10, ఆగస్టు 2020, సోమవారం

ముఖం మీద బొట్టు ఎందుకు

నేటి ధర్మ సందేహం:::::
ముఖం మీద బొట్టు ఎందుకు, ఎలా పెట్టుకోవాలి?
ఇప్పుడు ఉన్న ఈ తరం వాళ్ళకి ఖచ్చితంగా తెలియాల్సిన విషయం. వారు పాశ్చత్యులు నేర్పిన విధానం మార్చుకోవాలి.
మనకు కనుబొమ్మల మధ్య ఆజ్ఞాచక్రం ఉంటుంది. అది వేడిని పుట్టిస్తూ ఉంటుంది. అందుకే అక్కడ చల్లదనం కావాలి. అవసరం కూడా. పసుపు, కుంకుమ, తిలకం, భస్మం, చందనం, శ్రీచూర్ణం వగైరాలు ఈ అవసరాన్ని తీరుస్తాయి. ముఖం మీద బొట్టు గుండ్రంగా పెట్టుకోవాలా ? అడ్డం గా పెట్టుకోవాలా ? నిలువుగా పెట్టుకోవాలా? అని అడిగితే ఎవరి ఇష్టం మరియు వారి వంశాచారం ప్రకారం పెట్టుకోవాలి. ఏ బొట్టు అయినా ముఖానికి అందాన్ని, తేజస్సును ఇస్తుంది. మొత్తం మీద అడ్డంగా పెట్టుకునే భస్మం. ఐశ్వర్యాన్ని అభివృద్ధి చేస్తుంది. నిలువుగా పెట్టుకునే శ్రీచూర్ణమ్ బ్రహ్మరంధ్రం ద్వారా జీవాత్మ చేరుకునే పరమపదాన్ని సూచిస్తుంది. కనుబొమ్మల మధ్య బొట్టు నాడీ వ్యవస్థ పై అనుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇక ఆడవారు పెట్టుకునే బొట్టు వారి సౌభాగ్యాన్ని, ఐశ్వర్యాన్ని సూచిస్తుంది.
అందుకే ఆడవాళ్ళు ఎప్పుడు బొట్టుని ధరించాలి. స్టికర్ పెట్టడం నిషిద్ధం.
ఇక ఎవరూ ముక్కు పై భాగం లో బొట్టు పెట్టరాదు. ఇలా పెట్టడం వల్ల ఏమి ఫలితం ఉండదు.
::::::₹₹₹₹₹₹:::::::
 "కృతేయుగే నారసింహ: త్రేతాయాంరఘునందన:
 ద్వాపరే వాసు దేవశ్చ కలౌవేంకటనాయక:"
"అంజనాద్రి: వృషాద్రిశ్చ శేషాద్రి: గరుడాచల:తీర్థాద్రి: శ్రీ నివాసాద్రి: చిన్తామణి గిరిస్తథా వృషభాద్రి: వరాహాద్రి: జ్ఞానాద్రి: కనకాచల: ఆనన్దాద్రిశ్చ నీలాద్రి: సుమేరు శిఖరాచల"
::::₹₹₹₹::::.  🕉🕉

కామెంట్‌లు లేవు: