30, ఆగస్టు 2024, శుక్రవారం

అక్షరాలు ఎలా పలకాలో

 *శ, ష, స అనే అక్షరాలు ఎలా పలకాలో తెలియని కొందరు దీనిని గమనిస్తారని ఆశ.* 


    *యద్యపి బహునాధీషే*

        *తథాపి పఠ పుత్ర! వ్యాకరణమ్ |*

    *స్వజనః శ్వజనో మా భూత్*

        *సకలం శకలం సకృత్ శకృత్ ||*


భావం: నాయనా! నీవు ఎక్కువ చదవకపోయినా పర్వాలేదు, వ్యాకరణం మాత్రం నేర్చుకో. ఎందుకంటే స్వజన అనగా (మన వాళ్ళు) అన్న శబ్దాన్ని శ్వజన అంటే (కుక్కలు) అనకుండా, సకలం అనగా (సర్వం) అన్న శబ్దాన్ని శకలం అంటే (ముక్కలు) అని పలకకుండా, 

సకృత్ అనగా (ఒకసారి) అన్న శబ్దాన్ని శకృత్ అంటే (మలము) అని పలకకుండా ఉండడానికే కాక 

తదితర పదాలను కూడా సక్రమముగా పలకడానికి ఉపయోగపడుతుంది — అని ఒక తండ్రి తన కుమారునికి చెబుతున్నాడు.  


నాగరిక ప్రపంచం *కళ్ళని -కల్లు అనీ* శిరీష-షిరీష అనీ, వేళ-వేల అనీ, 

కళ-కల అనీ, పళ్ళు-పల్లు అనీ, కాళ్ళు-కాల్లు అనీ, ఇలాగే ఇంకా ఎన్నెన్నో.....అపస్వర శబ్దాలు...వినలేని అపస్వరాలు..ముఖ్యంగా టీవీల వల్ల..


విదేశాలలో ఉన్న తెలుగు వారు, చక్కటి భాషా ప్రావీణ్యతతో రాణిస్తున్నారు..


కొంతమంది తెలుగువారే.. సగం తెలుగు -సగం ఆంగ్లము మాట్లాడడంలో మాతృభాషకు ఇచ్చే విలువలు వారికే తెలియాలి. 


అలాగే వ్యాకరణం తెలియనివారు ఏ అక్షరం ఎలా ఉచ్ఛచరించాలో తెలుసు కోలేరు. ఉచ్ఛారణ సరిగా లేకపోతే వారు తలంచిన అర్థం రాకపోగా విరుద్ధార్థం వస్తుంది - అని భావం.


అందుకనే, వ్యాకరణ సిద్ధి ఉంటేనే,వాక్‌ సుద్ధి వస్తుంది. మన నాలుక శుభ్ర పడుతుంది. ఆ వాగ్దేవి కరుణా ప్రవాహం అపారంగా లభ్యమవుతుంది.


అందుకేనేమో పవన సుతుడు శ్రీ హనుమ, శ్రీ సూర్య నారాయణుని సన్నిధిలో సకల విద్యలు నేర్చుకొని, నవ వ్యాకరణ విద్యను అభ్యాసానికి

వివాహముచేసుకొని (వివాహితుడే అర్హుడు కనుక), నవ వ్యాకరణ పండితుడై, భవిష్యత్‌

బ్రహ్మ గా ప్రకటించ బడ్డాడు.


తెలుగు వారికి పురాణ గ్రంధమైన పెద్ద బాల శిక్ష దొరకటం మహా పుణ్య ఫలం.

ఆ మహాగ్రంధం చదివి పెద్దలు, పిల్లలూ మహా జ్ఞానులవుతారు.. అందులో వ్యాకరణ సంపద అపారంగా లభిస్తుంది.. తప్పక చదవండి. భావితరాలకు మన జ్ఞాన సంపదను తరలించండి..


దేశ భాషలందు తెలుగు లెస్స అని నిరూపించండి🙏 మన తెలుగు భాషను పూజిద్దాం..

మంచిపనుల యందు

 *2050*

*కం*

ఇతరులొనరు సుకృతంబుల

నతిగా దోషములనెంచు నలతుల కన్నన్

మితముగనైనను సాయము

మతిభక్తితొ జేయువారె మాన్యులు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ఇతరులు చేసే మంచిపనుల యందు అతిగా తప్పులను ఎంచిచూపే అల్పులకన్నా ఎంతో కొంత అయినా సహకారం మనస్పూర్తిగా చేసేవారే గొప్పవారు.

*సందేశం*:-- ఒకమంచిపని ఇతరులు చేసేటప్పుడు అందులో ని తప్పు లు కనబడటం చాలా సహజం, కానీ ఆ తప్పులను ఎంచిచూపడంకన్నా తనవంతు సహాయం చేసే వాడే గొప్పవాడు కాగలడు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

విదురుడు

 

                  *విదురుడు*

                 ➖➖➖✍️


*మహాభారతంలో విదురుడు మహానీతిమంతుడు.*


*యమధర్మరాజు అంశలో ఆయన- వేదవ్యాసుడికి, కుఱురాజు అంతఃపురంలోని ‘పరిశ్రమి’ అనే దాసికి జన్మించాడు.*


*భారతంలో కుఱువంశీయుల జన్మ వివరాలు వింతగా అగుపిస్తాయి.* 


*విదురుడు ధృతరాష్ట్రుడికి సవతి తమ్ముడు. ఇతడికి కుఱు వంశ పితామహుడైన ‘దేవవ్రతుడు’ (భీష్ముడు) విద్యాబుద్ధులు నేర్పించాడు.*


*పాండవులకు కౌరవులు చేసిన అన్యాయాలకు విదురుడు ప్రత్యక్షసాక్షి. అన్యాయం సహించని నైజం ఆయనది. ఎవరితోనూ శత్రుత్వం ఉండరాదన్నది ఆయన నీతి.*


*వైరం లేకుండా జీవించడం ఒక సాధన. విదురుడికి, అక్రూరుడికి, ధర్మరాజుకు శత్రువులే లేరు.*


*విదురుడు సుయోధనుడి దుష్టత్వాన్ని సహిస్తూనే మిత్రుడిగా జీవించాడు. శిష్టుడైన శ్రీకృష్ణుడితోనూ అంతే స్నేహం ప్రదర్శించాడు.*


*పాండవ పక్షపాతి అని భావించిన కౌరవులు సైతం విదురుణ్ని భక్తిపూర్వకంగా ‘విదుర దేవా!’ అని సంబోధించేవారు.*


*ఆయన మహావీరుడు. యుద్ధవిద్యలన్నీ తెలుసు. మహారథి అయినా భారతయుద్ధంలో ఎవరి పక్షమూ వహించలేదు.*


*ధృతరాష్ట్రుడు ఆయన పట్ల అసహనం ప్రదర్శించేవాడు. కొన్నిసార్లు అది క్రోధంగా మారేది. విదురుడు మాత్రం ధృతరాష్ట్రుడితో, ఆయన నూరుగురు కొడుకులతో స్నేహంగానే మెలిగేవాడు. ఎప్పుడూ ధర్మాన్నే అనుసరించాడు.*


*తామరాకుపై నీటిబొట్టులా ఉండేవాడు. ఎవరి మనసునూ నొప్పించేవాడు కాదు.*

*జీవిస్తే విదురుడిలా, తనువు చాలిస్తే సరయూ నది నుంచి నేరుగా వైకుంఠం చేరిన శ్రీరాముడిలా ఉండాలన్నది అక్రూరుడి మాట.*


*బలవంతులతో విరోధం మంచిది కాదని విదురుడు చాలాసార్లు దుర్యోధనుడికి హితవు పలికాడు.*


*ఆయన మంచిని తాను సాధన చేసి ఇతరులకు చెప్పిన మాన్యుడు. దుర్యోధన, దుశ్శాసన, కర్ణులు మనిషిలోని తాపత్రయాలకు గుర్తులని పలు మార్లు ధృతరాష్ట్రుడికి చెప్పేవాడు.*


*శకుని వల్ల మాయాజూదంలో ఓడిన ధర్మరాజుకు- ‘సాత్విక స్వభావం, నిశ్చల ధర్మస్థితి గల పురుషుడు ఎన్నడూ వంచితుడు కా’డంటూ నిష్ఠుర సత్యాలు బోధించాడు.*


*కష్టాల్లో ధైర్యంగా ఉన్న వ్యక్తినే విజయం వరిస్తుందని విదురుడు చెప్పిన మాటలు- ధర్మరాజుకు సాంత్వన కలిగించాయి.*


*ఆదరిస్తే ఆనందం, అనాదరణకు గురైతే కోపం పొందేవారు ఏమీ సాధించలేరు. అవమానాలను వ్యక్తం చేయకుండా, ఆ స్థితినే విజయానికి మెట్టుగా భావించడం ద్వారా శత్రువును జయించాలన్నది విదుర బోధ.*


*శకునికి ఈ విషయాన్ని ఆయనే రహస్యంగా బోధించాడని రాజాజీ ‘మహాభారతం’ వెల్లడిస్తోంది.*


*తీవ్రమైన మనోరథం కలిగినవారు మూర్ఖులేనని ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’ సందర్భంలో విదురుడు దుశ్శాసనుడికి చెబుతాడు.* 


*దుశ్శాసనుడు మూర్ఖత్వం చూపించి, దుర్యోధనుడి ఆజ్ఞలను అనాలోచితంగా పాటించి పతనమయ్యాడు.*

*శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్లినప్పుడు, విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన మాటలు అమూల్యమైనవి.*


*‘మహావీరుడి ధనుస్సు నుంచి వెలువడిన బాణం ఎప్పుడైనా గురి తప్పడం వల్ల శత్రువును బాధించకపోవచ్చు... కానీ, మహానుభావుడి పలుకులు గురి తప్పవు.*


*జీవరాశులన్నింటితో పాటు భూమినీ అవి నాశనం చేయగలవు’ అన్నది ఆయన హితోక్తి. నూరుగురు కౌరవుల దురాగతాలను ధర్మరాజు క్షమించాడు. ఆ వ్యక్తిత్వాన్నే విదురుడు ఉదాహరిస్తూ- ‘సుయోధనా! క్షమను అసమర్థతగా భావించకూడదు.*


 *క్షమించడం కంటే బలమైన అస్త్రం లేదు. సమర్థుడి క్షమ- సమయం ఆసన్నమైనప్పుడు భూమిని సైతం నశింపజేయగల శక్తిగా పరిణమిస్తుంది. ధర్మరాజుతో కయ్యం, సర్పంతో నెయ్యం ప్రమాదకరం’ అని హెచ్చరించాడు.*


*కుటుంబంలో ఎవరూ లేని వ్యక్తిని, విపత్తుల్లో పడిన స్నేహితుణ్ని, దారిద్య్రం వల్ల ఆకలితో అలమటిస్తున్న శత్రువును, సంతానం లేని సోదరిని అక్కున చేర్చుకొని ఆశ్రయమివ్వాలని విదురుడు చెప్పేవాడు. ఆయన నీతిసూత్రాలు ఎవరికైనా ఆచరణీయాలే..!!*✍️

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖


.🙏

నాణెం పై తెలుగు భాష.*

 *నాణెం పై తెలుగు భాష.*



*ఇంగ్లీష్ వాళ్ళు మన తెలుగు భాషకు పట్టం కట్టారు.*


*ఒకసారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. గాంధీజీ, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, ‘ఉక్కు మనిషి’ సర్ధార్ వల్లభాయి పటేల్, ఆంధ్ర ప్రముఖుడు మహా మేధావి డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య తదితరులు ఆ సమావేశంలో పాల్గొన్నారు.* 


*ఈ సందర్భంగా పట్టాభి సీతారామయ్య గారు ” ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ సమస్య ” ను సభ దృష్టికి తీసుకువచ్చారు.*


*పట్టాభీ ! నువ్వు ‘ ఆంధ్ర రాష్ట్రం,,, ఆంధ్ర రాష్ట్రం,,, ‘ అని ఎప్పుడూ అంటూ ఉంటావు… అసలు నీ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఉందయ్యా ? … మీరంతా ‘మద్రాసీ’లు కదా ? అంటూ పటేల్ గారు,గాంధీ గారు మరి కొంత మంది తెలుగు మాతృ బాషా కాని వారు ఎగతాళిగా మాట్లాడారు.*


*అప్పుడు వెంటనే పట్టాభి సీతారామయ్య గారు తన జేబులో నుంచి అణా కాసును తీసి ” సర్ధార్ జీ ! దీనిపై ‘ ఒక అణా ‘ అని అధికార భాష అయిన ఆంగ్లంలోనూ … జాతీయ భాష అయిన హిందీలోనూ … దేశంలో అత్యధికులు మాట్లాడే బెంగాలీలోనూ… ఆ తర్వాత ‘ ఒక అణా ‘ అని తెలుగులోనూ రాసి ఉంది. ఇది బ్రిటిష్ వారు తయారు చేసిన అణా నాణెం.* 


*(అప్పటికి భారతదేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు)… మరి ఈ నాణెం పై మా ‘ తెలుగు భాష ఉంది… కానీ, మీ గుజరాతీ భాష ఎక్కడా లేదే ???* 


*అంటూ చురక వేశారు. పటేల్ గారు, గాంధీ గారు మరి కొంత మంది తెలుగు మాతృ బాషా కాని వారు ఆశ్చర్యపోయారు.*


*భారత దేశానికి స్వతంత్రం రాక ముందే బ్రిటిష్ ప్రభుత్వం వారు మనలను పరిపాలించే రోజుల్లోనే… తెలుగు భాషకున్న ప్రాచీనతను గొప్పదనాన్ని గుర్తించి, వారు ముద్రించిన నాణెల మీద అధికార భాష ఇంగ్లీషు, జాతీయ భాష హిందీ, ప్రపంచం లో అధికంగా మాట్లాడే బెంగాలీ భాష, తెలుగు భాష లను ప్రవేశ పెట్టి, మన తెలుగు చరిత్ర గొప్పదనం అందరికి తెలియపర్చారు.*


*తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు*


      *🚩హనుమాన్ దళ్*🚩

              *ఆంధ్రప్రదేశ్*

గురుదేవులు

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

పాఠములు చెప్పే…

గురుదేవులు*

 ➖➖➖✍️


*టీచింగ్ వృత్తి కాదు... విలువల జాతి నిర్మాణం..!* 


*ఈ చిన్న కథ విన్నారా…?!*


*ఎండ... చెమట... ఈసురోమంటూ నడుస్తున్నాడు ఓ పెద్దమనిషి....!* 


*అనుకోకుండా ఓ యువకుడు ఎదురయ్యాడు... పలకరించాడు... వంగి, కాళ్లు మొక్కాడు...* 


*మాస్టారూ, బాగున్నారా..? 'సర్, నన్ను గుర్తుపట్టలేదా..?* 



*'ఎవరు బాబూ నువ్వు..? చూపు సరిగ్గా ఆనడంలేదు., గుర్తుపట్టలేకపోతున్నాను'*


*'సర్, నేను మీ ఓల్డ్ స్టూడెంట్ ను..'*


*'ఓహ్, నిజమా? సంతోషం, నాకు గుర్తు రావడం లేదు, ఏం చేస్తున్నావ్ బాబూ ఇప్పుడు..?*

*అంటే, బతకడానికి ఏం చేస్తున్నావ్ అని..?'*


*'నేను టీచరు అయ్యాను మాస్టారూ...’*


*'గుడ్, వెరీ గుడ్, నాలాగే టీచర్ అయ్యావన్నమాట..?'*


*'అవును సర్, నిజానికి టీచర్ కావడానికి మీరే స్పూర్తి తెలుసా..?'*


*'అదేంటి..? అదెలా..?'*


*'బహుశా మీకు గుర్తుండదు! ఓరోజు జరిగిన సంఘటన, నేను చెబుతాను, వినండి..!’*

*********************


*“ఓసారి నా ఫ్రెండ్ ఒకడు మంచి ఖరీదైన, మోడరన్ వాచీ స్కూల్ కి తెచ్చుకున్నాడు.*

*దాన్ని చూడగానే నాలో దొంగ బుద్ధి ప్రవేశించింది, చేతులు పీకేస్తున్నయ్, మనసు లాగేస్తోంది... ఎలాగైనా దాన్ని సొంతం చేసుకోవాలని అనుకున్నాను, వాడి జేబులో నుంచి లాఘవంగా దొంగతనం చేశాను.* 


*కాసేపటికి వాడికి తన వాచీ పోయిందని తెలిసొచ్చింది. లబోదిబో మని ఏడ్చాడు.*

*టీచరుకి కంప్లయింట్ చేశాడు..!* 


*అప్పుడు ఆ క్లాస్ టీచర్ మీరే..!*


*’ఒరేయ్ పిల్లలూ, ఇది మంచి పని కాదు! వాడి వాచీ ఎవరు తీశారో తిరిగి ఇచ్చేయండి, నేను క్షమిస్తాను, ఎవరినీ ఏమీ శిక్షించను!’ అన్నారు మీరు.* 


*నేనేమీ భయపడలేదు, నాకు ఇవ్వాలని లేదు, ఇవ్వడం కోసమా చోరీ చేసింది? అందుకే తిరిగి వాచీ ఇవ్వలేదు, ఇవ్వాలనే ఉద్దేశం నాకు ఉంటే కదా?* 


*’అప్పుడు మీరేం చేశారో గుర్తుందా మీకు..?’*


*కిటికీలు, తలుపులు మూసేశారు, అందరినీ ఓ సర్కిల్ గా నిలబెట్టారు. ప్రతి ఒక్కరి జేబు చెక్ చేస్తానన్నారు. కాకపోతే అందరినీ కళ్లు మూసుకోవాలని చెప్పారు.* 


*జేబుల చెకింగ్ అయిపోయేవరకు కళ్లు తెరవొద్దని గట్టిగా హెచ్చరించారు.*


*తప్పదు కదా మరి, మీరు ఒక్కొక్కరి జేబూ చెక్ చేస్తూ వెళ్లారు, నా జేబులో దొరికింది మీకు,*

*తీసుకున్నారు, అడ్డగోలుగా దొరికిపోయాను.*

*అనుకున్నాను, కానీ ఆ తరువాత కూడా మిగతా అందరి జేబులూ చెక్ చేశారు.* 

*నాకు అర్థం కాలేదు...!*


*‘వాచీ దొరికింది, కళ్లు తెరవండి!’ అన్నారు మీరు.*


*అన్ని జేబుల తనిఖీలు పూర్తయిపోయాక... ఫలానా వారి జేబులో దొరికిందని మీరు చెప్పలేదు, నన్ను పట్టుకుని నాలుగు తగిలించలేదు, నలుగురిలో నా ఇజ్జత్ మీరు కాపాడారు!* 


*అది తరువాత అర్థమైంది... ఒకసారి నాపై మీరు ఆరోజే దొంగ అనే ముద్ర వేసి ఉంటే, నిజంగానే దొంగగా మారిపోయి ఉండేవాడినేమో..?’*


*అలా నన్ను రక్షించారు మీరు..! నాలో ఓ మార్పు తెచ్చింది ఆనాటి ఎపిసోడ్...!*

*కనీసం మీరు పక్కకు తీసుకుపోయి నన్ను మందలించలేదు కూడా. నా అంతట నేనే మారిపోయేలా చేశారు. ఇప్పుడు గుర్తొచ్చిందా సర్..? కానీ నా దగ్గర వాచీ దొరికాక కూడా, నన్నెందుకు మందలించలేదు..? ఇప్పటికీ జవాబు దొరకని ప్రశ్న సర్, ఇప్పుడైనా చెప్పరా ప్లీజ్...”*


*’అప్పుడు ఆ టీచర్ సావధానంగా చెప్పాడు ఇలా...*

*“ఒరేయ్, మీరు నా పిల్లలురా..! నా బిడ్డలురా!! టీచరు పిల్లలను ప్రేమతో చూసుకుంటూ భయం, భక్తులు అలవడేట్లుగా పిల్లలును మార్చుతూ పాఠాలు చెప్పాలి!* 

*ఆరోజు..*

*అందరి జేబులూ చెక్ చేశాను... నీ దగ్గర వాచీ దొరికాక నీమొహం చూసి, నిన్ను మందలిస్తే, ఇక నిన్ను చూసినప్పుడల్లా వీడు దొంగ అనేదే గుర్తొస్తుంది నాకు, ఫలితంగా బోధనలో వివక్షకు, నీపట్ల నాప్రవర్తనలో తేడాకు కారణం కావొచ్చు...!*

*అందుకేరా అబ్బాయ్, నేను కూడా ఫలానా వాళ్ల దగ్గర వాచీ దొరికింది అనే సంగతి నాకూ తెలియకుండా ఉండటం కోసం.... నేను కూడా కళ్లు మూసుకునే అందరి జేబులూ చెక్ చేశాను...”*✍️



*అందుకే…*


*గురుబ్రహ్మ గురుర్విష్ణుః*

*గురుర్దేవో మహేశ్వరః*

*గురుస్సాక్షాత్ పరబ్రహ్మ*

*తస్మై శ్రీ గురవే నమః*


*ఒకదేశం ఉన్నత స్థితిలో ఉందీ అంటే… దానికి కారణం ఇలాటి గొప్ప ఉపాధ్యాయుల వల్లనే…!*🙏


*ఆనందాశృవులతో…*

*ఉపాధ్యాయులందరికీ అంకితం. 🌷రాజశేఖరరెడ్డి🌷

ఆగష్టు, 30, 2024*🌷 *ధృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹 గురుభ్యోనమః ॐ卐*

      🌹 *శుక్రవారం*🌹

🪷 *ఆగష్టు, 30, 2024*🌷

    *ధృగ్గణిత పంచాంగం*              


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*

*దక్షిణాయణం - వర్షఋతౌః*

*శ్రావణమాసం -  కృష్ణపక్షం*


*తిథి  : ద్వాదశి* రా 02.25 వరకు ఉపరి *త్రయోదశి*

*వారం  : శుక్రవారం* (భృగువాసరే)

*నక్షత్రం  : పునర్వసు* సా 05.56 వరకు ఉపరి *పుష్యమి*


*యోగం  : వ్యతీపాత* సా 05.47 వరకు ఉపరి *వరీయాన్* 

*కరణం  : కౌలువ* మ 01.57 *తైతుల* రా 02.25 ఉపరి *గరజి*


*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 07.00 - 08.00 సా 05.00 - 06.00*

అమృత కాలం: సా 03.24 - 05.05

అభిజిత్ కాలం  : *ఉ 11.43 - 12.33*


*వర్జ్యం        : శేషం ఉ 06.59 & రా 02.30 - 04.13*

*దుర్ముహూర్తం  : ఉ 08.23 - 09.13 మ 12.33 - 01.23*

*రాహు కాలం : ఉ 10.34 - 12.08*

గుళికకాళం      : *ఉ 07.27 - 09.01*

యమగండం    : *మ 03.15 - 04.58*

సూర్యరాశి : *సింహం* 

చంద్రరాశి : *మిధునం/కర్కాటకం*

సూర్యోదయం :*ఉ 05.54* 

సూర్యాస్తమయం :*సా 06.22*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం   :  *ఉ 05.54 - 08.23*

సంగవ కాలం   :*08.23 - 10.53*

మధ్యాహ్న కాలం   :*10.53 - 01.23*

అపరాహ్న కాలం:*మ 01.23 - 03.52*

*ఆబ్ధికం తిధి:శ్రావణ బహుళ ద్వాదశి*

సాయంకాలం  :  *సా 03.52 - 06.22*

ప్రదోష కాలం  :  *సా 06.22 - 08.40*

నిశీధి కాలం      :*రా 11.45- 12.31*


బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.22 - 05.08*

________________________________

            🌷 *ప్రతినిత్యం*🌷

 *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


మహాలక్ష్మినమస్తుభ్యం నమస్తుభ్యంసురేశ్వరి 

హరిప్రియేనమస్తుభ్యం నమస్తుభ్యందయానిధే  

పద్మాలయేనమస్తుభ్యం నమస్తుభ్యంశివప్రియే 

సర్వభూతహితార్థాయ వసువృష్టింసదాకురు 

            🍁 *ఓం శ్రీ*🍁

🪷 *వరమహాలక్ష్మీయై నమః* 🪷

🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

        🌷🍃🪷🪷🍃🌷

   🌹🌷🍁🌷🌷🍁🌷🌹

పంచాంగం 30.08.2024 Friday

 ,,ఈ రోజు పంచాంగం 30.08.2024 Friday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం వర్ష  ఋతు శ్రావణ మాస కృష్ణ పక్ష ద్వాదశి తిధి భృగు వాసర: పునర్వసు నక్షత్రం వ్యతిపాత యోగ: కౌలవ తదుపరి తైతుల కరణం. ఇది ఈరోజు పంచాంగం.


ద్వాదశి రాత్రి 02:26 వరకు.

పునర్వసు సాయంత్రం 05:58 వరకు.


సూర్యోదయం : 06:05

సూర్యాస్తమయం : 06:28


వర్జ్యం : తెల్లవారుఝామున 05:20 నుండి ఉదయం 07:01 వరకు తదుపరి రాత్రి 02:32 నుండి 04:15 వరకు.


దుర్ముహూర్తం : పగలు 08:34 నుండి 09:23 వరకు తిరిగి మధ్యాహ్నం 12:41 నుండి 01:31 వరకు.


అమృతఘడియలు : మధ్యాహ్నం 03:26 నుండి సాయంత్రం 05:07 వరకు.


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.


యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.



శుభోదయ:, నమస్కార:

29, ఆగస్టు 2024, గురువారం

డెంగ్యూ జ్వరం

 👉 డెంగ్యూ జ్వరం విస్తరిస్తోంది.  కొబ్బరి నూనెను మీ మోకాళ్ల నుండి మీ కాలి వరకు రాయండి.  ఇది ఉదయం నుంచి రాత్రి వరకు యాంటీబయాటిక్ పొరలా పనిచేస్తుంది.  👍🏻డెంగ్యూ దోమ మోకాలి ఎత్తు కంటే ఎక్కువ ఎగరదు.    ఎవరైనా డెంగ్యూతో బాధపడుతున్నట్లయితే, పచ్చి యాలకుల గింజలను నోటికి రెండు వైపులా ఉంచుకోండి, వాటిని నమలకుండా జాగ్రత్త వహించండి.  ఖాళీ నోటిలో ఉంచడం ద్వారా, రక్త కణాలు నార్మల్‌గా మారతాయి మరియు ప్లేట్‌లెట్స్ వెంటనే పెరుగుతాయి.    ఈ సందేశాన్ని అందరికీ పంపవలసిందిగా వినయపూర్వకమైన మనవి.   డెంగ్యూ వ్యాధిని 48 గంటల్లో నిర్మూలించవచ్చు   సామర్థ్యం   మందు  దయచేసి ఈ సందేశాన్ని పంపండి   ముఖ్యమైన సమాచారాన్ని వీలైనంత ఎక్కువ మందికి పంపండి:-   ఎవరైనా డెంగ్యూ లేదా సాధారణ జ్వరం కారణంగా ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉంటే, హోమియోపతి ఔషధం ఉంది.   యుపటోరియం పర్ఫ్యూయం 200   లిక్విడ్ డైల్యూషన్ హోమియోపతి ఔషధం.   ప్రతి 2-2 గంటలకు సాదా నీటిలో 3 లేదా 4 చుక్కలు వేసి 2 రోజులు మాత్రమే త్రాగాలి.   మీరు మంచి పనులు చేయాలనుకుంటే, ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరికీ పంపండి 🙏

Panchaag


 

మహాభారత" సారాంశం...*

 *🕉️లక్షల శ్లోకాలు గల*

*"మహాభారత" సారాంశం...*

*తొమ్మిది వాక్యాలలో..🕉️🙏*




*🕉️🙏 ఆణిముత్యాలు వంటి "ఈ తొమ్మిది వాక్యాలలో మహాభారత సారాంశం తెలుసుకోండి".🕉️🙏*


*🕉️🙏1. మీ పిల్లల 'అంతులేని వాంఛలు, గొంతెమ్మ కోరికలు' తీర్చుకుంటూ పోతే కాలక్రమేణా వారు అదుపు తప్పి,మీ ఆధీనంలోంచి దూరం అవుతారు..వారి ఆధీనంలో కి మీరు వెళ్తారు. 🕉️🙏*


*🕉️🙏ఉదా "కౌరవులు."🕉️🙏*


*🕉️🙏2. నువ్వు ఎంత బలవంతుడు అయినా,ఎంత శక్తివంతమైన ఆయుధాలు కలిగి ఉన్నప్పటికీ..ఎన్నో నైపుణ్యాలు కలిగినప్పటికీ.. వాటిని 'అధర్మం' కోసం వినియోగిస్తే..అవి నిరుపయోగమవుతాయి.🕉️🙏*


*🕉️🙏ఉదా: "కర్ణుడు" 🕉️🙏*


*🕉️🙏3. యోగ్యత తెలుసుకోకుండా 'పుత్ర వాత్సల్యం' తో అనర్హునికి అపారమైన జ్ఞానాన్ని అందిస్తే వినాశం జరుగుతుంది.🕉️🙏*


*🕉️🙏ఉదా:- "అశ్వత్థామ".🕉️🙏*


*🕉️🙏4. పాత్రత తెలుసుకోకుండా విచక్షణా రహితంగా హామీలు ఇస్తే వారికి జీవితాంతం లోబడి బానిస గా చేతులు ముడుచుకొని శక్తిసామర్థ్యాలు ఉన్నప్పటికీ 'నిర్వీర్యుడై' బ్రతకవలసి వస్తుంది.🕉️🙏*


*🕉️🙏ఉదా :-" భీష్ముడు."🕉️🙏*


*🕉️🙏5.సంపద, శక్తి, అధికారం మరియు తనను బలపరిచే వారి సమస్తము  'దురహంకారం' తో అధర్మం గా వినియోగిస్తే వినాశం జరుగుతుంది.🕉️🙏*


*🕉️🙏ఉదా :-"దుర్యోధనుడు "🕉️🙏*


*🕉️🙏6."స్వార్ధపరుడు, రాగద్వేషాలు గలవాడు,గర్విష్టి, జ్ఞానం కలిగిన వాడు అయినా తనవారి పట్ల వల్లమాలిన అభిమానం గల అంధునికి రాజ్యాధికారం ఇస్తే వినాశం జరుగుతుంది".🕉️🙏*


*🕉️🙏ఉదా: "ధృతరాష్ట్రుడు." 🕉️🙏*


*🕉️🙏7. తెలివితేటలకి 'ధర్మం, సుజ్ఞానం' తోడైతే విజయం తప్పక లభిస్తుంది.🕉️🙏*


*🕉️🙏ఉదా: "అర్జునుడు".🕉️🙏*


*🕉️🙏8. 'మోసం,కపటం,' జిత్తులమారి ఆలోచనలు అన్ని వేళలా చెల్లవు. 🕉️🙏*


*🕉️🙏ఉదా: "శకుని."🕉️🙏*


*🕉️🙏9. నీవు 'నైతిక విలువలు' పాటిస్తూ, సక్రమ మార్గంలో ప్రయాణం చేస్తూ నీ ధర్మం నువ్వు చేస్తూ ఉంటే ఏ శక్తీ నీకు హానిచేయదు.🕉️🙏*


*🕉️🙏ఉదా : "యుధిష్ఠిరుడు."🕉️🙏*




🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

పూజా విధానం

 🔔 *పూజా విధానం* 🔔


షోడశోపచార పూజ :

పూజలు ఎన్నిచేసినా అన్నిటికీ పునాది వంటిది షోడశోపచార పూజ. 16 రకాల సేవలు మనం దేవతలకు అర్పిస్తున్నాం గనుక, దీని పేరు షోడశోపచార పూజ. దేవత మన ఎదురుగుండా ప్రత్యక్షంగా వుండదు. మరి మనం ఉపచారాలు ఎలా చేస్తాము?


పదహారు రకాల ఉపచారాలు/సేవలు షోడశోపచారాలు

1.ఆవాహనం,2.ధ్యానం, 3.ఆసనం, 4.పాద్యం, 5.అర్ఘ్యం,

6.స్నానం-అభిషేకం,7.వస్త్రం, 8.యజ్ఞోపవీతం, 9.గంధం,

10. అధాంగ పూజ,11. ధూపం,12. దీపం, 13.నైవేద్యం, 14.తాంబూలం, 15. నీరాజనం, 16. మంత్ర పుష్పం


1. ఆవాహనం: భగవంతుడిని పూజామండపానికి ఆహ్వానించడము.


2. ధ్యానం: భగవంతుడిపై పూర్తిగా మనసు లగ్నం చేసి పూజామండపం లోకి ఆహ్వానించి పూజించడానికి శ్లోకంతో చేసే సేవను ధ్యానం అంటారు. 


3. ఆసనం: రత్నాలంకృతమైన బంగారు సింహాసనాన్ని అధిష్టించి పూజలందుకొమ్మని ఆసనం సమర్పించడం.


4. పాద్యం: పాదాలు(కాళ్ళు) శుభ్రపరుచుకోవడానికి నీరందించడాన్ని పాద్యం అంటారు.


5. అర్ఘ్యం: చేతులు శుభ్రపరుచుకోవడానికి నీరు అందించడాన్ని అర్ఘ్యం అంటారు.


6. అభిషేకం: స్నానికి జలం సమర్పించడాన్ని అభిషేకం అంటారు. దేవునికి పంచామృతం (తేనె, ఆవు పాలు, ఆవు నెయ్య, పెరుగు, పంచదార) స్నానం అత్యంత ప్రీతికరమైనది. ఈ ఏడు పదార్ధాలతో స్నానం చేయించి తర్వాత మళ్ళీ శుద్ధమైన జలంతో స్నానం చేయించడాన్ని అభిషేకం అంటారు.


7. వస్త్రం: అభిషేకం తరువాత దేవునికి సమర్పించే వస్త్రాలు


8. యజ్ఞోపవీతం: యజ్ఞోపవీతం సమర్పించడం.


9. గంధం: దేవునికి గంధం, అక్షతలు మరియు పుష్పాలు సమర్పించడం.


10. అధాంగ పూజ: దేవుని అన్ని అవయవాలను కీర్తిస్తూ పూజ సమర్పించడాన్ని అధాంగ పూజ అంటారు.


11. ధూపం: అగరవత్తులు మరియు ధూపం సమర్పించడం.


12. దీపం: దీపాన్ని వెలిగించి దేవుని ముందువుంచడము


13. నైవేద్యం: భగవంతునికి సమర్పించే భక్ష్య భోజ్యాలను నైవేద్యం అంటారు.


14. తాంబూలం: భక్ష్య భోజ్యాలతో సంతుష్టుడైన దేవునికి, తాంబూలం సమర్పించడం.


15. నీరాజనం: దేవునికి కర్పూరంతో హారతి ఇస్తారు 


16. మంత్రపుష్పం: మంత్ర సహితంగా చేసే సేవనే మంత్రపుష్పం అంటారు.


ఇన్ని సేవలూ పూర్తి అయ్యాక, చేసిన పూజలో గాని, చదివిన మంత్రాలలో గాని తప్పులున్న మన్నించమని, ఉచ్చారణ దోషాలున్నా, భక్తి లో ఎటువంటి లోపము ఉండదని అపరాధ క్షమాపణ చెప్పుకుని “పునరాగమనాయచ” అంటూ మళ్ళీ రమ్మని చెప్పి మరీ సాగనంపుతారు. ఇవి మనం నిత్యం దేవునికి సమర్పించే షోడశోపచార సేవలు.




🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

శ్రీమద్రామాయణము

 శ్రీమద్రామాయణము

యుద్ధకాండము

తొమ్మిదవ సర్గ. (9)


తరువాత రాక్షసవీరులైన నికుంభుడు, రభసుడు, సూర్యశత్రువు,

సుప్తఘ్నడు, యజ్ఞకోపుడు, మహాపార్శ్వుడు, మహోదరుడు, దుర్ధర్షుడు,రశ్మికేతువు, రావణుని కుమారుడు ఇంద్రజిత్తు, ప్రహస్తుడు, విరూపాక్షుడు,వజ్రదంష్ట్రుడు, ధూమ్రాక్షుడు, నికుంభుడు, దుర్ముఖుడు అనే పేరు గల రాక్షస వీరులు రావణునితో తమ తమ శౌర్యప్రతాపాలను ప్రదర్శిస్తూ, వెంటనే హనుమంతుని చంపివేద్దాము అని ప్రతిజ్ఞలు చేసారు. రావణుని మెప్పు సంపాదించడం కోసరం రాక్షస వీరులుచెప్పిన మాటలను రావణుని తమ్ముడు విభీషణుడు శ్రద్ధగా విన్నాడు. వారందరినీ శాంతింపజేసి వారి వారి స్థానములలోకూర్చోపెట్టాడు. తరువాత విభీషణుడు లేచి సభను ఉద్దేశించి ఇలా అన్నాడు. “ఏదైనా ఒక కార్యమును సాధించాలంటే సామ, దాన, భేదో పాయములను ముందు ప్రయోగించాలి. అవి సఫలము కానప్పుడు దండోపాయమును ప్రయోగించాలి అని తెలివికలవాళ్లు చెబుతారు. శత్రువు ఏమరిపాటుగా ఉన్నప్పుడు, ఇతర రాజులచేత ఓడింపబడినప్పుడు, వారికి దైవము అనుకూలంగా లేనప్పుడూ, శత్రువును మన పరాక్రమము ఉపయోగించి లొంగదీసుకోవచ్చును. ప్రస్తుతము మన శత్రువు రాముడు, మహా పరాక్రమవంతుడు. ఏ మాత్రం ఏమరిపాటు లేని వాడు. కోపమును జయించిన వాడు. ఎటువంటి క్లిష్టసమయములోనైనా సరైన నిర్ణయములు తీసుకోగల సమర్ధుడు. అటువంటి మహా వీరుడిని మీరంతా ఎలా ఎదుర్కోగలము అని అనుకుంటున్నారు. ఒక వానరము హనుమంతుడు అనే పేరుకలవాడు, సముద్రమము దాటివచ్చి, సీతను చూచి, లంకను దహించి వెళ్ళాడు అంటే నమ్మగలరా! కనీసం ఊహాంచగలరా! మీరంతా ఇప్పటిదాకా మీ మీ పరాక్రమములు గురించి చెప్పుకొన్నారు. మరి శత్రువుల బల పరాక్రమముల గురించి ఆలోచించారా! ఇంక అసలు విషయానికి వద్దాము. ఈ రాక్షస రాజు రావణుడు, జనస్థానములో ఉన్న రాముని భార్య సీతను, రాముడు ఇంటలేని సమయమున అపహరించి తెచ్చాడు. ఎందుకు? రాముడు రావణునికి ఏమైనా అపకారముచేసాడా! జనస్తానములో ఉన్న ఖరుడు ఏమి చేసాడో విచారించారా! ఖరుడు తన పరిధిని దాటి, మితిమీరి ప్రవర్తించబట్టే రాముడు ఖరుని దండించాడు. రాముడు తన ప్రాణములను, తనవారి ప్రాణములను రక్షించుకోడానికి ఖరుని చంపాడు. తప్పు మన దగ్గర పెట్టుకొని రాముని అనడంలో ఏమి ప్రయోజనము. అపహరించి తెచ్చిన సీతను తిరిగి రామునికి అప్పగించి యుద్ధమును నివారించడమే ఉత్తమము. మనము యుద్ధమును కొని తెచ్చుకున్నాము. దానికి నివారణ చేయడం మంచిది. మనము రామునితో అకారణంగా వైరము పెట్టుకున్నాము. రాముడు సముద్రమును దాటి లంకకు వచ్చి, రాక్షసులను చించి చెండాడక ముందే సీతను రామునికి అర్పించి ఆ వైరమును మాన్పుకుందాము. అపారమైన వానర సేన సముద్రమును దాటి లంకను ముట్టడించకముందే సీతను రాముని వద్దకు పంపుదాము. అలా జరగని ఎడల, లంక సర్వనాశనం అవుతుంది. ఇప్పటికే

హనుమంతుడు లంకను దహించి అపార నష్టం కలుగచేసాడు.

ఓ రావణా! నేను నీకు మంత్రినే కాదు. తమ్ముడను. బంధువును. అందుచేత ఇంతదాకా చెబుతున్నాను. నీ మెప్పు కోసం మాటలాడటం నాకు చేత కాదు. నీకు మంచి జరిగే మాటలు

చెబుతున్నాను. నా మాట విను. సీతను రాముని వద్దకు పంపు. రాముడు తన వాడి అయిన బాణములను లంక మీదికి సంధించకముందే, సీతను రామునికి ఇచ్చివేయి. రాముని మీద నీకు ఉన్న కోపాన్ని విడిచిపెట్టు. లంక సుఖము కోరి యుద్దము నివారించు. రాముని వద్దకు సీతను పంపితే మనమందరమూ భార్యాబిడ్డలతో సుఖంగా జీవించగలము.” అని పలికి విభీషణుడు మౌనంగా ఉన్నాడు. అప్పటిదాకా రాక్షసవీరులు పలికిన వీరోచిత ప్రగల్భాలూ, వాటికి విభిన్నంగా ఉన్న విభీషణుని మాటలు విన్న రావణుడు అందరినీ పంపివేసి మౌనంగా తన అంతఃపురమునకు వెళ్లిపోయాడు..


శ్రీమద్రామాయణము

యుద్ధకాండము తొమ్మిదవ సర్గ సంపూర్ణము

ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

ప్రపంచ తెలుగు మహాసభల

 ప్రపంచ తెలుగు మహాసభల సందర్భముగా విడుదలైన తపాలా బిళ్ళ - ఇందులో వ్రాసినవి - దేశ భాషలందు తెలుగు లెస్స, "ఎందరో మహానుభావులు అందరికీ వందనములు" ," పంచదార కన్న పనస తొనల కన్న కమ్మని తేనె కన్న తెలుగు మిన్న"

తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను

తెలుగు వల్లభుండ తెలుగొకండ

ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి

దేశ భాషలందు తెలుగు లెస్స

—శ్రీ కృష్ణదేవ రాయలు శ్రీకృష్ణదేవరాయల కన్నా ముందుగా 15వ శతాబ్ది తొలి అర్థభాగంలో జీవించిన వినుకొండ వల్లభరాయుడు ఈ పద్యంలో ప్రముఖవాక్యమైన దేశభాషలందు తెలుగు లెస్స వాక్యాన్ని ఉటంకించారు. వల్లభరాయలు క్రీడాభిరామమనే వీథి నాటకాన్ని రచిస్తూ ప్రస్తావనలోని 37వ పద్యంగా రచించిన జనని సంస్కృతంబులో ఈ వాక్యం ప్రస్తావనకు వస్తుంది. ఆ పద్యం ఇది:


జనని సంస్కృతంబు సకల భాషలకును

దేశ భాషలందు తెలుగు లెస్స

జగతి దల్లికంటె సౌభాగ్య సంపద

మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె?

—సేకరణ.... అడ్మిన్ కొల్లూరు సతీష్ శర్మ

💐అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు🙏

అశోక చక్రవర్తి

 మన దేశంలో " *అశోక చక్రవర్తి* " *జయంతి* ఎందుకు జరుపుకోరు??



ఎంత ఆలోచించినా "సమాధానం" దొరకలేదు కదా! 

మీరు ఈ " *చారిత్రక విషయాలను* " కూడా పరికించండి!🤔🤔🤔 


# అశోక చక్రవర్తి తండ్రి పేరు - *బిందుసార గుప్త,* తల్లి పేరు - *సుభద్రణి* ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిత్రకారులు "గొప్ప చక్రవర్తి" అని పిలుచుకునే " *అశోక చక్రవర్తి* " యొక్క రాజ చిహ్నం 

" *అశోక చక్రం* " ను భారతీయులు తమ జెండాలో ఉంచారు. 


# "చక్రవర్తి" రాజ చిహ్నం " *చార్ముఖి సింహం* "ను భారతీయులు *"జాతీయ చిహ్నం"* గా పరిగణిస్తారు మరియు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు మరియు *"సత్యమేవ జయతే"* ని స్వీకరించారు.


 # అశోక చక్రవర్తి పేరు మీద ఉన్న సైన్యం యొక్క అత్యున్నత యుద్ధ గౌరవం *"అశోక చక్రం".* ఇంతకు ముందు లేదా తర్వాత ఇలాంటి రాజు లేదా చక్రవర్తి లేరు"... 


# *"అఖండ భారత్"* (నేపాల్, బంగ్లాదేశ్, మొత్తం భారతదేశం, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్) యొక్క విస్తారమైన భూభాగాన్ని ఒంటరిగా పాలించిన చక్రవర్తి. 


# అశోక చక్రవర్తి కాలంలో "23విశ్వవిద్యాలయాలు"స్థాపించబడ్డాయి.ఇందులో *తక్షశిల, నలంద, విక్రమశిల, కాందహార్* మొదలైనవి ప్రముఖమైనవి.

ప్రపంచనలుమూలల నుంచి విద్యనభ్యసించడానికిఇక్కడికి వచ్చేవారు. 


# "చక్రవర్తి" పాలనను ప్రపంచంలోని మేధావులు మరియు చరిత్రకారులు భారతీయ చరిత్రలో అత్యంత " *స్వర్ణయుగ కాలం* "గా పరిగణిస్తారు. 


# "అశోకచక్రవర్తి" యొక్క పాలనలో భారతదేశం *"విశ్వ గురువు".* గా భాసిల్లింది

భారతదేశం " *బంగారు పక్షియై* " పరిఢవిల్లింది. ప్రజలందరూ సంతోషంగా మరియు వివక్ష లేకుండా ఉన్నారు. 


# వీరి హయాంలో అత్యంత ప్రసిద్ధ హైవే " *గ్రేడ్ ట్రంక్ రోడ్* " వంటి అనేక హైవేలునిర్మించబడ్డాయి. 


# *2,000 కిలోమీటర్ల* మేర మొత్తం "రోడ్డు"కి ఇరువైపులా చెట్లు నాటబడ్డాయి. "సరస్సులు" నిర్మించబడ్డాయి. 


# జంతువుల కోసం కూడా తొలిసారిగా " *వైద్యగృహాలు* " (ఆసుపత్రులు) ప్రారంభించ బడ్డాయి.చంపడం ఆగిపోయింది. 


# అలాంటి " *గొప్ప చక్రవర్తి అశోకుని* "  జన్మదినాన్ని తన దేశమైన భారతదేశంలో ఎందుకు జరుపు కోలేదు?? 


లేదా ......

*సెలవు దినంగా ఎందుకు ప్రకటించలేదు?* 


ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవాల్సిన *పౌరులు* తమ చరిత్రను మరచిపోవడం బాధాకరం, 

తెలిసిన వారు ఎందుకు జరుపుకోకూడదో తెలియడం లేదు??


# *గెలిచినవాడు చంద్రగుప్తుడు* అని కాకుండా 

*"గెలిచినవాడు అలెగ్జాండర్"* ఎలా అయ్యాడు?? 


*చంద్రగుప్త మౌర్యుని ప్రతాపం చూసి* అలెగ్జాండర్ సైన్యం యుద్ధానికి నిరాకరించిందని అందరికీ తెలుసు. 

చాలా ఘోరంగా వారి నైతికత దెబ్బతింది మరియు 

అలెగ్జాండర్ 

" *వెనుదిరగవలసి వచ్చింది* ".


# ఈ " *చారిత్రక తప్పిదాన్ని* " సరిదిద్దడానికి మనమందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దాం.🙏 




*వర్ధిల్లాలి భారతి యశస్సు*

*ఉప్పొంగాలి పునర్వైభవ తేజస్సు*


 *భారత్ మాతాకీ జై* 🇮🇳

✊✊✊✊✊✊

*శ్రీ కాళహస్తీశ్వర శతకము - 25*

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


*𝕝𝕝 శార్ధూలము𝕝𝕝* 


  *నీపంచం బడియుండఁగాఁ గలిగిన న్భిక్షాన్నమే చాలు ని*

  *క్షేపం బబ్బిన రాజకీటముల నే సేవింపఁగా నోప నా*

  *శాపాశంబులఁ జుట్టి త్రిప్పకుము సంసారార్థమై బంటుగాఁ*

   *జేపట్టం దయగల్గెనేని మదిలో శ్రీకాళహస్తీశ్వరా!!!!* 


            *శ్రీ కాళహస్తీశ్వర శతకము - 25*


*తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! నీచెంత నాకు భిక్షాన్నమైనా చాలును... నిధులు కలిగినా సరే నేను రాజాధముల సేవ చేయనోపను... సంసారమను ఆశాపాశాములందు నన్ను బంధింపక నీ బంటుగా చేర్చుకొని రక్షించు ప్రభో!*


✍️🌹💐🌷🙏