14, జనవరి 2023, శనివారం

కంచి కామకోటి

 కంచి కామకోటి... రాంచి రామకోటి..

పరమాచార్య వారు కాశి యాత్ర సందర్భంగా టాటా నగర్ (ఇప్పుడు ఝార్ఖండ్ లో ) లో జరిగిన ధనుర్మాస సభలలో పాల్గొన్నారు. బీహార్ లోని పత్రికలు స్వామి వారు పాల్గొన్న కార్యక్రమం వివరాలు ప్రజలకు అందించే క్రమం లో "కంచి కామకోటి స్వామి " వారు అనే బదులు "రాంచి రామకోటి స్వామి "వారు అని వ్రాసాయి. ఈ విషయం స్వామి వారి ద్రుష్టి కి తీసుకొని వెళ్ళినప్పుడు స్వామి చమత్కారం గా ఇలా వివరించారు.

" ఆంగ్ల భాషలో  (k)  "క "కారానికి "ర"(R) కారానికి దగ్గరి పోలిక ఉంది.


ఆ పదాల అర్ధం తెలియక అలా వ్రాసి ఉంటారు. నిజానికి రాముని (విష్ణువు )కుమారుడే కాముడు (మన్మధుడు )కానీ రాముడున్న చోట కాముడుండడు . తులసి దాస్ తన రామచరిత మానస్ లో "జహ రామ హో  వహ కామ్ నహి "అన్నారు.కానీ రామకోటి ఉన్న చోట కామకోటి ఉండడానికి అభ్యంతరం లేదు.ఎందువల్ల అంటే రామకోటి వ్రాసిన పుస్తకాలను ఊరేగింపుగా తెచ్చి నాకు స్వాగతం చెప్పారు. (బందరు లో )అంటే రామకోటి ఉన్న చోట మేము కామకోటి వారం ఉంటాము."అని చమత్కరించారు.

కామెంట్‌లు లేవు: