16, అక్టోబర్ 2022, ఆదివారం

మహోన్నతుల అవిరళ కృషి,

 మహోన్నతుల అవిరళ కృషి, నిత్య ప్రశాంత విశ్వ జీవన గమనంలో దివ్య ప్రకాశిక ! ప్రకృతి ఒసగెడి మహోన్నత ఆలంబన, విశ్వ జీవ నిత్య మనుగడకు సుచైతన్య స్ఫూర్తి ! సకల విశ్వ జీవజాలపు సంరక్షణకై, సృష్టి కర్త విశ్వ మానవాళికి ఒసగిన జీవకారుణ్యతా భావన ! " బ్రతుకు, బ్రతకనివ్వు ", అనే అద్భుత జీవన విధానంలో సుహృద్భావ స్ఫూర్తి ఒక దివ్య దృక్పథం ! పట్టుదల, ధృఢ సంకల్పం నిరంతరం తోడుగా నుండ మహత్తర లక్ష్య సాధనలో భగవత్కృపా కటాక్షం సుసాధ్యమన్నది సత్య వాక్కు ! ఈర్ష్యా ద్వేష రహితులై, విశ్వ మానవాళి వారి నిత్య జీవన ప్రణాళిక ఏర్పర్చుకోవడంలోనే సత్ఫలిత సాధన తథ్యమన్నది ముఖ్యాంశం ! సకల చరాచర జీవ జగత్తు, నిత్య ప్రశాంత సంక్షేమ జీవన గమనంలో విశ్వ మానవాళి పాత్ర మహోన్నతం ! ప్రకృతి పరిరక్షణలో నిత్య సుచైతన్య సన్మైత్రీ భావన, విశ్వ మానవాళికి సృష్టి కర్త ఒసగిన దివ్య వరం ! భారతీయ దివ్య వేద ధార్మిక  సంస్కృతి, అనాదిగా విశ్వ జీవజాలపు సంరక్షణకై వెన్నుదన్నై నిలవడం మహత్తర విషయం !                          " సర్వే భవంతు సుఖినః ! సర్వే సంతు నిరామయాః ! సర్వే భద్రాణి పశ్యంతు ! మా కశ్చిత్ దుఃఖభాగ్భవేత్ ! "                                 " సహనావవతు ! సహనౌ భునక్తు ! సహవీర్యం కరవావహై ! తేజశ్వినావధీతమస్తు ! మా విద్విషావహై !                                            " ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః "                                                 🤝🌹💐🌹🤝                                          రచన :                                       గుళ్లపల్లి ఆంజనేయులు

కామెంట్‌లు లేవు: