22, ఫిబ్రవరి 2026, ఆదివారం

Panchangam పంచాంగం

  


అర్చకుడు కావలెను.*

   

అనంతపురం జిల్లా,యల్లనూరు మండలం,తిమ్మంపల్లి గ్రామము నందు వెలసిన

 *శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం కి అర్చకుడు కావలెను.* 


నెల జీతం 15000 మరియు

హారతి డబ్బులు,

మంచి సౌకర్యం తో కొత్త ఇల్లు ఇవ్వబడును.

వివరములకు 

 *శేషగిరి శర్మ .తిమ్మంపల్లి. 9490481957.*

భగవద్గీత

  -------------------- భగవద్గీత. -------------------

తృతీయోధ్యాయ: కర్మ యోగము.


  శ్రీ భగవానువాచ ।

లోకేఽస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానఘ ।

జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామ్ ।। 3 ।।



ప్రతిపదార్థ:


  -భగవాన్-ఉవాచ — భగవంతుడు పలికెను; లోకే — లోకములో; అస్మిన్ — ఈ యొక్క; ద్వి-విధా — రెండు విధముల; నిష్ఠా — నిష్ఠ/విశ్వాసము; పురా — ఇంతకు పూర్వము; ప్రోక్తా — చెప్పబడినవి; మయా — నా (శ్రీ కృష్ణుడు) చేత; అనఘ — పాప రహితుడా; జ్ఞాన-యోగేన — జ్ఞాన మార్గము ద్వారా; సాంఖ్యానాం — ధ్యాన నిష్ఠ యందు ఆసక్తి కలవారికి; కర్మ-యోగేన — కర్మ యోగము ద్వారా; యోగినాం — యోగులకు.    


 

 తాత్పర్యము :   



భగవంతుడు ఈ విధంగా పలికెను: ఓ పాపరహితుడా, భగవత్-ప్రాప్తికి (జ్ఞానోదయము) ఉన్న రెండు మార్గములు ఇంతకు పూర్వమే నాచే చెప్పబడినవి: ధ్యాన నిష్ఠయందు ఆసక్తి కలవారికి జ్ఞాన మార్గము; మరియు పనుల పట్ల ఆసక్తి కలవారికి కర్మ మార్గము.



 వివరణ:


2.39వ శ్లోకంలో శ్రీ కృష్ణుడు ఆధ్యాత్మిక సిద్ధి కొరకు రెండు మార్గములను ఉపదేశించెను. మొదటిది విశ్లేషణాత్మక అధ్యయనం ద్వారా ఆత్మ యొక్క నిజ స్వభావాన్ని మరియు అది శరీరము నుండి ఎలా వేరైనదో తెలుసుకోవటం. శ్రీ కృష్ణుడు దీనిని 'సాంఖ్య యోగం' అన్నాడు. తత్త్వ-విచారణ దృక్పథం ఉన్నవారు, మేధో విశ్లేషణ ద్వారా ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకునే ఈ మార్గం వైపు మొగ్గు చూపుతారు. రెండవది, భగవంతునిపై భక్తి భావనతో పని చేయటం లేదా 'కర్మ యోగము'. శ్రీ కృష్ణుడు దీనినే, ఇంతకు క్రితం శ్లోకంలో చెప్పినట్టు 'బుద్ధి యోగం' అని కూడా అంటాడు. ఈ రకంగా పని చేయటం, అంతఃకరణాన్ని శుద్ది చేస్తుంది, మరియు నిర్మల మనస్సులో, జ్ఞానం సహజంగానే వృద్ధినొంది, అది జ్ఞానోదయ స్థితి వైపు దారితీస్తుంది.


ఆధ్యాత్మిక పథంలో ఆసక్తి ఉన్నవారిలో, ధ్యానము/విశ్లేషణ పట్ల మొగ్గు చూపే వారు ఉంటారు, మరియు, కర్మలు/పనుల పట్ల ఆసక్తి ఉన్నవారు కూడా ఉంటారు. కాబట్టి, ఆత్మకి భగవత్ ప్రాప్తి అభిలాష ఉన్నప్పటినుండీ ఈ రెండు మార్గాలు ఉన్నాయి. తన ఉపదేశం అన్నీ రకాల జనులకూ ఉద్దేశించబడింది కాబట్టి శ్రీ కృష్ణుడు ఈ రెంటినీ గురించి వివరిస్తున్నాడు.

*శ్రీ మూకశంకర విరచిత* *మూక పంచశతి*

  *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*ఆర్యా శతకం - 1*


*శ్లోకము - 37*


*పుంజితకరుణముదంచితశింజిత మణికాంచి కిమపి కాంచిపురే।*

*మంజరితమృదులహాసం పింజరతనురుచి పినాకిమూలధనమ్॥*


*భావము :*


*కామాక్షి అపార దయాసముద్రురాలు. ఎరుపు, పసుపు వర్ణముల మిశ్రితమైన గౌర వర్ణముతో శోభిల్లు శరీర కాంతి కలది. ఆమె మొలకు కట్టబడిన చిరుగంటలు చక్కటి ధ్వనులు చేస్తుండగా, ఈశ్వరుని అలరించే మాత కాంచీపురములో స్థితురాలై ఉన్నది.*


🙏🙏🙏*శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

22-02-2026 ఆదివారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

22-02-2026 ఆదివారం రాశి ఫలితాలు


మేషం


చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. మిత్రుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

---------------------------------------


వృషభం


ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ఆకస్మిక ధన లాభసూచనలున్నవి. నూతన వస్తు లాభాలు పొందుతారు. స్థిరాస్థి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి పొందుతారు.

---------------------------------------


మిధునం


అవసరానికి ఇతరుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------


కర్కాటకం


ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. పనులలో తొందరపాటు చేసి ఇబ్బందికి గురి అవుతారు. కొన్ని వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది. దూరప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు.

---------------------------------------


సింహం


ఇతరుల నుండి రావలసిన సొమ్ము సకాలంలో చేతికందదు. దూరప్రయాణం సూచనలు ఉన్నవి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

---------------------------------------


కన్య


సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతాన విద్యా విషయాలలో అప్రయత్న విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు సానుకూలమవుతాయి.

---------------------------------------


తుల


వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. రాజకీయ పరమైన పరిచయాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.

---------------------------------------


వృశ్చికం


గృహ నిర్మాణ పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారమున నూతన సమస్యలు కలుగుతాయి. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు.

---------------------------------------


ధనస్సు


చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. చేపట్టిన పనులలో శ్రమాధిక్యం తప్పదు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. విద్యార్థుల ప్రయత్నాలు మందగిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. బందు మిత్రులతో వివాదాలు కలుగుతాయి.

---------------------------------------


మకరం


ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

---------------------------------------


కుంభం


దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తివ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ఇంటా బయట ఊహించని సమస్యలు ఉంటాయి. సంతాన అనారోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.

---------------------------------------


మీనం


ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నూతన మిత్రుల పరిచయాలు కలుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. విద్యార్థులు అనుకూల ఫలితాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది.

---------------------------------------

ఆంధ్రభాషాయోష నా మాతృభాష"*

  *"ఆంధ్రభాషాయోష నా మాతృభాష"*


సీ॥

ముత్యముల్ పఱచిన ముగ్ధమోహనరూప 

మాశైలి కమనీయ మద్భుతమ్ము 

వ్రాలు వృత్తాల దివ్యమ్ముగా నొదిగెడి 

ౘదల తారాడు నక్షత్రచయము 

పదముల గదలాడు పలునాట్యభంగిమల్ 

పలుకగ రాగాలు పలుకరించు 

పరిపూర్ణతను గల్గు వర్ణసందోహమ్ము 

సంగీతసాహిత్యసంగతమ్ము 

గీ॥ తెలుగు సంస్కృత భాషలు మెలగి చెలగి 

ఆంధ్రభాషగా వెలసిన సాంద్రభాష 

నాదు మాతృభాషాయోష నల్గడలను 

తేనెలొలికించు లెస్సగా దీప్తులెగయ 

*~శ్రీశర్మద*

పురాణాలలో మత ఉగ్రవాదం)

 శ్రీరామ (97)


                   

              (పురాణాలలో మత ఉగ్రవాదం)


శ్లో//ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్/

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్// 

(సమస్తమైన ఆపదలూ పోగొట్టేవాడు, సమస్త సంపదలూ ఇచ్చేవాడు, సమస్త జీవులను ఆనందపెట్టేవాడు,అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు నమస్కరిస్తున్నాను, మరల మరల నమస్కరిస్తున్నాను).


                               ----------------


మతం అంటే అభిప్రాయం.

అనేకమంది అనేక అభిప్రాయాలను కలిగి యుంటారు.

ఒకే అభిప్రాయంగల అనేకుల సమూహం " మతం " గా ప్రస్తుతం చెలామణిలో ఉన్నది.

మా మతము గొప్పది,ఆచరణీయం అనుకోవడంలో తప్పులేదు.

కానీ అన్ని మతములకన్నా మా మతమే గొప్పది, అందరూ తదనుకూలంగా ఉండాలి అనేది మత తీవ్ర వాదం.

తమ మతం, తమ కులం, తమ భాష, తమ ప్రాంతం,ఇంకా చెప్పాలంటే తమ శాఖ, తమ సంప్రదాయములకు చెందని వారిని ద్వేషించడమే ఈ తీవ్రవాదుల మతం.

దానికి వారు యుక్తిగా అనేక కారణములు చెబుతారు.


కొందరు ఉన్మాదులు, మరికొంత ముందుకు వెళ్ళి తమ మతమునకు విరుద్ధంగా ప్రవర్తించే వారిని చంపివేయాలి అంటారు.

దీన్నే "మత ఉగ్రవాదం" అంటాము.

తాము సంహరిస్తున్న వారంతా " మత ద్రోహులు,అజ్ఞానులు,దుర్మార్గులు, నీచులు,వీరిని చంపితే గానీ సమాజం బాగుపడదు" అంటారు.


ఎంతమందిని చంపితే అంత ఎక్కువగా వారి దేవుడు సంతోషిస్తాడు అంటారు.


ఆత్మాహుతి దళాలను ఏర్పాటు చేస్తారు.


పరమత ద్వేషులైన మరికొందరు, సంప్రదాయ వేషధారులై శివ, విష్ణు, ద్వేషాలను సున్నితంగా రెచ్చకొడతూ అమాయకులను మభ్యపెడతారు.


వారు పైకి నవ్వుతూనే సమాజంలో

 "విషాన్ని" చిమ్మి, కొంతమంది మేధావులను లోబరచుకొని ప్రజలలో చీలికలు సృష్టిస్తారు.


ఇదంతా సత్యము, ధర్మము, అహింస, ప్రాణులందరి యందు సమభావము, లను బోధించే "సనాతన ధర్మము" నకు వ్యతిరేకమైన తీవ్రవాదమే.


 ప్రజలను అశాంతికి గురిచేసి, సమాజాన్ని సర్వ నాశనం చేసేది ఉగ్రవాదము.


ఆ ఉగ్రవాదానికి ప్రతీకే పురాణాలలో వర్ణించిన "హిరణ్యకశిపుడు".


తన మతానికి విరుద్ధంగా, ప్రహ్లాదుడు చేసిన విష్ణు ప్రశంశ, హిరణ్యకశిపుడు భరించలేక పోయాడు.


ఒడిలో నుండి పుత్రుని క్రిందికి త్రోసివేసి క్రోధావేశంతో అక్కడ ఉన్న మంత్రులతో ఇలా అన్నాడు.


"మంత్రులారా! ఈ ప్రహ్లాదునివంటి పితృద్రోహి, భూమండలంలో ఎవరైనా ఉన్నారా?


వీడియొక్క ‌పినతండ్రి హిరణ్యాక్షుని,వరాహ రూపంలో వచ్చి విష్ణువు సంహరించాడు.


వీడు సిగ్గు శరములు లేకుండా మన వంశ విరోధి అయిన ఆ విష్ణువునకు భజన చేస్తున్నాడు.


ప్రాణం పోయినంత బాధ నాకు కలిగిస్తున్నాడు. 

వీడిని ఏమాత్రం ఉపేక్షించ కూడదు,

అంటూ,

  రాక్షస భటులవంక తిరిగి వారిని ఈ విధంగా ఆజ్ఞాపించాడు.

శా// పంచాబ్దంబులవాడు, తండ్రినగు నా పక్షంబు నిందించి, య/

త్కించిద్భీతియు లేక విష్ణు, నహితుం గీర్తించుచున్నాడు,వ/

 ల్దంచుం చెప్పిన మాన డంగమున బుత్రాకారతన్

వ్యాధి జ/

న్మించెన్, వీని వధించి రండు దనుజుల్ మీ మీ పటుత్వంబులన్//

(రాక్షసులారా! వీడు చూస్తే ఐదేండ్ల పిల్లవాడు.

తండ్రి నైన నన్ను ధిక్కరించి,నా ఎదుటే, నా శత్రువైన విష్ణువును, నదురు,బెదురు, లేకుండా పొగడు చున్నాడు.

వద్దంటే నా మాట లెఖ్ఖ చేయడం లేదు.

వీడు నా కొడుకు కాదు. 

 "కొడుకు" అనే పేరుతో నా శరీరంలో జన్మించిన పెద్ద వ్యాధి.

మీ మీ శక్తి సామర్థ్యాలు చూపించి వీనిని తీసుకుని వెళ్లి వెంటనే వధించండి).


శా// అంగ వ్రాతములో జికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శే/

షాంగంబు రక్షసేయు క్రియ నీ యజ్ఞుం, గులద్రోహి, దు/

స్సంగుం, గేశవ పక్షపాతి, నధముం, జంపించి వీరవ్రతో/

త్తుంగ ఖ్యాతి జరించెదం,గులము నిర్దోషంబు గావించెదన్//


(ఓ రాక్షస భటులారా!

 శరీరంలో ఏదైనా ఒక అవయవం చెడిపోతే వైద్యుడు ఆ అవయవాన్ని శస్త్ర చికిత్సతో ఛేదించి, మిగతా దేహాన్ని రక్షిస్తాడు.

ఆ విధంగా " అజ్ఞాని, కులద్రోహి, దుర్మార్గులతో కూడిన వాడు, విష్ణు పక్ష పాతి, నీచుడు,అయిన ఈ ప్రహ్లాదుని సంహరించి,నా కులాన్ని నిర్దోషము చేస్తాను.

"పుత్రుని కూడా సంహరించి కులమును కాపాడాడు" అన్న మహాకీర్తిని సంపాదిస్తాను).

అన్నాడు.


హిరణ్యకశిపుని ఆజ్ఞానుసారం ఆ రాక్షసభటులందరు ఏకమై, శూలములు చేతుల్లో ధరించి, నిర్దయులై ప్రహ్లాదుని క్రూరంగా పొడిచి హింసించారు.

రాజకుమారుడు, అందరియడల దయగలవాడు, సాధువు, ప్రజలందరిచేత మన్నింపబడుతున్న వాడు, బాలుడు, చంపదగినవాడు కాడు, అనే ఆలోచనేదీ లేకుండా, వారంతా ఆ బాలుని చిత్రహింసలకు గురిచేశారు.


ఈ ఉగ్రవాదాన్ని చూచి, సాధుసంరక్షకుడైన భగవానుడు ఆగ్రహపరవశుడైనాడు.


భయంకరమైన నరసింహ రూపం ధరించాడు.

నిప్పులు కురిపిస్తున్న నేత్రాలతో హిరణ్యకశిపుని చూస్తూ అ దానవుడిపై లంఘించాడు.


మ// విహగేంద్రుం డహి వ్రచ్చు కైవడి, మహోద్వృత్తిన్, నృసింహుండు, సా/

గ్రహుడై,యూరవులందు జేర్చి, నఖ సంఘాతంబులన్ వ్రచ్చె, దు/

స్సహు,దంభోళి కఠోరదేహు,నచలోత్సాహున్,మహాబాహు, నిం/

ద్ర హుతాశాంతక భీకరున్, ఘనకరున్,దైత్యాన్వయ శ్రీ కరున్//


(ఆ హిరణ్యకశిపుడు సామాన్యుడు కాడు.

తన తపశ్శక్తితో ప్రపంచం సహించలేనంత శక్తి కలిగి ఉన్నవాడు.

వజ్రము వలె కఠినమైన దేహంతో కూడి ఉన్నవాడు.

అచంచలమైన ఉత్సాహంతో కూడి ఉన్నవాడు.

మహా బాహువు.

ఇంద్రుడు, అగ్ని, యముడు,మొదలైన దేవతలకు భీతి కలిగించిన వాడు,

దిగ్గజముల కుంభస్థలాలను పగులగొట్టగలిగిన బలమైన బాహువులు గలవాడు,

ముల్లోకాలను జయించి రాక్షస వంశానికి కీర్తి ప్రతిష్టలు చేకూర్చిన వాడు,

అటువంటి ఆ హిరణ్యకశిపుని "నృసింహుడు" మహాసంరంభంతో పట్టుకొన్నాడు.

తన తొడలమీద వేసుకొని,

మిక్కిలి ఆగ్రహపరవశుడై తన వాడి గోళ్లతో వాడి వక్షస్థలాన్ని చీల్చి వేశాడు)


                   ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః.


శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

22-2-'26.

21, ఫిబ్రవరి 2026, శనివారం

పంచాంగం

 


సందేశం

  బెంగళూరులోని నారాయణ హృదయాలయ డైరెక్టర్ మరియు ప్రపంచంలోని ప్రముఖ కార్డియాలజిస్టులలో ఒకరైన డాక్టర్ దేవి శెట్టి సందేశం..


"నా స్నేహితులారా...

గత కొన్ని సంవత్సరాలలో, నాకు వ్యక్తిగతంగా చాలా సన్నిహితంగా ఉన్న 8-10 మందిని నేను కోల్పోయాను.. ముఖ్యంగా 40 ఏళ్ల వయసున్న కొంతమంది ప్రముఖులు 'ఫిట్‌గా' ఉండటానికి చాలా కష్టపడి పనిచేసిన తర్వాత మరణించారు.. కానీ వారందరూ ఫిట్‌గా కనిపించారు మరియు సిక్స్ ప్యాక్‌లు కలిగి ఉన్నారు....


జీవితంలో ప్రతిదానికీ 'మితత్వం' అనేది మంత్రం.. మీరు సున్నా లేదా వంద కోసం ఎంత ప్రయత్నిస్తున్నా, అది తప్పు. ఇరవై ఒక్క నిమిషాలు మితమైన వ్యాయామం, ప్రతిదీ తినడం, తీవ్రమైన డైటింగ్ అవసరం లేదు.. కివి పండు.. ఆలివ్ నూనె.. ఇవన్నీ కాదు.. మీ పూర్వీకులు తినేవి, స్థానికంగా, కాలానుగుణంగా మరియు మీ గ్రామంలో అందుబాటులో ఉన్నవి మితంగా తినండి.. పూర్తి ఏడు గంటలు నిద్రపోండి.. స్టెరాయిడ్లు లేదా పనితీరును పెంచే మందులు తీసుకోకుండా మీ శరీరాన్ని గౌరవించండి.


మీరు పెరిగిన వాటిని మితంగా తినండి. ప్రతిరోజూ 20 నుండి 30 నిమిషాలు వ్యాయామం చేయండి, మంచి నడక.. ఇది సరిపోతుంది.. అన్ని రకాల ఎనర్జీ డ్రింక్స్ ఆపండి, సప్లిమెంట్స్.. మీకు తాగుడు అలవాటు ఉంటే, వారానికి కొన్ని పెగ్గులకు పరిమితం చేయండి.. మీరు ధూమపానం మానేయలేకపోతే, దానిని రోజుకు ఒకటి లేదా రెండు పెగ్గులకు పరిమితం చేయండి. నేను చెప్పే దాని సారాంశాన్ని మీరు అర్థం చేసుకోవాలి.. ప్రతిదీ ఉండనివ్వండి.. మితంగా ఉండండి.. మీ దినచర్యలో కొంత నిశ్శబ్ద ధ్యానాన్ని చేర్చండి. ముఖ్యంగా, మీ శరీరాన్ని వినండి.. అర్థం చేసుకోండి..


40 ఏళ్ళ వయసులో, మీ శరీరం చాలా మారుతుంది, 50 ఏళ్ళ వయసులో ఇంకా ఎక్కువ.. 60 ఏళ్ళ తర్వాత, శరీరం నెమ్మదించడం ప్రారంభిస్తుంది.. 70 ఏళ్ళ తర్వాత, అది ముగింపుకు సిద్ధం కావడం ప్రారంభిస్తుంది.. 80 ఏళ్ళ తర్వాత, ప్రతి సంవత్సరం బోనస్.. కాబట్టి అరవై అంటే కొత్త నలభై, యాభై అంటే కొత్త ముప్పై అనే ఆలోచనను మరచిపోండి. అది కాదు. మీరు 40 లేదా 50 దాటితే, దానికి కృతజ్ఞతతో ఉండండి. మీ హృదయ స్పందన రేటుకు సరిపోయేలా మీ వేగాన్ని తగ్గించండి మరియు తదనుగుణంగా వ్యాయామం చేయండి. పదవీ విరమణ ఒక కారణం కోసం సూచించబడిందని తెలుసుకోండి. మీ శరీరం మరియు మనస్సు మీరు ఒకప్పుడు భరించిన ఒత్తిడిని ఇకపై తట్టుకోలేవు. మీరు బయటకు గొప్పగా కనిపించవచ్చు, దానికి మీ జన్యువులకు ధన్యవాదాలు. కానీ లోపల, మీ అవయవాలు వృద్ధాప్యంలో ఉన్నారు.


మీరు 40 ఏళ్లు పైబడిన వారైతే, పైన పేర్కొన్నవన్నీ చదవండి. మీరు పైన పేర్కొన్న వాటికి చాలా భిన్నంగా ఏదైనా చేస్తుంటే, ఇప్పుడే దాన్ని మార్చుకోండి. మీరు మరొక గణాంకాలుగా మారకూడదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను." 💐🙏 అమెరికాలోని వైద్య అధికారులు ప్రతి ఒక్కరికీ సహాయం చేయడానికి దీన్ని పంపారు. దయచేసి చదవండి మరియు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి - డాక్టర్ ఒకిరే.


ఎంత మంది యువకులు మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారో ఆందోళనకరంగా ఉంది. మాకు సహాయపడే పోస్ట్‌ను నేను పంచుకుంటున్నాను.


దయచేసి క్రింద చదవండి:


ముఖ్యమైనది - మూత్రపిండాలు ఏది ఉత్తమమో నిర్ణయిస్తాయి.


రెండు (2) రోజుల క్రితం, మూత్రపిండాల వ్యాధి కారణంగా నైజీరియన్ నటుడు మరణించిన వార్త మనందరికీ అందింది.


మా ప్రజా పనుల మంత్రి గౌరవనీయులైన టెకో లేక్ ప్రస్తుతం మూత్రపిండాల సమస్యలతో ఆసుపత్రిలో ఉన్నారు. ఈ మూత్రపిండాల వ్యాధి ముప్పును ఎలా నివారించాలో నేను మీకు చూపించాలనుకుంటున్నాను.మూత్రపిండాల వ్యాధికి ప్రధాన కారణాలు ఇక్కడ ఉన్నాయి:


1. టాయిలెట్‌కు వెళ్లడాన్ని ఆలస్యం చేయడం. మీ మూత్రాశయంలో ఎక్కువసేపు మూత్రం ఉంచడం చెడ్డ విషయం. నిండిన మూత్రాశయం మూత్రాశయం దెబ్బతినడానికి దారితీస్తుంది. మూత్రాశయంలో మిగిలి ఉన్న మూత్రం బ్యాక్టీరియాను త్వరగా గుణిస్తుంది. మూత్రం మూత్రనాళం మరియు మూత్రపిండాలకు తిరిగి వచ్చిన తర్వాత, విషపూరిత పదార్థాలు మూత్రపిండాల ఇన్ఫెక్షన్లకు, తరువాత మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు, తరువాత నెఫ్రిటిస్ మరియు యురేమియాకు కారణమవుతాయి. ప్రకృతి పిలిచినప్పుడు - వీలైనంత త్వరగా దీన్ని చేయండి.


2. ఎక్కువ ఉప్పు తినడం. మీరు రోజుకు 5.8 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు.


3. ఎక్కువ మాంసం తినడం. మీ ఆహారంలో ఎక్కువ ప్రోటీన్ మీ మూత్రపిండాలకు చెడ్డది. ప్రోటీన్ జీర్ణక్రియ అమ్మోనియాను ఉత్పత్తి చేస్తుంది - ఇది మీ మూత్రపిండాలకు చాలా చెడ్డది. ఎక్కువ మాంసం అంటే మూత్రపిండాలకు నష్టం.


4. ఎక్కువ కెఫిన్ తాగడం. అనేక సోడాలు మరియు శీతల పానీయాలలో కెఫిన్ ఒక పదార్ధం. ఇది మీ రక్తపోటును పెంచుతుంది మరియు మీ మూత్రపిండాలు బాధపడటానికి కారణమవుతుంది. కాబట్టి మీరు ప్రతిరోజూ త్రాగే కోక్ మొత్తాన్ని తగ్గించాలి.


5. తగినంత నీరు తాగకపోవడం. మన మూత్రపిండాలు వాటి విధులను సరిగ్గా నిర్వహించడానికి సరిగ్గా హైడ్రేట్ చేయాలి. మనం తగినంతగా తాగకపోతే, మూత్రపిండాల ద్వారా ప్రవహించడానికి తగినంత ద్రవం లేనందున రక్తంలో టాక్సిన్స్ పేరుకుపోవడం ప్రారంభించవచ్చు. ప్రతిరోజూ 10 గ్లాసుల కంటే ఎక్కువ నీరు త్రాగాలి. మీరు తాగుతున్నారో లేదో తనిఖీ చేయడానికి సులభమైన మార్గం ఉంది

తగినంత నీరు: మీ మూత్రం యొక్క రంగును చూడండి; రంగు తేలికగా ఉంటే మంచిది.


6. ఆలస్యంగా చికిత్స. మీ అన్ని ఆరోగ్య సమస్యలకు సరిగ్గా చికిత్స పొందండి మరియు మీ ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోండి. మనల్ని మనం సహాయం చేసుకుందాం... ఈ సంవత్సరం దేవుడు మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని ప్రతి వ్యాధి నుండి రక్షించుగాక.


(3) ఈ మాత్రలను నివారించండి, అవి చాలా ప్రమాదకరమైనవి:

* D-కోల్డ్

* విక్స్ యాక్షన్-500

* ఆక్టిఫెడ్

* కోల్డారిన్

* కసోమ్

* నైస్

* నిములిడ్

* సెట్రిజెట్-డి

వాటిలో ఫినైల్ ప్రొపనాల్-అమైడ్, PPA ఉన్నాయి

ఇది స్ట్రోక్‌కు కారణమవుతుంది మరియు USAలో నిషేధించబడింది.


దయచేసి, తొలగించే ముందు, దానిని పాస్ చేయడం ద్వారా మీ స్నేహితులకు సహాయం చేయండి..! ఇది ఎవరికైనా సహాయపడవచ్చు. వీలైనంత వరకు ఫార్వార్డ్ చేయండి. 


వాట్సాప్ ఉచితం, .... దయచేసి దీన్ని ఫార్వార్డ్ చేయండి.. చదవండి మరియు ఫార్వార్డ్ చేయండి.


యునైటెడ్ స్టేట్స్‌లోని వైద్యులు సిల్వర్ నైట్రస్ ఆక్సైడ్ వల్ల మానవులలో కొత్త క్యాన్సర్‌ను కనుగొన్నారు.


మీరు రీఛార్జ్ కార్డులను కొనుగోలు చేసినప్పుడల్లా, వాటిని మీ గోళ్ళతో గీకవద్దు, ఎందుకంటే దానిలో సిల్వర్ నైట్రస్ ఆక్సైడ్ పూత ఉంటుంది మరియు చర్మ క్యాన్సర్‌కు కారణమవుతుంది.


ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు:


1. ఎడమ చెవితో ఫోన్ కాల్స్‌కు సమాధానం ఇవ్వండి.


2. చల్లటి నీటితో మీ మందు తీసుకోకండి ....


3. సాయంత్రం 5 గంటల తర్వాత పెద్ద మొత్తంలో భోజనం చేయవద్దు.


4. ఉదయం ఎక్కువ నీరు త్రాగండి, రాత్రి తక్కువ.


5. నిద్రించడానికి ఉత్తమ సమయం రాత్రి 10 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు.


6. మందు తీసుకున్న తర్వాత లేదా తిన్న వెంటనే నిద్రపోకండి.


7. ఫోన్ బ్యాటరీ చివరి బార్ వరకు తక్కువగా ఉన్నప్పుడు, ఫోన్‌కు సమాధానం ఇవ్వవద్దు, ఎందుకంటే రేడియేషన్ 1000 రెట్లు బలంగా ఉంటుంది.


మీరు దీన్ని శ్రద్ధ వహించే వ్యక్తులకు ఫార్వార్డ్ చేయగలరా?

ఇప్పుడే చేశాను.

 దయకు ఎటువంటి ఖర్చు ఉండదు కానీ జ్ఞానం శక్తి...


గమనిక:


ఈ సందేశాన్ని సేవ్ చేయవద్దు, మీరు చెందిన ఇతర సమూహాలకు ఇప్పుడే పంపండి.

ఇది మీ స్వంత మంచి కోసం మరియు ఇతరులకు, ఎవరికైనా ఉపశమనం అందించడం ఎల్లప్పుడూ ప్రయోజనకరంగా ఉంటుంది.

యింకా మెరుస్తున్నాయి"

  ☘️🌹☘️🌹☘️🌸☘️


పారిజాతాప హరణ కావ్యాన్ని కృతి నందుకున్నప్పుడు కృష్ణదేవరాయలు నంది

తిమ్మనకు తన రెండు కుండలాలు బహుమతిగా నిచ్చెనట.అవి పెట్టుకొని తిమ్మన తన

యింటి అరుగు పై కూర్చుని వుండగా భట్టు కవి ఆ త్రోవన పోతూ ఆయనను

అభినందించి ఈ పద్యము చెప్పెనట.

మాకొలది జానపదులకు

నీ కవనపు ఠీవి అబ్బునే కూపనట

ద్భేకములకు గగనధునీ

శీకరముల చెమ్మ నందిసింగయ తిమ్మా!

అర్థము:--మాలాంటి పల్లెటూరి వాళ్లకు నీ లాగ కవిత్వము చెప్పడము యెలాగ

వస్తుంది?బావిలో నాట్యమాడే కప్పలకు ఆకాశ గంగ యొక్క యెగసిపడే నీళ్ళ యొక్క

తడి కూడా అంటనట్టు.(అంటే మేము కూపస్థ మండూకాల వంటి వారము నీవు

ఆకాశ గంగ లో విహరించే వాడవు.నీ కవిత్వము అంత గొప్పది).

తిమ్మన సంతోషించి తనదగ్గర ఏమీ లేనందున తన చెవి కున్న కుండలము నొక దానిని

తీసి యిచ్చెనట.

(రాయల వారు యిచ్చినది.)మరుదినము యిద్దరూ ఒంటి కుండలముతో సభకు వెళ్లి

రట.రాయలు యిదేమిటి? అని అడుగగాతిమ్మన ఒక మంచి పద్యము

భట్టుకవి చెప్పెను.

నేను

బహుమతిగా ఆ కుండలము యిచ్చితిని అని అన్నాడు. అప్పుడు రాయలు ఆ పద్యము మేము వినగోరుతున్నామని అడుగగా తిమ్మన ఆపద్యాన్ని చదివి వినిపించారట. దానికి రాయలవారు. అందులో 'గగనధుని" కాకుండా "నాకధుని" అంటే ఎలా వుంటుంది?

మాకొలది జానపదులకు

నీ కవనపు ఠీవి అబ్బునే కూపనట

ద్భేకములకు నాకధునీ

శీకరముల చెమ్మ నందిసింగయ తిమ్మా!

అన్నాడు. నాకధుని అంటే స్వర్గ ములో వుండే గంగ (గగనము అంటే శూన్యము అని అర్థము. శూన్యములో నీళ్లు వుండవు అని రాయల యొక్క భావము)నీ కవిత్వము చాలా చాలా గొప్పది.నందితిమ్మనా అని.భావము.

.

వారిద్దరూ మహారాజా! మీరు సరిచేసినది ఇంకా అద్భుతంగా వుంది. యని తమ కుండలాలను ఒక పద్యము చెప్పి రాయలకు సమర్పిస్తారు. రాయల వారు వాటిని చెవులకు ధరిస్తారు

"కుండలాలు మీ చెవుల నుండి విడివడి అయ్యో అని దుఃఖిస్తూ వుండినాయి.

.ఇప్పుడు మీ చెవులను చేరి సంతోషముతో యింకా మెరుస్తున్నాయి"

అని అర్థము వచ్చే పద్యము. చెబుతారు రాయలు వారిని తగురీతిని సత్కరించి పంపించాడట


🌸రాయల వారు గొప్పకవి

-----సేకరణ- -------

తెలుగు - వెలుగులు

  ఓం శ్రీ మాత్రే నమః 

21-2-2026

తెలుగు - వెలుగులు 


విశ్వమునందు తేజమును వేవెలుగుల్ ప్రసరింప జేయుచున్

విశ్వ పదోన్నతింగని సువీక్షతమైన ప్రసిద్ధి గాంచుతన్

విశ్వజనీనమౌ తెలుగు వేడ్కగ భాషణ సేయువారికిన్ 

 నశ్వరమన్నదే యెరుగ నట్టి మహోన్నతి గూర్చు గావుతన్ 


 వెలుగులు జిమ్ము భాష యిది విశ్వమునందు నజంత భాషగా 

పలువురి మనన్నల్ గనుచు వర్ధిలుచున్న మహోన్నతమ్మునౌ 

తెలుగును మాటలాడుటయు తీయని వైన పదాల వర్ణ స

ల్లలితపు భాష వ్రాయుట ధరన్ గని నట్టి విశేష భాగ్యమౌ 


తమకిల జన్మనిచ్చిన ఉదార మహాత్ములు తల్లిదండ్రులన్ 

తమకు విశేష నైపుణి సుధల్ గన నేర్పిన మాతృభాషదౌ 

విమల మహత్త్వమెన్నుచును విశ్వమునందలి తెల్గువారలం

దమును గ్రహించ గల్గి తమదౌ తెలుగున్ వినుతించ మేలగున్ 


ప్రపంచ మాతృ భాషా దినోత్సవ సందర్భంగా మన తెలుగు భాషాభిమానులందరికీ శుభాకాంక్షలూ నమస్సులతో 


మీ

డా.రఘుపతి శాస్త్రుల

పాశుపతాస్త్రం

  🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*మహాభారత కాలం నాటి పాశుపతాస్త్రం:*

⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡

 అతిశక్తివంతమైన ఒక అస్త్రం ఇది. తపస్సుతో శివుని మెప్పించి అర్జునుడు పొందాడు దీన్ని. అర్జునునికి శివుడు ఈ అస్త్రాన్ని ఇస్తూ "పాశుపతానికి అసాధ్యమైనది ఏదీలేదని, అయితే దాన్ని శక్తిహీనులపై ప్రయోగిస్తే లోకాన్ని తగలబెడుతుందనీ, అది అన్నివేళలా అందరిమీదా ప్రయోగించేది కాదనీ" చెప్పాడు. అస్త్రంగా ఇది మారణహోమాన్ని సృష్టించగలదు. అంతేకాదు, దేనినైనా నిర్ణీతస్థానానికి చేర్చే 'మిస్సైల్'గా కూడా పనికొస్తుంది. ఇది టు- ఇన్- వన్ లాంటి ఆయుధం అన్నమాట. మారణాస్త్రంగా దీన్ని ప్రయోగిస్తే, బ్రహ్మశిరాస్త్రం మాదిరిగానే ప్రకృతి ఉత్పాతాల్ని కల్పిస్తుంది. అందువల్ల ఈ పాశుపతాన్ని కూడా ఎప్పుడుపడితే అప్పుడు వాడరాదని ఆనాటి పెద్దలు (ఋషులు) ఆంక్ష విధించారు. కాబట్టే అర్జునుడు మారణాస్త్రంగా తన పాశుపతాన్ని కురుక్షేత్ర యుద్ధంలో వాడలేదు. మారణాయుధంగా దాన్ని కనుక ఉపయోగించి ఉంటే, అర్జునుడు కేవలం ఒక్కక్షణంలోనే కౌరవుల్ని నశింపజేసేవాడు. పాశుపతాస్త్రాన్ని మిస్సైల్గా మాత్రం ఒకసారి వాడాడు అర్జునుడు. ఆ విషయం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. కౌరవులకూ, పాండవులకూ బావమరిది 'సైంధవుడు'. సైంధవుడికి అతని తండ్రి అయిన వృద్ధక్షత్రుడు, ఒక వరం ప్రసాదించాడు. “ఎవరివల్ల తన తనయుని తల నేలపై పడుతుందో, వారియొక్క శిరస్సు ముక్కముక్కలై పేలిపోవాలని” తన తపశ్శక్తితో శాసించాడు. ఈ విషయం కృష్ణునికి తెలుసు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు తన బాణంతో సైంధవుడి తలను తెగనరుకుతాడు. ఆ 'తల' క్రిందపడిందంటే, అర్జునుని శిరస్సు ప్రేలిపోయి ఉండేదే! ప్రమాదాన్ని పసిగట్టాడు శ్రీకృష్ణుడు. సైంధవుని తలను నేలపై పడనివ్వవద్దని అర్జునుడితో చెప్పాడు. అర్జునుడు తన బాణాలను ఉపయోగిస్తూ, సైంధవుడి తలతో బంతి ఆట ఆడసాగాడు. "ఈ తలను ఏం చెయ్యమంటావు? అయినా ఎందుకూ ఇదంతా?" అంటూ కృష్ణుణ్ణి అడిగాడు. కృష్ణుడు అసలు విషయం చెప్పాడు. “అయితే ఏం చేద్దాం మరి?" అన్నాడు అర్జునుడు. "సైంధవుని తండ్రి వృద్ధక్షత్రుడు శమంతపంచకంలో తపస్సు చేసుకుంటున్నాడు. అతని తొడపై ఈ తలకాయ పడేలా చెయ్యి. ఆ పని ఒక్క పాశుపతాస్త్రం వల్లనే సాధ్యం" అని చెప్పాడు శ్రీకృష్ణుడు. పాశుపతాన్ని తీసి మంత్రించి వదిలాడు అర్జునుడు. ఆ అస్త్రం సైంధవుని తలను ఎక్కడోఉన్న శమంత పంచకానికి తీసుకొనిపోయి, వృద్ధక్షతుని తొడపై పడేసింది. దాన్ని తన కుమారుని శిరస్సుగా గుర్తించలేకపోయాడు వృద్ధక్షతుడు. ఉలిక్కిపడి క్రిందకు నెట్టేశాడు. సైంధవుని తల ఆ విధంగా నేలపై పడింది. ఆ తలను నేలపై పడగొట్టినవాడు వృద్ధక్షత్రుడు కాబట్టి, అతని తల ముక్కముక్కలుగా ప్రేలిపోయింది. తాను ఇచ్చిన వరానికి తానే బలి అయ్యాడు వృద్ధక్షత్రుడు. ఈ సందర్భంలో పాశుపతాస్త్రం ఒక “క్షిపణి" గా పనిచేయడం మనం గమనించవచ్చు.


పాశుపతాస్త్రం, బ్రహ్మశిరాస్త్రం ఈ రెండూ కూడా జగత్ సంహారం చెయ్యగలవు. మారణాయుధాలుగా వీటిని ఉపయోగిస్తే అనేక లక్షల శూలాలూ, గదలూ, సర్పాల్లాంటి బాణాలూ వాటినుండి పుడతాయి. వీటిని మనుషులపై ప్రయోగిస్తే ఎన్నో ఆపదలు వస్తాయి. ఎంత ప్రమాదం వచ్చినా, ఇతరితర ఉపాయాలవల్లనే తప్పించుకోవాలి గాని, ఈ అస్త్రాల్ని ప్రయోగించకూడదు. మారణాయుధములుగా వీటిని ప్రయోగించడాన్ని నిషేధించారు నాటి విజ్ఞులు.

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱

నందో రాజా భవిష్యతి

 *నందో రాజా భవిష్యతి* ఉత్తుంగ భుజుడను రాజునకు నందుడను కుమారుడు కలడు. ఈ కుమారునియందును వీని తల్లి యందును రాజు ఉపేక్షవహించి ఒక వేశ్యను కూడియుండెను. రాజు భార్య పేదయై దీనయై యుండెను. ఒక వర్తకుడు ముత్యాల హారమును అమ్ముటకు తీసుకొని రాగా ఈమె చూచి దానిని కొనగోరి ధనము లేమికి మిక్కిలి విచారించెను. ఆమె కడనున్న దాసి " ముందుగా హారమును పుచ్చుకొనుము. తరువాత వర్తకునకు ధనమీయ వలసిన సంగతి చూచుకొనవచ్చును. ఇంతలో రాజు చనిపోవునో ? వర్తకుడు చనిపోవునో ? మన నందుడే రాజుగునో ? ఏమి చెప్పగలము ? అని చెప్పినది. **ఉత్తుంగ భుజనాశోవా 

దేశ కాల గతోపివా 

వేశ్యా వణిగ్వినాశోవా

నందో రాజా భవిష్యతి**

ఆర్థికంగా వెనుకబడిన

 

ఈ సంవత్సరం 10వ తరగతి పూర్తి చేసి, 80% కంటే ఎక్కువ మార్కులు సాధించిన, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుండి వచ్చిన ప్రతిభావంతులైన విద్యార్థులు ఎవరైనా మీకు తెలిస్తే, దయచేసి వారిని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మద్దతు ఇచ్చే 'ప్రేరణ' అనే స్వచ్ఛంద సంస్థను సంప్రదించమని చెప్పండి.


ఈ స్వచ్ఛంద సంస్థ ఒక రాత పరీక్షను నిర్వహిస్తోంది మరియు ఆ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి వారి తదుపరి చదువుల కోసం ఆర్థిక సహాయం అందించబడుతుంది.


ఫారం పొందడానికి విద్యార్థులను క్రింద పేర్కొన్న వ్యక్తులను సంప్రదించమని దయచేసి చెప్పండి:


సంప్రదించాల్సిన నంబర్లు:

1. శ్రీమతి సరస్వతి - 9900906338

2. శ్రీ శివకుమార్ - 99866 30301

3. శ్రీమతి బిందు - 99645 34667


ఒకవేళ మీకు ఎవరూ తెలియకపోయినా, దయచేసి ఈ సమాచారాన్ని ఇతరులకు పంపండి, ఇది ఎవరికైనా ఉపయోగపడవచ్చు. www.infosys.com/infosys-foundation


ధన్యవాదాలు


దీనిని ఇతర గ్రూపులలో కూడా ఫార్వార్డ్ చేయండి.😊

ఇది ఒక్కరికైనా సహాయపడితే చాలు

ఇది పేద విద్యార్థులకు మంచి సమాచారం ☝️


అందిస్తుంది అని చెప్పవచ్చు 

మీరు మీ వంతు సహాయం చేసేవాళ్ళుగా ఉంటారు 

🙏🙏🙏🙏🙏🙏🙏


ఈ సమాచారములోని సత్య అసత్యాలు ఈ బ్లాగరుకు సంబంధం లేదు మీరు వ్యక్తిగతంగా ఫోన్ చేసి కనుక్కోగలరు

తస్మాత్ జాగ్రత్త

 మహిళలందరికీ ముఖ్య గమనిక:

నా స్నేహితురాలు ఒక థియేటర్ బాత్‌రూమ్‌లో స్పృహ కోల్పోయింది. ఆమె వద్ద ఉన్న వస్తువులన్నీ దొంగిలించబడ్డాయి. ఒక మహిళ ఆమెకు ఒక పర్ఫ్యూమ్ (గంధం/సెంటు) వాసన చూడమని ఇచ్చిందని తప్ప ఆమెకు మరేమీ గుర్తులేదు.

నిన్న మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో మాల్ పార్కింగ్‌లో ఇద్దరు వ్యక్తులు నా దగ్గరకు వచ్చి, నేను ఏ పర్ఫ్యూమ్ వాడుతున్నానని అడిగారు. ఆ తర్వాత, వారు తక్కువ ధరకే అమ్ముతున్న ఒక అద్భుతమైన పర్ఫ్యూమ్‌ని వాసన చూస్తారా అని నన్ను అడిగారు.

ఒకవేళ నాకు "పర్ఫ్యూమ్ షాక్" (THE PERFUME SHOCK) గురించి ముందుగా తెలియకపోయి ఉంటే, నేను బహుశా దాన్ని వాసన చూసేదాన్ని. ఆ వ్యక్తులు పార్కింగ్ చేసిన కార్ల మధ్యే ఉండి, మరొకరి కోసం ఎదురుచూస్తున్నారు. వారి వైపు వెళ్తున్న ఒక మహిళను నేను ఆపి హెచ్చరించాను.

షాపింగ్ మాల్స్ లేదా పార్కింగ్ స్థలాలలో పర్ఫ్యూమ్ అమ్ముతున్నామని చెప్పి వాసన చూడమని అడిగే వ్యక్తుల గురించి నాకు ముందే హెచ్చరిక అందింది. నిజానికి అది పర్ఫ్యూమ్ కాదు, అది "ఆక్స్టర్" (AXTER - మత్తు మందు).

మీరు దానిని వాసన చూసిన వెంటనే స్పృహ కోల్పోతారు, ఆ సమయంలో వారు మీ వద్ద ఉన్న విలువైన వస్తువులన్నీ దొంగిలిస్తారు.

దయచేసి: ఈ సందేశాన్ని కాపీ చేసి మీ స్నేహితులకు పంపండి, ఎందుకంటే వారు అన్ని చోట్లా ఇలాగే చేస్తున్నారు.

దయచేసి: మీ జాబితాలో ఉన్న మహిళలందరికీ దీనిని పంపి, ఇతరులకు కూడా తెలియజేయమని కోరండి.

బాధితులుగా మారి బాధపడటం కంటే, జాగ్రత్తగా ఉండటం ఎంతో ముఖ్యం. 🙏

ఇది కోయంబత్తూరులోని బ్రూక్‌ఫీల్డ్ మాల్‌లో మాకు తెలిసిన వారికి జరిగింది.           B.V.S.S.MOHAN