🙏🙏🙏🙏🙏
🌹🌹🌹🌹🌹
శ్రీ కనకదుర్గా మాతను ఎలా ఆరాధిస్తే, దుర్గామాత యొక్క అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది.
🌹🌹🌹🌹🌹
దుర్గామాత ఆరాధనలో, ఏ ఆచారాన్ని పాటించాలి.
దుర్గమ్మ అనుగ్రహం పొందటానికి మన సాధన ఎలా ఉండాలి .
శ్రీ లలితా సహస్రనామంలో వశిన్యాది వాగ్దేవతలు "సమయాచార తత్పర" అన్న నామము ద్వారా, ఈ ప్రశ్నలన్నింటికీ మనకు సమాధానం స్పురింపచేశారు.
"తత్పర" అనగా ప్రీతి.
"సమయాచార తత్పర" అనగా, శ్రీ కనకదుర్గామాత తనను సమయాచార పద్ధతిలో ఆరాధించే భక్తులపైన ప్రీతి కలిగి ఉంటారు, అని భావము.
అమ్మవారిని ఆరాధించే పద్ధతులు, మూడు విధములు.
అవే,1) దక్షిణాచారం 2) వామాచారం మరియు 3) మిశ్రమ సాంప్రదాయం. వాటిలో వేటికవే గొప్పవి అయినప్పటికీ, దక్షిణాచారమే శ్రేష్టమని వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన విషయము.
వేదము చెప్పిన పద్ధతిలో అమ్మవారిని ఆరాధిస్తే, అది దక్షిణాచారం. ఆ దక్షిణాచార ప్రక్రియనే, "సమయాచారము" అని విశ్లేషించాడు ఆపస్తంబుడు తన ఆపస్తంబ సూత్రాలలో.
వేద విరుద్ధమైనది వామాచారం.
ఆ రెండింటిని సమన్వయం చేస్తూ, ఋషులు చెప్పిన పద్ధతియే 'మిశ్ర సాంప్రదాయం'.
ఈ మూడింటిలో, ఏ పద్ధతిని పాటించినా, సాధన అనేది "పరాపర" అయి ఉండాలి.
( "పరా" అనగా అంతర్ సాధన.)
("అపరా" అనగా, భాహ్య సాధన. )
రెండింటినీ కలిపి చేయవలసి ఉంటుంది. అందుకే, అన్నమాచార్యులవారు, "భావములోనా భాహ్యములోనా....." అని వచించారు.
అటువంటి సాధనతో, శ్రీ కనకదుర్గా, దేవతా, పరదేవతా, నమోస్తుతే
నమోస్తుతే.
🌹🌹🌹🌹🌹
🙏🙏🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి