6, అక్టోబర్ 2021, బుధవారం

శ్రీమద్భాగవతము

 *06.10.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2283(౨౨౮౩)*


*10.1-1411-వ.*

*10.1-1412-*


*శా. వేదశ్రేణియు నంగకంబులు ధనుర్వేదంబుఁ దంత్రంబు మ*

*న్వాదివ్యాహృత ధర్మశాస్త్రములు నుద్యన్న్యాయముం దర్కవి*

*ద్యాదక్షత్వము రాజనీతియును శబ్దప్రక్రియం జెప్పె నా*

*భూదేవాగ్రణి రామకృష్ణులకు సంభూతప్రమోదంబునన్.* 🌺



*_భావము: బలరామ కృష్ణులు గొప్ప వైభవములకు ఉనికిపట్టైన కాశీ పట్టణము చేరారు. అక్కడ గంగా తీరమున అవంతీ పుర నివాసి, సకల విద్యా పారంగతుడగు సాందీపుడు అనే పండితోత్తముని దర్శనము చేసికొని పవిత్రభావనతో, భక్తి శ్రద్ధలతో గురు శుశ్రూష చేశారు._*   

*_వీరి ప్రవర్తనకు సంతుష్టులైనగురువుగారు చతుర్వేదములను, వేదాంగములను (శిక్ష, వ్యాకరణము, చంధస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము), ధనుర్వేదమును (విలువిద్య), తంత్రశాస్త్రము, మను ధర్మ శాస్త్రము, ఇతర నీతిశాస్త్రములు, తర్కశాస్త్ర పాండిత్యాన్ని, రాజనీతిశాస్త్రమును, శబ్దలక్షణ శాస్త్రమును సమగ్రముగా బోధించారు._* 🙏



*_Meaning: Balarama and Sri Krishna reached Kasi town, which was well known for its greatness, glory and piety. There they approached Sage Sandeepa, vaidic scholar, prostrated before him and were serving him with diligence, devotion and reverence. Pleased with their assiduous service, he comprehensively taught them Four Vedas, Vedangas, Dhanurveda, Tantra Sastra, Manu dharama sastra and other Sastras like Neethi, Tarka, Rajaneethi and SabdaLakshana._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

కామెంట్‌లు లేవు: