3, ఆగస్టు 2024, శనివారం

ఆగష్టు,04, 2024*🌹 *ధృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       🌞 *ఆదివారం*🌞

 🌹 *ఆగష్టు,04, 2024*🌹

     *ధృగ్గణిత పంచాంగం*                


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - గ్రీష్మ ఋతౌః*

*ఆషాఢమాసం - కృష్ణపక్షం*


*తిథి : అమావాస్య* సా 04.42 ఉపరి *శ్రావణమాసం ప్రా𝕝𝕝*

వారం :*ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం : పుష్యమి* మ 01.26 వరకు ఉపరి *ఆశ్లేష*


*యోగం : సిద్ధి* ఉ 10.38 వరకు ఉపరి *వ్యతీపాత*

*కరణం : నాగ* సా 04.42 *కింస్తుఘ్న* రా 05.19 తె వరకు 


*సాధారణ శుభ సమయాలు:* 

            *-ఈరోజు లేవు-*

అమృత కాలం :*ఉ 06.39 - 08.21*

అభిజిత్ కాలం :*ప 11.48 - 12.39*


*వర్జ్యం : రా 03.16 - 04.59 తె*

*దుర్ముహుర్తం :సా 04.55 - 05.47*

*రాహు కాలం : సా 05.02 - 06.38*

గుళిక కాలం :*మ 03.26 - 05.02*

యమ గండం :*మ 12.13 - 01.50*

సూర్యరాశి : *కర్కాటకం* 

చంద్రరాశి : *కర్కాటకం*

సూర్యోదయం :*ఉ 05.49* 

సూర్యాస్తమయం :*సా 06.38*

*ప్రయాణశూల :‌ పడమర దిక్కుకు* 

*ప్రయాణం పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం :*ఉ 05.49 - 08.23*

సంగవ కాలం :*08.23 - 10.56*

మధ్యాహ్న కాలం :*10.56 - 01.30*

అపరాహ్న కాలం :*మ 01.30 - 04.04*

*ఆబ్ధికం తిధి : ఆషాఢ అమావాస్య*

సాయంకాలం :*సా 04.04 - 06.38*

ప్రదోష కాలం :*సా 06.38 - 08.52*

నిశీధి కాలం :*రా 11.51 - 12.36*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.20 - 05.04*

______________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


 🌞 *॥ శ్రీ సూర్య స్తోత్రం* ॥🌞


కాలాత్మా సర్వభూతాత్మా వేదాత్మా విశ్వతోముఖః |

జన్మమృత్యుజరావ్యాధిసంసారభయనాశనః || ౨ ||


బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నే తు మహేశ్వరః |

అస్తకాలే స్వయం విష్ణుః త్రయీమూర్తిర్దివాకరః || ౩ ||


    🌞 *ఓం సూర్యాయ నమః*🌞


🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><>

          🌷 *సేకరణ*🌷

      🌹🌷🌞🌞🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🌞🌞🌹🌷

 🌹🍃🌞🌹🌹🌞🍃🌹

అన్నదానం

 శక్త్యాऽన్నదానం సతతం 

తితిక్షా ధర్మ నిత్యతా।

యథాऽర్హం ప్రతిపూజా చ 

సర్వ భూతేషు వై సదా।।


తా: (ఈలోకంలో సకల ప్రాణులకు సదా శక్తి కొలది అన్నదానం చేయుటయును, సుఖదుఃఖాల వంటి ద్వంద్వాలను సహించుటయును, అనునిత్యం ధర్మాచరణయును, ఉభయుల యోగ్యతకు తగినట్లుగా తత్పరమైన పూజయును అనే నాలుగు ఆచరణీయములు).

శుభోదయం 🌹🌷🌹Goodmorning

లక్షీదేవి

 ఒకసారి లక్షీదేవి ఒక వ్యక్తి పై కోపగించుకొని “ఈ ఇంటినుండి వెళ్లి పోతున్నాను. ఇక మీ ఇంటికి దరిద్ర దేవత రాబోతుంది. కాకపోతే నీకో వరం ఇవ్వదలచుకొన్నాను. అడుగు!” అని అంటుంది.


అప్పుడు ఆ వ్యక్తి లక్ష్మీదేవితో ఇలా అంటాడు… “అమ్మా నీవు వెళ్లుతుంటే ఆపే శక్తి నాకు లేదు. అలాగే దరిద్రదేవత వస్తుంటే ఆపే శక్తి అంతకన్నా లేదు. మీలో ఒకరు వున్నచోట ఒకరు వుండరు. కాబట్టి దరిద్ర దేవత వచ్చిన వేళ *మా ఇంటిలో ఇప్పుడు ఒకరిపట్ల ఒకరికున్న ప్రేమాభిమానాలు అలాగే వుండేటట్లు వరం ఇవ్వమ”ని అంటాడు.*


 ‘తథాస్తు!’ అని లక్ష్మీదేవి ఆ ఇంటినుండి వెళ్లిపోతుంది.

             

కొన్నిరోజుల తర్వాత ఇంటిలో వంట చేస్తున్న ఆ వ్యక్తి భార్య కూరలో ఉప్పు కారం సమపాళ్ళలో  వేయమని కోడళ్లకు చెప్పి గుడికి పోతుంది.


కొంతసేపటికి చిన్న కోడలు ఉప్పు కారం కూరలో వేసి ఏదో పనిలో నిమగ్నమై పోతుంది.


ఇంకొంతసేపటికి పెద్దకోడలు వచ్చి కూరలో ఉప్పు వేశారో లేదో అని అనుమానం వచ్చి తనుకూడ ఆ కూరకు తగినంత ఉప్పు వేసి వేరేపనిలో పడిపోతుంది.


ఇంతలో అత్తగారు వచ్చి కోడళ్లు ఇద్దరు తమ పనిలోపడి ఉప్పు వేశారో లేదో అని తనూ కొంత వేస్తుంది.


మధ్యాహ్నం ఆవ్యక్తి  భోజనం చేసే సమయంలో కూరలో ఉప్పు ఎక్కువయిందని గ్రహించి దరిద్ర దేవత ఇంటిలోకి ప్రవేశించిందని తెలుసుకుంటాడు. ఏమి మాట్లాడకుండా తిని లేస్తాడు.


కొంత సేపటికి ఆ వ్యక్తి పెద్దకొడుకు కూడ భోజన సమయంలో ఉప్పు ఎక్కువ అయిందని గ్రహించి ‘నాన్న గారు తిన్నారా?’ అని భార్యను అడుగుతాడు.


’తిన్నారు!’  అని చెబుతుంది.l


దానితో   ‘నాన్న ఏమీ అనకుండ తిన్నాడు. నేనెందుకు అనాలి?’   అని ఏమి మాట్లాడకుండ తనూ తిని లేస్తాడు.


ఇలా ఆ ఇంటి వాళ్లంతా భోజనం చేసి వంట గురించి మాట్లాడకుండ వుంటారు.


ఆరోజు సాయంత్రం *దరిద్ర దేవత ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి   ‘నేను ఇక్కడ ఉండలేను వెళ్లిపోతున్నాను. ఉప్పు కశాయం అయిన వంట తిని కూడ మీ మధ్య ఏ స్పర్ధలు రాలేదు. మీరు ప్రేమగా ఐక్యమత్యంగా ఉన్నారు. ఇటు వంటి చోట నేనుండను!’ అని వెళ్లిపోతుంది.*


*దరిద్ర దేవత వెళ్లిపోవటంతో ఆ ఇంట మళ్లీ లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకొంటుంది.*


*కనుక, ఏ ఇంటిలో  ‘ప్రేమ, అప్యాయతలు మరియు శాంతి’ కళకళలాడుతూ వుంటాయో ఆ ఇల్లు లక్ష్మీనివాసం’ అవుతుంది.*

గురుకులాలు ఎలా మూసివేయబడ్డాయో

 ఇంగ్లాండ్‌లో మొదటి పాఠశాల 1811లో ప్రారంభించబడింది. ఆ సమయంలో భారతదేశంలో 7,32,000 గురుకులములు ఉన్నాయి. 


మన గురుకులాలు ఎలా మూసివేయబడ్డాయో,  గురుకుల అభ్యాసం ఎలా ముగిసిందో తెలుసుకుందాం.!

గురుకుల సంస్కృతిలో (సనాతన సంస్కృతిలో)  ఈ క్రింది విషయాలను బోధించారు.


01 అగ్ని విద్య (లోహశాస్త్రం)

02 వాయు విద్య (గాలి)

03 జల్ విద్య (నీరు)

04 అంతరిక్ష విద్య (స్పేస్ సైన్స్)

05 పృథ్వి విద్య (పర్యావరణం)

06 సూర్య విద్య (సౌర అధ్యయనం)

07 చంద్ర మరియు లోక్ విద్య (చంద్ర అధ్యయనం)

08 మేఘ విద్య (వాతావరణ సూచన)

09 ధాతు ఉర్జా విద్య (బ్యాటరీ శక్తి)

10 దిన్  రాత్ విద్య.

12 శ్రద్ధా విద్యా (అంతరిక్ష పరిశోధన)

13 ఖాగోళ విజ్ఞానం (ఖగోళ శాస్త్రం)

14 భుగోళ విద్య (భౌగోళిక)

15 కాల విద్యా(సమయ అధ్యయనాలు)

16 భూగర్బ విద్య (జియాలజీ & మైనింగ్)

17 రత్నాలు మరియు లోహాలు 

18 ఆకర్షణ విద్య (గురుత్వాకర్షణ)

19 ప్రకాశ విద్య (శక్తి)

20 సంచార విద్య (కమ్యూనికేషన్)

21 విమాన విద్య (విమానం)

22 జలయన్ విద్య (నీటి నాళాలు)

23 అగ్నియా ఆస్ట్రా విద్య (ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రి)

24 జీవవిజ్ఞాన విద్య (జీవశాస్త్రం, జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం)

25 యజ్ఞ విద్య


ఇది శాస్త్రీయ విద్య యొక్క చర్చ. ఇప్పుడు ప్రొఫెషనల్ మరియు టెక్నికల్ విభాగాల గురించి తెలుసుకుందాం!*


26 వ్యాపార్ విద్య (వాణిజ్యం)

27 కృషి విద్య (వ్యవసాయం)

28 పశు పాలన విద్య (పశుసంవర్ధక)

29 పక్షి పాలన (బర్డ్ కీపింగ్)

30 యాన విద్య (మెకానిక్స్)

32 వాహనాల రూపకల్పన

33 రతంకర్ (రత్నాలు & ఆభరణాల రూపకల్పన)

36 కుమ్హార్ విద్యా (కుమ్మరి)

37 లఘు (లోహశాస్త్రం & కమ్మరి)

38 తక్కలు

39 రంగ్ విద్యా (డైయింగ్)

40 ఖాట్వాకర్

41 రజ్జుకర్ (లాజిస్టిక్స్)

42 వాస్తుకర విద్యా (ఆర్కిటెక్చర్)

43 ఖానా బనానే కి విద్యా (వంట)

44 వాహన్ విద్యా (డ్రైవింగ్)

45 జలమార్గాల నిర్వహణ

46 సూచికలు (డేటా ఎంట్రీ)

47 గౌషాలా మేనేజర్ (పశుసంవర్ధక)

48 బాగ్వానీ (హార్టికల్చర్)

49 వాన్ విద్యా (అటవీ)

50 సహోగీ ( పారామెడిక్స్).


ఈ విద్య అంతా గురుకులం లోనే బోధించబడింది, కాని కాలంతో పాటు, గురుకులాలను  అదృశ్యము చేసి బ్రిటిష్ వారు ఈ జ్ఞానం అంతటిని కనుమరుగయ్యేలా చేశారు! ఇది మెకాలేతో ప్రారంభమైంది. ఈ రోజు, మెకాలే పద్ధతి ద్వారా మన దేశ యువత  భవిష్యత్తు ఇప్పటికీ నాశనం అవుతోంది.


భారతదేశంలో గురుకుల సంస్కృతి ఎలా ముగిసింది?

కాన్వెంట్ విద్య పరిచయం గురుకులాన్ని నాశనం చేసింది. భారతీయ విద్యా చట్టం 1835 లో ఏర్పడింది (1858 లో సవరించబడింది). దీనిని 'లార్డ్ మెకాలే' రూపొందించారు.


మెకాలే ఇక్కడ విద్యావ్యవస్థపై ఒక సర్వే నిర్వహించగా, చాలా మంది బ్రిటిషర్లు భారతదేశ విద్యా విధానం గురించి తమ నివేదికలను ఇచ్చారు. బ్రిటిష్ అధికారి ఒకరు జి.డబ్ల్యు. లూథర్ మరియు మరొకరు థామస్ మున్రో! వారిద్దరూ వేర్వేరు ప్రాంతాలను వేర్వేరు సమయాల్లో సర్వే చేశారు. ఉత్తర భారతదేశం (ఉత్తర భారత్) ను సర్వే చేసిన లూథర్, ఇక్కడ 97% అక్షరాస్యత ఉందని, దక్షిణ భారతదేశం (దక్షిణ భారత్) ను సర్వే చేసిన మున్రో ఇక్కడ 100% అక్షరాస్యత ఉందని రాశారు.


భారతదేశం (భారత్) శాశ్వతంగా బానిసలుగా ఉండాలంటే, దాని ′ ′ *దేశీయ మరియు సాంస్కృతిక విద్యావ్యవస్థ*  పూర్తిగా కూల్చివేయబడాలి మరియు దాని స్థానంలో ′ ′ ఆంగ్ల విద్యా విధానం  ఉండాలి అని మెకాలే స్పష్టంగా చెప్పారు మరియు అప్పుడే భారతీయులు శారీరకంగా భారతీయులు అవుతారు , కానీ మానసికంగా ఇంగ్లీష్ వారు అవుతారు. 


వారు కాన్వెంట్ పాఠశాలలు లేదా ఇంగ్లీష్ విశ్వవిద్యాలయాలను విడిచిపెట్టినప్పుడు, వారు బ్రిటిష్ వారి ప్రయోజనాలకు పని చేస్తారు.

మెకాలే ఇలా చెప్పాడు -  ఒక పంటను నాటడానికి ముందు ఒక వ్యవసాయ క్షేత్రాన్ని పూర్తిగా దున్నుతున్నట్లే, దానిని దున్నుతూ ఆంగ్ల విద్యావ్యవస్థలో తీసుకురావాలి.  అందుకే అతను మొదట గురుకులము చట్టవిరుద్ధమని ప్రకటించాడు. అప్పుడు అతను సంస్కృతాన్ని చట్టవిరుద్ధం అని ప్రకటించి గురుకుల వ్యవస్థకు నిప్పంటించాడు, అందులో ఉన్న ఉపాధ్యాయులను కొట్టి జైలులో పెట్టించాడు.


1850 వరకు భారతదేశంలో '7 లక్షల 32 వేల' గురుకుల & 7,50,000 గ్రామాలు ఉన్నాయి. దాదాపు ప్రతి గ్రామంలో గురుకులము ఉంది మరియు ఈ గురుకులములన్నీ  'ఉన్నత విద్యా సంస్థలు' గా ఉండేవి.  గురుకులములు  ప్రజలు మరియు రాజు చేత  కలిపి నడుపుబడేవి.

విద్యను ఉచితంగా ఇచ్చారు.

గురుకులాలు రద్దు చేయబడ్డాయి మరియు ఆంగ్ల విద్యను చట్టబద్ధం చేశారు మరియు కలకత్తాలో మొదటి కాన్వెంట్ పాఠశాల ప్రారంభించబడింది. ఆ సమయంలో దీనిని 'ఉచిత పాఠశాల' అని పిలిచేవారు. ఈ చట్టం ప్రకారం కలకత్తా విశ్వవిద్యాలయం, బొంబాయి విశ్వవిద్యాలయం & మద్రాస్ విశ్వవిద్యాలయం సృష్టించబడ్డాయి. ఈ మూడు బానిస యుగ విశ్వవిద్యాలయాలు ఇప్పటికీ దేశంలో ఉన్నాయి!


మెకాలే తన తండ్రికి ఒక లేఖ రాశారు. ఇది చాలా ప్రసిద్ధ లేఖ, అందులో అతను ఇలా వ్రాశాడు: " కాన్వెంట్ పాఠశాలలు భారతీయుల మాదిరిగా కనిపించే పిల్లలను బయటకు తీసుకువస్తాయి కాని వారి మెదడు ఇంగ్లీషు భావజాలంతో నిండి ఉంటుంది


మరియు వారికి వారి దేశం గురించి ఏమీ తెలియదు. వారి సంస్కృతి గురించి వారికి ఏమీ తెలియదు, వారి సంప్రదాయాల గురించి వారికి తెలియదు, వారి జాతి గురించి వారికి తెలియదు, అలాంటి పిల్లలు ఈ దేశంలో ఉన్నప్పుడు, బ్రిటిష్ వారు వెళ్లినా, ఇంగ్లీష్ ఈ దేశాన్ని విడిచిపెట్టదు".  ఆ సమయంలో రాసిన లేఖ లో ఉన్న నిజం ఈనాటికీ మన దేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చర్య ద్వారా మన స్వంత భాష మాట్లాడటం మరియు మన స్వంత సంస్కృతిని చూసి సిగ్గుపడటం, మనల్ని మనం తక్కువగా భావిస్తున్నాము. 


మాతృభాష నుండి దూరం కాబడిన సమాజం ఎప్పటికీ అభివృద్ధి చెందదు మరియు ఇది మెకాలే యొక్క వ్యూహం! నేటి యువతకు భారతదేశం కంటే యూరప్ గురించి ఎక్కువ తెలుసు. భారతీయ సంస్కృతిని గొప్పతనం తెలుసుకోండి.


 మన భారతీయ సంస్కృతి , వారసత్వాన్ని   తిరిగి పొందే సమయం ఇది.

భాగవత కధా కవితా సుధారసము



భాగవత  కధా కవితా సుధారసము

                                                   --------------------------------------------------- 


              కం: పలికెడిది భాగవతమట!

                     పలికించెడు వాఁడు  రామభద్రుండట!  నే

                     పలికిన  భవహర మగునట!

                     పలికెద,  వేరొండు గాధ  పలుకఁగ  నేలా? 


                       అంటూ సర్వము  భగవత్కర్తృత్వము గా నెంచి  భక్తి భావ సంభరితముగా  రచియింపఁ బడిన  మహాపురాణ గ్రంధము

శ్రీమదాంధ్ర మహాభాగవతము.


                 భాగవతం చదవటం  అంటే  బాగుపడటం"- అన్నారు పెద్దలు. తపస్సు యజ్ఙయాగాదులు చేయటం, వంటి కష్టాలు యేమాత్రం పడకుండా కేవలం  ,శ్రవణ  మాత్రం చేతనే  ముక్తిని పొందే ఉపాయం భాగవత కధాశ్రవణం .


                                 చతుర్వేదములను, అష్టాదశ పురాణములను, పదునెనిమిది పర్వముల మహాభారతమును  రచించించియు,

కలత వొందు వ్యాసుని  చిత్తార్తిని దీర్చుటకు నారదోప దేశమున వ్యాసునిచే నీగ్రంధము విరచింప ఁబడినది .పన్నెండు స్కంథములుగా

విస్తరిం చిన  యీగ్రంధము మహాపురాణముగా కీర్తింప బడుచున్నది.


                                  భగవం తుడే (శ్రీకృష్ణుడు) కథానాయుకుడైన యీగ్రంధమును  పరమ భాగవతాగ్రేసరుడు  ఆంధ్రీకరించి  యాంధ్రులకు  సారస్వత సంబంధమైన విందు సమకూర్చినాడు. కల్పక సదృశమైన యీభాగవతము మందార మకరందములను

గురియించు పద్య సంపదకు నెలవై యాంధ్రుల హృదయ క్షేత్రములలో  నాధ్యత్మికమును పండించుచు ముక్తిద్వారముగా మురిపించుచున్నది.


                              పోతన కవిత్వ మొక పంచదార పాకము. జుంటితేనియ. గొజ్జగి పూమృదులము. తెనుగు పదములకు సంస్కృత సమపదములను జోడించి, శబ్దార్ధాలంకార భాసురమై  నాదసుభగాభిరామమై  చదివినంత సేపు పాఠకుని యొక దివ్య కవితాలోకమున

విహరింపఁజేయును.


                    కృష్ణుని బాల్యక్రీడలు మరపురాని ఘట్టము. భావుకుడైన పాఠకుడా ఘట్టమున మునిగి కన్నుల నానంద భాష్ప శిక్తుడౌట

తథ్యము. యిందలి యుపాఖ్యానములన్నియు నొకదానిని మించి మరియొకటిగా చిత్రిపబడి యుండును. అనుప్రాసలతోను, అంత్యప్రాసలతోను, యమకాదులతోను, ఆపద్యములు పాఠకుని కవితాడోలలో  నూయల లూగించును.


                     పోతన ప్రతిభను "మందార మకరందాది యొండు రెండు పద్యములతో  వివరించుట  సాధ్యము కానిపని.సామాన్యముగా క్రియాపదముతోనో లేక అవ్యయముతోనో ప్రారంభమౌ వృత్తపద్యములు ఆపై వరుసగా విశేషణ ముల

ముక్తాయింపులతో  అంత్యప్రాసల విన్యాసములతో బహు సుందరముగా నుండును.


            "  అట  గాంచెన్  కరణీ విభుండు  నవఫుల్లాంభోజ కల్హారమున్

                నట దిందీవర వారమున్  గమఠ మీన గ్రాహ  దుర్వారమున్

               వట హింతాల తమాల తాల తరుణీ వల్లీ కుటీతీరమున్

                చటులోధ్ధూత మరాళ చక్ర బక సంచారంబుఁ గా సారమున్ి


                                అట, అవ్యయం.కాంచెన్ క్రియ.కాసారమున్  విశేష్యము.తక్కినవన్నీ విశేషణములే!


                     పోతన భాగవత మొక కవితా సాగరము.పద్యములన్నియు మంచి ముత్యముల రాసులే  ఎన్నిని యెన్నగలం? అదిమన శక్తికి మించిన పని.


                        పోతన కవితా తత్వమును బహుముఖములుగా బరిశీలించిన వారిలో  అభినవ పోతన శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రిగారి ప్రశంసా పద్యాలతో మనమీ విషయాన్ని ముగిద్దాం.మరోసారి విపులంగా పోతన గారిగురించి చెప్పుకుందాం.


                "  అచ్చపు జుంటితేనియల  నైందవబింబ  సుధారసాల  గో

                   ర్వెచ్చని  పాలమీగడల  విచ్చిన  కన్నె  గులాబి  మొగ్గలన్

                   మచ్చరికించు  నీ మధుర మంజుల మోహన మైన  శైలి నీ

                   వెచ్చట  నేర్చినావు సుకవీ!సుకుమారకళా కళానిధీ!


                "  ముద్దులుగార  భాగవతమున్  రచియించుచు  పంచదారలో

                    నద్దితివేమొ  ఘంటము  మహాకవి శేఖర!  మధ్య  మధ్య   న

                    ట్లద్దక  వట్టి ఘంటమున  నట్టిటు  గీసిన  తాటియాకు  లో

                    పద్దెములందు  నీ మధుర  భావన  లెక్కడినుండి  వచ్చురా?


                                                         కరుణశ్రీ,


జ      జుంటితేనెల తీయదనం. వెన్నెల లోని యమృతం,  గోరువెచ్చని పాలమీగడల సొగసును,విచ్చిన లేతగులాబి మొగ్గలను మచ్చరికింప జేస్తుందట పోతన కవిత్వం. కరుణశ్రీ యెంతచక్కగా చెప్పారు.అసలు యింత సుకుమారమైన కవితాకళను నీవెక్కడ

నేర్చుకున్నావయా? అనిప్రశ్న? అదియా భగవదత్తము. నిరంహంకారమునకు నిర్మమత్వమునకు ప్రతిఫలము!


ముద్దులుగార భాగవతమున్రచియించుచు,పంచదారలో

నద్దితివేమొ గంటము? మహాకవిశేఖర!మధ్యమధ్య న

ట్లద్దక, వట్టిగంటమున నట్టిటువ్రాసినతాటియాకులో

పద్దెములందు నీమధురభావనలెక్కడనుండి వచ్చురా?--


                     ముద్దులు గారేవిధంగా కవిత్వంవ్రాస్తూ గంటాన్ని పంచదారలోముంచావేమో ?అందుకే నీకవిత్వానికి అంతతీపి! మధ్యమధ్యమరచావేమో నంటాడు కరుణశ్రీ యింతకన్నా యెవ్వరు మాత్రం పోతన కవితను వింగడించగలరు?


                           " అందుకే భాగవతమును రోజూ చదువుకుందాం  అందరం బాగుపడదాం!


                                                                       స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

శనివారం / రాశి ఫలితాలు*

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️


*03-08-2024 / శనివారం / రాశి ఫలితాలు*

•••••┉━•••••┉━•••••┉━•••••

మేషం


ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సోదరుల నుంచి స్థిరస్తి లాభాలుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన  పనులు మిత్రుల సహాయ సహకారాలతో పూర్తిచేస్తారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తి కరంగా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి.

---------------------------------------

వృషభం


వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక దూర ప్రయాణ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలలో తొందరపడి పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. నేత్ర సంభంధిత ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దైవ చింతన కలుగుతుంది.

---------------------------------------

మిధునం


గృహమున ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహన వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సఖ్యత కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యత కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

---------------------------------------

కర్కాటకం


ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. అవసరానికి ఆప్తుల సహాయ సహకారాలు  అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.   వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.

---------------------------------------

సింహం


ధనదాయం బాగుంటుంది. దూర ప్రాంతాల వారి నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.  వృత్తి ఉద్యోగ  విషయంలో శుభవార్తలు అందుతాయి.

---------------------------------------

కన్య


ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. భూ క్రయ విక్రయాలలో  అనుకూల ఫలితాలుంటాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.  చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన. ధైర్యంగా పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.

---------------------------------------

తుల


వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థాన చలనాలుంటాయి. వ్యాపారపరంగా ఎదురైనా అవరోధాలను అధిగమిస్తారు. ఆర్థిక వ్యవహారాలు కొంత ఆశజానాకంగా ఉంటాయి. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు.  దూర ప్రాంతాల బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.

---------------------------------------

వృశ్చికం


వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. స్థిరస్తి క్రయవిక్రయాలలో  నూతన ఒప్పందాలు చేసుకుంటారు. సోదరుల నుండి ఊహించని ఆర్ధిక సహాయం అందుతుంది. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమై  మానసిక ప్రశాంతత పొందుతారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. 

---------------------------------------

ధనస్సు


వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుండి విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.  దీర్ఘకాలిక  రుణాలు నుండి బయట పడతారు. వ్యాపారములు అనుకూలంగా సాగుతాయి.

---------------------------------------

మకరం


ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి హోదాలు  పెరుగుతాయి.  సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.  జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలను ప్రారంబించి సకాలంలో పూర్తిచేస్తారు. దీర్ఘ కాలిక సమస్యలు నుండి బయట పడతారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది.

---------------------------------------

కుంభం


దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. సంతాన విద్యా వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

---------------------------------------

మీనం


గృహమున పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుండి  శుభవార్తలు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆలోచనలను కలసివస్తాయి. ముఖ్యమైన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.

•••••┉━•••••┉━•••••┉━•••••

🍁 *శుభం భూయాత్* 🍀

అవిరోధితయా

 *అవిరోధితయా కర్మ నావిద్యాం వినివర్తయేత్ ।*

*విద్యావిద్యాం నిహన్త్యేవ తేజస్తిమిరసంఘవత్ ॥ 3॥*

ఏ చర్య అయినా అజ్ఞానానికి విరుద్ధం కానందున, ఆ చర్య అజ్ఞానాన్ని తొలగించదు. గాఢమైన చీకటిని నశింపజేసేది వెలుగు మాత్రమే అయినట్లే, అజ్ఞానాన్ని నాశనం చేసేది కేవలం జ్ఞానం మాత్రమే.

(ఆత్మబోధ యొక్క ఈ శ్లోకంలో, శ్రీ శంకర భగవత్పాదులు కేవలం జ్ఞానం మాత్రమే ఎందుకు, ఏ విధమైన చర్యలు , ముక్తికి ప్రత్యక్ష మార్గం అని వివరిస్తున్నారు.)

జ్ఞానం ద్వారానే అజ్ఞానం తొలగిపోతుంది. ఏదైనా విషయం యొక్క అజ్ఞానాన్ని ఆ విషయం యొక్క జ్ఞానం ద్వారా తొలగించవచ్చు - అది భౌతిక అజ్ఞానమైనా లేదా ఆధ్యాత్మిక అజ్ఞానమైనా. కార్యం, భౌతికమైనా, ఆధ్యాత్మికమైనా, అజ్ఞానాన్ని తొలగించలేవు. చర్యలు భౌతిక శరీరం (కాయిక కర్మ), వాక్కు (వాచిక కర్మ) లేదా మనస్సు (మానస కర్మ మొదలైనవి)తో కూడిన చర్యలుగా విస్తృతంగా వర్గీకరించబడ్డాయి. వీటిలో ఏవీ అజ్ఞానాన్ని తొలగించలేవు. ఎందుకంటే చర్యలు అజ్ఞానానికి వ్యతిరేకం కాదు. మా స్వంత అనుభవం దీనిని నిరూపిస్తుంది. ఒక నిర్దిష్ట రైలు ఎప్పుడు వస్తుందో మనకు తెలియకపోతే, కొంత ప్రమాణాన్ని (జ్ఞాన సాధనాలు) ఉపయోగించడం ద్వారా మాత్రమే కనుగొనవచ్చు. ఉదాహరణకు, మేము రైలు టైమ్‌టేబుల్‌ని చూడవచ్చు లేదా తెలిసిన వారిని అడగవచ్చు. ఎలాంటి శారీరక శ్రమ లేదా ధ్యానం రైలు సమయానికి సంబంధించిన సమాచారాన్ని అందించదు.

ఉదాహరణ, *తేజస్తిమిరసంఘవత్* దట్టమైన చీకటి ఉంటే, కాంతి మాత్రమే దానిని తొలగించగలదు. వెలుగులోకి వచ్చేంత వరకు ఎలాంటి చర్య అయినా సహాయం చేయదు. అజ్ఞానానికి, జ్ఞానానికి కూడా ఇదే వర్తిస్తుంది. జ్ఞానం ఉద్భవించినప్పుడే అజ్ఞానం నశిస్తుంది.

*-జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతీమహస్వామివారు*

కాశీ

 🪷 _*కాశీ*_ 🪷

             



✳️ అక్కడ పరమేశ్వరుడి అడుగుల ధ్వని బ్రాహ్మీ ముహూర్తంలో వినిపిస్తుందంటారు♪. వేదపఠనాలు, హారతి గీతాలు, శంఖనాదాలు, ఢమరుక ధ్వనులు నిత్యం స్వాగతం పలుకుతుంటాయి♪. అది విశ్వనాథుడి నగరమైన కాశీ! ఆ పక్కనే ఆధ్యాత్మిక రసవాహిని గంగ ప్రవహిస్తుంటుంది♪. గాలిలో ఓంకార ధ్వని వినిపిస్తుంటుంది♪. హోమ జ్వాలలు పరతత్వాన్ని తెలుపుతుంటాయి♪.


✳️ కాశీనగరం ఆధ్యాత్మిక దృశ్యప్రపంచంలో హిమాలయం లాంటిది♪. మోక్షప్రదాయినిగా భావించే ఆ నగరం, సాధకుల పాలిట స్వర్గ ధామం♪. వరుణ, అసి నదుల మధ్య ఉన్న ప్రదేశమే కాశీ. దానికి వారణాసి, ఆనంద కాననం, శివపురి, మహాశ్మశానం, బెనారస్ అనే పేర్లున్నాయి♪. అది సాక్షాత్తు పరమేశ్వరుడి సృష్టి అని 'శివపు రాణం' తెలుపుతోంది♪. అష్టాదశ పురాణాల్లో కాశీ వైభవాన్ని వ్యాసుడు పలుచోట్ల ప్రస్తావించాడు♪.


✳️ కాశీ అంటే 'ప్రకాశించేది' అని అర్థం♪. ఇది ముక్తిక్షేత్రం. 'నేను కాశీ వెళతాను. అక్కడ నివసిస్తాను' అని పలుసార్లు తలచినా శివుడు సంతోషిస్తాడట. జీవులందరికీ మోక్షద్వారం కాశీ, ఇక్కడ మరణించినవారి చెవిలో స్వయంగా విశ్వనాథుడే తారకమంత్రాన్ని ఉపదేశించి కైవల్యప్రాప్తి అనుగ్ర హిస్తాడని 'స్కాందపురాణం' చెబుతోంది•.


✳️ పరమేశ్వరుడు ఇక్కడ జ్యోతిర్లింగ స్వరూపుడిగా, విశ్వనాథుడిగా కొలువయ్యాడు♪. దేవతాగణాలతో కైలాసంలో పొందే దివ్యానందాన్ని ఇక్కడ పొందుతున్నాడని భక్తులు విశ్వసిస్తారు♪. కాశీనగరాధిపతిగా, రక్షకుడిగా శివాంశతో జన్మించిన కాలభైరవుడు ఇక్కడే ఉన్నాడు♪. ముందుగా దర్శించుకోవాల్సింది. మనసులో మాట విన్నవించుకోవాల్సింది కాలభైరవుడికే♪.


✳️ కాశీ విశ్వనాథుడి ఆలయం బంగారు తాపడం చేసిన గోపురాలతో ఉంటుంది♪. ప్రాంగణమంతా శివలింగాలతో, అభిషేక జలాలతో ప్రకాశిస్తుంటుంది♪. అదే ప్రాంగణంలోని మసీదు, సందర్శకులతో నిండి ఉంటుంది. మతసామరస్యానికి నెలవు ఆ ప్రాంగణం♪. జగన్మాత ఇక్కడ అన్నపూర్ణగా కొలువై ఉంది♪. పుడమిని సుభిక్షం చేసిన వరదాయిని ఆ తల్లి♪. గంగకు అవతలి ఒడ్డు 'వ్యాసకాశీ' గా సుప్రసిద్ధమైంది♪. వ్యాస ప్రతిష్ఠితమైన పరమేశ్వరుడు. ఎత్తుగా ఉండే మందిరంలో కొలువుతీరి కనిపిస్తాడు♪. అష్టాదశ శక్తిపీఠాల్లో మూడోదైన `విశాలాక్షి' పీఠం ఇక్కడే ఉంది♪.


✳️ లలితాపరమేశ్వరి పరివార దేవతల్లోని వారాహి మాత ఆలయం ఇక్కడ భూగృహంలో ఉంటుంది♪. అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని పై నుంచే గవాక్షం ద్వారా దర్శించుకోవాలి♪. 


✳️ చైతన్యస్వరూపానికి నిదర్శనంగా ఇక్కడ తిలభాండేశ్వర్ ఆలయం ఉంది♪. శివలింగం పెద్దగదిలో పట్టేంతగా ఉంటుంది♪. దేశంలోని పెద్దవైన మూడు శివలింగాల్లో ఇదొకటి♪.


✳️ నిత్యమూ - గంగాహారతి ఇచ్చే దశాశ్వమేధ ఘాట్ ఎంతో పేరుపొందింది♪. బ్రహ్మ - ఈ ప్రదేశంలో పది అశ్వమేధయాగాలు చేశాడంటారు♪. ఇక్కడే ఉన్న శీతలమాత ఆలయం ప్రశాంతతకు నిలయం♪. అన్నపూర్ణ, మహాలక్ష్మి పూజలు భక్తిప్రపత్తులతో జరుగుతుంటాయి♪. గంగామాతకు నిత్యమూ ఇచ్చే హారతి, నదుల పట్ల భారతీయుల పూజ్యభావాన్ని వెల్లడిస్తుంది♪.


✳️ భక్తి ముక్తి క్షేత్రంగానే కాక, శక్తి క్షేత్రంగానూ కీర్తి గడించింది కాశీ♪. రాక్షసులను సంహరించిన దుర్గాదేవి ఈ క్షేత్రంలోనే విశ్రాంతి తీసుకున్నదట♪. ఇక్కడే ఆమె స్వయంభువుగా కొలువై ఉంది♪.


✳️ గోస్వామి తులసీదాసు 'రామచరిత మానస్' రాసింది ఇక్కడే♪. అనంతర కాలంలో కాశీలో హనుమాన్ మందిరాల నిర్మాణాలు విస్తృతంగా జరిగాయి♪. ప్రభాతవేళల్లో - కాషాయాంబరధారులైన సాధువులు దండ కమండలాలతో 'హరహర మహాదేవ్' అంటూ విశ్వనాథుడి దర్శనానికి సాగి పోతుండటం ఓ మనోహర దృశ్యం♪.


✳️ కాశీ పండితుడు, కాశీ విద్వత్ సభ, కాశీలో విద్యాభ్యాసం, కాశీరాజుల సత్కారాలు... అని గొప్పగా చెప్పుకొంటారు♪. కాశీరాజు ఇచ్చిన విరాళ స్థలంలో బెనారస్ విశ్వవిద్యాలయాన్ని పండిత మదన్మోహన్ మాలవ్య స్థాపించారు♪. ఇందులో నిర్మించిన విశ్వనాథ మందిరం సుందరమైంది♪.


✳️ బుద్ధుడు మొదటగా ధర్మ ప్రవచనం చేసిన 'సారనాథ్' ఇక్కడే ఉంది. ఇక్కడి గ్రామదేవత గవ్వలమ్మ.. ఆమెను దర్శించి, యాత్రికుల సంపూర్ణ యాత్రాఫలసిద్ధి పొందుతారు♪.


✳️ ఘనచరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికతల కాశీ. దీని దర్శనం వల్ల కలిగే అనుభూతి భావనగా మారి ఆత్మానందాన్ని ప్రసాదిస్తుంది♪.



        ❀┉┅━❀🕉️❀┉┅━❀

🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు*

🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 

🚩

వృద్ధులు మెట్లు ఎక్కేటప్పుడు

 👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇👇


 *51% కంటే ఎక్కువ మంది వృద్ధులు మెట్లు ఎక్కేటప్పుడు పడిపోతారని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక అధ్యయనం నివేదించింది.  USలో ప్రతి సంవత్సరం, మెట్లు ఎక్కేటప్పుడు పడిపోవడం వల్ల 20,000 మరణాలు సంభవిస్తున్నాయి.   65 ఏళ్లు దాటిన తర్వాత, ఈ క్రింది పనులను స్వయంగా లేదా ఎవరి సహాయం లేకుండా చేయకూడదని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు:*


 1. మెట్లు/నిచ్చెనలు ఎక్కడం


 2. చాలా వేగంగా తిరగడం


 3. మీ పాదాలపై వంగడం


 4. నిలబడి ప్యాంటు ధరించడం


 5. కూర్చున్న స్థానం నుండి హఠాత్తుగా లేవడం


 6. త్వరగా ఎడమ-కుడి తిరగడం


 7. అకస్మాత్తుగా వెనక్కి తగ్గడం


 8. బరువైన వస్తువులను ఎత్తడానికి వంగడం


 9. అకస్మాత్తుగా మంచం నుండి లేవడం


 10. చాలా ఒత్తిడికి లోనవుతున్నారు


 *65 ఏళ్ల తర్వాత పై 10 పనులు చేయకుండా ప్రయత్నించండి

 *

 *✍🏻వృద్ధాప్యంలో వచ్చే నాలుగు సాధారణ సమస్యలు 👉🏼*

 1. ఆహారం గొంతులో ఇరుక్కుపోవడం వల్ల ఉక్కిరిబిక్కిరి కావడం.


 2. తప్పు దిండును ఉపయోగించడం


 3. లెగ్ తిమ్మిరి.


  4. కాళ్లలో జలదరింపు.


 ఎలా సహాయం చేయాలి:


 1. తినేటప్పుడు ఊపిరి ఆగిపోవడం:


 మీరు "మీ చేతులు పైకెత్తడం" మాత్రమే అవసరం.  మీ చేతులను మీ తలపైకి పైకి లేపడం వల్ల మీ గొంతులో ఇరుక్కున్న ఆహారం ఆటోమేటిక్‌గా క్రిందికి వెళ్లిపోతుంది.


 2. తప్పు దిండు:


 మీరు మేల్కొన్నప్పుడు కొన్నిసార్లు మీ మెడలో నొప్పి వస్తుంది.  దిండు తప్పుగా ఉంటే ఏమి చేయాలి?  మీరు మీ కాళ్ళను మాత్రమే పైకి లేపాలి, ఆపై మీ కాలి వేళ్ళను లాగండి మరియు సవ్యదిశలో లేదా అపసవ్య దిశలో మసాజ్ చేయండి.


 3. కాళ్లలో తిమ్మిర్లు:


 మీ ఎడమ కాలులో తిమ్మిరి అనిపించినప్పుడు, మీ కుడి చేతిని పైకి లేపండి, మీకు మీ కుడి కాలులో తిమ్మిరి ఉన్నప్పుడు, మీ ఎడమ చేతిని పైకి లేపండి, అది వెంటనే ఉపశమనం పొందుతుంది.


  4. జలదరింపు అడుగుల:


 ఎడమ పాదం జలదరించినప్పుడు, మీ కుడి అరచేతిని మీ శక్తితో తిప్పండి, కుడి పాదం జలదరించినప్పుడు, మీ శక్తితో మీ ఎడమ అరచేతిని తిప్పండి.


 ఈ సమాచారాన్ని కేవలం *సేవ్* చేయవద్దు.  దయ చేసి పంచండి*.


 ఎవరికి తెలుసు... *మీరు మరొకరిని రక్షించవచ్చు*.

మదించిన ఏనుగును

 శ్లోకం:☝️

*అల్పానామపి వస్తూనాం*

 *సంహతిః కార్యసాధికా ।*

*తృణైర్గుణత్వమాపన్నైర్*

 *బధ్యన్తే మత్తదన్తినః ॥*


అన్వయం: _లఘూనాం వస్తునాం మేలనేన మహత్ కార్యమపి సాధయితుం శక్యతే యథా తృణైః నిర్మితయా రజ్జ్వా మదాన్వితః గజః బంధయితుం శక్యతే ।_


భావం: మదించిన ఏనుగును గడ్డితో పేనిన తాడుతో కట్టగలిగినట్లు, చిన్న చిన్న వస్తువుల (పనుల లేక విషయాల) సరైన కలయికతో, పెద్ద పనులను కూడా సాధించవచ్చు.

డొనెషన్లు

 

మిత్రులారా మన బ్లాగు అభివ్రుద్దికి డొనేషనులు +91 9848647145 మొబేలు నంబరుకు జీ పే, ఫొనె పె, లొ దేనితొ నయినా పంప వచ్హు. మీ స్క్రీన్ షాట్ పంపిస్తె మన బ్లాగులొ పబ్లిష్ చేస్తాము. ఇక ఆలశ్యం యెందుకు ఇప్పుడె మీరు డొనెషన్ పంపండి. మన బ్లాగు అభివ్రుద్దికి తొట్పడండి 

సద్గుణ దయను అలవర్చుకోవాలి.*

 *అందరూ జీవితంలో సద్గుణ దయను అలవర్చుకోవాలి.* 


మనం జీవితంలో పెంపొందించుకోవాల్సిన ముఖ్యమైన లక్షణాలలో దయ ఒకటి.  ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం మరియు దుఃఖం మారుతూ ఉంటాయి కాబట్టి, కష్టాల్లో ఉన్నవారికి మనం సహాయం చేయడం చాలా ముఖ్యం.  ఇతరులకు సహాయం చేయాలనే కోరికను పెంపొందించుకోవడానికి మనలో దయ ఉండాలి. 

 భగవంతుని కరుణ అనంతమైనది కాబట్టి, ఆయన కరుణా సాగరమని వర్ణించబడింది.  లోకసంరక్షణ నిమిత్తం భగవంతుడు అనేక అవతారాలు ధరించేలా ప్రేరేపిస్తుంది ఈ దయ. 

 ఒకరు దయతో మరొకరికి సహాయం చేసినప్పుడు, ప్రతిఫలంగా ఏమీ ఆశించకూడదు.  అప్పుడే సత్పురుషుడు అని పిలవగలడు. 

 ఆదిశంకర భగవత్పాదులు తన శిష్యునికి గురువు ఉపదేశించడం దయతో అని చెప్పారు.  శిష్యుడు భక్తితో గురువును చేరుకోవాలి.  ఎందుకంటే గురువు కరుణా సాగరం.  మరియు బ్రహ్మ అంటే ఋషులలో ఉత్తముడు అని అర్థం. 

 ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో సద్గుణ దయను అలవర్చుకోవాలి.  ఇతరులకు చేసే చిన్న సహాయం కూడా పుణ్యం.  ఎదుటివారి గురించి మంచి మాటలు చెప్పడం మంచి పని.  ఆదిశంకరుడు తనకు హాని తలపెట్టడానికి వచ్చిన ఒక కాపాలిక పట్ల కరుణ చూపాడు.  ఇది మహోన్నతమైన దయ. 

 చిన్నతనం నుంచే పిల్లల్లో దయ పెంపొందించాలి.  పాఠశాలలో చదువుకునేటప్పుడే తోటి విద్యార్థులకు చిన్న చిన్న సహాయములు చేయటం నేర్పించాలి.  ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకోవడం చూస్తే వారిని శాంతింపజేసి పోరాటాన్ని ఆపేందుకు ప్రయత్నించడం మన ధర్మం.  కరుణతో నిండిన వారు మాత్రమే ఈ ప్రయత్నంలో నిమగ్నమవ్వగలరు. 

 మంచి స్థానంలో ఉన్న వ్యక్తి తనని యోగ్యతతో కోరుకునే వారికి సహేతుకమైన ఉపకారం చేయాలి.  ఇతరులకు సహాయం చేయడానికి మన జీవితంలో చాలా అవకాశాలు ఉన్నాయి.  మీరు వాటిని కోల్పోతే, మీరు చింతిస్తారు.  అది కూడా అజ్ఞానమే. 

 కాబట్టి ప్రతి ఒక్కరూ ఇతరులకు సహాయం చేయడానికి మరియు భగవదనుగ్రహాన్ని సాధించడానికి తమ వంతు కృషి చేయాలి.


-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు*

మనస్సులోని భావం

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


     శ్లో𝕝𝕝 *ఆకారైరింగితైర్గత్యా*

           *చేష్టయా భాషణేన చ* l

           *నేత్రవక్త్రవికారైశ్చ*

           *లక్ష్యతేఽన్తర్గతం మనః* ll


తా𝕝𝕝 " ఆకారముచేత, ఇంగితముచేత, నడవడికచేత, వ్యవహారముచేత, మాటలచేత మరియు కళ్ళలో, ముఖములో కలిగే మార్పులచేత మనస్సులోని భావం తెలియజేయబడును"

2, ఆగస్టు 2024, శుక్రవారం

Panchaag


 

Kasi yatra

 

 కాశీ యాత్ర (మొదటి భాగము)

 

ఏడు ఫెబ్రవరి నెలలో నేను నా శ్రీమతి కలసి రామేశ్వరము ఒక యాత్రికుల సమూహంతో బస్సులో వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని బస్సుకు టికెట్ల డబ్బులు కూడా కట్టి చివరి నిమిషంలో కారణాంతరాలవల్ల ప్రయాణాన్ని విరమించుకోవలసి వచ్చింది. ఈశ్వరుని అనుగ్రహం లేదు అని సరిపెట్టుకున్నాము. విషయంలో మేము వ్యాకులపడి ఉన్నామని తలంచి మా కుమారుడు మమ్ములను ఉత్సాహ పరచనెంచి గత మార్చి నెలలో వారణాశి ప్రయాణముకు విమాన టికెట్లు బుక్కు చేసినాడు. మా ప్రయాణం ఏప్రియల్ 4 తారీకు రాత్రి 7-40 నిముషములకు హైదరాబాదు విమానాశ్రయం నుండి మొదలై 9 తారీకు ఉదయం 9-15 నిముషములకు తిరిగి హైదరాబాదు విమానాశ్రయంలో చేరుకోవటంతో ముగుస్తుంది.

 

ప్రయాణ సన్నాహాలు: రోజులు గడుస్తున్నాయి అనుకున్న ఏప్రియల్ 4 తారీకు రానే వచ్చింది. నాకు రోజుకూడా రాజేంద్రనగర్ కోర్టులో ఒక కేసు వున్నది(నేను న్యాయవాదిని) . నా కుమారుడు అనుకున్న ప్రకారం రెండు రోజులముందే బెంగుళూరు నుండి వచ్చాడు. వచ్చిన వెంటనే ప్రయాణానికి ఏమేమి సామానులు తీసుకొని వెళ్ళాలి అని నా కుమారుడు, నా శ్రీమతి మాట్లాడు కోని బ్యాగులు సర్దుకోవటం మొదలు పెట్టారు. నేను 4 తారీకునాడు కోర్టుకు నా క్లయింటు కారులో వెళ్ళాను. అదృష్ట వశాత్తు మా జడ్జిగారు సెలవులో వున్నారు. కేసు తొందరగా వాయిదా వేసుకొని 12 గంటలకల్లా ఇంటికి చేరుకొని నా బ్యాగు సర్దుకున్నాను. మేము అనుకున్న ప్రకారము సాయంత్రము 5 గంటలకు రాపిడో క్యాబు బుకు చేసుకున్నాము. ఒక పది నిముషములలో క్యాబు వచ్చింది. ఒక అర గంటలో మమ్ములను విమానాశ్రయంలో దింపాడు. క్యాబుకు 600 రూపాయలు అయ్యాయి. మేము ముందుగా నా ప్రింటరులో తీసుకున్న టికెట్ల ప్రింట్లను చూపించి విమానాశ్రయాయంలోకి ప్రేవేశించాము. తరువాత మా లగేజీలను తనిఖీచేసిన  ఆమెతో మేము మా లగేజీలను క్యాబిన్లో కాకుండా మా వెంట తీసుకొని వెళతాము అని అడుగగా దానికి ఆమె సరే అని అన్నది. మీ వెంట లగేజి తీసుకునే పక్షంలో టాగ్లు వేసుకోవలసిన అవసరము లేదు అని అన్నది. తరువాత అక్కడి మానెటరును చూసుకొని మేము గేటు నెం. 17 లో విమానాన్ని ఎక్కాలని తెలుసుకొని చెక్ ఇన్ ద్వారాన్ని దాటి వెళ్ళాము. చెకిన్ లో మనము మన మనీపర్సు, మొబైలు ఫోనులు నడుము బెల్టులు కూడా అక్కడి ట్రేలలో పెట్టి అక్కడి యంత్రంద్వారా తనికీ చేయపడ్డ తరువాత మాత్రమే తీసుకొనాలి

 

మాకు వారణాసి వెళ్ళటానికి ఇండిగో విమానంలో 45 వరుసలో సీట్లు దొరికాయి. విమానంలో 7 కేజీల లగేజి మన వెంట మరియు 15 కేజీల లగేజి క్యాబిన్లో తీసుకొని వెళ్ళవచ్చు. గోళ్ళ రంగులు, రేజరులు, మండే పదార్ధాలు, సిగరెట్ లైటరులు, చాకులు, బ్లేడులు వెంట తీసుకోని వెళ్ళటానికి  అనుమతి ఉండదు.

కాశీ యాత్ర (రెండవ భాగము)

కాశీలో కాలుమోపటం: మా విమానం రాత్రి 10 గంటలకు కాశీ చేరుకుంది. హైదరాబాదు నుండి 1035 కిలోమీటరులు (గగన  దూరం)  ప్రయాణించి మేము కాశీలో అడుగిడి నా ము   మా వెంట తినుబండారాలు అంటే పులిహోర, ఇతరత్రా పదార్ధాలు ఏవి తీసుకొని వెళ్లనందున మాకు దిగగానే ఆకలి వేసింది. ఒక టాక్సీ మాట్లాడుకొని సైకిలు బాబా ఆశ్రమానికి తీసుకొని వెళ్ళమని అడిగాము. నిజానికి మేము బ్రాహ్మణ కరివేన సత్రంలో బస చేద్దామని అనుకున్నాము. కాగా సత్రం పేరు చెపితే టాక్సీవాళ్ళు తెలియదనటంతో దానికి సమీపంలోని సైకిలు బాబా ఆశ్రమం అని   చెప్పాము. ఒక అర్ధగంటలో బెంగాలీ టోలి (బెంగాలు ప్రైమరీ స్కూల్ ) వద్ద  రోడ్డు మీద మా కారు ఆపి సందులోంచి వెళ్ళండి సందులోకి కారు రాదనీ చెప్పాడు డ్రైవరు. టాక్సీ డ్రైవరుకు 750 రూపాయలు చెల్లించి తినటానికి ఏదైనా దొరుకుతుందా అని అక్కడ చుస్తే ఒక రోడ్డుప్రక్క దోశ బండి కనిపించింది. బ్రతుకు జీవుడా అని తలా ఒక దోశ తిన్నాము. దాని రుచి కూడా మాకు తెలియ లేదు . బండివాడు దోశ లను తయారు చేస్తుంటే నేను సందులో కొంతదూరం నడచి విచారించ ప్రయత్నించాను. సందులో నాకు ఒక ముగ్గురు మనుషులు కనిపించారు అందులో ఇద్దరు పెద్దవారు ఒక బాలిక వున్నది. వాళ్ళు తెలుగులో మాట్లాడుకోవటం నాకు ఆశ్చర్యం కలుగచేసింది. నేను తెలుగులో ఇక్కడ కరువేన సత్రం ఎక్కడో మీకు తేలుసా అని అడిగాను. సందులోంచి చివర వరకు వెళ్ళండి అని అన్నారు సందు ఒక 5-6 అడుగుల వెడల్పు కన్నాలేదు. ఇంకా ముందుకు చాలా ఇరుకుగా వుంది. కాశీలో సందులు చిన్నగా ఉంటాయి అని అప్పుడు నాకు తెలిసింది. విద్యుత్ దీప కాంతితో సందు దేదీప్యమానంగా వుందినేను  వచ్చి మా వాళ్లతో పాటు ఒక దోశ తిన్నాను. తరువాత ఎవరి బ్యాగు వాళ్ళం తగిలించుకొని సందులో ప్రయాణం అయ్యాము. నడచి, నడచి, నడచి చూసుకుంటూ వెళితే మాకు అఖిల భారతీయ బ్రాహ్మణ కరువేనా సత్రం కనిపించింది. అది చూడటానికి ఒక చిన్న ఇల్లుమాదిరిగా వుంది. మేము లోపలి వెళ్లగా అక్కడ ఒకరు  వున్నారు. మాకు రూము కావాలి అని అడిగితె రెండవ అంతస్తులో ఎసి రూము వుంది రోజుకు కిరాయి 1200 అని చెప్పి అతని హెల్పరుకు మాకు రూము చూపించమని చెప్పాడు

మీరు డబ్బులు రేపు  చెల్లించండి ముందు  గదిలోకి వెళ్లి విశ్రాన్తి తీసుకోండని ఆయన అన్నారు. అయన పేరు సుధాకర్ అని చెప్పారు. మేము కాలాతీతం చేయకుండా రూముకు వెళ్ళాము. అక్కడి మెట్లు చాలా ఇరుకుగా ఎత్తుగా వున్నాయి. ఎలాగో ఆలా మెట్లు ఎక్కి రూములోకి వెళ్ళాము. మేము వెంట తెచ్చుకున్న నీళ్ల బాటిలులోని నీళ్లుతాగి బ్రతుకు జీవుడా అని ప్రక్కమీద మేను వాల్చాము. నేను  ఉదయం 3 గంటలకు లేచి దంతధావన చేసి తరువాత స్నానం చేసే సరికి దాదాపు 4 గంటలు కావచ్చిందినా శ్రీమతిని, కుమారుడిని లేపి వాళ్ళను కూడా త్వరగా కాలకృత్యాలు తీర్చుకోమని చెప్పాను . మేము ముగ్గురం ఉదయం 5 గంటలకు తయారు అయి రూము బయటకు వచ్చాము. మాకు దోవ క్రొత్త నా కుమారుడు గూగులు మ్యాప్స్ పెట్టి మమ్మలను రోడ్డు మీదకు మార్గదర్శనం చేసాడు. ఒక 15 నిముషాలు నడచి మేము రోడ్డు మీదకు చేరాము. అక్కడ ఒక ఆటో లో మాకు కాలబైరవ డైవ దర్శనం చేయించి తరువాత విశ్వనాధుని ఆలయ దర్శనం చేయించవలెనని అడుగగా అతను నేను కాలాభిరవ దేవాలయానికి తీసుకొని వెళ్లి మిమ్ములను నంది సర్కిల్ దగ్గర దింపుతాను నాకు 300 రూపాయలు ఇవ్వాలని అన్నాడు. సరేనాని ఆటోలో కూర్చున్నాము. దాదాపు ఒక 3 కిలోమీటర్లు తీసుకొని వెళ్లి ఒక సందులో ఆటో ఆపి మీరు ఇటునుంచి వెళ్లి దైవదర్శనం చేసుకొని రండి నేను ఇక్కడే ఉంటానని అన్నాడు. కాలభిరావుని దేవాలయంలో రద్దీ ఎక్కువగా లేదు  మేము ఒక 10-15 నిముషాలలో స్వామి దర్శనం చేసుకొని ఆటో చేరుకున్నాము. ఆటో ఒక 3,4 నిముషాలలో నంది సర్కిల్ చేరిందినంది సర్కిల్లో రెండు వైపుల మాత్రమే వాహనాలను అనుమతిస్తారు రెండు రోడ్లలో అనుమతించరు. అందులో ఒక రోడ్డు మీద కొంత దూరం వెళ్లిన తరువాత మనం విశ్వనాధ ఆలయం వెళ్లే గేట్లు ఉంటాయి. గేటు నెం 4 క్రొత్తగా నిర్మించారని విన్నాము. మేము గేటు నెంబరు 2 నుండి లోపలి వెళ్ళాము. లోపలి మార్గం చాలా ఇరుకుగా ఉంటుంది. ఒక ముగ్గురు ప్రక్క ప్రక్కగా ఉంటే అటు గోడ ఇటు గోడ ఆనుతుంది కొన్ని చోట్ల ఇంకా ఇరుకుగా కూడా ఉంటుంది. అందులోంచి అక్కడి వారు మోటారు సైకిళ్ళు, స్కూటర్లు నడుపుతూ వెళతారంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇరువైపుల రకరకాల దుకాణాలు. కొన్నిచోట్ల సందులలో అరుగులు కూడా వున్నాయి. అరుగులమీద కూడా దుకాణాలు వున్నాయి. రాగి, ఇత్తడి సామానులు, రుద్రాక్షమాలలుపూలు,మొదలైనవి షాపులలో ఎక్కువగా కనపడతాయి. మారేడు దళాలు, ఉమ్మెత్త కాయలు, జిల్లేడు మొగ్గల మాలలు ఇతర పూలు, స్వీట్లు ఎక్కువగా కనపడ్డాయి. సందులో చాలా దూరం మాకు ఎటువంటి రద్దీ కనపడలేదు. కొంత దూరం వెళ్లిన తరువాత షాపులలో మీరు ఇక్కడ లాఖరులో మీ ఫోన్లు పెట్టుకోండి ప్రీ మీరు పూలు మాదగ్గర కొంటె చాలు అని అన్నారు. నా కుమారుడు ఒక షాపులో పూలు, స్వీట్లు పెట్టిన బుట్టను అడుగగా అతను రూ. 250 అన్నాడు. నేను రూ200 బ్యారం చేస్తే అందులోంచి కొన్ని ధ్రవ్యాలను తీసి మాకు ఇచ్చాడు. మేము బుట్ట పట్టుకొని కొంత దూరం వెళ్లగా అక్కడ ఒక షెడ్డు కనిపించింది. అక్కడ దాకా జనాలు ఎక్కువ లేరు. అక్కడినుంచి లైను మొదలైయింది. ఆడవారికి వేరు మొగవారికి వేరుగా లైన్లు వున్నాయి. అక్కడ చెక్ చేసి లోపలి హాలులోకి మమ్మలను పంపారు. అక్కడ మన దేవాలయాల బారికేట్లు కనిపించాయి. వాటిలో దాదాపు ఒక గంట నడచి మేము విశ్వనాధుని చేరుకున్నాము. ఉదయం 8-30 కల్లా మాకు దర్శనం అయ్యింది. కాసేపు గుడి ప్రాంగణంలో కూర్చున్నాము. అక్కడ బోర్డులు తెలుగులో వ్రాసి ఉండటం ఆనందాన్ని కలుగచేసింది. కాశీలో తెలుగు వాళ్ళు చాలామంది వున్నారు. ఆలయానికి ఒక గోడకు ఆనుకొని ఒక పురాతన మసీదు ఉండటం నాకు బాధ కలిగించింది. 9గంటలకు ఆలయ ప్రాంగణాన్ని వదిలి 10 నిముషాలు  నడచి మేము రోడ్డు మీదకు చేరుకున్నాము. అక్కడ ఒక హోటలులో టిఫినీ చేసాము. తరువాత కొంత దూరం నడచి ప్రక్కనే వున్నా గంగ ఘాటుకి వెళ్ళాము. పైన ఎండ బాగా ఎక్కువగా వుంది. మేము తిన్న టిఫిన్ ఎప్పుడో ఆవిరి అయ్యింది. ఇక ఎక్కువ సేపు ఎండలో ఉండలేక పోయాము. అక్కడి రోడ్డుకి ఇఱుపేపులా బట్టల దుకాణాలు రోడ్డుమీద వ్యాపారాలు నాకు హైదరాబాదులోని చార్మినార్ సెంటరు లాగ అనిపించింది. కొంత దూరం నడచి ఒక సైకిలు రిక్షా ఎక్కాము . సైకిలు బాబా ఆశ్రమం దాకా రావటానికి 70రూపాయలు  అడిగాడు సరే అని అన్నము. . రిక్షా సీటు ఎత్తుగా వుంది ఇద్దరు కూర్చోవటానికి కూడా ఇరుకుగా వుంది. మరి నేను యెట్లా కూర్చోవాలని నా కుమురుడు అడుగగా నా సీటు మీద కూర్చో మని అన్నాడు అట్లానే తంటాలు పడుతూ ముగ్గురం కూర్చున్నాము. రిక్షావాలా కొంత దూరం తోసుకుంటూ నడిచి తరువాత తొక్కుకుంటూ చిన్నగా బెంగాలీ టోలి అంటే మా సందు కలిసే రోడ్డు వద్దకు వచ్చి ప్రక్కసందులో కొంత దూరం తీసుకొని వెళ్లి సైకిలు బాబా ఆశ్రమం దగ్గర రిక్షా ఆపాడు. అతను ఎక్కువగా కష్టపడ్డట్లు నేను భావించి వప్పుకున్న దానికన్నా ఎక్కువ అంటే 100 రూపాయలు ఇచ్చి అక్కడినుండి నడుచుకుంటూ సత్రానికి చేరుకున్నాము. సత్రం లో అడిగితె ఇప్పుడు వెళితే మీకు భోజనం పెడతారు అని ప్రక్కనుండి వెళ్ళమని మార్గదర్శనం చేస్తే మేము ప్రక్కవీధిలోని భోజనశాలకు వెళ్లి భోజనం చేసాము. అక్కడినుండి రూముకు చేరుకొని విశ్రాన్తి తీసుకొని మరల సాయంత్రం గంగా నదికి వెళ్ళటానికి ప్లాను చేసుకొన్నాము.  

కాశీ యాత్ర (మూడవ భాగము)

 5 తారీకు సాయంత్రం 4గంటలకు సత్రం రూముకు తాళం వేసి నడుచుకుంటూ సందులన్నీ తిరిగి మేము బాపు పాండే ఘాట్ వద్దకు వెళ్ళాము. అక్కడ మెట్ల ప్రక్కన ఒక స్లోపు గోడ వున్నది నేను గోడమీదనుంచి నడవటం వలన క్రిందికి దిగటం తేలిక అయ్యింది. మేము కొంత క్రిందికి రాగానే ఒక పడవ వాడు మమ్ములను కలిసి రెండు వేలు ఇస్తే మొత్తం ఘాటులన్ని చూపించి వస్తానన్నాడు. నేను క్రింద నది దగ్గరకు తొందర తొందరగా వెళ్ళితే అక్కడ ఒక ఫెర్రీ షిప్  బయలుదేరటానికి సిద్ధంగా వున్నది నేను పడవ వానిని ఎంత తీసుకుడుంటావు  అని అడిగితె మనిషికి 300 రూపాయలు అని అన్నాడు. కానీ మా కుమారుడు 15వందలకు చిన్న మోటారు బోటు మాట్లాడాడు. మా కాంట్రాక్టు ప్రకారం మమ్మలను ఆవలి వడ్డుకు తీసుకొని వెళ్లి మేము నదిలో స్నానం చేసే దాకా ఉండి తరువాత కాశీలోని గాటు  లన్నీ చూపించి గంగ హారతిని చూపించి మరల మమ్మలను బాపు పాండే ఘాటులో వదలాలి. అదే ప్రకారం ముందుగా మమ్మల్ను ఆవలివడ్డుకు తీసుకొని వెళ్ళాడు. అక్కడ మేము ముగ్గురం స్నానాలు చేసాము. తరువాత నదికి ఎగువగా వెళ్లి ఒక్కొక్క గాటుని దూరం నుంచి చూపుతూ చివరి ఘాట్లు అంటే హరిచంద్ర ఘాటు మేము ఘాటుని చూసినప్పుడు ఒక నాలుగు చితులు కాలుతూ కనిపించాయితరువాత మణికర్ణికా ఘాటు అక్కడ కూడా నాలుగు చితులు కాలుతూ కనిపించాయి. నేను బోటులోంచే చితులకు నమస్కరించానుఆహ వాళ్ళ భాగ్యం ఏమిటి కాశీలో మరణించారు అని తలచాను. " కాశీని మరణాత్ ముక్తిహి" అని మనసులోనే అనుకొన్నాను. కాశీలోనే మరణించాలని చాలామంది వృద్ధాప్యంలో కాశీకి వచ్చి నివసిస్తారని నేను విన్నాను. యెంత ప్రయత్నించినా కానీ కొద్దిమందో పుణ్యస్థలంలో మరణించగలరని నానుడి. మమ్మలను అన్ని ఘాట్లు తిప్పుతూ చివరకు దశాశ్వమేధ ఘాటుకు తీసుకొని వచ్చి గంగ నదిలో నావను నిలిపాడు. అక్కడ దాదాపు రాత్రి 8 గంటలవరకు ఉండి గంగ హారతిని కన్నులపండుగగా తిలకించాము. హారతి కార్యక్రమం ముగియకముందే మమ్ములను నదిలో బాపు పాండే ఘాటు వద్దకు బోటు వాడు తీసుకొని వెళ్ళాడు. మేము అతనికి వప్పుకున్న ద్రవ్యం ఇచ్చి మేము నడుచుకుంటూ సత్రానికి చేరుకున్నాము. కరివేనసత్రంలో రాత్రి పుట భోజనం పెట్టరు . నా కుమారుడు వెళ్లి టిఫిన్ ప్యాక్ చేయించుకొని ఒక స్టీలు మగ్గునిండా మజ్జిగ తీసుకొని వచ్చాడు. మేము ఉప్మా తిని మజ్జిగ త్రాగినాము. నేను నా కుమారుడు అక్కడికి దగ్గరలోని తారక రామ ఆంధ్రశ్రమాన్ని వెళ్లి రూములగూర్చి విచారించాము. మీరు సామానుతో వస్తే కానీ మీకు రూము ఇవ్వము అని అక్కడి రిసిప్షన్లోని ఆయన అంటే తిరిగి సత్రానికి వచ్చి రూము కిరాయి రూ. 1200 కట్టి రూము  కాళీ చేసి ఆంధ్రాశ్రమానికి వెళితే  మాకు రెండవ అంతస్తులో 39 నంబరు గది రూ 375 కిరాయితో ఇచ్చారు. మేము ఎదురుగా వున్న లిఫ్ట్ ఎక్కి 2 అంతస్తులోని గదికి వెళ్ళాము. అటెండరు గది తాళం తీసి మాకు గది  వప్పచెప్పి  తాళం చెవి తీసుకొని వెళ్ళాడు. అదేమిటని అడిగితె మీరు మీ సొంత తాళం వేసుకోవాలని అన్నాడు. నేను క్రిందికి వచ్చి అక్కడి సమీప షాపులో ఒక చిన్న తాళం రూ 50 పెట్టి కొన్నాను. ఆంధ్రశ్రమంలో బియ్యపు రవ్వ ఉప్మా పెడితే నేను గదికి తీసుకొని వచ్చి దానిని తిని మేము పడుకున్నాము.

కాశీ యాత్ర (నాలుగవ భాగము

 6 తారీకు ఉదయం నేను 3-30 గంటలకు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని నా శ్రీమతిని, కుమారుడిని త్వరగా తయారు కమ్మని చెప్పగా ఉదయం 5 గంటలకు మేము రూముకు తాళం వేసి చిన్నగా ఆశ్రమం ప్రక్క సందునుండి సైకిలు బాబా ఆశ్రమం వరకు నడుచుకుంటూ వెళితే అక్కడ ఒక రిక్షా కనిపించింది 300 రూపాయలకు నంది సర్కిల్ వరకు రావటానికి వప్పుకొన్నాడు. బ్యాటరీ రిక్షాలు రోడ్డుమీద వెళితే మనకు ఎడ్ల బండి ఎక్కిన అనుభూతి కలుగుతుంది. ఎందుకంటె వాటి షాక్ అబ్సర్వర్స్ మంచిగా వుండవు. 15 నిముషాలలో మమ్మలను నంది సర్కిల్లో దించాడు. మేము ఆలస్యం చేయకుండా గేటు  నెంబరు 1 ద్వారా వెళ్లి సాక్షి గణపతి మరియు అన్నపూర్ణ అమ్మవారిని, మరియు వారాహి మాత అమ్మవారిని చూడాలని సంకల్పంకాగా అక్కడి పోలీసులు గేటు -1 నుండి వెళ్లనీయలేదు. మేము కొంచం ముందుకు వెళ్లి గేటు-2 నుండి వెళ్లి దైవానుగ్రహంతో ముందుగా సాక్షి గణపతి దర్శనం చేసుకున్నాము. ఆంజనేయస్వామికి పూసినట్లు స్వామికి సిందూరం పూసి ఉంచారు. జనం ఎవరు లేరు. చక్కగా దర్శనం అయ్యింది. తరువాత వారాహి అమ్మవారి దర్శనానికి వెళితే అక్కడ చాలామంది క్యూలో వున్నారు. మేము క్యూ చివరకు వెళితే అక్కడ ఒక ఆంజనేయస్వామి దేవాలయం కనిపించింది స్వామిని దర్శించుకొన్నాము దేవాలయ ప్రాంగణం చిన్నగా వుంది అక్కడ్నుంచి చుస్తే గంగ నది కనిపిస్తున్నది. కొంచం సేపు అక్కడ ఉండి దేవాలయం క్రింద ఒక మునిసిపల్ నల్ల కనిపిస్తే కాళీ ఆయిన మా నీళ్ల సీసాను నింపుకొని మరల క్యూను ముందరగా వెళితే అక్కడ వున్న రోడ్డు ప్రక్క దుకాణం ఆమె మీరు ఒక్కొక్కరు రూ 300 ఇస్తే మీకు స్పెషల్ దర్శనం  చేయిస్తాను. అది నాకు ఇవ్వనక్కరలేదు పూజారికి ఇవ్వండి అని మమ్మలను ఆపింది. నాకు ఎండకు అస్వస్థతగా ఉండటం చేత మనం వెళదాం అని మా వాళ్ళను తొందర పెట్టితే ఆమె బాబూజీ ఉండండి మీకు కుర్చీ వేస్తా అని ఒక కుర్చీ తెచ్చి వేసి నాకు త్రాగటానికి నీళ్లు ఇస్తా అని చెప్పి ఆమె కూతురుకు ఫురమిస్తే అమ్మాయి ఒక పెద్ద గ్లాసునిండా మజ్జిగ పంచదార కలుపుకొని వచ్చి నాకు ఇచ్చింది. అది తాగి నేను కొంత ఊరట చెందాను. ఇంతలో దేవాలయపు తలుపులు మూయటంతో క్యూలోని వాళ్లంతా వెళ్లారు. అక్కడ మేము ముగ్గురం మా ముందు దుకాణం ఆమె ఆపిన మొరొక 4గురు మాత్రమే మిగిలారు. ఇంతలో ప్రక్క ఇంట్లోంచి ఒక పూజారి వచ్చి కేతేనే లోగ్ హై అన్నాడు. తీన్ అని మా కాంట్రాక్టరు, చారు అని ఎదురు షాపు ఆమె అనటంతో జెల్ది ఆజావ్ అని దేవాలయపు తలుపు ప్రక్కన వున్న గది తలుపు తెరిచాడు. మేము ముగ్గురం మిగిలిన వార్ అందరం లోపలి వెళ్ళాం తీన్  తీన్  సౌ దేవ్ అని ముందుగా మా దగ్గర 900 రూపాయలు తీసుకున్నాడు. నాకు అంతా అయోమయంగా అనిపించిందిమమ్మలను చిన్నగా ఒక గదికి తీసుకొని వెళ్ళాడు అదే వారాహి అమ్మ దేవాలయం. నన్ను కూర్చో మని అన్నాడు నాకు తెలియక బాసుపేట్లు  వేసుకొని కూర్చున్నాను. ఐస నై అని గొంతుకు కూర్చోమని చెప్పాడు అక్కడ 2.x 1 అడుగుల  కంత ఒకటి వున్నది దానిలోంచి క్రిందికి చూడమని చెప్పాడు. అప్పుడు నాకు తెలిసింది అమ్మవారు క్రింద వున్నారని. నేను చుస్తే అమ్మవారి ముఖం ఒక ప్రక్కగా క్రింద కనిపించింది. చేలో చేలో అని నన్ను పంపించి మిగిలిన వారికి కూడా ఒక 2 నిముషాలలో దర్శనం చేయించి పంపాడు. మేము బ్రతుకు జీవుడా అని బయటకు  వచ్చాము. తరువాత అన్నపూర్ణ అమ్మవారి దర్శనం కోసం బయట విచారించాం కానీ క్యూ చాల పెద్దగా ఉండటం చేత తల్లిని చూడకుండానే వెళదామని నిర్ణయించుకున్నాం. బయటకు అంటే సందులలోంచి రోడ్డు మీదకు రాగానే ఒక టీ దుకాణం కనిపించింది. మట్టి గ్లాసులల్లో టీ ఇస్తున్నాడు. గ్లాసు 15 రూపాయలు. తాగినవి పారేయటమే. నాకు మట్టి గ్లాసు నచ్చింది. నాకు ఒక కాళీ గ్లాసు కావలి అంటే 3రూపాయలకు ఇచ్చాడు. దానిని భద్రంగా తెచ్చుకొన్నాను

రోడ్డుకు ఇరుపైపుల మన చార్మినార్ రోడ్డులాగా అన్నీ బట్టల  దుకాణాలు,డ్రస్సులు అమ్ముతున్నారు. ఆడవారు చేతినిండా డబ్బులు తీసుకొని వస్తే మోయలేనన్ని బట్టలు కొనటం కాయం. కాకపొతే మాకు ఆకలి బాగా వేయటంతో ఏమి కొనకుండానే 1-30 గంటలకు నంది సర్కిలుకు నడుచుకుంటూ వచ్చి ఒక సైకిల్ రిక్షా ఎక్కి రూము దోవ పట్టము. రిక్షా వాడు రూ 100 తీసుకున్నాడు. రూములో కొంతసేపు ఉండి అక్కడినుండి కరివేనసత్రం భోజనాలయానికి వెళ్లి భోజనం చేసి ఇక రోజు విశ్రాంతి తీసుకుందామని అనుకున్నామునేను మాత్రం మరుసటి రోజు ప్రోగాంగూర్చి ఆలోచిస్తున్నాను. మేము ఆశ్రమ సందులోకి వస్తూవుంటే ఒకడు కరపత్రాలను పంచుతున్నాడు. అది గయ, ప్రయాగరాజుకు టూరులు అది చదివి నేను మరుసటి రోజు గయకు వెళ్ళటానికి కారు మాట్లాడుకున్నాను. గయా చూపించి తిరిగి తీసుకొని రావటానికి రూ 6000 అడిగాడు. ముందుగా అద్వాన్సు రూ  500 అడిగితె ఇచ్చాను. నాకు ఆతను డ్రైవరు ఫోను నంబరు ఇచ్చాడు. ఉదయం 5గంటలకు బెంగాలీ టోలి దగ్గరకు కారు వస్తుంది అని అన్నాడు. నేను ఇంటికి వచ్చి రేపటి ప్రోగ్రాం గురుంచి మావాళ్లకు చెప్పాను . సాయంత్రం ఆంధ్రశ్రమం నుంచి తెచ్చుకున్నటిఫిన్ బియ్యపురవ్వ ఉప్మా తిని పడుకున్నాము

కాశీ యాత్ర (ఐదవ భాగము

7 తారీకు ఉదయం 5గంటలకు మేము తయారయి రూముకు తాళం వేసి చిన్నగా సైకిలుబాబా ఆశ్రమంముందునుంచి నడుచుకుంటూ బెంగాలి టోలె (రోడ్డు  మీదకు)వెళ్ళాము మేము అక్కడకు చేరుకోగానే  మా కారు సిద్ధంగా వుంది డ్రైవరు పేరు యాదవ్. మేము ఫోను చేసి కారుదగ్గరకు వెళ్లి మా లగేజీని డిక్కీలో పెట్టి కూర్చున్నాము. అది మారుతి డిజైర్ తెల్ల కారు. డ్రైవరు చిన్నగా కారు నడిపి ఒక అర్థగంటకు కాశీ పట్టణాన్ని వదలి గయావైపు వెళ్లే రోడ్డు ఎక్కించాడు. . మధ్యలో బనారస్ హిందూ యూనివర్శిటీ  గేట్లను దాటుతూ మా కారు వెళ్ళింది. అందులో ఒక గేటు పేరు హైదరాబాదు గేటు అని డ్రైవరు చెప్పాడు. కొంతదూరం వెళ్లిన తరువాత కారును ఒక డాబా ముందు ఆపి మీరు ఇక్కడ టిఫిన్ చేయవచ్చు అన్నాడు. మేము టిఫిన్ చేసాముఅక్కడ కూడా మన టిఫిన్లే వున్నాయి. దోశ 70 రూపాయలు, ఇడ్లీ ప్లేటు (4 చిన్నవి) 50 రూపాయలు, టి  10 రూపాయలు. తరువాత ఎక్కడ ఆగకుండా మాకారు మధ్యాన్నం 12 గంటల సమయంలో గయను చేరింది. ముందుగా విష్ణు పాద ఆలయూయాన్ని చూసాము. అక్కడ క్యూ పద్దతి లేదు సెల్ఫోనులు లోపలి అనుమతించరుఒక్కసారిగా ఒక గుంపు గుంపుగా భక్తులను గుడిలోకి వదులుతారునాకు పద్ధతి మంచిగా అనిపించలేదు. ఎట్లాగో మేము గుంపులోవెళ్లి విష్ణుపాదాన్ని దర్శించుకొని వంటిగంటకల్లా బయటకు వచ్చాము. మా డ్రైవరు తిరిగి మమ్మలను ఊళ్లోకి తీసుకొని వచ్చాడు. ఊర్లో తెలుగులో ఆంధ్ర భోజనం అని వ్రాసి ఉన్న ఒక హోటలులో భోజనం చేసాము. మాత్రం రుచిగా లేదు ప్లేటుకు 120 తీసుకున్నారు. అక్కడినుంచి మేము అక్కడి శక్తిపీఠం అయినా మాంగల్యగౌరి అమ్మవారి దర్శనానికి వెళ్ళాము. దేవాలయం ఒక చిన్న కొండ మీద  వున్నది. మేము వెళుతుంటే ఎవరో భక్తులు అక్కడ ఇప్పుడు దర్శనం కావటం లేదు అందుకే మేము తిరిగి వెళుతున్నాము అని అన్నారు. వారి మాటలు మాకు కొంత నిరుత్సాహం కలుగ చేసింది. మేము అమ్మవారిని తలుచుకొని కొండ  ఎక్కాము అక్కడ క్యూ చాలా పెద్దగా వుంది. అక్కడ ఒక టేబులు ముందు ఒక ముగ్గురు కూర్చొని వున్నారు. మేము వారలను విచారిస్తే కొంత సేపు లాగండి ఇక్కడికి డిప్యూటీ సీఎం వస్తున్నారుఆయన వెళ్లిన తరువాత మీరు ఒక్కొక్కరు రూ 250 కడితే ప్రత్యేక దర్శనం లభిస్తుందని అన్నారు. మేము రూ 750 ఇచ్చి టికెట్లు తీసుకున్నాము. ఒక ఆర్ గంటలోనే మాకు దర్శనమ్ అయ్యింది. నేను అమ్మవారు అంటే మన దేవాలయాలలో మాదిరిగా తల్లి విగ్రహం ఉంటుందని అనుకున్నా కానీ ఆలా లేదు ఒక చిన్న గది మధ్యలో ఒక చిన్న గద్దెమీద దీరఘాచేతురస్రాకారంలో వెండితాపడం చేసిఉంది. దానిమీద ఒక దీపం వెలుగుతున్నది. మేము కొండదిగి క్రిందికి రాగానే మా డ్రైవరు మమ్మలను బుద్ధగయాకు తీసుకొని వెళ్ళాడు. అక్కడ మా కారు వెళ్ళటానికి పర్మిషన్ ఉండదట అక్కడి వాహనాలలోనే వెళ్ళాలట. మేము ఒక ఈరీక్షను 400 రూపాయలకు మాట్లాడుకొని అన్ని బుద్ధ దేవాలయాలను చూసాము. ఎండ మండిపోతున్నది. మేము కారులో గొడుగులు తెచ్చాము కానీ వాటిని అక్కడే వదలటం వల్ల కొంత ఇబ్బంది అయ్యింది. 3-4 గంటల సమయంలో తిరుగు ప్రయాణం చేసాము. సాయంత్రం 5 గంటల సమయంలో ఉదయం టిఫిన్ చేసిన హోటలులో మళ్ళి వెళ్లి టీ  తాగి ప్రయాణం కొనసాగించాము. డాబా హోటలు చుట్టూ గోధుమ పంట కోతకు సిద్ధంగా ఉండి వుంది. నేను మొదటిసారి గోధుమ పంటను చూడటం. రాత్రి 7 గంటల సమయంకల్లా మమ్మలను వారణాసిలో బెంగాలీ టోలి వద్ద దింపాడు దారిలో ఒక పార్ధవ శరీరాన్ని ఊరేగిస్తూ తీసుకొని  వెళుతున్నారు. బాడీని మణికంటిక గాటుకే తీసుకొని వెళతారు అని డ్రైవరు చెప్పాడు. నేను నా కాళ్ళ చెప్పులు కారులోనే విప్పి మోక్షప్రాప్తి పొందిన జీవికి నమస్కరించాను. ప్రతి రోజు రాత్రి 12 గంటల సమయంలో మణికంటిక గాటులో జ్వలించే చితి భస్మాన్ని తీసుకొని వచ్చి కాశీ విశ్వనాధునికి అభిషేకం చేస్తారని డ్రైవర్ చెప్పాడురాత్రి రూముకు చేరుకోగానే మేము ఆశ్రమంలో పెట్టిన టిఫిన్ తిని విశ్రాన్తి తీసుకున్నాము. మరుసటి రోజు ప్రయాగ వెళ్ళటానికి అదే డ్రైవరుతో మాట్లాడుకున్నాము ట్రిప్ ఖరీదు 3,400/- 

 7 తారీకు ఉదయం 5గంటలకు మేము తయారయి రూముకు తాళం వేసి చిన్నగా సైకిలుబాబా ఆశ్రమంముందునుంచి నడుచుకుంటూ బెంగాలి టోలె (రోడ్డు  మీదకు)వెళ్ళాము. మా డ్రైవరు సిద్ధంగా వున్నాడు. రోజు మనం తొందరగానే వస్తాము ప్రయాగ 110 కిలోమీటర్లే అని అన్నాడు. 8 గంటల సమయంలో ఒక హోటలు ముందు కారుని ఆపి టిఫిన్ చేయమన్నాడు. మేము టిఫిన్ చేసాము. అక్కడినుంచి దాదాపు 9-30 కల్లా ప్రయాగ గంగా బ్రిడ్జి మీదుగా ప్రయాగరాజ్కు తీసుకొని వెళ్ళాడు. బ్రిడ్జిమీద కారువున్నప్పుడు దూరంగా ఒక వంతెనను చూపించి అది యమునా నదిమీద వున్నదని చెప్పాడు. మమ్మలను యమునా నదీ తీరానికి తీసుకొని వెళ్లి మీరు బోటులో త్రివేణి సంగమంకు వెళ్లి స్నానాలు చేయమని చెప్పాడు. మేము ఒక చిన్నపడవను 1600 రూపాయలకు మాట్లాడుకొని వెళ్ళాము. అక్కడకు వెళ్లి స్నానాలు చేసి తిరిగి వడ్డుకు వచ్చాము. అక్కడే వున్న హనుమంతుని దేవాలయానికి వెళ్ళమని చెపితే మేము వెళ్ళాము. అక్కడ స్వామి పడుకొని వుంటారు. "లేటేహుయే బడా హనుమాన్ దేవల్ " అని చెప్పాడు. తొందరలోనే స్వామీ దర్శనం అయ్యింది. అక్కడినుంచి మమ్ములను ఇంకొక శక్తీ పీఠం అయిన మాతా మాధవేశ్వరి దేవాలయంకు తీసుకొని వెళ్ళాడు. అక్కడ మన దేవాలయాల్లో మాదిరిగానే బారికేట్లు వున్నాయి కానీ జనం ఎక్కువ లేక పోవటం వలన దర్శనం త్వరగానే అయ్యింది. అక్కడ అమ్మవారు ఒక ఉయ్యాల కట్టి క్రింద ఒక నాలుగు పలకల ఫలకం వుంది. విగ్రహం లేదు. అమ్మవారి దర్శనం అవ్వగానే మేము తిరోన్ముకులం అయ్యాము. రోజు సోమవారం కాబట్టి మ్యూజియంకు సెలవు అని చెప్పి మమ్మలను మ్యూజియంకు తీసుకొని వెళ్ళలేదు. మధ్యాన్నం 2-30కు రూముకు చేరుకొని సత్రంలో భోజనం చేసి విశ్రమించి మరుసటి రోజు హైదరాబాదు ప్రయాణానికి సంసిద్ధులం అయ్యాము. డ్రైవరుకు తిరిగి ఉదయం 5 గంటలకు వచ్చి మమ్మలను విమానాశ్రయంలో విడవాలని చెప్పాము. రాత్రే రూము రెంటు 1500 చెల్లించి రసీదు తీసుకున్నాము. ఆంధ్రశ్రమంలో సాయంత్రం 7ఇంటికి ఒక డాక్టరు రూము 1 లో వస్తారు అన్నారు. నేను నాకు కొంత జలుబుగా ఉంటే డాక్టరు దగ్గరకు వెళ్లి మందులు తీసుకున్నాను. మందులు కూడా ఉచితంగా ఇస్తారు

9 .తారీకు ఉదయం 5గంటలకు మేము తయారయి సామానులన్నీ తీసుకొని  రూముకు తాళం వేసి గేటుదగ్గర వాచిమనుకు రసీదు చూపించి చిన్నగా సైకిలుబాబా ఆశ్రమంముందునుంచి నడుచుకుంటూ బెంగాలి టోలె (రోడ్డు  మీదకు)వెళ్ళాము. మా కారు మాకోసం సిద్ధంగా వుంది. కారులో కూర్చోగానే ఒక 40 నిముషాలలో మమ్ములను విమానాశ్రయంలో దింపాడు. నేను డ్రైవరుకు 700 రూపాయలను ఇచ్చాను. టైము ప్రకారం మా విమానం 7-40 కి వచ్చింది. వారణాసిలో చెకింగ్ మన హైదరాబాదుకన్నా ఎక్కువగా వుందిమా సూటుకేసును కాబిన్లో వేయక తప్పదన్నారు. దానికి ట్యాగ్ వేయించుకొని మిగిలిన రెండు బ్యాగులు నేనొకటి నా కుమారుడు ఒకటి పట్టుకొని విమానం ఎక్కాము. మా విమానం యెరిండియా ఎక్ష్ప్రెస్స్ మేము హైదరాబాదులో 10 గంటలకల్లా దిగాము. ఒక టాక్సీ మాట్లాడుకొని ఇంటికి చేరాము. దానితో మా యాత్ర పరిసమాప్తం ఐయ్యింది

శుభం బురియత్ 

సర్వజన సుఖుఇనోభవంతు 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ భార్గవ శర్మ

 

కాశీలో జీవనం

 

వివిధ ప్రాంతాలనుంచి అనేదానికన్నా వివిధ దేశాలనుంచి ఎంతోమంది కాశీకి వచ్చి రోజులకొద్దీ, నెలల కొద్దీ, సంవత్సరాలకొద్దీ నివసిస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకు అని నన్ను నేను ప్రశ్నించుకుంటే నాకు లభించిన సమాధానం నేను ఏప్రిల్ 5 తారీకు ఉదయం 8-30 నుండి 9 గంటలవరకు పొందిన అనుభవం, అనుభూతే సమాధానంగా లభించింది. కాశీవిశ్వేశ్వరుని దర్శించుకొని ఆలయ ప్రాంగణంలో కూర్చుంటే అనన్య సామాన్యమైన ఆధ్యాత్మిక అనుభూతి,. అక్కడి భక్తులందరూ నాకు ఈశ్వరుని ప్రమద గణాలుగా అనిపించారు. ఆలయ ప్రాంగణం సాక్షాతు కైలాసంగా అనిపించింది. సాధకుడు పొందిన దివ్యానుభూతిని వర్ణించ మాటలు లేవు. అటువంటప్పుడు ప్రతివారు ఈశ్వరుని సన్నిధిలో ఉండాలని అనుకోటంలో ఆశ్చర్యం ఏముంది. కాశీ పట్టణం ఎంతో పురాతనమైనది. సాక్షాత్తు పరమేశ్వరుడు నడచిన ప్రదేశం. అమ్మవారు తిరిగిన స్థలం. ఇప్పటికి అక్కడికి దేవతలు వస్తారని ప్రతితీ.

 

సాధకుల జీవనం:

 

అరిషడ్వార్గాలను వదిలి దేహాభిమానాన్ని త్యజించిన సాధకులు అనేకులు మనకు కాశీలో  తారసపడతారు. బిక్షాటన చేస్తూ పరమేశ్వరుని కొలిచేవారు కొందరు ఆంధ్రశ్రమంలో రోజు 20,30 మంది సాధువులు వచ్చి కూర్చోవటం    వారికి అక్కడ రోజు భోజనం పెట్టటం నేను చూసాను. . ఆలా కాశీలో ఎన్నిచోట్ల అన్నదానం జరుగుతుందో  ఏమో మరి. ఇక కొందరు సాధువులు చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం చేస్తూ జీవిస్తున్నారు.  కొందరు. సాధువులే కాదు సామాన్యుజనం కూడా సాదారణ జీవనం పెట్టుబడి  లేకుండా,లేక కొద్దీ పెట్టుబడితో జీవిస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కటి వివరంగా వివరిస్తాను.

 

కొద్దిపెట్టుబడితో అంటే : ఒక రూ 100-500 పెట్టుబడితో జీవనం. కొందరు సాధువులు ఒక చిన్న పళ్ళెరం పట్టుకొని అందులో భస్మం యెర్రని చెందనం, ఒక త్రీసులపు లేక మూడుగీతాల ముద్రలు కలిగిన ముద్రలు వెంట పెట్టుకొని భక్తులకు బొట్లు పెట్టి డబ్బులు వసులు చేసుకుంటున్నారు. హీనపక్షం వారు రోజుకు 1000 నుండి 1500 వరకు సంపాయించవచ్చు. మేము బోటులో గంగ హారతి చూస్తూవుంటే ఒక సాధువు ఒక పళ్ళెరంలో చిన్న దీపారాధన కుంది పెట్టుకొని చిన్న సీసాలో నూనె పెట్టుకొని అందరికి హారతి చూపిస్తున్నాడు.  ఒక్కొక్కరు 10,20 ఇంకా కొంతమంది అంతకన్నా ఎక్కువ డబ్బులు వేయటం నేను చూసాను. చాలా తక్కువ పెట్టుబడితో రకంగా కూడా జీవించవచ్చు. అన్నీ  పడవలు తిరిగితే అతనికి రూ 2000 వరకు కూడా రోజుకు రావచ్చు. కేవలం గంట నుండి 2 గంటల వరకు బొట్లు తిరిగితే సరి రోజంతా విశ్రాంతి తీసుకోవచ్చు చక్కగా జీవనం సాగించవచ్చు. దేవాలయూయానికి వెళ్లే మార్గంలో ఉమ్మెత్తకాయలు, జిల్లేడు పూవులు, జిల్లేడు పులా మాలలు, మారేడు దళాలు అమ్మే వాళ్ళు కొంతమంది ఎటువంటి పెట్టుబడి లేకుండా కేవలం బయలు ప్రదేశాలకు వెళ్లి ఆకులు, అలమలు  ఏరుకోరావటం చేసి సంపాదిస్తున్నారు.  పెట్టుబడి ఏమిలేదు కేవలం తిరిగి ఏరుకొని రావటమే.  చాలా తక్కువ ఖర్చుతో అంటే జిల్లేడు, ఉమ్మెత్త చెట్లు ఉండే ప్రదేశానికి వెళ్ళటమే. ఆలా ఏమాత్రం ఖర్చు లేకుండా సంపాదన. నాకు అనిపించింది పుణ్యక్షేత్రాలలో ఏదో ఒక పని చేసి పొట్టపోసుకోవచ్చు అని.

 

ఇక కొంచం పెట్టుబడితో జీవనం:

 

కొంతమంది పిల్లలు 15 నుంచి 20 సం మధ్యవాళ్ళు  ఒక కిరోసిన్ స్టవ్వును ఒక డబ్బాలో పెట్టి పైన ఒక రాతివెండి కెట్లి పెట్టి లెమెన్ టీ అమ్ముతూ సంపాదిస్తున్నారు. ఒక్కో టీకి రూ 20 తీసుకుంటున్నారు.  వీళ్ళు రాత్రి గంగ హారతి సమయంలో బోట్లమీద తిరుగుతూ, పగటి పుట గల్లీలలో తిరుగుతూ అమ్ముతున్నారు. రోజుకు కనీసం రెండు, మూడు ట్రిప్పులు తిరిగితే 60 నుంచి 80 టీలు సునాయాసంగా అమ్మవచ్చు. వాళ్లకు వేయి రూపాయుయాలకన్నా ఎక్కువ గిట్టుబాటు కాగలవు.

 

చిన్న దుకాణాలు. రోడ్డు ప్రక్కన ప్లాస్టిక్ డబ్బాలు, ఇతర ప్లాస్టిక్ సామానుల దుకాణాలు వీటికి 2000 నుండి 5000 వరకు పెట్టుబడి అవసరం ఉంటుంది సంపాదన బాగానే ఉంటుంది.

 

చొక్కాల వ్యాపారం. మహాదేవ అని ఇంకా ఇతర శివనామాలు హిందీలో వ్రాసినవి  అచ్చువేసిన చొక్కాలు 150 రూపాయలకు అమ్ముతున్నారు. ఒక్కొక్క చొక్కాకు రూపాయలు 50 లాభం రావచ్చు. అంతే  కాక ఆడవారి డ్రస్సులు, చీరలు కూడా ఫూటుపాత్ మీద అమ్ముతున్నారు. వ్యాపారానికి కొంత ఎక్కువ పెట్టుబడి కావాలి. లాభం మంచిగా ఉంటుంది.

 

రాగి ఇత్తడి సామానులవ్యాపారం. రాగి చెంబులు,  కంకణాలు,చిన్న పాత్రలు (గంగ నీరు పట్టుకోవటానికి) ఇవి ఇనుపవే కానీ రాగివాటిలాగా కనపడతాయి. ఇత్తడి కుందులు, చిన్నచిన్న వస్తువులు, శివలింగాలు, జంధ్యాలు, విబూది, రుద్రాక్షమాలలు, స్పటిక మాలల దుకాణాలు మనకు అడుగడుగునా కనపడతాయి. వస్తువుల ధరలు మనకు ఇక్కడికన్నా  పెద్దగా తేడా నాకు కనిపించలేదు. రెండు ఇత్తడి కుందులు 150 చెప్పి రూ 120 కి ఇచ్చాడు.

చిన్న టీ స్టాళ్ళు , చిన్న ఇడ్లీ, వడ, దోశ హోటళ్లు అంటే రోడ్డు ప్రక్క బండ్లు అరుగు మీద పెట్టి అమ్మే చిన్న షాపులు మనకు కాశీలో కో కొల్లలు గా కనపడతాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అక్కడ దాదాపు అందరు తెలుగులో మాట్లాడటమే కాదు ప్రతి సందులో మనకు తెలుగు బోర్డులు ఉండటం విశేషం. చిన్న వ్యాపారస్తులు అక్కడి ట్రావెల్స్ తో సంబంధం పెట్టుకొని తెలుగులో కరపత్రాలు ముద్రించి మేము గయకు, ప్రయాగకు, అయోధ్యకు కార్లు, చిన్న బస్సులు సప్లై చేస్తామని వ్యాపారం చేస్తున్నారు. వారికి ఒక్కొక్క త్రిప్పకు 500 పైన కమిషన్ లభిస్తుంది. వీరు వారి వ్యాపారానికి అనుబంధంగా కమీషను  కూర్చొని సంపాదిస్తున్నారు.

ఇక తొక్కే రిక్షాలు రిక్షావాళ్లు 1-2 కిలోమీటర్ల దూరం వరకు వెళతారు 70 రూపాయలకన్నా ఎక్కువ తీసుకుంటున్నారు.

బ్యాటరీతో నడిచే రిక్షాలు. వీరి సంపాదన చాలా బాగుంది. వీరు ఒక ట్రిప్పుకు 300 నుంచి 400 వందల వరకు అడుగుతున్నారు. వీరు రోజులో 20 ట్రిప్పుల కన్నా ఎక్కువ వేయగలరు అంటే వారి సంపాదన ఎలా ఉందో ఊహించండి. బ్యాటరీ రిక్షా ఖరీదు లక్షా యాభై వేల నుంచి రెండు లక్షల వరకు ఉంటుందని అన్నారు. రిక్షాలు మెయింటెనెన్స్ ఫ్రీ కేవలం రెండు మూడు ఏళ్లకు ఒకసారి బ్యాటరీలు మార్చాలి. ఒక ఊడదీసిన రిక్షాను చూసాను అందులో లేడ్  యాసిడ్(Led Acid ) బ్యాటరీలు ఉన్నట్లు కనిపించింది. వారణాశిలో, గయలో, నాకు చాలా బ్యాటరీ రిక్షాలు కనిపించాయి. వీటిలో 8 మంది దాకా ప్రయాణించవచ్చు. వెడల్పు తక్కువగా వుంది ఎదురెదురుగా కుర్చునేటట్లు రెండు సీట్లు ఇంకా డ్రైవర్ పక్కన కూడా కూర్చుని ప్రయాణిస్తున్నారు. రిక్షా వాళ్ళ సంపాదన చాలా బాగుంది.

ఆటోలు కూడా చాలా కనపడుతున్నాయి కానీ ఆటోలు బ్యాటరీ రిక్షాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి. . ఇవి కాక టాక్సీ కారులు, మినీ బస్సులు  అంటే ట్రావెలర్ వాళ్ళవి అన్నమాట, రకంగా రవాణా వాహనాల వాళ్ళు కూడా చాలా సంపాదిస్తున్నారు.

నేను ఒక గల్లీ లోంచి వెళ్తుంటే ఒక యువతితో పరిచయం అయ్యింది.  ఆమె రెండు నెలల క్రితం ఆంధ్ర నుంచి వచ్చిందట, తెలుగు తప్ప ఏమీ రాదు.  అక్కడ ఒక ఆశ్రమంలో ఆమె వుంటున్నది. ఆశ్రమ అరుగు మీద ఒక చిన్న దుకాణం పెట్టుకున్నది.  అది ఆశ్రమం స్వామీజీ ఏర్పాటు చేశారని అన్నది.  ఆమె రుద్రాక్ష మాలలు,  తెలుగు పుస్తాకాలు, కొన్ని హిమాలయ డ్రగ్స్ వారి ఆయుర్వేద మందులు విక్రయిస్తున్నది. నేను ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఒక సాధువు వచ్చి రుద్రాక్షమాలలు 10 కొన్నాడు. వాటికి 600 రూపాయలు ఇచ్చాడు. నేను ఆమెతో హిమాలయ ఆయుర్వేదం కాక పతంజలి మందులు విక్రయించమని సూచించాను. రెండు మూడు సాదారణ వ్యాధులకు పనికి వచ్చే  మందుల పేర్లు కూడా చెపితే ఆమె పుస్తకంలో వ్రాసుకుంది.

ఇన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావించడానికి కారణం నేను మన తెలుగువారు అనేకమంది వారణాసి వెళ్లి ఉండాలని కోరుకుంటున్నట్లు నాకు అర్ధమైనది. అలాంటి వారికి ఉపయోగపడాలని ఉద్దేశ్యంతో నేను కాశీలో వివిధ రకాల ప్రజల జీవన సరళి గురించి నేను చూసి గమనించి అర్ధంచేసుకున్నది వివరించాను నాకు తెలిసినంతవరకూ కాశీలో మధ్యతరగతి వారే ఎక్కువగా వున్నారు. కేవలం తెలుగు వస్తే చాలు కాశీలో బ్రతకవచ్చు.  నా వ్యాసం తెలుగు వారికైనా పనికి వస్తే నా ప్రయత్నం సఫలీకృతం అయినట్లే.

 

 

 

 

.