16, అక్టోబర్ 2022, ఆదివారం

భగవద్గీత శ్లోకం

 🙏 ప్రతిరోజూఒక్క భగవద్గీత శ్లోకం పారాయణం చేద్దాము, చేయిద్దాము 🙏

  🌿భగవద్గీత 1వఅధ్యాయం, అర్జున విషాద యోగం,🌿

               -------------------------------------------------

🌻40-వ,శ్లోకం- కులక్షయే ప్రణశ్యంతి కుల ధర్మా సనాతనః |            ధర్మేనష్టే కులం కృత్స్నం అధర్మోభి భవత్యుత॥🌻

అర్థం- కులక్షయము వలన సనాతనమైన కులధర్మములన్నీ నశిస్తాయి.ధర్మము అంతరించిపోయినప్పుడు కులమందు పాపమే వ్యాపిస్తుంది. 

-----------------------------------------------------------------

 వ్యాఖ్య- సనాతన ధర్మం వేదముల నుండి వచ్చింది. ఋషులు మానవలు సుఖశాంతులతో మనుగడ సాగించటం కొరకు ధర్మశాస్త్రాలను అందించారు. అవి పరంపర సంప్రదాయములై  భావితరముల వారికి మార్గదర్శకముగా వస్తున్నాయి. వీటిని అనాదిగా  అందరూ శ్రద్ధగా ఆచరిస్తూ,రక్షిస్తూ, మనకందించారు. వీటినే కులధర్మములు, సాంప్రదాయములు అంటారు. యుద్ధములో పురుషులు ఇంటి పెద్దలు  మరణిస్తే ధర్మములు సాంప్రదాయములు అంతరించే అవకాశం ఉంది. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు విచ్చలవిడితనంగా  వ్యవహరించే అవకాశం ఉంది. వేద శాస్త్రములను ఉల్లంఘించే అవకాశం ధారాళంగా జరుగుతుంది. సమాజ వ్యవస్థ మొత్తం అస్త వ్యస్తమవుతుంది. వర్ణసంకరం ఏర్పడుతుంది. ఈ దుష్పరిణామాలను తలుచుకొని అర్జునుడు బాధపడుతున్నాడు. మనకు ఈ శ్లోకం ద్వారా కులక్షయం, (వర్ణసంకరం) ఏర్పడకూడదు తద్వారా అనేక దుష్పరిణామాలు ఏర్పడతాయి అని భగవద్గీత తెలుపుతోంది.

------------------------------------------------------------------------------

🙏షేర్ చేసి కొన్ని కోట్లమంది ప్రజలు ప్రతిరోజు  ఒక్క భగవద్గీత శ్లోకం పారాయణం చేసే అదృష్టాన్ని కల్పిద్దాము. శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని,ఈ భగవద్గీత పారాయణ మహాయజ్ఞ ఫలితాన్ని అందరం పొందుదాము. గీతామృతాన్ని అందరం త్రాగుదాము, 🙏

కామెంట్‌లు లేవు: