10, ఆగస్టు 2020, సోమవారం

నూతన సృష్టికి మహాకాలుని ప్రణాళిక - 01


సద్గురు పండిత శ్రీరామ శర్మ ఆచార్య
. సంక్షిప్త సారం
అశుభ సమయాలు ప్రపంచ చరిత్రలో అనెకసార్లు వస్తూ వచ్చాయి. అయితే అనౌచిత్యాన్ని పరిధి దాటి రానివ్వరాదనేది సృష్టికర్త నియమం. దుర్మార్గులు తమ గతివిధులను వదిలిపెట్టనపుడు, పీడితులు వారిని ఆపడానికి సంసిద్దులు కానపుడు సృష్టికర్త ఆక్రోశం బయట పడుతుంది. “యదా యదా హి ధర్మస్య అన్న ప్రతిజ్ఞకు సృష్టికర్త బద్దుడై ఉంటాడు. యుగనంధి యొక్క పది సంవత్సరాలలో ఇది, ప్రసవవెదన లాంటి స్ధితి. ప్రసవకాలంలో ఒకవైపు గర్భిణి స్త్రీ సహించరాని ప్రసవక్రమాన్ని భరిస్తూ ఉంటే మరో వైపు సంతానప్రాప్తి అనే సుందర భావనలు కూడ మనసులోనే పులకింతను ఉత్పన్నం చేసూ ఉంటుంది. ఈ సంధి కాలంలో మనషి శాంతి, సౌజన్యాలతో మార్దంలో వెళ్ళడం నేర్చుకొని, కర్మఫల సునిశ్చిత ప్రక్రియను అవగతం చేసుకొని, ఏది చేయాలో అది చేసుకొంటూ, బుద్ధిమంతులు నడిచే మార్గంలో నడవాలి.

01. అనౌచిత్యం - ప్రతీకారం
అప్పుడప్పుడు అంటువ్యాధులలాగా అనాచారాలు కూడా తీవ్రగతిలో విజృంభించి వాటంతట అవే పాకే తీగలాగా అల్లుకుపోయి సమయం వస్తూ ఉంటుంది. సొంతవేర్లు లేకపోయినా అమర తీగ విస్తరిస్తూ చూస్తూ చూస్తూనే వృక్షమంతా వ్యాపిస్తుంది.

వనస్పతుల మీద అంటుకునే క్రిములు కూడా ఎవరి సహాయం లేకుండానే తమ వంశాన్ని వృద్ధి చేసుకుంటూ ఉంటాయి. వనస్పతులను నాశనం చేస్తూ ఉంటాయి.

దుష్టచింతన, దుష్టాచారాలు ఈ రోజులలో ఒక ప్రచలనగా తయారయ్యాయి. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ప్రతి వస్తువునూ క్రిందికి లాగుతూ ఉంటుంది. నీళ్ళు కూడా అప్రయత్నంగా పల్లంలోకి ప్రవహిస్తాయి. దుష్టత్వ పరిస్థితి కూడా ఇలాంటిదే. అది పతనం, పరాభవ దిశనే పట్టుకుంటుంది. కానీ ఎవరినైన ఉన్నతంగా తీర్చిదిద్దడానికి అసాధారణ, కష్టసాధ్యమైన శ్రమ కావాలి. ఉదాహరణకు రావణుడు జన్మించింది ఒంటరిగానే. అతని పిల్లలు, మనవళ్లు కాక వంశస్టులు, ప్రజలు కూడా అదె రీతిని –నీతిని పుణికి పుచ్చుకొన్నారు. సర్వత్రా అనాచారం వ్యాపించింది. కంసుడు, జరాసంధుడు, వృత్తాసురుడు, మహివాసురుడు మొదలైన వారుకూడా తమ కాలంలో ఇలాంటి అనాచార విస్తరణ కార్యక్రమాన్ని సొంతం చేసుకున్నారు. అనాచారాలు అన్నివైపులా ఆధిక్యాన్ని ప్రదర్శించాయి.

అలాంటి అశుభ సమయాలు ప్రపంచ చరిత్రలో అనేకసార్లు వచ్చాయి. అయితే సృష్టికర్త నియమం ఏమిటంటె అనౌచిత్యాన్ని పరిధిని దాటి రానివ్వడు. చిన్నపిల్లలు చేసే తప్పులు వారి పరిధిలో ఉన్నంతవరకు తల్లిదండ్రులు క్షమిస్తూ ఉంటారు. అయితే క్రమశిక్షణ ఉల్లంఘించి అవాంఛనీయ వనులు చేయడం మొదలుపెడితే చెంపదెబ్బలు వేయడం, చెవి మెలిపెట్టడం లాంటి ప్రతీకారాలు కూడా చేస్తారు. అలా జరుగక పోతే ఉద్ధండత పెరిగిపోయి సృష్టి వ్యవస్థ అంతా అతలాకుతలం అవుతుంది. గత రెండువేల సంవత్సరాలలో అవినీతి, అనాచారాలు తమ అన్ని పరిధులను దాటి క్రమశిక్షణను ఉల్లంఘించాయి. సమర్ధులు అసమర్ధులను అన్ని విధాల బాధ పెడుతున్నారు.* *సామంతవాదం అనే పేరుగల ఈ యుగాన్ని అంధకార యుగంగా చెబుతూ వచ్చారు.

సమర్దులైన వారు గర్వంతో తమ సంయుక్త శక్తిని దురుపయోగం చేయడంలో ఎటువంటి లోపాన్నీ చూపలేదు. ఈ పరిస్థితులలో పీడితులు కూడా మానవీయ మర్యాదలకు అనుగుణంగా చేయదలచిన ఎటువంటి ప్రతిఘటన చేయలేదు. కష్టాలను భరించాలంటే ఇతరులది కాక, తన రక్తాన్ని ప్రవహింప జేయగలగటం - ఆపదల నుండి బయటపడడానికి మనిషి యొక్క ఈ శాశ్వత సామర్థ్యమే అతని ప్రత్యేకతగా ఉంది.

వాస్తవానికి మనిషి ఎలాంటి మట్టితో తయారయ్యాడంటే అవినీతిపై విజయం సాధించినా సాధించలేకపోయినా, దానితో కనీసం పోరాటమైనా చేయగలడు. అవినీతిని నిరాటంకంగా కొనసాగనివ్వడం లేదా దానిని సహిస్తూ ఉండే బదులు దానితో పోరాడుతూ మానవీయ గౌరవాన్ని జాగృతం చేయడం కూడ అవసరం. దుర్మార్డులు తమ దుర్మార్గాన్ని వదలనపుడు, పీడితులు పిరికితనం, భయంతో పోరాట పటిమను చూపించనపుడు సృష్టిని సృష్టించిన సృష్టికర్తకు నచ్చదు. అపుడు సృష్టికర్తకు ఆక్రోశం వస్తుంది.

సృష్టిలో దుర్మార్గం అయితే ఉన్నది. దానితో పాటు పీడితులు జయాపజయాలను ఆలోచించకుండా ప్రతీకారానికి, నిరోధించడానికి సిద్ధంగా ఉండాలనే విధానం కూడా ఉన్నది. దయ, క్షమల పేరుతో దుర్మార్దాన్ని పెంచుకుంటూ పోవడం ఎప్పుడూ అవాంఛనీయమే.

దుర్మార్గంతో పోరాడడం అనేది మానవీయ గొప్పదనాన్ని సూచిస్తుంది. రెండు వైపుల నుండి తప్పు జరుగుతూ ఉంటే తన వ్యవస్థ దిగజారుడుతనం చూస్తే సృష్టికర్తకు కోపం వస్తుంది. మనిషి చేయలేని పనిని స్వయంగా తనే చేయడానికి సిద్ధపడతాడు. దీనినే అవతార పరంపర అంటారు. 

కామెంట్‌లు లేవు: