16, అక్టోబర్ 2022, ఆదివారం

త్యాగేనైకేన అమృతత్వమానశుః

 శ్లోకం:☝️

*మానం హిత్వా ప్రియో భవతి*

 *క్రోధం హిత్వా న శోచతి l*

*కామం హిత్వాఽర్థవాన్భవతి*

 *లోభం హిత్వా సుఖీ భవేత్ ll*


మనుజు డహము విడువ మాన్యూడౌ జనులందు 

క్రోధ వర్జనమున బాధ లుడుగు

కోర్కె వీడె నేని కూర్మి సంపన్నుడౌ 

వదల లోభ గుణము వరలు సుఖము


గోపాలుని మధుసూదనరావు


భావం: మనిషి అహంకారాన్ని త్యాగం చేయడం ద్వారా ప్రజలకు ప్రియమైనవాడు అవుతాడు, కోపాన్ని త్యజించి శోకించడు, కామాన్ని విడిచిపెట్టి ధనవంతుడు అవుతాడు మరియు లోభాన్ని  విడిచిపెట్టి సంతోషంగా ఉంటాడు. చివరికి త్యాగం ద్వారా అమృతత్వం (మోక్షం) లభిస్తుంది.

*త్యాగేనైకేన అమృతత్వమానశుః*

కామెంట్‌లు లేవు: