శ్లోకం:☝️
*విచిత్రే ఖలు సంసారే*
*నాస్తి కిఞ్చిన్నిరర్థకమ్ l*
*అశ్వశ్చేత్ ధావనే వీరో*
*భారస్య వాహనే ఖరః ॥*
భావం: ఈ ప్రపంచంలో పనికిరానిది అంటూ ఏదీ లేదు. గుఱ్ఱం అయితే యుద్ధంలో వీరులు ఉపయోగించవచ్చు, గాడిద అయితే బరువులు మోయించవచ్చు!
చిత్రమరయగ మానవ జీవనమున
పనికిరానిది లేదిల కనగ మనము
వీరులను దాల్చు యుద్దాన వారువమ్ము
గరిమ బరువుల మోయును గార్ధభమ్ము
గోపాలుని మధుసూదనరావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి