6, మార్చి 2022, ఆదివారం

పండితసత్కవుల్ ప్రభవంబునందు

 భీమవరం

-------------

శ్రీమాన్ ఎస్.టి.వి.రాజగోపాలాచార్యులుగారు

---------------------------------------------------------

పండితసత్కవుల్ ప్రభవంబునందు శ్రీ

         తిరుమలవంశాన ధరజనించి ,

మాటల వెన్నెల మనసున వెన్నెల

          వెన్నెల పద్యాల వ్రేలజేసి ,

అధ్యాత్మభావ సద్ధ్యానాత్మ తృష్ణతో

           నహరహంబును జ్ఞానయజ్ఞమంది ,

అన్నకోశమురామ(నామ)సుధాదికావ్యమ్ములన్

            రచన ముద్రణల భారంబుదాల్చి ,


శ్రీనివాసభారతిపేర సేవజేయు

రాజగోపాలు రాచార్యతేజసులయి

సౌహృదిని భీమవరమున సాహితీ స--

మర్చనముసల్పెడున్ కోవిదార్చకులెగ.


సూత్రముల వ్యాకరణమున

స్తోత్రంబగు తత్త్వశాస్త్రశోభను శోధన్

పాత్రంబన బుధు లంత--

ర్నేత్రమ్మున సల్పినారు నిరుపమకృషినే .


(అన్నవిజ్ఞానము ,విశ్వనాథశబరి ,నేనెవరిని , అనుభవదీపం ,వ్యాకరణతత్త్వదర్శనం"మొదలగునవి వీరిరచనలు.) 


రాయప్రోలు సీతారామశర్మ ,భీమవరం.

కామెంట్‌లు లేవు: