23, జూన్ 2021, బుధవారం

వేదం ధనం

 వేదం ధనం అనగా + యని అనగా వున్న శక్తిని చైతన్యపరచుటయని అనగా ప్రచోదయాత్ ప్రయోజనం చేయుటను తెలుపుచున్నది. ధనం శ్రీ సూక్తం వివరంగా  అగ్ని, వాయువు, సూర్య, వసు, యింద్ర బృహస్పతి, వరుణ, శక్తిని సూత్రపరంగా  దేహమునకు ఎలా వుపయెూగమెూ తెలిపినది. వాటిని ప్రకృతి పరంగా స్వీకరించుటయే + యనే క్రియ రూపంలో తెలుపుచున్నది. అగ్ని ని + చేయుట యనగా మన దేహములో యున్న శక్తిని సూర్య శక్తితో + చేయుట స్వీకరించుటయే. ఆ తరువాత వాయువుగా మారి నీటి పరంగా  శరీర శుద్ది కలుగును.నీరు కూడా శుద్ది జరిగి దానికి వాయువు కారణము. ప్రాణాయామం ద్వారా శ్వాస నీరు నాడులు శుధ్ది తద్వారా ఆరోగ్యం మైన జీవితం ప్రాప్తమగును. దీని సూత్రమే గాయత్రి రూపంలో గల ఆత్మ లేక అణు రూపంలో గల శక్తి అదే దేహములో గల టెంపరేచర్.అదే ఓం నమః శివాయ మంత్రం.దానిని విధించుటయందు లలితా సహస్రం గాని రుద్రం గాని సమస్త వేద వాఙ్మయం మానవ జీవన వినికిడి మూల సూత్రమే ధనం +.ధనం అనగా వస్తు పరంగా నిర్వచనం లేదు. అది వక మార్గము జీవికి సంబంధించిన వ్యవహారిక క్రియకు పదార్ధ రూపము. దేహమే ధనం దేహ ధారణ ధనం. దేహము ధరించిన తరువాత పోషణకు మార్గము. యింత స్పష్టంగా వేదము ధనము అనగా + అని తెలిపినది. అణువు కూడా + చైతన్యమైన పదార్ధ రూపం దాల్చిన,దాని వునికి తెలియ నట్టు మానవ శరీరము శక్తి కూడా సూక్ష్మంగా ప్రారంభమై అనంతమగుచూ తిరిగి సూక్షమంగా వచ్చిన దారిలోనే తిరుగు ప్రయాణం. దానంతట తాను ప్రయాణము సహజ సూత్రం. సహజ సూత్రమును తెలిసి తిరిగి దేహ ప్రవేశము జరుగక మూల శక్తిలో ప్రవేశించుటకు + అనే మూల సూత్రంను తెలియుట ఙ్ఞానము.పురుషసూక్తం శక్తి వ్యాప్తమును తెలిపితే శ్రీ సూక్తం దాని పదార్ధ లక్షణమును ప్రకృతి రూపంలో తెలుపుచున్నది. తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.

కామెంట్‌లు లేవు: