6, అక్టోబర్ 2021, బుధవారం

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*438వ నామ మంత్రము* 6.10.2021


*ఓం కురుకుళ్ళాయై నమః*


కురుకుళ్ళయను దేవతాస్వరూపురాలు అయిన అమ్మవారికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కురుకుళ్ళా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం కురుకుళ్ళాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు సాధకులు ఆత్మానందానుభూతితో విలసిల్లుదురు.


మణిద్వీపమునందు శ్రీపురము గలదు. ఆ శ్రీపురము అనేక ప్రాకారములు గలవు. ఆ ప్రాకారములలో అహంకారమయ ప్రాకారమునకును, చిత్తమయప్రాకారమునకును నడుమ విమర్శమయమగు దిగుడు బావిగలదు. ఆ బావికి అధినేత్రి *కురుకుళ్ళ* యను దేవి గలదు. ఆ కురుకుళ్ళాదేవి స్వరూపంతో అమ్మవారు తేజరిల్లుచున్నది గనుక, శ్రీమాత *కురుకుళ్ళా* యని అనబడినది. ఈ విషయము లలితా స్తవరత్నమునందు ఈ శ్లోకంలో వివరింపబడినది:


*కురువిందమణినిలయాం కులాచలస్ఫర్థికుచనమన్మధ్యామ్|*


*కుంకుమవిలప్తగాత్రీం కురుకుళ్ళాం మనసి కుర్మహే సతతమ్॥*


'పద్మరాగమణులచే నిర్మితమైన నౌకయందు ఉన్నది. కులపర్వతములను బోలిన కుచయుగళముతోను, సన్ననైన నడుముతోను, కుంకుమలేపన గావించబడిన దేహముతోను భాసిల్లు కురుకుళ్ళాదేవిని మనస్సున ఎల్లప్పుడూ ధ్యానింతును' అని లలితా స్తవరత్నమందు గలదు. అటువంటి కురుకుళ్ళా స్వరూపము గలిగిన పరమేశ్వరి *కురుకుళ్ళా* యని అనబడినది.


అమ్మవారిని చతుష్షష్టి కోటి యోగినీ గణదేవతలు సేవిస్తున్నారు. వారందరి స్వరూపంతో అమ్మవారు తేజరిల్లుచూ, ఆ చతుష్షష్టి కోటి యోగినీ గణముల స్వరూపము తనదై విరాజిల్లుచున్నది. శ్రీచక్రము నందు ప్రతీ ఆవరణమునందు గల యోగినీ గణముల నామములతో అమ్మవారు ఈ విధంగా స్తుతింపబడుచున్నది:-


*శ్రీ దేవీ సంబోధనము.*

ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఓం నమస్త్రిపురసుందరీ,


*న్యాసాంగదేవతలు*

హృదయదేవీ, శిరోదేవీ, శిఖాదేవీ, కవచదేవీ, నేత్రదేవీ, అస్త్రదేవీ,


*తిథినిత్యాదేవతలు*

కామేశ్వరీ, భగమాలినీ, నిత్యక్లిన్నే, భేరుండే, వహ్నివాసినీ, మహావజ్రేశ్వరీ, శివదూతీ, త్వరితే, కులసుందరీ, నిత్యే, నీలపతాకే, విజయే, సర్వమంగళే, జ్వాలామాలినీ, చిత్రే, మహానిత్యే,


*శ్రీచక్ర ప్రథమావరణదేవతలు*


అణిమాసిద్ధే, లఘిమాసిద్ధే, గరిమాసిద్ధే, మహిమాసిద్ధే, ఈశిత్వసిద్ధే, వశిత్వసిద్ధే, ప్రాకామ్యసిద్ధే, భుక్తిసిద్ధే, ఇచ్ఛాసిద్ధే, ప్రాప్తిసిద్ధే, సర్వకామసిద్ధే, బ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారి, వైష్ణవీ, వారాహీ, మాహేంద్రీ, చాముండే, మహాలక్ష్మీ, సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావిణీ, సర్వాకర్షిణీ, సర్వవశంకరీ, సర్వోన్మాదినీ, సర్వమహాంకుశే, సర్వఖేచరీ, సర్వబీజే, సర్వయోనే, సర్వత్రిఖండే, త్రైలోక్యమోహన చక్రస్వామినీ, ప్రకటయోగినీ,


*శ్రీచక్ర ద్వితీయావరణదేవతలు*


కామాకర్షిణీ, బుద్ధ్యాకర్షిణీ, అహంకారాకర్షిణీ, శబ్దాకర్షిణీ, స్పర్శాకర్షిణీ, రూపాకర్షిణీ, రసాకర్షిణీ, గంధాకర్షిణీ, చిత్తాకర్షిణీ, ధైర్యాకర్షిణీ, స్మృత్యాకర్షిణీ, నామాకర్షిణీ, బీజాకర్షిణీ, ఆత్మాకర్షిణీ, అమృతాకర్షిణీ, శరీరాకర్షిణీ, సర్వాశాపరిపూరక చక్రస్వామినీ, గుప్తయోగినీ,


*శ్రీచక్ర తృతీయావరణదేవతలు*


అనంగకుసుమే, అనంగమేఖలే, అనంగమదనే, అనంగమదనాతురే, అనంగరేఖే, అనంగవేగినీ, అనంగాంకుశే, అనంగమాలినీ, సర్వసంక్షోభణచక్రస్వామినీ, గుప్తతరయోగినీ,


*శ్రీచక్ర చతుర్థావరణదేవతలు*


సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావినీ, సర్వాకర్షిణీ, సర్వహ్లాదినీ, సర్వసమ్మోహినీ, సర్వస్తంభినీ, సర్వజృంభిణీ, సర్వవశంకరీ, సర్వరంజనీ, సర్వోన్మాదినీ, సర్వార్థసాధికే, సర్వసంపత్తిపూరిణీ, సర్వమంత్రమయీ, సర్వద్వంద్వక్షయంకరీ, సర్వసౌభాగ్యదాయక చక్రస్వామినీ, సంప్రదాయయోగినీ,


*శ్రీచక్ర పంచమావరణదేవతలు*


సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ప్రదే, సర్వప్రియంకరీ, సర్వమంగళకారిణీ, సర్వకామప్రదే, సర్వదుఃఖవిమోచనీ, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్ననివారిణీ, సర్వాంగసుందరీ, సర్వసౌభాగ్యదాయినీ, సర్వార్థసాధక చక్రస్వామినీ, కులోత్తీర్ణయోగినీ,


*శ్రీచక్ర షష్టావరణదేవతలు*


సర్వజ్ఞే, సర్వశక్తే, సర్వైశ్వర్యప్రదాయినీ, సర్వజ్ఞానమయీ, సర్వవ్యాధివినాశినీ, సర్వాధారస్వరూపే, సర్వపాపహరే, సర్వానందమయీ, సర్వరక్షాస్వరూపిణీ, సర్వేప్సితఫలప్రదే, సర్వరక్షాకరచక్రస్వామినీ, నిగర్భయోగినీ,


*శ్రీచక్ర సప్తమావరణదేవతలు*


వశినీ, కామేశ్వరీ, మోదినీ, విమలే, అరుణే, జయినీ, సర్వేశ్వరీ, కౌళిని, సర్వరోగహరచక్రస్వామినీ, రహస్యయోగినీ,


*శ్రీచక్ర అష్టమావరణదేవతలు*


బాణినీ, చాపినీ, పాశినీ, అంకుశినీ, మహాకామేశ్వరీ, మహావజ్రేశ్వరీ, మహాభగమాలినీ, సర్వసిద్ధిప్రదచక్రస్వామినీ, అతిరహస్యయోగినీ,


*శ్రీచక్ర నవమావరణదేవతలు*


శ్రీ శ్రీ మహాభట్టారికే, సర్వానందమయచక్రస్వామినీ, పరాపరరహస్యయోగినీ,


నవచక్రేశ్వరీ నామాని

త్రిపురే, త్రిపురేశీ, త్రిపురసుందరీ, త్రిపురవాసినీ, త్రిపురాశ్రీః, త్రిపురమాలినీ, త్రిపురసిద్ధే, త్రిపురాంబా, మహాత్రిపురసుందరీ, మహామహేశ్వరీ, మహామహారాజ్ఞీ, మహామహాశక్తే, మహామహాగుప్తే, మహామహాజ్ఞప్తే, మహామహానందే, మహామహాస్కంధే, మహామహాశయే, మహామహా శ్రీచక్రనగరసామ్రాజ్ఞీ, నమస్తే నమస్తే నమస్తే నమః' అని అంతమంది దేవతలు, ఆయా దేవతల ఉపదేవతలు ఇలా మొత్తం చతుష్షష్టికోటి యోగినీ గణదేవతల రూపంలో అమ్మవారు అలరారుతున్నది. 


అదేవిధంగా ఇంకను చెప్పవలెనంటే మూలాధారం నుండి సహస్రారం వరకూ గల సుషుమ్నా మార్గంలో కురుకుళ్ళా దేవత యను పేరుతో ఒక ముఖ్యమైన నాడి గలదు. ఈ కురుకుళ్ళా యను దేవతను *శ్యామ* అని కూడా అంటారు. అటువంటి *కురుకుళ్ళా* స్వరూపిణియైన పరమేశ్వరి *కురుకుళ్ళా* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు 

*ఓం కురుకుళ్ళాయై నమః* అని యనవలెను

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: