వనిత... నీవే భవిత!.
ఆడదంటే అబల కాదు 'సబల'.
సృష్టికి పురుడు పోసేది భూమాత.
మనిషికి జన్మనిచ్చేది
స్త్రీమాత.
నవమాసాలు మోసి
మానవ చరిత్రకే ఆద్యం పోసి తానో అమ్మగా..
కష్ట నష్టాలను భరిస్తూ
తనకే సొంతమైన ప్రేమరూపం
'అమ్మ'..
మానవుని ఎదుగుదలకి
తన రొమ్ము ముర్రుపాలు పట్టి బలమిచ్చేది తల్లి..
అటువంటి అమ్మ గడపచాటు కారాదు బొమ్మ..
లోకమనే పొత్తిళ్ళలో ఓనమాలు నేర్పే తొలి గురువు అమ్మ..
బుడి బుడి నడకల నుండి జీవన పయనంలో నడత నేర్పే ఆది గురువు అమ్మ..
కుటుంబం అనే బాధ్యతతో సంసారాన్ని మరో బుజాన మోసే ఆడది అమ్మ...
పురుష ప్రపంచంను ఎదురొడ్డి పోటి ప్రపంచంలో అడుగు వేసే కార్యశీలి.. అమ్మ!.
నింగి నుండి నేల వరకు
హద్దు లేదు వనితా ప్రపంచానికి... అంతా అమ్మకు ప్రతి రూపం జనని.
ఏమని చెప్పను అమ్మ గురించి...
వారు కన్న కలలు గురించి...
అంపశయ్య మీద భీష్ముడు సైతం అమ్మ ప్రేమ కోసమే పరితపించినే...
ఆదిశక్తి రూపం, ఆత్మీయతకు ప్రతిరూపం
అనంత ప్రేమకు నిలువైన రూపం అమ్మ..
ఆడదంటే అలుసు కాదు
ఆడదంటే చులకన కాదు
ఆడది అంటే ఆత్మస్థైర్యం
ఆడది అంటే ఆత్మగౌరవం.
అమ్మ అంటే మాతృదేవత
వనిత అంటే భవిత
బాలిక అంటే వెలుగు
స్త్రీ రూపమే జగన్మాత.
అమ్మలందరికి వందనం.
అశోక్ చక్రవర్తి. నీలకంఠం.
9381456575.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి