16, అక్టోబర్ 2022, ఆదివారం

వృద్ధాప్యము శాపము కారాదు

 వృద్ధాప్యము శాపము కారాదు ఎవరికైనను. 

ఒక్కరు సంపాదిస్తే పది మంది కూర్చొని తినే రోజులు

గతించాయి. ఇద్దరు సంపాదిస్తే నలుగురు బ్రతికే

రోజులు వచ్చినవి. ప్రేమాప్యతలు మెండుగా గల 

రోజులవి. 

నేడు భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తేనే గడవని

రోజులొచ్చినవి, అన్ని సంబంధములు ఆర్ధిక సంబంధములైనవి.ధరల ప్రభావము, పెరిగిన స్వార్ధము, పెరిగిన కుల ద్వేషాలు, చిన్న కుటుంబ

వ్యవస్థలే కారణము. సొంతమగువారే పట్చిచుకోరు. 

  సంపాదనకు భార్యాభర్తలు, విద్యాభ్యాసమునకు

పిల్లలు పోయి సాయంత్రము గాని ఇంటికి రాలేని 

పరిస్థితి వుంది. 

ఇంటిలో గల వృద్ధులను చూసుకొనే వారు తక్కువ. 

కేర్ టేకర్ లు గూడ మంచివారు దొరికితే వారి

అదృష్టము. ఇది చాలా ఖర్చు తో కూడిన వ్యవహారము. ఐదు శాతం కూడా వుండక పోవచ్చు 

భరించు వారు. 

రానున్న కాలము వృద్ధులన శాతం పెరుగు నని

గణాంక ములు సూచిస్తున్నాయి. కావున ప్రభుత్వ 

పాఠశాలలవలె ప్రభుత్వ వృద్ధాశ్రమాలను నెలకొల్ప

వలసిన అవసరం తప్పక వుంది. 

ప్రజా సంఘాలు గాని, కుల సంఘాలు గాని, 

ప్రభుత్వ దృష్టికి తీసుకు రావలసిన అవసరముంది. లేకున్న వృద్ధుల పరిస్తితి అగమ్యగోచరమే. 

అందరమూ ఆలోచించి తీరవలసిందే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములు ప్రణాళిక లు తయారు చేయాలని. 

ఇది నా అభిప్రాయము. కృతజ్ఞతలు🙏💕.

కామెంట్‌లు లేవు: