బ్రహ్మ దేవుడు ప్రత్యక్ష మై వరం కోరుకోమన్నప్పడు
రావణుడు తనకు చావు లేకుండా వరం ఇవ్వమన్నాడు అందుకు బ్రహ్మ దేవుడు ఒప్పుకోలేదు చివరకు రావణుడు ఆలోచించి ఇలా అడిగాడు
నాకు
దేవతల వలన గానీ , దానవుల వల్ల గానీ , గరుడుల వల్ల గానీ గంధర్వుల వల్ల గానీ మరణం లేకుండా ఉండే వరం ఇవ్వండి
నీచులు, అధములైన మానవుల గురించి నేను మాట్లాడను
ఇంతమంది చంపలేని నన్ను మానవుడు ఏంచేయగలడు వాడి పేరుతో వరం కోరుకోవడం కూడానా
అని ఈసడించి మాట్లాడాడు
అందుకే రావణ సంహరం కోసం శ్రీ మన్నారాయణుడే 11నెలలు కౌసల్యా గర్బవాసం చేసి మానవుడి గా జన్మించి శ్రీ రామచంద్ర మూర్తి గా భూమిపై నడయాడాడు
1-48 నిమిషాల వ్యవధి లో ఖర,దూషణాది రాక్షసులను నేలమట్టంచేసిన వీరుడు
అమిత శౌర్యం ధైర్యాలకు ప్రతీక మన రామచంద్ర ప్రభువు
యుద్ధం అంటూ వచ్చింది అనంటే ఆయన చేతులు తాండవం చేస్తాయి అరివీర భయంకరమైన ఆ బాణపరంపరకు యుద్ధ కౌశలమునకు ఎంతటి వారైనా నేలకొరగక తప్పదు అసలాయనను చూసినా ఆయన కరస్పర్శను పొందినా ఆ ధనస్సు కి కూడా రాశీ భూతమైన ఉత్సుకత తోడౌవుతుందేమో అందుకే ఆయన యుద్ధం చేసే క్రమాన్ని రామదాసు గారు ఇలా వర్ణన చేశారు ఫణి
భండన భీముడార్తజన బాంధవుడుజ్జ్వల బాణ తూణ కో
దండ కళాప్రచండ భుజతాండవ మూర్తికి రామమూర్తికిన్
రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరికా
డాండ డడాండ డాండ నినందంబులజాండము నిండ మత్త వే
దండమునెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ!
ఓ కరుణాసముద్రుడవైన శ్రీరామా! యుద్ధములో అమిత పరాక్రమవంతుడు, ఆర్తజనులకు బంధువు, ప్రకాశించే బాణముల అమ్ములపొది, కోదండము ధరించి ప్రంచండమైన భుజబలముతో శరములను సంధించే నీకు రెండవ సాటి దైవము లేడని నిశ్చయించుకొని మదించిన ఏనుగునెక్కి దుందుభిని మ్రోగించి డాండ డడాండ శబ్దభేరులు బ్రహ్మాండమంతా నిండేలా చాటెదను.
- దాశరధీ శతకం
శ్రీ రాముడు
ధర్మ సంస్థాపన కోసం వానర సమూహ సహాయం తో రావణుని సంహరించి మానవుని గొప్పతనాన్ని దశ దిశలకూ చాటి యుగ యుగాలకూ గుర్తుండేలా చేసి ఒక మానవుడు ధర్మబద్దంగా వీరోచితం గా ఎలా జీవించాలో ఆచరించి చూపిన శ్రీ రాముడే మానవుని కి ఆదర్శం
శ్రీ రామ చంద్ర పరబ్రహ్మణేనమ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి