రామాయణం.....*
రామాయణం నుండి నేర్చుకోవలసిన కొన్ని విషయాలు..
రామాయణం పనితనం పెంచుతుంది. నిద్రపోయే కుంభకర్ణులు కావద్దంటుంది.
సేవా భావం నిర్మాణం చేస్తుంది. ఆంజనేయునిలా, లక్ష్మణుడిలా సేవ చేయండని పిలుపునిస్తుంది.
ఏకతాపథంలో నడిచే ఆలోచనలను కలిగిస్తుంది. రామానుజుల్లా కలిసి ఉండమంటుంది. వానరుల్లా సంఘటిత శక్తితో నడవండి అంటుంది.
రామాయణం సజ్జనులను కాపాడమంటుంది. దుర్జనులను శిక్షించమంటుంది.
రామాయణం తల్లిదండ్రుల మాటలను పాటించమంటుంది. అందుకొరకు మనముందు దశరథుణ్ణీ, శ్రీరామున్ని నిలిపింది.
రామాయణం కన్నతల్లిని ప్రేమించమంటుంది.
కన్న నేలను రక్షించుకొమ్మంటుంది.
రామాయణం గురువుల మాటను పాటించి ప్రజానురంజక పాలన చేయమంటుంది.
ఉదాహరణకు.. వాల్మీకి, వశిష్ట, విశ్వామితులున్నారు.
వ్యక్తిసుఖం కంటే దేశం.. దేశ ప్రజలే ముఖ్యమని రామాయణం సందేశమిస్తున్నది.
ఉదాహరణకు.. సీతా పరిత్యాగాం..
రామాయణం అపూర్వగ్రంథం..
మనల్ని నీతిమంతులుగా,
బుద్ధిమంతులుగా,
శక్తిమంతులుగా,
శ్రీమంతులుగా,
ధర్మమూర్తులుగా,
ప్రతిభావంతులుగా,
దేశ భక్తులుగా,
దేశ సంరక్షకులుగా,
సర్వగుణ సంపన్నులుగా తీర్చిదిద్దుతుంది..
రామాయణం చదువుదాం..
ఆలోచిద్దాం..
పరమార్థాలు పదిమందికి చెబుదాం..
అందరూ రామాయణం చదివేందుకు దోహదం చేద్దాం..
రామాయణం...
ఒక తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమ..
ఒక కొడుకుకి తండ్రి మీద ఉన్న గౌరవం..
ఒక భర్తకి భార్య మీద ఉన్న బాధ్యత..
ఒక భార్యకి భర్త మీద ఉన్న నమ్మకం..
ఒక అన్నకి తమ్ముడి మీద ఉన్న విశ్వాసం..
ఒక తమ్ముడికి అన్న మీద ఉన్న మమకారం..
ఒక మనిషిలోని బలం..
మరో మనిషి లోని స్వార్ధం..
ఇంకో మనిషి లోని కామం..
ఒకరి ఎదురు చూపులు..
మరొకరి వెతుకులాటలు..
అండగా నిలిచిన మనుషులు..
అన్ని కలిపి మనిషి మనిషి గా బ్రతకడానికి అవసరమైన ఒక నిఘంటువు...
శక్తి ఉన్నా ఒద్దికగా ఉండటం రామ తత్వం..
అవకాశం ఉన్నా భర్త వెంట నడవటం సీత తత్వం..
కష్టాల్లో తోడు నిలవడం ఆంజనేయ తత్వం..
ప్రతి అడుగులో మంచిని గ్రహించాలన్నదే రామాయణ పరమార్ధం...
ఇదే రామాయణం మనకిచ్చే ఆదర్శ సందేశం...
*|| ఓం నమః శివాయ ||*
హిందూ సనాతన ధర్మమునకు సంభదిత విషయములు తెలుసుకొనుటకు కొరకు టెలిగ్రామ్ యాప్ వాడే వారు ఈ క్రింది లింక్ ద్వారా మన సమూహం నందు జాయిన్ అవచ్చును.....
Spiritual Seekers 🙏
https://t.me/Spiritual_Seekers
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి