🌹*భగవంతుడిని చూడటం ఎలా*🌹
ఒకరోజు రామకృష్ణ పరమహంస దగ్గరకి ఒక శిష్యుడు వచ్చి ఇలా అడిగాడు. గురువుగారు, అసలు భగవంతుడుని చూడటం ఎలా? భగవత్ తత్వం ఎలా అవుతుంది ? దానికి రామకృష్ణులు ఇలా చెప్పారు..
ఒక ఊరిలో ఒక సాధువు ఉండేవాడు. ఒంటి మీద చొక్కా లేకుండా నిరంతరం పరబ్రహ్మంతో రమిస్తూ ఉండేవాడు, ఎవరైనా భిక్ష పెడితే తింటూ ఉండేవాడు.
ఒకరోజు ఒక గృహస్థు అతనికి కొంచెం బెల్లం పొంగళి పెట్టాడు. దాన్ని తీసుకొని రొడ్డు చివరన ఆకలితో ఉన్న ఒక కుక్క పక్కనే కూర్చోని దానికోక ముద్ధ నోట్లో పెట్టి, ఆయనొక ముద్ధ తినేవాడు.. ఈ తంతును చూసి దారినపోయేవారు పకపక నవ్వుకునేవారు.. వారిని చూసి ఆ సాధువు ఇలా చెప్పాడు..
“ఎందుకు నవ్వుతున్నారు మీరు.. ఈ కుక్కలో ఉన్నది విష్ణువే, నాలో ఉన్నది విష్ణువే.. నేను తినే పథార్దము విష్ణువే.. విష్ణువు, విష్ణువుని తింటున్నాడు.. విష్ణువుకు పెడుతున్నాడు.. మీరెందుకా నవ్వుతున్నారు విష్ణువు అని నవ్వే వారిలో కూడా భగవంతుడిని చూసాడు ఆ సాధువు.. “
కాబట్టి అర్ధమైందా భగవంతుడు ఎక్కడ ఉంటాడో, అన్నీ జీవులయందు విష్ణువే ఉంటాడు. ఆ పరబ్రహ్మంను జీవులయందు చూడటమే నిజమైన జ్ఞానం. అలా అన్నీ జీవులలో విష్ణువును చూడలేకపోవటమే మాయ అని జ్ఞానబోధ చేసి పంపించాడు పరమహంస..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి