శ్లోకం:☝️
*నహి స్నానశతేనాపి*
*రజ్జుసర్పభ్రమో నృణాం l*
*భయకంపప్రదో యాతి*
*వినా వస్త్వవమర్శనం ll*
- మహావాక్య దర్పణం - 26
భావం: త్రాటిని జూచి సర్పమని భ్రమించిన వ్యక్తి తనకు తాను విచారించుకుని "అది సర్పము కాదు త్రాడే" అని తెలుసుకుంటేనే ఆ భయం పోతుంది గాని, వందసార్లు స్నానం చేసినా వేరే ఇంకే కర్మ ఆచరించినా ఆ భయం పోదు కదా! అలాగే కర్మల వల్ల జ్ఞానం కలుగదని. ఎవరికి వారు విచారించుకుని ఏక రూపుడగు బ్రహ్మము నెరిగినచో అజ్ఞానం నశించును గాని కర్మల వల్ల తొలగదని భావం. 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి