🙏 ప్రతిరోజూఒక్క భగవద్గీత శ్లోకం పారాయణం చేద్దాము, చేయిద్దాము 🙏
🌿భగవద్గీత 1వఅధ్యాయం, అర్జున విషాద యోగం,🌿
-------------------------------------------------
🌻44-వ,శ్లోకం- ఉత్సన్నకుల ధర్మాణాం, మనుష్యాణాం జనార్దన |
నరకేనియతం వాసో, భవతీత్యను శుశ్రుమ॥🌻
అర్థం- అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు! ఓ జనార్దన కుల ధర్మములు నశించిన వారికి శాశ్వతంగా నరకం ప్రాప్తిస్తుందని విన్నాను .
-----------------------------------------------------------------
అద్భుత వ్యాఖ్యానం - 84 లక్షల జీవరాసులలో పుట్టిన తరువాత ఈ మనుష్య జన్మ వస్తోంది అని వేదాలు, శాస్త్రాలు, పురాణాలు చెబుతున్నాయి . అంతటి దుర్లభమైనటువంటి మనుష్య జన్మను పొందిన వారందరూ పాప కర్మలను చేయకుండా పుణ్యకర్మలను ఆచరిస్తూ జన్మను సార్ధకం చేసుకోవాలి. కుల ధర్మాలు పాటించడంలో ఏమరపాటు లేకుండా జాగ్రత్త వహించాలి. కుల ధర్మాలు పాటించని వారికి శాశ్వతంగా నరకప్రాప్తి వస్తుంది. శాశ్వతంగా నరక ప్రాప్తి అంటే ఎంతటి బాధాకరమైన విషయం.
------------------------------------------------------------------------------
🙏షేర్ చేసి కొన్ని కోట్లమంది ప్రజలు ప్రతిరోజు ఒక్క భగవద్గీత శ్లోకం పారాయణను అర్థంతో సహా చేసే అదృష్టాన్ని కల్పిద్దాము. శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని,ఈ భగవద్గీత పారాయణ మహాయజ్ఞ ఫలితాన్ని అందరం పొంది ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సుఖంగా జీవిద్దాము. గీతామృతాన్ని అందరం త్రాగి ఆనందిద్దాము, 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి