నడిచే కాలాన్ని ఆపటం ఎవరికీ సాధ్యం కాదన్నది సత్య దార్శనికం ! కాలంతో పరుగెట్టే విశ్వ గమనంలో మార్పులు, చేర్పులు ఎన్నో మరెన్నో ! విశ్వ సృష్టి రహస్యం, ఈ నిరంతర ప్రక్రియలో విశ్వ మానవాళి పాత్ర మహోన్నతమన్న సత్యం ! చరాచర జీవజగతి ప్రశాంత మనుగడలో మానవాళి పోషించే పాత్ర వర్ణనాతీతం ! ప్రకృతి, అనాదిగా పవిత్ర భావనాత్మక చింతనతో, సుస్నేహ భావనతో, సహజసిద్ధమైన అనేకానేక వనరులెన్నో ఈ పుడమిపై నిరంతరంగా అందిస్తూ, విశ్వ జీవజగతికి నెచ్చెలిగా ఆత్మీయతతో అలరారుతున్న నేపథ్యం ! ప్రకృతి ఒడిలో సేద తీరే జీవజగతికి సురక్షాత్మక రక్షా కవచం, మానవాళి యొక్క నిత్య సదాలోచనాత్మక వ్యూహం ! ప్రకృతి పరిరక్షణే ధ్యేయంగా, సృష్టి కర్త మానవాళిని తీర్చి దిద్దిన విషయం ఈ దశలో ప్రధానాంశం ! అనునిత్యం ప్రాతఃకాల సమయాన నిద్ర లేచెడి సకల జీవుల సుసంక్షేమాన్ని, విశ్వ మానవాళి వారి కనీస బాధ్యతగా గుర్తించాల్సిన విషయం ! పరిసరాల పరిశుభ్రత ముఖ్యాంశంగా ప్రతి వ్యక్తీ తన నిత్య జీవన విధానాన్ని ఎంచుకుని ముందుకు సాగాలన్నదే ఇక్కడ ముఖ్యం ! విశ్వంలో జీవనాన్ని సాగించే చరాచర జీవుల పట్ల జీవకారుణ్యతా భావం, విశ్వ మానవాళి మదిన స్థిరీకృతం కావాలి ! " సర్వే భవంతు సుఖినః ! సర్వే సంతు నిరామయాః ! సర్వే భద్రాణి పశ్యంతు ! మా కశ్చిత్ దుఃఖభాగ్భవేత్ ! " ఓం శాంతి శాంతి శాంతిః ! ✍️గుళ్లపల్లి ఆంజనేయులు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి