14, జనవరి 2023, శనివారం

న’గరం’

*శీర్షిక: న’గరం’*


1. గరం చాయి పిలుస్తోంది

మనసు ఆపేస్తోంది

ఒ’కప్పు’డు రూపాయి

ఇప్పుడు 20 దేనికని.

2. సమాచార సంద్రంలో

అందరూ ఈదుతూ ఉంటారు

కానీ గమ్యం చేరేది కొందరే.

3. (చాదర్ ఘాట్, మూసారాం బాగ్ వంతెనలు)

వరదోస్తే మునుగుతాయని తెలుసు

తెలియనిది ఒక్కటే

ఎందుకలా కట్టారో...

4. లాడ్ బజార్ లో

లాడ్ (ప్రేమ) కరువైంది.

5. ‘భాగ్య’ నగరం

వచ్చినవారందరూ

వెతుకుతూనే ఉంటారు.

6. నగరం మధ్యలో

పండ్ల మార్కెట్ ఉండేది

ఇప్పుడు వీధికో 

పళ్ళ దవాఖానా ఉంది.

7. మూసీనది గతి

అధోగతి అనిపిస్తుంది, కానీ

మూసీ కలకలలాడితే

నగరం విలవిలలాడుతుంది.

8. ముత్యాల నగరమైనా

మురిపాల కోసం వచ్చాము

అదీ లేదనటం భావ్యమా?

9. బంగళాలు పెరిగాయి

వాహనాలు పెరిగాయి

పెరగనిదొక్కటే - మానవత్వం.

10. నగర బ్రతుకుబండికి

కరోనా పంచర్ చేసింది

ఈడ్చుకెళ్లక తప్పడంలేదు.

🌀🎼🌈🌹🙏🌹🌈🎼🌀


తుమ్మ జనార్దన్ (కలం పేరు: జ్ఞాన్)*

కామెంట్‌లు లేవు: