27, సెప్టెంబర్ 2023, బుధవారం

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* *🚩జీవిత గాథ🚩* *భాగం 49*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


     *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 49*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


శ్రీరామకృష్ణులు నరేంద్రునితో తమ దివ్యదర్శనాలను గురించి ముచ్చటించారు. నరేంద్రుడు వాటిని నమ్మలేదు. అంతా విన్న అతడు చివరకు. "ఈ దృశ్యాలు నిజం కావు. అవి మీ మనోభ్రాంతి జనితాలు" అని తేల్చివేశాడు. శ్రీరామకృష్ణులు చలించిపోయారు. “ఏయ్, ఏమంటున్నావు నువ్వు? ఆ దేవతలు

నాతో మాట్లాడుతున్నారు" అన్నారు శ్రీరామకృష్ణులు. "అలాగే అనిపిస్తుంది" అని నరేంద్రుడు తేలిగ్గా కొట్టిపారేశాడు. శ్రీరామకృష్ణులు దిగ్రృమ చెందారు. 


నరేంద్రుడు సత్యనిష్టాపరుడు. కనుక అతడు చెబుతున్న దాన్లో పొర పాటు ఉండదని శ్రీరామకృష్ణులకు అచంచలమైన విశ్వాసం. తాను దర్శించిన దేవతా రూపాలన్నీ మనోకల్పిత జనితాలని అతడు చెప్పినప్పుడు శ్రీరామకృష్ణులు గందరగోళ స్థితిలో పడిపోయారు. ఆయన ఉన్నత చైతన్య స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటివి విన్నప్పటికీ నవ్వేసేవారు. ఇతర సమయాలలో ఇలాంటి భావనలు ఆయనను గందరగోళానికి లోనుచేస్తాయి. అది చెబుతున్నది నరేంద్రుడనే ఏకైక కారణం వలననే ఆ గందరగోళం.


ఇప్పుడు కూడా గందరగోళానికి లోనైన శ్రీరామకృష్ణులు తిన్నగా కాళికాలయం వాకి వెళ్లి తమ సమస్యను ఆమెకు విన్నవించారు. కరుణాస్వరూపిణియైన ఆమె ఆయనతో, “నువ్వెందుకు అతడి మాటలు అంతగా పట్టించుకొంటావు? అతడు కాలుడు. ఇప్పుడు ఇలాగే మాట్లాడతాడు. కాలక్రమాన నువ్వు చెప్పే ప్రతి మాటనూ నిజమని నమ్ముతాడు" అని చెప్పింది. కాళీమాత చెప్పిన మాటలు నరేంద్రునికి చెబుతూ, "ధూర్తుడా! నాలో అపనమ్మకం కలిగించావే! ఇకపై ఇక్కడకు రావద్దు" అన్నారు శ్రీరామకృష్ణులు. నరేంద్రుడు మౌనంగా ఉండిపోయాడు.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

మహాలయ పక్షాలు

 💥మహాలయ పక్షాలు ప్రారంభం అవుతున్నాయి.(30-09-2023 To 14-10-2023)🍁


 💥ఈ పితృస్థుతి ని అందరూ రాసుకొని భద్ర పరచుకొండి. ప్రతీ రోజూ చదువుకోవచ్చు. తల్లిదండ్రులు ఉన్నవారు కూడా చదువుకోవచ్చు. పితృదేవతలు అంటే, జన్యుదేవతలు. బృహద్ధర్మపురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్తుతి. 


💥ఈ స్తోత్రాన్ని శ్రాద్ధ దినములందే కాక ప్రతిరోజూ ఎవరు చదువుతారో వారికి ఈతిబాధలు ఉండవు. ఎవరైనా వారి పితరుల విషయంలో తప్పు చేసి ఉంటే పశ్చాత్తాపంతో ఈ స్తోత్రం చదివితే ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అంతేకాక వారు చదివిన వారిని అనుగ్రహిస్తారు.  ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది. పాపకర్మలు నశించిపోతాయి.


🌿బ్రహ్మ ఉవాచ:

1. నమో పిత్రే జన్మదాత్రే సర్వ దేవమయాయ చ!

సుఖదాయ ప్రసంనాయ సుప్రీతాయ మహాత్మనే!!


2. సర్వ యజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే!

సర్వతీర్థావలోకాయ కరుణాసాగారాయ చ!!


౩. నమో సదా ఆశుతోషాయ శివరూపాయ తే నమః!

సదాపరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ!!


4. దుర్లభం మానుషమిదం యేనలబ్ధం మాయా వపుః!

సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమోనమః!!


5. తీర్థ స్నాన తపో హోమ జపాదీన్ యస్య దర్శనం!

మహా గురోశ్చ గురవే తస్మై పిత్రే నమోనమః!!


6.. యస్య ప్రణామస్తవనాత్ కోటిశః పితృతర్పణం!

అశ్వమేధ శతైః తుల్యం తస్మై పిత్రే నమోనమః!!


💥💥ఫలశ్రుతి:🌿🌿

💥ఇదం స్తోత్రం పిత్రుః పుణ్యం యః పఠేత్ ప్రయతో నరః!

ప్రత్యహం ప్రాతరుత్థాయ పితృశ్రాద్ధదినోపి చ 

స్వజన్మదివసే సాక్షాత్ పితురగ్రే స్థితోపివా 

న తస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞత్వాది వాంఛితమ్ 

నానాపకర్మకృత్వాపి యఃస్తౌతి పితరం సుతః 

సధృవం ప్రవిధాయైవ ప్రాయశ్చిత్తం సుఖీ భవేత్ 

పితృప్రీతికరైర్నిత్యం సర్వ కర్మాణ్యధార్హతి!!

💥ఎవరివలన ఈ జన్మ వచ్చినదో, ఎవరు సకల దేవతా స్వరూపులో ఎవరి ఆశీస్సుల వల్ల సుఖములు కలుగునో అట్టి మహాత్ములైన పితరులకు నమస్కారములు.

💥సకల యజ్ఞస్వరూపులై స్వర్గంలో ఉండే దేవతలతో సమానమైన వారు సకల పుణ్యతీర్థములకు ఆలవాలమైన కరుణాసముద్రులైన పితరులకు నమస్కారములు. 

💥సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించే వారైన శివరూపులకు నమస్కారము. ఆచరించే తప్పులను ఎల్లవేళలా క్షమిస్తూ సంతోషమూర్తులై సుఖములను కలుగజేసే పితరులకు నమస్కారములు.

💥ధర్మాలు ఆచరించడానికి అవకాశమున్న దుర్లభమైన ఈ మానవ శరీరం ఎవరివలన లభించిందో ఆ పితృ దేవతలకు నమస్కారములు.

💥ఎవరిని చూసినంతనే అనేక తీర్థ స్నానములు, తపస్సులు, హోమాలు, జపములు చేసిన ఫలితం కలుగునో మహాగురువులకు కూడా గురువులైన పితృదేవతలకు నమస్కారములు. 

ఎవరిని నమస్కరించినా, తర్పణాదులు చేసినా అవి వందలకొలది అశ్వమేధ యాగములతో సమానమో అటువంటి పితరులకు నమస్కారము...మాతృ దేవో భవ,పితృ దేవో భవ 🌹🙏

మహాభారతములో - ఆది పర్వము*

 *మహాభారతములో - ఆది పర్వము*


         *ప్రథమాశ్వాసము*


                      *7*


*ఉదంకుడు గురుదక్షిణ సమర్పించుట*


గురువు ఉదంకునితో " ఉదంకా ! సమీపంలో ఉన్న పౌష్యమహారాజు నుండి కుండలాలు తీసుకురావడానికి ఇంత సమయం ఎదుకు అయ్యింది " అని అడిగాడు. ఉదంకుడు జరిగిన విషయాలు వివరంగా గురువుకు చెప్పాడు. గురువు " ఉదంకా ! నీవు ధన్యుడివి. ఎద్దును ఎక్కి వచ్చిన వాడు ఇంద్రుడు. ఆ ఎద్దు ఐరావతం. గోమయం అమృతం. అది సేవించడం వలనే నీవు అనుకునిన పని చేయగలిగావు. నాగలోకంలో నీవు చూసిన స్త్రీలు దాత, విధాత. నలుపు తెలుపు దారాలే రాత్రి పగలు. పన్నెండు ఆకులు కలిగిన చక్రం పన్నెండు మాసమపలకు ప్రతీక అయిన కాల చక్రం. వారి ఆరుగురు కుమారులు ఆరు ఋతువులు. గుర్రం మీద వచ్చిన దివ్యపురుషుడు ఇంద్రుడి మిత్రుడైన పర్జన్యుడు. గురుపత్ని కోరిక నెరవేర్చి నీవు గురుదక్షిణ సమర్పించుకున్నావు. ఇక నీ విద్యాభ్యాసం పూర్తి అయింది " అని పలికాడు.

అటువంటి విద్య పనికిరాదని

 శ్లోకం:☝️

*విద్యా వినయాఽవాప్తిః*

 *సా చేదవినాయాఽఽవహా ।*

*కిం కుర్మః కం ప్రతి బూమః*

 *గరదాయాం స్వమాతరి ॥*


భావం: సాధారణంగా విద్య వల్ల వినయం లభిస్తుంది. *విద్యా దదాతి వినయం* కాని అది గర్వాన్ని ప్రేరేపిస్తే మనం ఏమి చేయాలి? స్వంత తల్లే విషమిచ్చే దానిలాగా మారినప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? విద్య ద్వారా వినయము పొందకపోతే, అటువంటి విద్య పనికిరాదని భావం.

పంచాంగం 27.09.2023 Wednesday,

 ఈ రోజు పంచాంగం 27.09.2023 Wednesday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస శుక్ల పక్ష: త్రయోదశీ  తిధి సౌమ్య వాసర: ధనిష్ఠ తదుపరి శతభిషా నక్షత్రం ధృతి తదుపరి శూల యోగ: కౌలవ తదుపరి తైతుల కరణం ఇది ఈరోజు పంచాంగం.

త్రయోదశీ  రాత్రి 10:17 వరకు.

ధనిష్ఠ ఉదయం 07:09 వరకు తదుపరి శతభిషం రా.తె 04:28 వరకు.

సూర్యోదయం : 06:09

సూర్యాస్తమయం : 06:05

వర్జ్యం : మధ్యాహ్నం 01:33 నుండి 02:58 వరకు.

దుర్ముహూర్తం : పగలు 11:43 నుండి 12:31 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.


యమగండం : పగలు 07:30 నుండి 09:00 వరకు.  



శుభోదయ:, నమస్కార:

జ్ఞానబోధ

 🌹*భగవంతుడిని చూడటం ఎలా*🌹


ఒకరోజు రామకృష్ణ పరమహంస దగ్గరకి ఒక శిష్యుడు వచ్చి ఇలా అడిగాడు. గురువుగారు, అసలు భగవంతుడుని చూడటం ఎలా? భగవత్ తత్వం ఎలా అవుతుంది ? దానికి రామకృష్ణులు ఇలా చెప్పారు..


ఒక ఊరిలో ఒక సాధువు ఉండేవాడు. ఒంటి మీద చొక్కా లేకుండా నిరంతరం పరబ్రహ్మంతో రమిస్తూ ఉండేవాడు, ఎవరైనా భిక్ష పెడితే తింటూ ఉండేవాడు.


ఒకరోజు ఒక గృహస్థు అతనికి కొంచెం బెల్లం పొంగళి పెట్టాడు. దాన్ని తీసుకొని రొడ్డు చివరన ఆకలితో ఉన్న ఒక కుక్క పక్కనే కూర్చోని దానికోక ముద్ధ నోట్లో పెట్టి, ఆయనొక ముద్ధ తినేవాడు.. ఈ తంతును చూసి దారినపోయేవారు పకపక నవ్వుకునేవారు.. వారిని చూసి ఆ సాధువు ఇలా చెప్పాడు..


“ఎందుకు నవ్వుతున్నారు మీరు.. ఈ కుక్కలో ఉన్నది విష్ణువే, నాలో ఉన్నది విష్ణువే.. నేను తినే పథార్దము విష్ణువే.. విష్ణువు, విష్ణువుని తింటున్నాడు.. విష్ణువుకు పెడుతున్నాడు.. మీరెందుకా నవ్వుతున్నారు విష్ణువు అని నవ్వే వారిలో కూడా భగవంతుడిని చూసాడు ఆ సాధువు.. “


కాబట్టి అర్ధమైందా భగవంతుడు ఎక్కడ ఉంటాడో, అన్నీ జీవులయందు విష్ణువే ఉంటాడు. ఆ పరబ్రహ్మంను జీవులయందు చూడటమే నిజమైన జ్ఞానం. అలా అన్నీ జీవులలో విష్ణువును చూడలేకపోవటమే మాయ అని జ్ఞానబోధ చేసి పంపించాడు పరమహంస..

పద్యం గురించి

 



బెజవాడ ఆలయంలో రాజద్వారం పై ఉండే

ఈ పద్యం గురించి మీకు తెలుసా.


అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ* *దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మాయమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్


విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవెలలో ఇప్పటికీ రాజద్వారం మీద ఈ పద్యం రాసి ఉంటుంది. ఈ పద్యం పైకి ఒకలా కనపడుతుంది. మీరు తెలిసికాని, తెలియకకాని పోతనగారు వ్రాసిన పద్యములు *కొన్ని నోటికి వచ్చినవి మీరు చదివినట్లయితే అవి సత్ఫలితాలనే ఇచ్చేస్తాయి


ఎందుకు అంటే మీరు కొన్ని కొన్ని చదవకూడదు. కొన్ని కొన్ని చేయకూడదు. పక్కన గురువు వుంటే తప్ప మేరువుని, శ్రీచక్రమును ఇంట్లోపెట్టి పూజ చెయ్యలేరు. అది మనవల్ల కాదు. మీరు బీజాక్షరములను ఉపాసన చెయ్యలేరు. అది కష్టం. 


కానీ పోతనగారు ఈ దేశమునకు బహూకరించిన గొప్ప కానుక ఆయన రచించిన భాగవత పద్యములు.


అమ్మలనుకన్న దేవతా స్త్రీలయిన వారి మనస్సులయందు ఏ అమ్మవారు ఉన్నదో అటువంటి అమ్మని మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ – ఈ నాలుగింటికోసము నమస్కరిస్తున్నాను. 


అటువంటి దుర్గమ్మ మాయమ్మ. ’ఇవీ ఆయన ఈ పద్యంలో చెప్పిన విషయములు, మీరు చెయ్యలేని ఒక చాలా కష్టమయిన పనిని పోతనగారు చాలా తేలికగా మీకు ప్రమాదం లేని రీతిలో మీతో చేయించేయడాని కని ఇటువంటి ప్రయోగం చేశారు


అమ్మలగన్నయమ్మ’ – అమ్మలని చెప్పబడ్డవారు ఎవరు? మనకి లలితాసహస్రం ’శ్రీమాతా’ అనే నామంతో ప్రారంభమవుతుంది. ’శ్రీమాతా’ అంటే ’శ’కార ’ర’కార ’ఈ’కారముల చేత సత్వరజస్తమోగుణాధీశులయిన బ్రహ్మశక్తి, విష్ణుశక్తి రుద్రశక్తులయిన రుద్రాణి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి – ఈ ముగ్గురికీ అమ్మ – ఈ మూడు శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ అమ్మ ఎవరు వున్నదో ఆయమ్మ – అంటే ’లలితాపరాభట్టారికా స్వరూపం’ – ఆ అమ్మవారికీ దుర్గాస్వరూపమునకు భేదం లేదు – అందుకని ’అమ్మలగన్నయమ్మ’ ’ముగ్గురమ్మల మూలపుటమ్మ’ – ఆ ముగ్గురు అమ్మలే మనం మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి స్వరూపములుగా కొలిచే తల్లులు. ఈ ముగురమ్మల మూలపుటమ్మ. ’చాల పెద్దమ్మ’ – ఇది చాలా గమ్మత్తయిన మాట. చాల పెద్దమ్మ అనే మాటను సంస్కృతంలోకి తీసుకువెడితే మహాశక్తి – అండపిండ బ్రహ్మాండములనంతటా నిండిపోయిన బ్రహ్మాండమయిన శక్తిస్వరూపం. ఈ శక్తి స్వరూపిణి చిన్నపెద్దా భేదంలేకుండా సమస్త జీవరాశులలోను ఇమిడి ఉంది. అలా ఉండడం అనేదే మాతృత్వం. ఇది దయ. దీనిని సౌందర్యం అంటారు. దయకు సౌందర్యం అని పేరు. అది ప్రవహిస్తే సౌందర్యలహరి.


అండపిండ బ్రహ్మాండములనన్నిటినీ నిండిపోయి ఈ భూమిని తిప్పుతూ, లోకములనన్నిటినీ తిప్పుతూ ఇవన్నీ తిరగడానికి కారణమయిన అమ్మవారు ఎవరో ఆ అమ్మ.


సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ’ – సురారి అనగా దేవతలకు శత్రువయిన వాళ్ళ అమ్మ. అనగా దితి. దితి అయ్యో అని ఏడిచేటట్టుగా ఆవిడకు కడుపుశోకమును మిగిల్చింది. అనగా రాక్షసులు నశించడానికి కారణమయిన అమ్మ. దేవతలలో శక్తిగా ఈమె ఉండబట్టే రాక్షసులు మరణించారు.


తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ’ – ఇదొక గొప్పమాట. అమ్మవారిని మనస్సులో నమ్ముకుని శక్తితో తిరుగుతున్న వారెవరు?


బ్రాహ్మి – మాహేశ్వరి – వైష్ణవి – మహేంద్రి-

చాముండ – కౌమారి –వారాహి–మహాలక్ష్మి


మనకి సంప్రదాయంలో ’అష్టమాతృకలు’ అని ఉన్నారు. వాళ్ళని మనం ఎనిమిది పేర్లతో పిలుస్తూ ఉంటాము. బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, మహేంద్రి, చాముండ, కౌమారి, వారాహి, మహాలక్ష్మి.


ఇలా ఎనమండుగురు దేవతలు ఉన్నారు. వీరిని ’అష్టమాతృకలు’ అని పిలుస్తారు. ఈ అష్టమాతృకలు శ్రీచక్రంలో దేవతలుగా ఉంటారు. వీరు నిరంతరము అమ్మవారిని లోపల కొలుస్తూ, అమ్మవారి వలన శక్తిని పొంది మనని ఉద్ధరిస్తూ ఉంటారు. ఈ ఎనమండుగురునే మనం కొలుస్తూ వుంటాము.


రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సౌభాగ్యసుందరాం వైష్ణవీం శక్తిమద్భుతాం’


అంటారు దేవీభాగవతంలో వ్యాసభగవానుడు. ఈ ఎనమండుగురికీ శక్తినిచ్చిన అమ్మవారెవరో ఆవిడే వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ – దుర్గమాయమ్మ – ఈ దుర్గమ్మ ఉన్నదే లలితాపరాభట్టారిక – ఆవిడ లలితా పరాభట్టారిక – ఆ అమ్మ మాయమ్మ.


మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్’ – ఇప్పుడు ఆవిడ నాకు దయతో మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదలను ఇవ్వాలి. నాకు అర్హత ఉన్నదని ఇవ్వనక్కరలేదు. దయతో ఇచ్చేయ్యాలి.


అమ్మవారికి ’శాక్తేయప్రణవములు’ అని కొన్ని బీజాక్షరములు ఉన్నాయి. ఓం ఐంహ్రీంశ్రీంక్లీంసౌః – ఈ ఆరింటిని శాక్తేయ ప్రణవములు అని పిలుస్తారు. దానిని ఎలాబడితే అలా ఉపాసన చెయ్యకూడదు. కాబట్టి బీజాక్షరములను అన్నివేళలా ఉపాసన చేయలేము. కానీ ఇప్పుడు పోతనగారు ఒక గొప్ప ప్రయోగం చేశారు. మహత్వమునకు బీజాక్షరము ’ఓం’, కవిత్వమునకు బీజాక్షరము ’ఐం’, పటుత్వమునకు భువనేశ్వరీ బీజాక్షరము ’హ్రీం”, ఆ తర్వాత్ సంపదల్ – లక్ష్మీదేవి – ’శ్రీం’.


ఇపుడు ’ఓంఐంహ్రీంశ్రీం’ – అమ్మలగన్నయమ్మ ’శ్రీమాత్రేనమః’.మీరు బీజాక్షరములతో అస్తమానూ అలా అనడానికి వీలులేదు. కానీ మీరు రైలులో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా స్నానం చెయ్యకుండా కూడా ఎక్కడ ఉన్నా కూడా – అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ – అంటున్నారనుకోండి అపుడు మీరు మరోరూపంలో ’ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః’ – ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః’ అనేస్తున్నారు.


మీరు అస్తమాననూ అమ్మను తలచుకున్నట్లు అవుతుంది. అపుడు అమ్మవారు చాలా తొందరగా మీకు పలుకుతుంది. అందుకే లలితా సహస్రం ’శ్రీమాతా’ అంటూ అమ్మతనంతో ప్రారంభమవుతుంది.


ఆవిడ రాజరాజేశ్వరి. అయినా ఆవిడముందు అమ్మా అమ్మా అనేసరికి ఆవిడి పొంగిపోతుంది. ఇన్నిమార్లు ఆ పద్యంద్వారా అటూ ఇటూ అమ్మని మీరు పిలుస్తుంటే విసుక్కోవడం చేతకాని దయాస్వరూపిణి అయిన అమ్మ మీకోరికను తీరుస్తుంది. ఇప్పుడు మీరు ’ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రే నమః’ అనలేకపోవచ్చు.


కానీ ’అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ ’ అనడానికి కష్టం ఏమిటి


ఈవిధంగా పోతనగారు శ్రీవిద్యా రహస్యములన్నిటిని ఔపోసనపట్టి తెలుగు వారందరికీ ఒక మహత్తరమయిన కానుకను బహూకరించిన మహాపురుషుడు ఆయన ఒక ఋషి. అందుకని ఆ పద్యమును అనుగ్రహించినారు.

ఆ తల్లి అనుగ్రహం అందరికీ లభించాలని ప్రార్థిస్తూ

[27/09, 8:45 am] Ch. Satyanarayana: 🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷💐💐💐💐🌷🌾👏💐👏👏👏🙏🌸🙏🌷🌷🌾

ఏకదంతుని ఎల్లప్పుడూ నా స్మరించెదను

 🕉️  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

                  _*భక్తిసుధ*_


𝕝𝕝శ్లోకం𝕝𝕝 


*నితాంతికాంత దంతకాంతి మంతకాంతకాత్మజం*

*అచింత్య రూప మంతహీనమంతరాయకృంతనం*

*హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం*

*తమేకదంతమేవతం విచింతయామి సంతతం*

~గణేశ పంచరత్నమ్-5


𝕝𝕝తా𝕝𝕝

ఎంతో శోభతో ఉన్న దంతము కలవాడు, మృత్యుంజయ కారకుడైన శివుని కుమారుడు, వర్ణనకు, ఊహ ఏకదంతుని కు అందని ఆకారము కలవాడు, అంతము లేని వానికి, విఘ్నాలు, ఆపదలు తొలగించే వానిడు, వసంత ఋతువులాగా యోగుల మనస్సులో నిలిచే వాడు అయిన ఏకదంతుని ఎల్లప్పుడూ నా స్మరించెదను.

Padandi


 

Grahachar


 

గణేశ పంచరత్నమ్* - 5

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝 


*_నితాంతికాంత దంతకాంతి మంతకాంతకాత్మజం_*

*_అచింత్య రూప మంతహీనమంతరాయకృంతనం_*

*_హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం_*

*_తమేకదంతమేవతం విచింతయామి సంతతం_*


_#! *గణేశ పంచరత్నమ్* - 5


*ఎంతో శోభతో ఉన్న దంతము కలవానికి, మృత్యుంజయ కారకుడైన శివుని కుమారునికి, వర్ణనకు, ఊహకు అందని ఆకారము కలవానికి, అంతము లేని వానికి, విఘ్నాలు, ఆపదలు తొలగించే వానికి, వసంత ఋతువు లాగా యోగుల మనస్సులో నిలిచే వానికి ఎల్లప్పుడూ నా స్మరణ*.... {స్మరణ పూర్వక నమస్సులు} 


🧘‍♂️🙏🪷 ✍️🙏

బుధవారం, సెప్టెంబరు 27, 2023

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


బుధవారం, సెప్టెంబరు 27, 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - వర్ష ఋతువు

భాద్రపద మాసం - శుక్ల పక్షం

తిథి:త్రయోదశి రా8.49 వరకు  

వారం:బుధవారం (సౌమ్యవాసరే)

నక్షత్రం:ధనిష్ఠ ఉ6.05 వరకు తదుపరి శతభిషం తె4.26 వరకు

యోగం:ధృతి ఉ7.51 వరకు

కరణం:కౌలువ ఉ10.03 వరకు తదుపరి తైతుల రా8.49 వరకు

వర్జ్యం:ఉ12.47 - 2.16

దుర్ముహూర్తము:ఉ11.28 - 12.16

అమృతకాలం:రా9.43 - 11.13

రాహుకాలం:మ12.00 - 1.30

యమగండ/కేతుకాలం:ఉ7.30 - 9.00

సూర్యరాశి : కన్య

చంద్రరాశి : కుంభం 

సూర్యోదయం:5.53

సూర్యాస్తమయం: 5.53


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

నవగ్రహ పురాణం - 64 వ అధ్యాయం*

 *నవగ్రహ పురాణం - 64 వ అధ్యాయం*

🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷


*చంద్రగ్రహ చరిత్ర - 2*



*"నిజమే అనుకో..."*


*"నారదా ! ఆ చంద్రుడు మా పుత్రికకు తగిన వరుడేనా ?"* ప్రసూతి దేవి అడిగింది. 


*"పుత్రికకు - కాదు , దేవీ ! పుత్రికలకు ! ఇది నా ఆలోచనా , నా ప్రతిపాదనా కావు. మన జనకపాదులు చతుర్ముఖుల సంకల్పం. ఆయన సంకల్పాన్ని సాక్షరమూ , సార్ధకమూ చేయడమే ఈ నారదుని పని !" నారదుడు నవ్వుతూ అన్నాడు. ఇక ఆ ఆత్రేయ చంద్రుడు మన కన్యలకు తగిన వరుడేనా అన్నది మీ సందేహం ! అంత అందగాడు కాకపోతే , ఆ తార అతగాడిని ఎందుకు నెత్తికెత్తుకుంటుంది ; అతగాడికి ఒక సుకుమారుణ్ణి కంటుంది ? మీ కన్యలు ఇరవై ఏడుగురూ చక్కని చుక్కలు ! ఈ చక్కని చుక్కల మధ్య ఆ చంద్రుడిని చూసి తీరాల్సిందే !"*


*"బాగుంది ! చంద్రుడి జననీ జనకులను గౌరవించడం మన విధి. అది ధర్మం. కూడా ! చంద్రుడిని మా అల్లుడిగా స్వీకరించడానికి అత్రీ అనసూయల అనుమతీ, అమోదం తీసుకుందాం !"* దక్ష ప్రజాపతి అన్నాడు.


*"శుభస్య శీఘ్రం , నారదుడు నవ్వుతూ అన్నాడు. "మీ దంపతులు బయలుదేరండి ! మీకు తోడుగా నేనూ వస్తాను !"*


అత్రి అనసూయా దంపతులు దక్ష దంపతులకూ , నారదుడికి స్వాగతం పలికి అతిధి సత్కారాలు అందించారు. అతిధ్యం స్వీకరించిన అనంతరం దక్షుడు అత్రితో తమ రాకకు కారణం వివరించాడు. అత్రి , అనసూయా ముఖాలు చూసుకున్నారు.


*"మా చంద్రుడు గురుపత్నీ గమనంతో ధర్మం తప్పి ప్రవర్తించాడు. తల్లిదండ్రులు తలలు వాల్చుకునేలా చేశాడు. వాని మూలంగా తారకు జన్మించిన బాలుడి పోషణ భారం , విద్యాబోధన బాధ్యతా నేను స్వీకరించి , తలకెత్తుకోవాల్సి వచ్చింది !"* అత్రి కంఠంలో ఆవేదన ధ్వనించింది.


*"ఆ గతాన్ని మరిచిపొండి , అత్రి మహర్షీ !"* నారదుడు నవ్వుతూ అన్నాడు. *"తారాచంద్రుల తనయుడిగా బుధుడు ఆవిర్భవించాల్సి ఉంది. అది జరిగింది ! దక్ష కన్యలను చంద్రుని పత్నులుగా స్వీకరించడం మంచిది !”*


*"బహువచనం ఉపయోగిస్తున్నావు నారదా ?"* అత్రి మహర్షి చిరునవ్వుతో అన్నాడు. 


*"బహువచనమే ! మన చంద్రుడికి బహుపత్నీ లాభం ఉందన్నారు చతుర్ముఖులు !! నారదుడు నవ్వుతూ అన్నాడు..


*"ఆలోచిస్తుంటే మా చంద్రుడి గతాన్నీ , వర్తమానాన్నీ , భవిష్యత్తునూ నియంత్రిస్తోంది. ఆ చతుర్ముఖులేనేమో అనిపిస్తుంది , నారదా!"* అత్రి నవ్వుతూ అన్నాడు.


*"ఆ విషయంలో నాకు ఎలాంటి సందేహమూ లేదు. ఆ బ్రహ్మదేవుల అంశే కదా. నా గర్భాన చంద్రుడిగా జన్మించింది !"* అనసూయ నవ్వుతూ ప్రసూతితో అంది.


*"మా కన్యలను మీ దంపతుల కోడళ్ళుగా చేయమని నారదుడి ద్వారా ఆ చతుర్ముఖులు సూచించారు. అనసూయా !"* ప్రసూతి అంది. 


*"ఇరవై ఏడుగురు కన్యలు..."* అనసూయ సాలోచనగా అంది. *"మంచిదే చంద్రుడికి ఇంక పరసతుల గురించి ఆలోచించే తీరిక కూడా చిక్కదు. సతీ సైన్యం చుట్టు ముట్టి ఉంటుంది !"*


అనసూయ మాటలకు అందరూ నవ్వారు.


*"దక్షప్రజాపతీ ! మీ అభిప్రాయం , మా అభిప్రాయం ఒక్కటయ్యాయి. కళ్యాణం జరిపించండి !"* అత్రి నవ్వుతూ అన్నాడు.


*"శుభం !"* అన్నాడు నారదుడు.


అందరూ వివాహమహోత్సవం గురించి ఉత్సాహంగా చర్చించుకుంటూ ఉంటే , - దర్భలూ , సమిధలూ పట్టుకుని బుధుడు వచ్చాడు.


*"నాయనా , బుధా ! ఇలారా ! దక్షదంపతులకూ , నారద మహర్షికి ప్రణామాలు చేయి !"* అత్రి మహర్షి బుధుడితో అన్నాడు.


బుధుడు వినయంగా ముగ్గురికీ అభివాదం చేసి , ఆశీస్సులు అందుకున్నాడు.


*"బుధుణ్ణి చూస్తుంటే , ఈ వయసులో చంద్రుణ్ణి చూస్తున్నట్టే వుంది !"* నారదుడు నవ్వుతూ అన్నాడు. *"తార నిజమే చెప్పింది ! బుధుడు చంద్ర సుతుడే !"*


అత్రిమహర్షీ , దక్షప్రజాపతి నారదుడి సమక్షంలో ముహూర్త నిర్ణయం చేశారు.


దక్షపుత్రికలు అశ్విని , భరణి , కృత్తిక , శ్రీ పాణి , మృగశిర , ఆర్ద్ర , పునర్వసు , పుష్యమి , ఆశ్లేష , మఖ , పుబ్బ , ఉత్తర , హస్త , చిత్త , స్వాతి , విశాఖ , అనూరాధ , జ్యేష్ఠ , మూల , పూర్వాషాఢ , ఉత్తరాషాఢ , శ్రవణం , ధనిష్ఠ , శతభిషం , పూర్వాభాద్ర , ఉత్తరాభాద్ర , రేవతి - ఆ శుభ ముహూర్తాన చంద్రుడి పత్నులయ్యారు.


తల్లి ప్రసూతీదేవి పనువున ఇరవై ఏడుగురు వధువులూ వెలుగుతున్న జ్యోతులున్న బంగారు పళ్ళేలు పట్టుకుని , తమ వరుని చుట్టూ వలయాకారంగా నిలబడి హారతి ఇస్తున్నారు. ఆ జ్యోతుల కాంతిలో చంద్రుడు వెలిగిపోతున్నాడు. అందరికీ కన్నుల పండువ చేస్తూ.


*"చూశారా ! చక్కని చుక్కలలో చక్కని చంద్రుడు !"* నారదుడు నవ్వుతూ దక్ష దంపతులతో అన్నాడు.


చంద్రుడు చిరునవ్వులు చిందిస్తూ , తన భార్యా బృందాన్ని ఒకరి అనంతరం ఒకరిని చూస్తూ నెమ్మదిగా గుండ్రంగా తిరుగుతున్నాడు.


దీపకళికల కాంతులు ప్రతిఫలిస్తూ తళతళలాడుతున్న అతని కళ్ళు ఒక్కసారి మెరిశాయి. గుండ్రంగా తిరుగుతున్న చంద్రుడు ఆగిపోయాడు. మెరుస్తున్న అతని కళ్ళు ఎదురుగా ఉన్న ఒక వధువు మీద తాపడం అయిపోయాయి. ఆ నవ వధువు పేరు తనకు తెలుసు. అయస్కాంతంలా తనని లాగుతున్న ఆ నవ వధువు పేరు - రోహిణి.


అత్తవారింటి నుండి పత్నీ బృందంతో చంద్రుడు తన మందిర ప్రవేశం చేశాడు. 


నవ వధువులందరూ ఒకరిని మించి ఒకరు ఉత్సాహంగా ఉన్నారు. వరసగా ప్రథమ , ద్వితీయ , తృతీయ పత్నులైన అశ్వినీ , భరణి , కృత్తికా ఆహారం సిద్ధం చేశారు. కొత్త పెళ్ళికొడుకుతో , తమ గృహంలో మొట్టమొదటిసారిగా సహ పంక్తిలో భోజనం చేయబోతున్నందుకు వాళ్ళందరికీ చాలా సంతోషంగా ఉంది. తల్లి తమను సాగనంపే ముందు చెప్పిన మాటలు అందరిలోనూ ఉత్సాహం ఉరకలెత్తేలా చేస్తున్నాయి.


భోజన సమయానికి ముందే ఇరవై ఆరుగురు వధువులూ , చక్కగా అలంకరించుకుని. భోజనశాలలో నిరీక్షిస్తున్నారు. వాళ్ళలో రోహిణి మాత్రం లేదు.


*"చెల్లీ , మూలా ! ఆ రోహిణి మందిరంలో ఏ మూలలో ఉందో చూడవే !"* అశ్విని నవ్వుతూ అంది. అందరూ నవ్వారు.


*"అందరికీ లేని అలసట దానికే వచ్చినట్టుంది !"* అంది మూల వెళ్ళబోతూ.


ఆమెకు ఆ అవకాశం ఇవ్వకుండా చంద్రుడూ , రోహిణీ ఇద్దరూ భోజనశాలకు వచ్చారు. చంద్రుడి చెయ్యి రోహిణి నడుం చుట్టూ ఒడ్డాణంలా చుట్టుకుని ఉంది. ఇద్దరూ నవ్వుకుంటున్నారు.


చంద్రుడు తన ఇతర పత్నుల్ని కన్నెత్తి చూడనేలేదు ! రోహిణి చూసింది , అయితే చూడనట్టు నటిస్తోంది. చంద్రుడు ఒక విస్తరి ముందు కూర్చున్నాడు. రోహిణి అతని పక్కనే కూర్చుంది.


*'తమలో ఎవరెవరు పంక్తిలో కూర్చోవాలి ?'* అంటూ ఆలోచిస్తున్న ఇరవై ఆరుగురు నవ వధువుల సందేహానికి చంద్రుడి మాట పరోక్షంగా సమాధానం చెప్పింది. *"ఎవరు వడ్డిస్తారు. మాకు ?”* దూరంగా నిలుచున్న అశ్వినీ బృందాన్ని కలయజూస్తూ అన్నాడు చంద్రుడు. *"మేం భోజనం చేసి , తోటలో తిరిగి వస్తాం ! ఈలోగా మీరందరూ ఆహారం తీసుకోండి !"*

రామాయణమ్ ..337

 రామాయణమ్ ..337

...

రాముడా గీముడా అతడెంత ? ఆతడి బలమెంత ? మేము నీ చెంత ఉండగా ఏల నీకు చింత ?

ఇరువురు మానవులకు, కొన్ని కోతులకు మనము ఆలోచించవలసిన అవసరమే లేదు !.

.

దేవదానవ,పన్నగోరగ,యక్షగంధర్వకిన్నరకింపురుషులను జయించి ముల్లోకములను గజగజలాడించిన రాక్షస సార్వభౌముడికి వారొక లెక్కా !!

.

మనము ఏమరపాటుగా ఉన్నప్పుడు ఆ కోతిగాడు చేసిన పనికి మనమేల చింతించవలే !

.

 ప్రభూ నేనొక్కడను చాలును అని ప్రహస్తుడు అను సేనా నాయకుడు గర్వముగా పలికెను.

.

హనుమంతుడు చేసిన పరాభవము మరువలేనిది సహింపరానిది ! రామలక్ష్మణసుగ్రీవ సహితముగా వానరులందరినీ నేను మట్టుపెట్టెదను ప్రభూ అని దుర్ముఖుడను సేనా నాయకుడు విర్రవీగుచూ మాటలాడెను.

.

రాజా నా కొక ఉపాయము తోచుచున్నది అని వజ్రదంష్ట్రుడు అను సేనానాయకుడు ఈ విధముగా మాటలాడెను.

.

రాజా! వేలకొలదిగా మన రాక్షస సమూహము మనుష్యరూపములు ధరించి రాముని వద్దకు వెళ్ళి ,మేము నీ తమ్ముడు భరతుడుపంపగా వచ్చినాము అని చెప్పి సేనలో కలిసి అందరూ నిద్రించుసమయమున గాఢసుషుప్తిలో ఉన్నప్పుడు ఏ ఒక్కరూ మిగులకుండా సంహారము చేసి వచ్చెదము!

.

ఎవరికి తోచిన ఉపాయము వారు చెప్పుచూ వీరాలాపములు సేయుచున్నప్పుడు విభీషణుడు వారెల్లరినీ శాంతింపచేసి అంజలి ఘటించి ఇట్లు పలికెను.

.

వూటుకూరు జానకిరామారావు

26, సెప్టెంబర్ 2023, మంగళవారం

Panchaag