🛕🦚 *knvr* 🦚🛕
************************
*శుభోదయం*
*బుధవారం*
************************
🔥 ఒకానొక గ్రామం లో ఒక మతిమరుపు మనిషి ఉండేవాడు . అతనికి సంస్కృతం చదువుకోవాలని ఎంతో కోరికగా ఉండేది . కానీ ఏమి చదువుకున్నా వెంటనే మర్చిపోయేవాడు . ఇలా ఎన్నో రోజులు కష్టపడ్డ తరువాత అతనికి ఒక ఉపాయం తట్టింది . అతను రెండు సారకాయ బుర్రలను తీసుకున్నాడు . ఒక దాంట్లో నిండుగా నువ్వులను నింపుకున్నాడు . ఒక్కో సంస్కృత పదం నేర్చుకుని ఆ పదానికి గుర్తుగా పక్కనున్న ఖాళీ సొరకాయ బుర్రలో ఒక్కో నువ్వు గింజ వేయడం మొదలు పెట్టాడు . కొద్దిరోజులలో ఆ ఖాళీ సొరకాయ బుర్ర నువ్వులతో నిండిపోయింది . ఒక్కో నువ్వుగింజకు గుర్తుగా అతను నేర్చుకున్న ఒక్కో పదం అతనికి గుర్తురాసాగింది . అతను పట్టుదలగా ఎన్నోపదాలను నేర్చుకున్నాడు . ఇదే పద్ధతిలో ఎన్నో విషయాలను నేర్చుకున్నాడు . మతిమరుపు మనిషి అని వెక్కిరించినవారే అతని విద్యకు ఆశ్చర్యపోయారు . మహా మహా పండితులు కూడా అతనిముందు ఓడిపోయారు . అతని వద్ద చదువుకోడానికి ఎంతోమంది వచ్చి చేరారు . పండిత చర్చలలో అతనిదే పైచేయిగా ఉండేది . అతనిని అందరూ నువ్వుగింజ పండితుడు అనేవారు . అతని కష్టం వృదా పోలేదు లేదు . ఈ కథ మనకు నేర్పే నీతి కేవలం తెలివైనవారే చదువులో ముందుంటారన్న అపోహను అతను తుడిచిపెట్టేశాడు . ఏదైనా నేర్చుకోడానికి వయసుతోనూ , తెలివి తేటలతోనూ సంబంధం లేదని అతను నిరూపించాడు .
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి