6, అక్టోబర్ 2021, బుధవారం

 తెలుగుభాషలో మొదటి పి.హెచ్ డి పొందినదెవరు ?

________________________


(1) తెలుగుభాషలో మొదటి PhD పొందిన మహవ్యక్తి ఎవరు ?


(2) వసుచరిత్రను వ్రాసిన భట్టుమూర్తి, నరస భూపాలీయం వ్రాసిన రామరాజభూషనుడు వేరువేరుకాదు ఒక్కడేనని నిరూపించిన కవి విమర్శకుడెవరు ?


(3) హైదరాబాదు, తెలంగాణాలలో తెలుగు భాషాభివృద్ధికిగాను 1901లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం స్థాపకుడెవరు ?


(4) ఆముక్తమాల్యద గ్రంథాన్ని పెద్దనామాత్యుడే శ్రీకృష్ణదేవరాయల పేరున వ్రాసాడన్న అపప్రధను పోగొట్టినదెవరు ? దత్త మండలాలకు రాయలసీమనే పేరును ప్రతిపాదించింది కూడా ఇతనే.


(5)  తెలుగులో మొదటి నవల రాజశేఖరచరిత్రం, గ్రంథకర్త వీరేశలింగంపంతులుగారు, కాని రాజశేఖరచరిత్రం కాదు, శ్రీరంగరాజు చరిత్రే మొదటి నవలని ఆరుద్రగారు చెప్పారు. శ్రీరంగరాజుచరిత్ర నవలా రచయిత ఎవరు ?


॥సేకరణ॥

_________________________________

జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

కామెంట్‌లు లేవు: