శ్లో: వర మేకో గుణీ పుత్రః
న చ మూర్ఖ శతాన్యపి
ఏకః చంద్ర స్తమో హన్తి
న చ తారా గణో౽పి చ
ఉ. ఒక్కడు చాలు నాత్మసుతు డొప్పెడు సద్గుణవంతు డుర్విలో ,
లెక్కకు వంద మూర్ఖ సుతు లేర్పడియుండిన నేమి లాభమౌ,
చక్కని వెన్నెలిచ్చు నొక చంద్రుడు చాలు తమస్సు బాపగన్
రిక్క లనంత ముండినను రేయి తమంబును బార ద్రోలునే !
గోపాలుని మధుసూదనరావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి