*మనోధైర్యం*
దాదాపు పాతిక సంవత్సరాల క్రితం ఒక కుటుంబం, జీవనోపాధి కోసం అమెరికా నుంచి ఆస్ట్రేలియా వెళ్ళింది. వారికి ఒక అందమైన కొడుకున్నాడు. యుక్తవయసులో అతడు ఎంతో ఆకర్షణీయంగా వుండేవాడు. సర్కస్ లో ట్రెపీజ్ ఆర్టిస్టుగా చేరాలని అతని అభిలాష. ఎంత ఎత్తు మీద నుంచి అయినా అవలీలగా దూకేవాడు.
ఒకరోజు, ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో అయిదుగురు దొంగలు అతడిపై కత్తులతో దాడి చేసారు. అయితే, అందరిలా అతడు భయపడి పర్సు ఇచ్చెయ్యలేదు. ఎదుర్కొన్నాడు. ఆ ఫలితంగా వారు అయిదుగురూ అతడిని నిర్దాక్షిణ్యంగా చావబాదారు. అరగంట తరువాత అక్కడ గస్తీ తిరిగే పోలీసులు, రోడ్డుమీద రక్తపుమడుగులో పడివున్న అతడిని చూసి, శవమనుకుని, మార్చురీకి తీసుకెళ్ళారు. అక్కడి డాక్టర్లు కొసప్రాణం వుందని నిర్ధారించారు. కొత్తగా చేరిన నర్సు అతడి ఆకృతి చూసి స్పృహ తప్పిపడిపోయింది.
అతడి మొహం స్థానంలో రక్తపు ముద్ద వుంది. ముక్కు వేలాడుతూంది. ఒక కనుగుడ్డు, సాకెట్ లోంచి బయటకొచ్చి నిర్జీవమైపోయింది. పుర్రె రెండు చోట్ల బ్రద్దలై వుంది. శరీరంపై పదహారు ఫ్రాక్చర్లున్నాయి. దవడ పక్కకి తిరిగిపోయింది. మొత్తం పళ్ళన్నీ ఊడిపోయాయి. అతడు మనిషి అవటానికి ఏడాది పట్టింది. అయితే, అతడికి ముక్కులేదు. ఒక కన్నులేదు. పళ్ళు లేవు. ఒకప్పటి అందమైన కుర్రవాడు, కేవలం "కదిలే మాంసపు ముద్ద"లా మిగిలాడు. అందరూ అతడివైపు కనీసం చూడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. చూడగానే ఒళ్ళు గగుర్పొడిచేటంత భయంకరమైన ఆకృతి. ఎక్కడ ఉద్యోగం దొరకలేదు. చివరకు, ఏ కంపెనీలో అందమైన ట్రెపీజ్ ఆర్టిస్టుగా చేద్దామనుకున్నాడో, ఆ కంపెనీలో సర్కస్ ఫీట్లు చెయ్యాల్సి వచ్చింది. సర్కస్ లో ప్రేక్షకులకి అతడిని *A MAN WITH NO FACE* గా అనౌన్స్ చేసేవారు.
అసలెవరూ అతడిని అక్కడ ఒక మనిషిగా గుర్తించేవారు కాదు. సరి అయిన తిండి లేదు. తిండివున్నా, తినటానికి పళ్ళు లేవు. అవి కట్టించుకోవటానికి డబ్బు లేదు. ఇంత జరిగినా, అతడు తన చిన్నప్పటి అలవాటుని పోగొట్టుకోలేదు. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా చర్చికెళ్ళి ప్రశాంతంగా కూర్చునేవాడు. గంటల తరబడి 'ధ్యానం'లో లీనమయ్యేవాడు. దానధర్మాలు చేసేవాడు. ఇలా రెండేళ్ళు గడిచాయి. అతడిని ప్రతిరోజూ చూస్తున్న చర్చి ఫాదర్ కి జాలీ అభిమానం కలిగాయి. మనిషి స్వరూపాన్ని పోగొట్టుకున్నా, మానవ స్వభావాన్ని పోగొట్టుకోని అతడికి, సాయం చేద్దామనుకున్నాడు.
ఆస్ట్రేలియాలోని ప్రముఖ ప్లాస్టిక్ సర్జెన్, ఆ ఫాదర్ కి ఆప్తమిత్రుడు. డెంటిస్ట్ ఖర్చులు చర్చి భరించింది. అతడి మొహం మీద ఆర్నెల్లపాటు ఎనిమిది ఆపరేషన్లు జరిగాయి. గాజు కన్ను అమర్చారు. దవడ వంకర సరిచేసి, ఒక రూపుకి తీసుకువచ్చారు. క్రమక్రమంగా అతడికి ఒక ఆకారం ఏర్పడింది. వివాహం జరిగింది. పిల్లలు పుట్టారు. అతడు కథానాయకుడిగా, పై సంఘటన ఆధారంతో A MAN WITHOUT A FACE అని సినిమా తీసారు. హిట్టయింది. ఆ తరువాత వరుసగా సూపర్ డూపర్ హిట్స్ MAD MAX, BRAVE HEART, LETHAL WEAPON సినిమాలు వచ్చాయి. అతనెవరో మీలో కొందరికి తెలిసే ఉంటుంది.
అతడు *హాలీవుడ్ నెం. 1 నటుడు మెల్ గిబ్సన్.* పది మిలియన్ డాలర్లకధిపతి. ఇప్పటికీ అతడు ఖాళీ సమయాల్లో అదే చర్చి దగ్గర దానధర్మాలు చేస్తూ కనపడతాడు. మనోధైర్యం అంటే అది.
మనం చాలా చిన్న సమస్యలు చూసి బెంబేలు పడతాం. దానికి కారణం, నిజమైన సమస్యలు తెలియక....!! చాలామంది ఈ వాదనని ఒప్పుకోరు. *ఎవరి సమస్య వారికి పెద్దది* అంటారు. ఇది ఆత్మ సమర్థన. 'విచారం' పట్ల వుండే ప్రేమ.
కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యంగా ఉంటుందని అందరూ చెబుతారు కానీ కొబ్బరికాయలోకి ఆ నీళ్లు ఎలా వచ్చాయో లేక వస్తాయో చెప్పేవాడే మేధావి, అలాగే సమస్యను పరిష్కరించుకోమని చెప్పడం చాలా తేలిక కానీ ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో చెప్పడమే చాలా కష్టం.
అలా చెప్పగలిగే శక్తి మరియు
మేధావితనం కేవలం మన మనసు కు మాత్రమే ఉంటుంది.
*సమస్యతో పాటు పరిష్కారం కూడా పురుడుపోసుకుంటుంది*.సమస్యను చూస్తూ కూర్చుంటే పెద్దదిగా కనిపిస్తోంది కానీ దాన్ని సాధించడం మొదలుపెడితే చాలా చిన్నదిగా కనబడుతుంది.
అర్జునుడు నిర్వేదాన్ని పోగొట్టడానికి కృష్ణ భగవానుడు గీతను బోధించాడు. రామకృష్ణ పరమహంస కన్నీళ్లు తుడవడానికి కాళీ మాత దర్శనం ఇచ్చింది.
అలాగే మన సమస్యల పరిష్కారానికి మన మనసు మంచి మార్గని చూపిస్తుంది.
మనోధైర్యాన్ని మించిన మందు గాని, అంతకంటే విలువైన ఆస్తి గాని మరేది ఈ ప్రపంచంలో లేదు ఇది అందరికీ తెలిసిన సత్యం.
సమస్యతో సహచర్యం చేయడం తప్ప వేరే మార్గం లేదు మనకి, దానితోనే ఉంటూ దానితోనే పోరాడుతూ,మనల్ని మనం విజయ తీరాల వైపు నడిపించు కోవాలి.
*అపజయానికి కృంగి పోక విజయానికి పొంగిపోక తన గమ్యం వైపు పైనుంచి వాడే పరిపూర్ణమైన వ్యక్తి గా ఎదుగుతాడు*
🌹 *డా. ఓ. మహమ్మద్ రఫి* 🌹
మంచి కథలు గ్రూప్ లో ప్రవేశం కొరకు క్రింది అవకాశం ఉపయోగించుకోవవచ్చును.
*ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక తమిళనాడు మరియు అమెరికా మెత్తం 31 గ్రూపులు ఉన్నాయి (7000 మంది సభ్యులు వున్నారు)* అన్నింటిలో ఒకే కధ పంపించబడుతుంది.
👇
https://chat.whatsapp.com/CQ2af235UzgLjnB7EbKND7
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి