23, జూన్ 2021, బుధవారం

శ్రీరమణీయం* *-(185)*_

 _*శ్రీరమణీయం* *-(185)*_

🕉🌞🌎🌙🌟🚩


_*"ఆత్మానుభవం, ఆత్మజ్ఞానం ఒక్కటేనా ?"*_


_*కాదు. నేను ఈదేహాన్ని కాదని తెలియటం వైరాగ్యం. నేను చైతన్యం అని తెలియటం ఆత్మానుభవం. నిరంతరం అదే స్ఫురణలో ఉండటం ఆత్మజ్ఞానం. ఆధ్యాత్మికతలో ఆత్మానుభవం తొలిమెట్టు. ఆత్మజ్ఞానం తుదిమెట్టు. మన ప్రాణస్వరూపం ఎలా ఉంటుందో తెలిసేందుకు భిన్నమైన ఒక వస్తువు కావాలి. అందుకు మన దేహం ఉపయోగపడాలి. అంతే గాని ఈ శరీరం కేవలం దేహాభావనలో పడి కొట్టుకు పోవడానికి కాదు. అన్ని ప్రాణుల్లో కేవలం జీవించేందుకు అవసరమైన గ్రహింపు ఉంటుంది. పరిమితమైన ప్రతిస్పందన మాత్రమే ఉంటుంది. కానీ అనుగ్రహిస్తుంది. నేను ఈ దేహాన్ని కాదని తెలుసుకోవటమే ప్రధమ లక్ష్యం !*_


_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*_

_*'మనసు పవిత్రం - ఆలోచనలే వికారం !'*- 


🕉🌞🌎🌙🌟🚩

కామెంట్‌లు లేవు: