10, ఆగస్టు 2020, సోమవారం

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - పదియవ అధ్యాయము*

*దేవాసుర సంగ్రామము*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*10.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*తస్యాసన్ సర్వతో యానైర్యూథానాం పతయోఽసురాః|*

*నముచిః శంబరో బాణో విప్రచిత్తిరయోముఖః॥6679॥*

*10.20 (ఇరువదియవ శ్లోకము)*

*ద్విమూర్ధా కాలనాభోఽథ ప్రహేతిర్హేతిరిల్వలః|*

*శకునిర్భూతసంతాపో వజ్రదంష్ట్రో విరోచనః॥6680॥*

*10.21 (ఇరువది రెండవ శ్లోకము)*

*హయగ్రీవః శంకుశిరాః కపిలో మేఘదుందుభిః|*

*తారకశ్చక్రదృక్ శుంభో నిశుంభో జంభ ఉత్కలః॥6681॥*

*10.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*అరిష్టోఽరిష్టనేమిశ్చ మయశ్చ త్రిపురాధిపః|*

*అన్యే పౌలోమకాలేయా నివాతకవచాదయః॥6682॥*

నలువైపుల తమ తమ విమానములపై సేనాపతులు కూర్చొనియుండిరి. వారిలో ప్రముఖులు నముచి, శంబరుడు, బాణుడు, విప్రచిత్తి, అయోముఖుడు, ద్విమూర్ధుడు, కాలనాభుడు, ప్రహేతి, హేతి, ఇల్వలుడు, శకుని, భూతసంతాపుడు, వజ్రదంష్ట్రుడు, విరోచనుడు, హయగ్రీవుడు, శంకుశిరుడు, కపిలుడు, మేఘదుందుభి, తారకుడు, చక్రాక్షుడు, శుంభుడు, నిశంభుడు, జంభుడు, ఉత్కలుడు, అరిష్టుడు, అరిష్టనేమి, త్రిపురాధిపతియైన మయుడు, పౌలోముడు, కాలేయుడు, నివాతకవచులు మొదలగువారు ఉండిరి.

*10.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*అలబ్ధభాగాః సోమస్య కేవలం క్లేశభాగినః|*

*సర్వ ఏతే రణముఖే బహుశో నిర్జితామరాః॥6683॥*

వీరు అందరు సముద్రమథనమునందు పాల్గొనియుండిరి. కాని,వారికి అమృతములో భాగము దొరకలేదు.  కేవలము కాయకష్టమే మిగిలినది. వీరు అందరును పెక్కు పర్యాయములు దేవతలను యుద్ధమునందు ఓడించియుండిరి.

*10.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*సింహనాదాన్ విముంచంతః శంఖాన్ దధ్ముర్మహారవాన్|*

*దృష్ట్వా సపత్నానుత్సిక్తాన్ బలభిత్కుపితో భృశమ్॥*

కనుక, వారందరును సమరోత్సాహముతో సింహనాదమొనర్చుచు బిగ్గరగా శంఖములను పూరించుచుండిరి. రణోత్సాహముతో వచ్చుచున్న శత్రువులను జూచి, ఇంద్రుడు మిగుల కుపితుడాయెను.

*10.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*ఐరావతం దిక్కరిణమారూఢః శుశుభే స్వరాట్|*

*యథా స్రవత్ప్రస్రవణముదయాద్రిమహర్పతిః॥6685॥*

ఆ ఇంద్రుడు తన వాహనమైన ఐరావతమను దిగ్గజమును అధిరోహించి యుండెను. ఆ గజము యొక్క కపోలముల నుండి మదజలము స్రవించు చుండెను. అప్పుడు అతడు పెక్కు సెలయేళ్ళు ప్రవహించుచున్న ఉదయాద్రిపై ఆరోహించి యున్న సూర్యభగవానునివలె శోభిల్లుచుండెను.

*10.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*తస్యాసన్ సర్వతో దేవా నానావాహధ్వజాయుధాః|*

*లోకపాలాః సహ గణైర్వాయ్వగ్నివరుణాదయః॥6686॥*

ఇంద్రునకు నలువైపుల దేవగణములు, ఇంకను వాయువు, అగ్ని, వరుణుడు మొదలగు లోకపాలురు తమ తమ గణములతో రక్షణగా నిలచియుండిరి. ఆ దేవ గణములు, తమతమ వాహనములను, ధ్వజములను, ఆయుధములను కలిగియుండిరి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని పదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319

కామెంట్‌లు లేవు: