6, మార్చి 2022, ఆదివారం

పుణ్యం విలువ

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

           * || ఓం నమః శివాయ ||*            

                * పుణ్యం విలువ …*

﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌

*దానం వల్ల కలిగిన…పుణ్యం విలువ తెలుసా?*


*కాశీకి చేరుకున్నారు ఒక జంట.   కొన్నేళ్ల తరువాత వారికి ఒకమ్మాయి పుట్టింది.*


*చిన్నప్పుటి నుండి శివారాధనలో మునిగింది అమ్మాయి.*


*భక్తిలో ఆ ఈశుడినే ఆకట్టుకుంది అని చెప్పొచ్చు*


*ఆమె కాశీకి దైవదర్శనానికి వచ్చిన వారికి అన్నదానం చేస్తూ ఉండేది.*


*అమ్మ అనారోగ్యంతో చనిపోయింది, తండ్రి తోడుగా ఉన్నాడు.*


*ఆయన అమ్మాయికి పెళ్లి చేయాలని ప్రయత్నించగా ఆమె ‘వివాహం చేసుకోను,ఇలాగే దైవారాధనలో కాలం గడిపేస్తాను!’ అని చెప్పింది.*


*ఆమె కాశీలో ఒక నీటి తొట్టెను కట్టించింది. దాహంతో ఉన్న ప్రతి ఒక్కరు అక్కడకు వచ్చి దాహం తీర్చుకుంటారని!* 

*ఆమె అడిగినవారికి దానం చేయడం తెలుసుకున్న అందరూ ఆమెను వచ్చి అడుగుతుంటే… కాదనలేక అందరికి ఇస్తూ అప్పులుపాలైపోయింది.*


*అప్పటి వరకు ఆమెను పొగిడిన అందరు ఆమెను నిష్టూరంగా మాట్లాడ్డం మొదలుపెట్టారు.* *”మా డబ్బులు మాకు ఇవ్వండి!” అంటూ గొడవ పెట్టారు.*


*ఆమెకు ఏం చేయాలో అర్థం కానివేళ ఒక డబ్బున్న వ్యక్తి దగ్గర తన అప్పులు తీర్చమని అడిగింది. అప్పు మొత్తం ఐదు లక్షలు అని చెప్పింది.*


*అతడు “తాకట్టుగా నీ దగ్గర ఏముంది!” అని అడిగాడ.*


*అందుకు ఆమె “నాదగ్గర ఏమి లేదు నేను చేసిన దానాలతో సంపాదించిన పుణ్యం తప్ప!” అన్నది.*


*”నీ పుణ్యం నాకు ఎలా వస్తుంది?” అంటే…* 

*“ఇదిగో ఇక్కడ నేను కట్టించిన నీటి తొట్టే ఉంది, అక్కడకి వచ్చి దాహం తీర్చుకుంటే నాకు పుణ్యం వచ్చి చేరింది ఇప్పుడు ఆ నీటి తొట్టెను మీకు ఇస్తున్నాను. నా పుణ్యం తీరేవరకు అక్కడ వచ్చే పుణ్యం మీదే!” అంది.* 


*”నాకెలా తెలుస్తుంది- నాకెంత పుణ్యం వచ్చిందో?” అని అంటే…*

*ఆమె ఒక లింగ రూపం అయిన రాయిని తీసి “అయ్యా ఇదిగో ఈ లింగాన్ని ఆ నదిలో వేస్తున్నాను, అది మునిగి నదిలో ఉంటుంది. ఎప్పుడైతే నేను చేసిన అప్పు తీరిపోతుందో అప్పుడు ఆ లింగం పైకి తేలుతుంది!” అని చెప్పింది.*


*రాయి మునిగిపోతుంది, కాని ఎప్పటికీ తేలదు అని అనుకుని అతడు ఆమెకు ఐదులక్షలు అప్పు తీర్చాడు.*


*ఆ తరువాత ఆ వ్యక్తి ఆ తొట్టే దగ్గర ఒక వ్యక్తిని నియమించాడు. ఎంతమంది అక్కడకు వచ్చి నీళ్లు తాగుతున్నారని లెక్కకట్టమన్నాడు.*


*ఆరోజు రాత్రి గడిచింది.*

*ఉదయాన్నే ప్రకాశవంతంగా సూర్యుడు ఉదయిస్తున్నాడు.*

*అతడి నివాసం నుండి అతను నదిలోకి చూస్తూ ఉన్నాడు.*

*’అనవసరంగా అంత డబ్బు గుడ్డిగా నమ్మి ఇచ్చాను., మోసపోయానేమో?’ అని అనుకుంటుండగా… ఒక ఆవు అటుగా వచ్చి ఆ తొట్టెలోని నీరు తాగింది. అంతే! నదిలో ఆమె విసిరిన లింగం పైకి తేలింది.*


*ఆశ్చర్యపోయాడు ఆ వ్యక్తి!  ‘ఏంటి ఐదులక్షలు విలువ చేస్తుందా పుణ్యం ఈ    ఒక్క ఆవు తాగిన ఈ చుక్క నీరు  అంటే ఆ తల్లి చేసిన పుణ్యం     నా కోట్లు కుమ్మరించినా సరితూగదు కదా!’ అని ఆమెను వెతుక్కుంటూ పరుగు పెట్టాడు.*


*ఆ రోజు నుండి అతను కూడా అందరికీ సాయం చేయడం మొదలుపెట్టాడు.  ఆ ఈశుడిని భక్తిగా కొలవడం మొదలుపెట్టాడు.*


*మనం మంచితనంతో సంపాదించుకున్న పుణ్యం  చాలా విలువైనది వెల కట్టలేనిది. చెడు ఒక్క క్షణం కూడా తలవకు రమంచిని నిమిషమైన మరిచిపోకు!*

﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌

               *ధర్మో రక్షతి రక్షితః*

    || ఓం మధుసూదనాయ నమః ||

సేకరణ:- వాట్సాప్.

కామెంట్‌లు లేవు: