14, జనవరి 2023, శనివారం

శ్రీత్రిపురసుందరీభావనాష్టకం

 శ్రీత్రిపురసుందరీభావనాష్టకం 


1) తురీయజ్ఞానభాసినీం

   తులనాతీతరూపిణీం 

   తిరోధానుగ్రహరూపాం 

   భావయామి త్రిపురసుందరీం ||


2) మహిషాసురమర్దినీం

    మమతానురాగవర్జితాం

    మనోజవప్రదాయినీం 

    భావయామి త్రిపురసుందరీం ||


3) కాదిహాదివిద్యాంకురాం 

    కారణాతీతవిగ్రహాం 

    కార్యాకార్యవిచక్షణాం 

    భావయామి త్రిపురసుందరీం ||


4) వంశాభివృద్ధికారిణీం 

    వరిష్ఠమునిగణవందితాం 

    వామాచారవిద్వేషిణీం 

    భావయామి త్రిపురసుందరీం ||


5) పర్వతరాజనందినీం 

   పార్వణేందుముఖీం

   పాపసంఘవిఘాతినీం 

   భావయామి త్రిపురసుందరీం ||


6) కరిచర్మాంబరమనోహరాం 

    కామితార్థఫలదాయినీం 

    కవితారసమాధుర్యాం 

    భావయామి త్రిపురసుందరీం ||


7) అరుణారుణవర్ణవిగ్రహాం 

    ఆశాపాశవిమోచనీం 

    అరవిందదళాయతాక్షీం 

    భావయామి త్రిపురసుందరీం ||


8) మేధాబుద్ధిప్రదాయినీం 

    మణిమేఖలధారిణీం 

    మోక్షమార్గప్రదర్శినీం 

    భావయామి త్రిపురసుందరీం || 


    సర్వం శ్రీ త్రిపురసుందరీ దివ్యచరణారవిందార్పణమస్తు

కామెంట్‌లు లేవు: