నాలు కలుగుట తథ్యం.) 


60. ఆసంశయవినాశాత్ సంశయవినాశఃశ్రేయాన్ (నిస్సంశయమైన వినాశం కంటే సంశయవినాశం మేలు.) 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సూర్య భగవానుడు

 సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు.ఆరోగ్య ప్రదాత..మహా శక్తి మంతుడు..సకల శాస్త్రపారంగతుడు..కశ్యపునికి,అదితి కి విష్ణువు అనుగ్రహముతో జన్మించాడు.. ఈ "సూర్యునికి" 7 గుర్రాల రథం ఉందని అందరూ అనుకుంటారు..కానీ వారి రథానికి వుండే అశ్వము ఒక్కటే..సూర్యునికి "సప్తమి" అను పేరు కూడా ఉంది.."ఏకో అశ్వ సప్తమాన"...అదే "సప్త" అని పేరు పొందినది..ఆ ఏక కాంతిని సప్త వర్ణాలుగా విశ్లేషించి సప్తాశ్వాలుగా ఋషులు దర్శించారు."అరుణ కేతుకం" ప్రకారం సూర్యునికి "సప్త"  (వేగవంతమైన) అనే అశ్వం ఉంది.ఇది సూర్యుని రథము యొక్క పేరు.. అదే అశ్వము కూడా..అంతే గానీ ఆయన రథానికి 7 అశ్వాలు లేవు...ఆ "సప్త" కు ఒకే చక్రం..అది సంవత్సరానికి సంకేతం..ఆ చక్రానికి ఉన్న 6 ఆకులు 6 ఋతువులకు చిహ్నాలు.. సూర్యుని కిరణాలలో నుండి  ప్రధానంగా 7 కిరణాలు వెలువడుతాయి.. అవి 1. సుషుమ్నము.2.హరి కేశము.3. విశ్వవ్యచ 4.సంపద్వసు.5.అర్యాస్వం 6.సర్వాద్వసు           7. విశ్వ స్రవ... ఇవే సప్త చందస్సులు..సప్త వర్ణాలు.సప్త లోకాలు...ఇలా అనేకం..ఇవి అన్నీ కూడా "సప్త" అనే రథం వల్ల లేదా అశ్వం వల్ల  ప్రభావితం అవుతున్నాయని వేదమంత్రం చెబుతోంది.." సప్తయుంజంతి రథ మేక చక్రం ఏకో అశ్వోవహతి సప్తనామా" అంటూ ఉంది ఋగ్వేదం... ఆదిత్యుడు,కాశ్యపేయుడు అని కూడా సూర్యునికి పేర్లు..ఆదిత్యునికి నమస్కరిస్తే జన్మ జన్మ పాపాలు పటాపంచలు అవుతాయి.." "చక్షో సూర్యో అజాయతే" అని మరో వాక్యం కూడా ఉంది...అంటే సాధారణ చక్షువులతో (కన్నులు)ఇతరులు చూడటానికి వీలు కానివాడు  అని అర్థం.. అలాగే "భగవద్గీత" లోని "విభూతి యోగం" లో "ఆదిత్యానాం మహా విష్ణుః" అనీ, " జ్యోతిషామ్ రవి  రంశుమాన్" అని శ్రీకృష్ణుడు చెప్పాడు.."పంచాయతనం" అనే అర్చనా విధానాన్ని ( ఆదిత్య,అంబిక,విష్ణు,గణనాథ,ఈశ్వర) శంకర భగవత్పాదుల వారు ఏర్పరచారు..అందుకే మనం ప్రభాకరుణ్ణి  ప్రధాన దైవం గా, ప్రత్యక్ష దైవం గా ఆరాధిస్తూ ఉన్నాము...."మాఘ శుద్ధ సప్తమి "  వీరి జన్మ తిధి...దీనినే "రథ సప్తమి" గా విశిష్టమైన పర్వదినంలా చేసుకుంటాము... ఓం సూర్య దేవాయ నమః.....ఆ సూర్య భగవానుని ఆశీస్సులు అందరిపై ఉండాలని, సదా ఆరోగ్యవంతులుగా జీవించాలని  మనసారా కోరుకుంటూ ఉన్నాను....... శుభంభూయాత్!

శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర🪔

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🪔శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర🪔*


                     *శ్రీ గణేశాయ నమః* 


 *శుక్లాం భరదరం విష్ణుం శశి వర్ణం చతుర్ భుజం* 

 *ప్రసన్న వదనం ద్యాయేత్ సర్వ విఘ్నోపశాన్తయేత్* 


 *వక్ర తుండ మహా కాయ సూర్య కోటి సమ ప్రభ* 

 *నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా!* 


 *శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -1*


✍️  *సంకలన కర్త:*

 *శ్రీ జొన్నలగడ్డ మల్లికార్జున శర్మ గారు.*


          🍁🍁🍁🍁🍁


ఒకనాడు శౌనకాది మునిపుంగవులు సూతుల వారిని సకల ఇష్టార్థ సిద్ధి ప్రదంబగు పుణ్యస్థలం బేదియయి యున్నది? 


శ్రీమన్నారాయణుడు భూలోకమునకు మానవుల పూజల బొందుటకు భూతలమునకు విచ్చేయుట, దానికి సంబంధించిన కథలను మాకు చెప్పవలసినది అని ప్రార్ధించిరి. 


అంతట సూతులవారు – మునులారా! 


భూలోకము మొత్తము మీద శ్రీవేంకటాచలము శ్రేష్ఠతరమయిన పుణ్యస్థలము, అందు శ్రీమహావిష్ణువు వేంకటేశ్వరుడై కలియుగమున దైవమై భక్తుల కోరికలీడేర్చుచుండును


తన  భక్తుల కోరికలను తీర్చుటయందు శ్రీవేంకటేశ్వరుని ముందు సర్వదైవములున్నూ తీసికట్టుగానేయుందురు. 


అనగా విని శౌనకాదులు మహానుభావా


ఆ మహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరుడైన విధము,

 ఆ శ్రీ వేంకటేశ్వరునికి చెందిన అనేకానేక లీలలను, మాకు తెలియజెప్పి, పుణ్యము కట్టుకొనుమనీ, తమ్ము మహానంద భరితులుగా నొనర్చవలసినదనిన్నీ కోరిరి. 


అంతట సూతులవారు మునీశ్వరులారా! నేను ఆ మహిమాన్వితుని వేంకటేశ్వరుని లీలలు చెప్పుట కెంతటివాడను,


 కాని మీరు ఆసక్తితో భక్తిశ్రద్ధలతో వినకోరెదరని నేను భావించి శ్రీ వేంకటేశ్వరునకు చెందిన యేవియో కొన్ని లీలలను చెప్పగలవాడను అని తన సహజ వినయమును ప్రకటించుకొని హృదయము గురువైన వేదవ్యాసుని తలపోసెను.


 అట్లు వేదవ్యాసుని తలచుకొనుట వలన సూతులవారికి తాను శౌనకాదులకు చెప్పబోవు కథా విశేషములు అన్నియు కళ్ళకు కట్టినట్లు అవగతమయ్యెను. అనంతరము శౌనకాది మహర్షులతో యిట్లు చెప్పసాగినారు.


మునులారా! నారదుడు మహాభక్తుడు. అతడు మఱి యెవరోకాడు. సాక్షాత్తూ బ్రహ్మదేవుని కుమారుడే, భగవద్భక్తులను అభిమానించు నారదుడు సజ్జనుల పాలిట కామధేనువుగ నుండి గర్వముతో పెటపెటలాడువారిని ఒక చూపు చూసి గర్వపు కోరలనుతీసి వినోదించు స్వభావము కలవాడు. 


నిరంతరము శ్రీమన్నారాయణుని నామస్మరణతో పరవశుడై గానము చేయుచూ యెచ్చట నాటంక మనునది లేకయే త్రిలోకములలో సంచరించు నారదుని మహిమ నారాయణునకు తెలియును. 


నారాయణుని లీలలు నారదునకు తెలియవలసినంతగా తెలియును.


ఒకనాడు తన జనకుడగు బ్రహ్మదేవుని సందర్శించుటకై సత్యలోకమునకు ప్రయాణమయి వెడలినాడు. 


పద్మాసనమున నాలుగు మోములతో చక్కగ కూర్చునియున్నాడు బ్రహ్మ, ఆయన భార్య అందాల రాశి, చదువుల తల్లియయిన సరస్వతీదేవి వీణ పై సామగానము చేస్తూ భర్తచెంత కూర్చోని యున్నది. 


ఇంద్రుడు మున్నగు దిక్పాలకులు, సూర్యుడు మున్నగు కాంతులీను గ్రహములూ, అనేక మంది మునులు, ముఖ్యముగా సప్తఋషులు, అప్పటికే ఆ సభలో తము అర్హమైన ఆసనముల నలంకరించియుండిరి.


అటువంటి మహాసభకు నారద మునీంద్రుడు విచ్చేసి వినయ పూర్వకంగా బ్రహ్మ, సరస్వతులకు నమస్కరించాడు. వారు నారదుననుగ్రహించి దీవించినారు. 


నారదుడు ఆ సభకు వచ్చుట సభాసదులకాసక్తికరముగా నుండెను. కారణము నారదుడు త్రిలోక సంచారి కదా. అతడు దేవతల వద్దకు వెడలును, రాక్షసుల వద్దకు వెడలును ఆయన ఎక్కడకు వెడలినను అడ్డు ఆపులుండవు కదా!


 అందువలన అచ్చటి విశేషము లిచ్చటను, ఇచ్చటి విశేషము లచ్చటను ముచ్చటించుట ఆయన కుండనే యున్నది. 


అందువలననే నారదాగమనం ఆనందకరమగుట బ్రహ్మదేవుడు తనయుని ఉచితాసనమలంకరింపజేసి యిట్లనెను –


 కుమారా! నారదా! నీవు మహాభక్తులలో ఒకడవు. లోకోపకార కార్యక్రమములు నిర్వహించుటయందు నీ ఆసక్తి, శక్తి నాకు తెలియనివి కావు. 


నీచే నాకొక మహాకార్యము జరుగుదగియున్నది. అందువలన నీ వర్హుడవని నేననుకొందును. ఇంతకు అది ఏమన...


మానవులందరూ దైవభక్తియనునది దానంతయులేక నాస్తిక భావములతో నజ్ఞానాంధ కారమున కొట్టుమిట్టాడుచున్నారు. మూర్ఖభావములు కలిగి, ఆ మనుష్యులు బరితెగించి యిష్టము వచ్చినట్లు చేయరాని పాపము లెన్నియో చేస్తూ యున్నారు. 


తల్లితండ్రుల మాటలు పిల్లలు వినుట లేదు. భర్తల మాటలకు భార్యలు విలువనిచ్చుట లేదు. పెద్దవారిని గౌరవించుట, గురువుల పట్ల భక్తి కలిగియుండుట యివి భూలోకమున నీ కలియుగమున నల్లపూసలగుచున్నవి. 


ఇవి అన్నియు మానవులందు పొడజూపుటకు కారణము యీ సర్వలోకము లకూ సర్వగ్రహ నక్షత్రాదులకు మొత్తము మీద సర్వ ప్రకృతి సృష్టికి కారకుడైన దైవము యొక్క చింతన లేకపోవుటయే. 


పైగా యీ కలియుగమందు శ్రీమహావిష్ణువుయొక్క అవతారము లేకపోయెను. కనుక, నారదా! ఇంతకూ నేను చెప్పబోవునదీ, నీవు చేయవలసినదీ యేమనగా నీ యొక్క నేర్పు చూపించి, యోచించి యెట్లయిననూ శ్రీమహావిష్ణువు భూలోకమున అవతరించునట్లు చేయవలెను. 


దానివలన మానవ కళ్యాణమగును. మరల భూలోకవాసులందు ఆస్తికత్వము ప్రబలుటకు వీలుండును అనెను.


 సభలో గల ఇంద్రాదులకు బ్రహ్మదేవుని ఆలోచన ఆనందమును రేకెత్తించినది. జనకుని మాటలను శ్రద్ధగా విని, నారదుడు తానా పనిని చేయబూనుట లోకోపకారమని భావించి చేయుటకు నిశ్చయించుకొని మరల తండ్రికి నమస్కరించి శెలవు గైకొని వీడి వెడలినాడు.


కశ్యపాది మహర్షులు గంగానది ఒడ్డున కలియుగ రక్షణార్థం క్రతువు చేయ నిర్ణయించారు.

 యజ్ఞం ఆరంభించే సమయానికి నారదుడు అక్కడకు వచ్చి, అక్కడ ఉన్న కశ్యప, ఆత్రేయ, మార్కండేయ, గౌతమాది మహర్షులను చూసి, ఆ మహర్షులను

 క్రతువు దేనికొరకు చేస్తున్నారు, 

యాగఫలాన్ని స్వీకరించి కలియుగాన్ని సంరక్షించే వారు ఎవరు అని 


ప్రశ్నను వదలి నారదుడు వెడలిపోగా వారలు చర్చించుకొనసాగిరి. 


కొందరు మునులు ‘‘బ్రహ్మ గొప్పవాడని కొందరు ‘‘కాదు విష్ణువే గొప్పవా’’డనిరి. మరికొందరు ‘కాదు’ శంకరుడు గొప్పవాడనిరి.


 తుదకు ఆయన గొప్పవారు, ఈయన గొప్పవారని అనుట నుండి ఈయన తక్కువవారు ఆయన తక్కువవారని అనుటవరకు దిగినది. చిలికి చిలికి గాలివాన అయినది. 


వాదోపవాదములు పెచ్చు పెరిగినవి. ఇవి వినిన కొందరు పెద్దలు ‘‘ఋషులారా! న్యాయా న్యాయములు, ధర్మసూక్ష్మములు, నీతి సూత్రములు ప్రకటించు అర్హత గలిగిన మీరు ఈ విధముగ తర్జన భర్జనలతో పరస్పర నిందలతో అసలు పని మరచుట న్యాయమా? నారదుడు విజ్ఞాన సంపన్నుడు, ఆయన మనకు చాలా ముఖ్యమైన ఒక సమస్యను గుర్తుకు తెచ్చి వెడలినాడు. 


మనము కార్యశూరులమయి సమస్యను పరిష్కరించు మార్గమును కనుగొనవలెనే కాని వ్యర్ధ వాదోపవాదములు కిది తగిన కాలము కాదు గదా అనిరి. 


‘‘సత్త్వగుణము, రజోగుణము, తమోగుణము అను త్రిగుణములందున సత్త్వగుణమే మహోన్నతము కదా! అందువలన త్రిమూర్తులలో సత్త్వ గుణ ప్రధానుడెవ్వరో గ్రహించుట శ్రేయస్కరము. 


మునులారా! మీ యందరి యందును త్రిమూర్తులను పరీక్షింపగల సమర్థుడెవ్వరో యాతనిని ఎంపిక చేసి పంపుడు, అందువలన మన సందేహము తీరుట జరుగును’’ అని కూడ ప్రవచించిరి. 


మునులు దాని కంగీకరించినారు. కాని అది కత్తి పై సాము వంటిది అని వారికి తెలియకపోలేదు. 


సరే ఎవ్వరిని పంపిన బాగుండునని బాగుగా యోచించసాగిరి మునీశ్వరులు, అంతలో కొంతమంది మన మునులలో ఘనుడగువాడు ఒక్క భృగువు మాత్రమే, అతడు మహా తపస్సును చేసి శక్తిని సంపాదించినవాడు. 


ఆయన మాత్రమే ఈ మహా కార్యమును నిర్వహించుటకు సమర్ధుడు అని వారు పలికినారు


ఇది అంతయు శ్రద్ధతో ఆలకించు చున్న మునులందరూ మహానుభావ అటువంటి మహోన్నత వ్యక్తి ,విష్ణుస్వరూపుడైన భృగు మహర్షి చరిత్రను మాకు తెలియజేయ వలసినదిగా కోరినారు 


దానికి సూతమహర్షి చిరు మందహాసముతో ఆ వృత్తాంత మంతయు తెలియజేయుటకు సంకల్పించినారు .


 

 *శ్రీనివాస గోవిందా, శ్రీ వేంకటేశా గోవిందా,* 

 *భక్తవత్సల గోవిందా, భాగవతప్రియా గోవిందా; |* 


 *గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా* *హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||1|* |


శ్రీవేంకటేశ్వరునిదివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.


 *ఓం నమో వెంకటేశాయ*


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

పండితవర్యుల నెయ్యము

 సుభాషితమ్

             ll శ్లోకం ll


పణ్దితైస్సహ సాఙ్గత్యం

పణ్దితైస్సహ సంకథాః।

పణ్దితైస్సహ మిత్రత్వం

కుర్వాణో నావసీదతి॥


తా𝕝𝕝 

*పండితులతో సహవాసం, పండితులతో....మాటలాడుట.....పండితులతో మైత్రి* - వీటిని ఆచరించువాడు నాశమునొందడు.....



పండితవర్యుల నెయ్యము

పండితులను కూడి యుంట

భాషించుటయున్

మెండుగ కల్గిన మానవు 

డుండును నాశమ్ములేక నుర్విన్ సుఖిగన్


గోపాలుని మధుసూదన రావు