37వ దినము:
Know about a telugu word Daily.
మన మాతృ భాష పరిరక్షింప బడవలెననిన ముందు అందరకు ఆ భాష మీద అవగాహన, పదకోశము అత్యంతావశ్యకము. అందు నిమిత్తము నా వంతు కృషిలో భాగముగా ప్రజోపయోగము గల ఒక పదమునకు గల పర్యాయ పదములను అందించ సంకల్పించినాను. ఈ నా కృషికి అందరు సహకరించి తమ తమ సమూహములలో ఉంచి విశేష ప్రచారణకు తమవంతు సహాయమును అందింతురని ఆశించు చున్నాను.
37వ దినము (13-01-2023):
కొండ: అగమము, అగము, అచలము, అద్రి, అవనీధరము, అవి, అహర్యము, ఉర్వీధరము, కందకారకము, కటకి, కరువ, కుట్టీరవము, కుత్కీలము, కుధరము, కులి, క్షితిధరము, గట్టు, గిరి, గుట్ట, గోత్రము, చట్టు, జీమూతము, తాలిశము, తిప్ప, తుంగము, దంతి, దుర్గమము, ధరము, ధరాధరము, ధాత్రీధరము, నిర్ఝరి, పరిఖ, పర్వతము, భూధరము, మల, మహీధరము, శిఖరి, శృంగి, శైలము, సుదానము, స్తంబము, స్రావరము.
ఆంగ్లము: Hill
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి